Sunday, July 8, 2007

ప్రాస పాట ఒకటి

పిల్లల ప్రాస పాట

పిల్లల ప్రాస పాట ఒకటి చూడండి ఇక్కడ. ఈ పాట అందించిన మిత్రుడు రాగంపేట శ్రీనివాస్ కి ధన్యవాదాలు.తన చిన్నప్పుడు వాళ్ళ అమ్మమ్మ వద్ద ఈ పాట వింటూ ఉండేవాడిని అని శ్రీనివాస్ తెలియచేసాడు.

పిట్టమ్మ పిట్ట
ఏమి పిట్ట
చిలక పిట్ట
ఏమి చిలక
తెలుపు చిలక
ఏమి తెలుపు
హంస తెలుపు
ఏమి హంస
రాజ హంస
ఏమి రాజు
మృగరాజు
ఏమి మృగము
వన మృగము
ఏమి వనము
పూల వనము
ఏమి పూలు
జాజి పూలు
ఏమి జాజి
గుత్తి జాజి
ఏమి గుత్తి
కవ్వం గుత్తి
ఏమి కవ్వం
చల్ల కవ్వం
ఏమి చల్ల
మంచు చల్ల
ఏమి మంచు
పొగ మంచు
ఏమి పొగ
దీపం పొగ
ఏమి దీపం
గోడ దీపం
ఏమి గోడ
కోట గోడ
ఏమి కోట
తులసి కోట
ఏమి తులసి
రామ తులసి
ఏమి రామ
ఆత్మా రామ

1 comment:

  1. ఈపాట మేమూ పాడుకునేవాళ్ళం.పిల్లలకి ఈ ఒక్కపాటలో ఎన్నో విషయాలు తెలియచేయొచ్చు.

    ReplyDelete