Sunday, October 14, 2007

విశ్వకవి రవీంద్రుల వారు - రాజమహేంద్రవరం

హైదరాబాదులో ఉండగా మా నాన్న గారి పాత ఫోటో ఆల్బం లో దొరికిన ఒక ఆణిముత్యం - ఎవరో ఏమిటో చెప్పుకోండి చూద్దాం ?


- విశ్వకవి రవీంద్రుల వారు - 1930 లో రాజమహేంద్రవరానికి కవితాగోష్టికి వచ్చినప్పుడు తీసిన ఛాయాచిత్రం ఇది. మిగిలిన వారు ఎవరో , నాకు తెలియదు..అ విషయం కనుక్కునే బాధ్యత మా నాన్నగారి భుజస్కంధాల మీద వదిలి వచ్చా..

10 comments:

  1. వంశీ గారూ, మీవద్ద ఓ నిధి ఉన్నట్టుంది!
    ఫోటోలోని పెద్దలు ఎవరెవరో తెలుసుకో కుతూహలంగా ఉంది. ఎదురుచూస్తాను.

    ReplyDelete
  2. చిలకమర్తి లక్ష్మీనరసింహం (రవీంద్రుని కుడివైపున మూడో బుర్రమీసాల వ్యక్తి) చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి (ఎడమవైపు రవీంద్రుని పక్కనే వ్యక్తి) అని అనుకుంటున్నాను. మిగిలిన వాళ్ళను గుర్తించే ప్రయత్నంలో ఉన్నాను.

    ReplyDelete
  3. చాలా rare pic అండి.

    ReplyDelete
  4. అమూల్యమైన చిత్రం. :) ఆ చిత్రంలో ఉన్న తక్కిన పెద్దలెవరో త్వరలో చెప్తారని ఆశిస్తున్నాను.

    అద్సరే కానీ మీరేంటి మీ బ్లాగ్ టైటిల్ కి టాగ్‌లో తెలుగు ' వాడి ' గా జీవించండి అని అన్నారు. వారి అనబోయి వాడి అన్నారా? లేక మగవాడికే తెలుగువాడిలా జీవించే హక్కు ఉందా. ఆడవాళ్ళు తెలుగువారిలా జీవించక్కరలేదాండి? :p

    ReplyDelete
  5. తప్పు సరిదిద్దడమయినది "సీగానప్రసూనాంబ" గారూ

    ReplyDelete
  6. This comment has been removed by the author.

    ReplyDelete
  7. హమ్మయ్య. ఇప్పుడు సరిపోయింది. లేకపోతే ఆడవాళ్ళు యే అరవ్వాళ్ళగా జీవించాలేమో అని సందేహం వచ్చింది. :p

    అబ్బే!!! మీకు పలకటం రాలేదు. సీగానపెసూనాంబ అనాలి. :p

    మీకు ఆ కుఠోలో ఎవరెవరో తెలిసాక కింద వరసగా పేర్లు రాసి ఇంకో పోస్ట్ వేసారంటే బ్రహ్మాండంగా ఉంటుంది.

    ReplyDelete
  8. ఇక్కడో కిటుకు ఉందండోయి - ప్రసూనాంబ అనేది మా అమ్మగారి పేరు కూడ అవటం వల్ల - మీరు అన్నట్టు రాయలేకపోయాను....లేకపోతేనా... సరే అ కుఠోలో జనాలు బతికి వచ్చి వారి వారి పేర్లు, వారి సంకల్పం చెప్పుకుంటే కానీ మనకి ఆ మహానుభావుల గురించి తెలియటం కొంచెం కష్టమే "సీగానాయి" గారు... :) ...అయినా మన ప్రయత్నం మనం చెయ్యటంలో తప్పు లేదు కదా...అదే పనిలో ఉన్నా...

    అయినా మన ఆడవాళ్ళు అరవ వాళ్ళుగా అవతారం ఎత్తితే , మరి అసలు అరవ మేళాలు సింహిక రూపాలు ఎత్తి సింహళ దేశం పోవాలేమో...

    ReplyDelete
  9. ముందువరసలో ఎడమవైపు మొదటి వ్యక్తి గిడుగు రామ్మూర్తి పంతులు, కుడి వైపు చివరన బెజవాడ గోపాలరెడ్డి (అని సందేహం). చివరి వరుసలో మూడవవ్యక్తి (హిట్లెరు మీసాలు) దేవులపల్లి కృష్ణశాస్త్రి అయ్యుండవచ్చు

    ReplyDelete
  10. మంచి పసకల చిత్రం.వీళ్లంతా ఎవరో తెలుసుకోవాలి అని బహు ఆసక్తిగా ఉంది

    ReplyDelete