Monday, May 28, 2007

తిట్లు - తీరు

తిట్లు - తీరు

ఆవేశపూరితమయిన మనిషి కోపానికి రూపం తిట్టు. ఆవేశం ఎక్కువయ్యేకొద్దీ వేడెక్కే బూతులు కూడ తోడవుతూ ఉంటాయి. సరే బూతులు మనకెందుకు కానీండి కానీ, అసలు తిట్లు ఎలా తిడతారో చూద్దాం

ఊతపదాలయిన తిట్లు కొన్ని

పళ్ళు రాలగొడతాను పిచ్చి పిచ్చిగా వాగావంటే
ముక్కలు ముక్కలుగా కోసి కాకులకీ గద్దలకీ వేస్తా
పీక పిసికి పారేస్తా
గోతిలో కప్పెట్టేస్తా దొంగ వెధవా
వీపు విమానం మోతే
చంపి పారేస్తా ఏమనుకుంటున్నావో
తల్లి తోడు నీ ప్రాణం తీయకపోతే
చెంప పగిలిపోతుంది
నీ మొఖం మండనీ నోరు పడిపోను
నీ నోట్లో పురుగులు పడ
నీ శవం కాటికెళ్ళ
నీ జిమ్మడ
నీ పెళ్ళాం ముండ మొయ్య
నీ పెళ్ళాం రేవులోకెళ్ళ
నీ తెలివి సంతకెళ్ళ
నిన్ను అమ్మోరు యేసుకుపోను
నీ తాడు తెగ
నీ కాళ్ళూ చేతులు పడిపోనూ
నువ్వు దిక్కులేని చావు చస్తావు
నిన్ను గోతిలో పెట్ట
నీ అమ్మ కడుపు కాలా
వెధవసచ్చినోడా
బుర్ర రామకీర్తన పాడించేస్తాను వెధవ
నిన్ను కోదండం తీయించకపోతే నా పేరు కాదు
ఒక్క తన్ను తన్నానంటే ఆమడ దూరం పడతావు
దిక్కున్న చోట చెప్పుకోరా ఫో
అడ్డంగా నరికి పారేస్తా
నోరు ముయ్యి
ముక్కలు ముక్కలుగా నరికేస్తా
గూబ గుయ్యిమంటుంది వెధవ వాగుడు వాగావంటే
కళ్ళు పీకేస్తాను
గుడ్లు పెరికేస్తాను
మేకగుడ్ల వెధవ
సోంబేరి నాయాల
సాచి లెంపకాయ కొడితే మంచినీళ్ళు కూడా అడగవు
దవడ పగిలిపోతుంది
పెంట వెధవ
ఊరపంది
నరుకుతా - దిక్కున్న చోట చెప్పుకో పోరా
నీ దెవసం పెట్ట
నీ తద్దినం పెట్ట
నిన్ను తగలెయ్య
ఏం పోయే కాలం వచ్చిందిరా దరిద్రుడా

ఇలా కొన్ని వందలు ఉన్నాయి

సరే మరి కొన్ని వచ్చే భాగంలో...

సశేషం

11 comments:

 1. మన తిట్లని మరలా ఒకసారి గుర్తు చేసారు. మా నాయనమ్మే గుర్తుకొచ్చింది ఈ తిట్లు చూస్తుంటే. ఆవిడ ఊతపదాలు---నీ అమ్మ కడుపు కాలా, నీ జిమ్మడ, నీ తాడు తెగ, నిన్ను గోతిలో పెట్ట, నీ దెవసం చేయ. అవన్నీ ఇప్పుడు తలుచుకుంటే నవ్వు వస్తుంది.

  ReplyDelete
 2. మాకు ఒకటో క్లాసులో ఆవు మాస్టారుండేవారు (ఆవు ఉన్న మాస్టారు). ఆయన తిట్టే పెద్ద తిట్టు- 'ఓరి నీ పెళ్ళాం మొగడా' అని. నాకు కూడా అది అలవాటైంది. ప్రేమగా నాకన్నా చిన్న వాళ్ళని 'ఓరి దుర్మార్గుడా' అని తిట్టడం కూడా అలవాటైంది. మా అబ్బాయినైతే 'నాకొడకా' అని తిట్టడం అలవాటైంది.

  జాన (జాను కాదా?) తెలుగు అంటే ఏమిటో కొద్దిగా వీలైనప్పుడు వివరించగలరా?

