Friday, March 7, 2008

తాతా తాతా తైతక్కలాట..

తాతా తాతా తైతక్కలాట
నువ్వుందేమో సామర్లకోట

కోట కింద బొమ్మలాట
కూచుందేమో కుర్చీపీట
పీట కింద బంగారు మూట

ఆ మూట నాకిస్తే
నీ మాట నే వింటా

2 comments:

  1. ఎందుకండీ ఈ పాటలన్నింటినీ మనం దూరం చేసుకుంటున్నాము?
    -యడవల్లి వేంకట సత్యనారాయణ శర్మ.

    ReplyDelete
  2. ముందు పెద్దవాళ్ళు తాము ఇలాంటివే చాలా నేర్చుకున్నాము అని స్పృహలోకి వస్తే, ఒక్కసారి తమ చిన్నప్పటి జ్ఞాపకాలలోకి వెళ్ళి అవి అన్నీ మననం చేసుకుని, ఆ పాషాణం పొరలు తొలగించుకుంటే తమ పిల్లలకి తాము నేర్చుకున్నవే నేర్పించడానికి వీలవుతుంది...పెద్దవాళ్ళే పూనుకోకుండా మందంగా కూర్చుంటే పిల్లవాళ్ళ పరిస్థితి, మన సాంప్రదాయ స్థితి ఎప్పటికీ ఇంతే

    నాకు ఒక్కటే అర్థం కాదండీ - జీవితం అంతా పరుగులమయం అయిపోయింది అని అంటూ, నేర్పించటానికి మాకు సమయం లేదు, సమయం ఉన్నా ఇవి అన్నీ నేర్పిస్తే ఇప్పటి పిల్ల పిడుగులకు ఉపయోగం ఏమిటి అని అంటూ ఉంటారు....జీవితం మనల్ని పరుగులెత్తిస్తోందా, మనమే జీవితాన్ని పరుగులు పెట్టిస్తున్నామా అని నేను అడిగే ప్రశ్నకు సమాధానం వారిలో ఒక్కరు కూడా చెప్పలేకపోయారు...

    ReplyDelete