Friday, June 22, 2007

అది కూడా యూనీకోడులో? భళారే విచిత్రం!

కోలాచలం శ్రీనివాస రావు గారు 1895 లో వ్రాసిన సునందినీ పరిణయము అనే నాటకము నుండి ఒక అద్భుతమయిన మధురగతి రగడ ఇక్కడ చూడండి.

http://maganti.org/janapadapatalu/madhuragatiragada.html

ఆ నాటక రచన మొత్తం త్వరలో మీ ముందుకు, మాగంటి.ఆర్గ్ లో.అది కూడా యూనీకోడులో.. కొందరు మిత్రుల ఆనందం కోసం.

నా మటుకు నాకుగా ఈ యూనీకోడు ఫాంటు ఎన్నడూ నచ్చలేదు, నచ్చబోదు. వేరే ఇతర ఫాంటులు వస్తే తప్ప ఈ యూనీకోడు గురించి ఆలోచించనేమో మరి...చూద్దాము...

ప్రస్తుతానికి ఈ నాటిక మటుకు యూనీకోడులో ప్రచురించి చూసి, చదువరుల అభిప్రాయాలు తెలిసాక తరువాతి మెట్టు ఎక్కడానికి ప్రయత్నిస్తాను... :)

3 comments:

  1. వంశీగారు, (నేను చెప్పబోతున్న సంగతి బహుశా మీకిదివరకే తెలిసే ఉండొచ్చు) మీరు Windows Xp వాడుతున్నట్లైతే ControlPanel -> System -> Advanced tab -> Performance -> Settings button -> SmoothEdgesOfScreenFonts అనేది ఎంపికచేసి చూడండి. యూనికోడ్ ఫాంటు కాస్త అందంగా కనిపిస్తుందేమో.

    ReplyDelete
  2. ఆ ప్రయత్నం అయ్యింది రామూ.. ఎందుకో తెలియదు కానీ నాకు ఈ యూనీకోడు ఫాంటును చూస్తే నాకు అటువైపు పోబుద్ధి అవటల్లా..ఏదో కొందరు స్నేహితుల బలవంతం మీద (నీకు తెలుసనుకుంటాను ఎవరో వారు... :) )తప్పని పరిస్థితుల్లో అటువైపు కాలు పెట్టడం అవుతోంది.కానీ మొత్తం ప్రయాణం ఇక పై అటువైపే జరుగుతుంది అని మటుకు ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాను. చూద్దాం ఈ అడుగు ముందడుగు అవుతుందో లేదో!!

    ReplyDelete
  3. చాలా చాలా థాంక్సండీ

    ReplyDelete