Thursday, September 27, 2007

ఎక్కడయినా దొరుకుతుందేమో ఎవరికయినా తెలిస్తే చెప్పమని...

చిత్రకవిత, బంధకవిత గురించి ఒక మంచి పుస్తకం ఎక్కడయినా దొరుకుతుందేమో ఎవరికయినా తెలిస్తే చెప్పమని విన్నపము. విశాలాంధ్ర బుక్ హౌసు మొదలయినవి అన్నీ చుట్టబెట్టాను కానీ , ఎక్కడా దొరకలేదు..పైగా అలాంటి కవితలు కూడా ఉన్నాయా అని ఒక మాంచి తెలివయిన ప్రశ్న వేసాడు ఒకడు నన్ను...హుం ...ఇలా ఉన్నారు మన బుక్ హౌసు వాళ్ళు

3 comments:

  1. మీరు ప్రస్తావించిన వాటిని ఛందశ్శాస్త్రంలో చిత్రకవిత్వం అనే generic name తో వ్యవహరిస్తారు. వాటి మీద ప్రత్యేకంగా ఎవరూ పుస్తకాలు రాయలేదు కానీ సాధారణ చ్ఛందో గ్రంథాల్లోనే వాటి గురించి ఒక అధ్యాయంగా రాశారు. మీరు పుస్తకాల కొట్లలోను గ్రంథాలయాల్లోను అడగాల్సింది-తెలుగు/సంస్కృత చ్ఛందో గ్రంథాలు సమగ్రంగా (భాగాలుగా కాకుండా) కావాలని. ఛందో గ్రంథాలు చాలా ఉన్నాయి.

    తెలుగులో :- మల్లియ రేచన వ్రాసిన కవిజనాశ్రయము
    అప్పకవి వ్రాసిన అప్పకవీయము
    అనంతుడు వ్రాసిన అనంతుని ఛందము
    తాతంభట్టు వ్రాసిన సులక్షణసారము మొ.

    సంస్కృతంలో :- వృత్తరత్నాకరము సర్వశ్రేష్ఠం.

    ReplyDelete
  2. ధన్యవాదాలు తాడేపల్లి గారు...ఆ విధంగా కూడా అడిగి చూసాను..ఆ విశాలాంధ్ర వాడు, నవోదయ వాడు నన్ను ఒక వెర్రి మొహం వేసుకుని చూశారు... :) అందుకే బ్లాగులో రాయవలసి వచ్చింది...ఇప్పుడు మీరు ఖచ్చితమయిన పుస్తక సమాచారం అందించారు కాబట్టి, వారిని అడిగి చూస్తా...మరోసారి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ

    ReplyDelete
  3. వృత్తరత్నాకరం గురించి Motilal Banarsidas Publications, New Delhi వారిని సంపర్కించండి.

    ReplyDelete