Saturday, September 22, 2007

ఊగాడమ్మా....ఊగిందమ్మా!!!

ఈ "ఊగాడమ్మా" పిల్లల పాట గోదావరి జిల్లాల్లో ప్రచారం పొందిన పాట అని తెలియవచ్చింది.బాలుడయితే ఇలా మోకాళ్ళ మీద ఊగిస్తూ ఇలా పాడుతూ ఉంటారు

ఊగాడమ్మా ఊగాడూ
ఊగే చిలుకా ఊగాడూ
బంగరు బొమ్మా ఊగాడూ
తంగేడు పువ్వా ఊగాడూ
గుడిపావురమా ఊగాడూ
కన్నుల వెలుగా ఊగాడూ
సొగసుల గువ్వా ఊగాడూ
శుకమా పికమా ఊగాడూ
చక్కని నెమలీ ఊగాడూ
చక్కెర బొమ్మా ఊగాడూ

అదే బాలికలయితే ఇలా పాడుతూ పిల్లలకి ఆనందం కలిగిస్తారు

ఊగిందమ్మా ఊగిందీ
ఊగే చిలుకా ఊగిందీ
బంగరు బొమ్మా ఊగిందీ
తంగేడు పువ్వా ఊగిందీ
గుడిపావురమా ఊగిందీ
కన్నుల వెలుగా ఊగిందీ
సొగసుల గువ్వా ఊగిందీ
శుకమా పికమా ఊగిందీ
చక్కని నెమలీ ఊగిందీ
చక్కెర బొమ్మా ఊగిందీ

3 comments:

 1. ఇళయరాజా "లైవ్ ఇన్ ఇటలీ" ఆల్బంలో "సాంజాడమ్మా సాంజాడు" అని ఒక చిన్నపిల్లల పాట ఉంది. ఇదెందుకో దానికి బాగ దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తోంది. ఒకే రకమైన పాట ఇటు గోదావరి ప్రాంతంలోనూ, తమిళనాడులోనూ ఉండటం విచిత్రంగా ఉంది కదా!!

  ReplyDelete
 2. "శుకమా పికమా ఊగాడు"
  ఆ పాటలో "మయిలే కుయిలే సాంజాడు"

  అర్థం కూడా ఒకటే అనుకుంటా :)

  ReplyDelete
 3. నేను గోదావరి జిల్లానుంచే అయినా ఈ పాట ఎప్పుడూ వినలేదు. మా చిన్నప్పుడు మమ్మల్ని ఇలా ఆడించే వారు..

  "ఏనుగమ్మా ఏనుగు..

  మావూరొచ్చిందేనుగు..
  మచినీళ్ళు తాగిందేనుగు..

  కాకినాడెళ్ళిందేనుగు..
  కాజాలు తిందేనుగు..

  ....
  "
  ఇలా ఏనుగు ప్రతీ ఊరు వెళ్ళినట్టూ, అక్కడ ఆ ఊరిపేరుకు ప్రాస కలుపుతూ ఏదో తినుబండారం తిన్నట్టూ సాగిపోయేది ఆ పాట.

  ReplyDelete

Note: Only a member of this blog may post a comment.