  ReplyDelete
 3. నాకు తెలిసి నేను చదివిన పుస్తకాలలో అంటే పాల్కురికి వారివి, నన్నెచోడ వారివి - వీటిలో - జానతెనుగు, జానుతెనుగు అనే పదాలు ఉపయోగించబడ్డాయి....

  నాకు తెలిసి మన మాతృభాషను మూడు రకాలుగా విభజించవచ్చును:
  (1) అచ్చతెనుగు, (2) జానతెనుగు, (3) తేటతెనుగు

  జాన, జాను అంటే అర్ధం - "అత్యంత అందమయిన" "సుందరమయిన లేక అపురూపమయిన" అని.

  ఇంకా వేరే పెద్దవారిని కూడా కనుక్కుంటాను.

  ReplyDelete
 4. ఇప్పుడే "జానుతెనుగు" వ్యావహారికంగా సరి అయిన పదం అని కొంత మంది తెలియచేసారు. "జానతెనుగు" పదాలు పాల్కురికి వారు తమ రచనలలో వాడారు కానీ, ఆ పదం వాడబడిన విశేషం వేరు అని తెలిసింది. జానతెనుగు కూడా వడవచ్చు అట కానీ జానుతెనుగు మరింత సరి అయిన పదం అని తెలియ వచ్చింది. మార్చేసాను.... తప్పు తెలియచేసినందుకు కొత్తపాళీ గారికి, సత్యసాయి మాష్టారు గారికి ధన్యవాదాలు

  ReplyDelete
 5. తెలుగు నేర్పించడంలో భాగంగా ఇవన్నీ మా పిల్లలకు నేర్పిస్తే ఇంకేవన్నా వుందా?

  --ప్రసాద్
  http://blog.charasala.com

  ReplyDelete
 6. ప్రసాద్ గారూ

  భలే జోకారండి ...హహహ ...ఒక్కటి మటుకు చెప్పగలను.. పిల్లలను అసలు ఈ బ్లాగు మాయాజాలం వైపు రానివ్వొద్దు. చక్కగా వారికి తెలుగు పుస్తకాలు ఇచ్చి కాలక్షేపం చేయించండి.

  ReplyDelete
 7. తరువాతి టపాతో మా "దుంప తెంచుతారా"?

  ReplyDelete
 8. "నీ జిమ్మడ" అంటే ఏమిటి? చిన్నప్పుడు నేనో చిన్న నాటకం వ్రాసి నా బోటి పిల్లల చేత నటింపజేశాను. అందులో ఐవోరు...పిల్లల మీద విసుక్కొంటూ తిట్లు తిట్టాలి. ఏదో సినిమాలో విన్న ఙ్ఞాపకమో ఏమో..."నీ మొహం జిమ్మడ" అని వ్రాసి అదే డవిలాగు పెద్దగా అన్నాను...అంతే మా తెలుగు మేడం 10 నిముషాల పాటు ఆగకుండా నవ్విందే కానీ దానర్థం చెప్పలేదు.....ఇప్పుడు మీరు దానర్థం చెప్పి ఆ 15 యేళ్ళ మిస్టరీకి తెరదించగలరని ఆశిస్తూ
  - నవీన్ గార్ల
  (http://gsnaveen.wordpress.com)

  ReplyDelete
 9. నాకైతే జంధ్యాల సినిమాలు, నిర్మలమ్మ గారు ఒకేసారి గుర్తొచ్చారు.

  ReplyDelete
 10. ఇందులో కొన్ని తిట్లు నేను వాడతాను.సత్యసాయి గారిలా నేను కూడా బాగా దగ్గరివారిని ప్రేమగా దుర్మార్గురాలా,దుర్మార్గుడా అంటాను.

  ReplyDelete
 11. నాకైతే అన్నిటి కన్నా నచ్చిన తిట్టు అగ్నిహొత్రవధానులు నీ ఇంట కోడికాల్చా అని తిట్టినది. కొసమెరుపు నాటకం చివర్లో లాయరు నాయుడిని ఇలాగే తిడితే రోజూ కాలుస్తూనే వుంటారు అనిచెప్పి వెళ్ళిపోతాడు.అగ్నిహోత్రవధానులు పాత్ర అంతా కళ్ళముందు కనిపిస్తుంది ఈ ఒక్క మాటలో

  ReplyDelete