Saturday, December 29, 2007

ఆచార్య తూమాటి దొణప్ప

ఆచార్య తూమాటి దొణప్ప



ఆచార్య తూమాటి దొణప్ప గారి వ్యాసాలు ఇక్కడ చూడండి

కవుల మధ్యనే ఈ పేచీలు

కవుల మధ్యనే ఈ పేచీలు

డాక్టర్ ద్వా.నా.శాస్త్రి గారి వ్యాసం

అభినందించడం నేర్చుకుందాం దుయ్యబట్టడం కాదు

అభినందించడం నేర్చుకుందాం దుయ్యబట్టడం కాదు

డాక్టర్ ద్వా.నా.శాస్త్రి గారి వ్యాసం

బిరుదుల వ్యామోహం ఎందుకో?

బిరుదుల వ్యామోహం ఎందుకో?

డాక్టర్ ద్వా.నా.శాస్త్రి గారి వ్యాసం

చూసేవి కళ్ళు, చూపేది మెదడు

చూసేవి కళ్ళు, చూపేది మెదడు

డాక్టర్ కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ గారి వ్యాసం

రంగుల కలలు, వాస్తవాలు

రంగుల కలలు, వాస్తవాలు

డాక్టర్ కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ గారి వ్యాసం

దృష్టికి జన్యువుల తోడ్పాటు

దృష్టికి జన్యువుల తోడ్పాటు

డాక్టర్ కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ గారి వ్యాసం

నేత్రాల పరిణామం

నేత్రాల పరిణామం

డాక్టర్ కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ గారి వ్యాసం

కళ్ళ నిర్మాణం, పనితీరు

కళ్ళ నిర్మాణం, పనితీరు

డాక్టర్ కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ గారి వ్యాసం

కళ్ళ కమామీషు

కళ్ళ కమామీషు

డాక్టర్ కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ గారి వ్యాసం

Friday, December 28, 2007

ఎత్తిన చెయ్యి దించలేదు ఈ వీడియోలో

ఎత్తిన చెయ్యి దించలేదు

ఒకటే లయలో గీసిన బొమ్మ

తీరిక చిక్కి - మొత్తానికి "ముఖపుట" మారింది

అను క్లిప్ ఆర్ట్స్ సి.డి. సెట్టు (6 సి.డిలు - 4 వేల బొమ్మలు) చేతిలో పడిన రెండు వారాలకి తీరిక చిక్కి మాగంటి.ఆర్గ్ "ముఖపుట" మార్చడానికి వీలయ్యింది... ఇక నెమ్మదిగా ఇతర రూపురేఖలు మార్చాలి.

మాగంటి.ఆర్గ్

అను క్లిప్ ఆర్ట్స్ సి.డి. సెట్టులో చాలా మంచి మంచి క్లిప్ ఆర్ట్స్ ఉన్నాయి. మన తెలుగువారికి అంతర్జాలంలో దొరికే సగం పైన బొమ్మలు అను వాళ్ళ క్లిప్ ఆర్ట్స్ లోని బొమ్మలని ఇతర సాఫ్ట్ వేర్లతో మార్చి సొబగులద్దినవే అని నాకనిపిస్తుంది.

Saturday, December 22, 2007

చేతిలో మైనపు ముద్దలా ఒదిగిపోయే వీణ

మిత్రులు ధూళిపాళ శ్రీనివాస్ అద్భుతమయిన సంగీతాభినివేశం ఉన్న వ్యక్తి. సంగీతమయమయిన కుటుంబంలో పుట్టిన ఆయనకి వీణ అంటే పంచప్రాణాలు. ఆయన్ని అందరూ ముద్దుగా "వీణా శ్రీనివాస్" అనే పిలుస్తారు.చేతిలో మైనపు ముద్దలా ఒదిగిపోయే వీణతో తొమ్మిదేళ్ళ వయస్సులోనే ఆకాశవాణి (ఆల్ ఇండియా రేడియో)లో వీణానాద ప్రదర్శన ఇచ్చిన ఉత్తుంగతరంగమది.

ధూళిపాళ శ్రీనివాస్ (వీణా శ్రీనివాస్)

ఆ కళామతల్లికి తన ఊపిరి ఉన్నంతవరకు సేవ చేస్తూ ఉండాలి అని ఎంతో వినమ్రంగా చెప్పే ఆయన , తన వీణానాదంతో, సంగీత సామ్రాజ్యంలో అత్యున్నత శిఖరాలు అధిరోహించాలి అని కోరుకుంటూ, అడిగిన వెంటనే కొన్ని ముత్యాలు మీతో పంచుకోమని అందించిన మిత్రులు శ్రీనివాస్ కి సహస్ర ధన్యవాదాలతో...

Friday, December 21, 2007

తెలుగు వారికే ప్రత్యేకమా - లేక సర్వమానవసహజమా?

ఇదండీ మన వారి తీరు

ఒకటే అనుమానం - ఇది మన తెలుగు వారికే ప్రత్యేకమా - లేక సర్వమానవసహజమా? ఏదేమయినా కొంత మంది మహానుభావులకి ఉన్న ఈ జబ్బు ఎప్పటికీ పోదేమో అని అనిపిస్తుంది.

ఒకడిని చూసి ఒళ్ళు వాతలు పెట్టుకుంటూ లేని గొప్పలు చెప్పుకుంటూ, ఎవడి దగ్గరో నేర్చుకున్న, విన్న, చూసిన విషయాలను తన స్వంత మాటలు, చేతలు, పరిచయాలుగా జనాలకి తెలియచేస్తూ ఆర్భాటం ప్రకటించుకోవటం అనే దుష్ట సంస్కృతి ఎప్పటికి పోతుందో ఏమో....అసలు వీరి బాధలేమిటో ఆ భగవంతుడికే తెలియాలి...ఫలానా వారి దగ్గరినుంచి ఈ విషయం తెలిసింది, లేక ఫలానా వారి పరిచయం వల్ల నాకు ఈ సంగతులు తెలిసినాయి - అవే మీకు తెలియచేస్తున్నాను అని చెప్పటానికి మొహమాటం ఎందుకు అడ్డు వస్తుందో ఏమో..ఇలాంటి వారికి మానసిక వికాసం సరిగా లేకనా, అభద్రతా భావమా, లేక కీర్తి అంతా నాకే దక్కాలి అనే కాంక్షా అనే అనుమానం నా బుర్రని ఎప్పటికీ తొలుస్తూనే ఉంటుంది..

ఈ టపా రాయటానికి కారణం ఈ మధ్యే జరిగిన ఒక సంఘటన - దీని గురించి విపులంగా ఉదాహరణలతో త్వరలో బ్లాగుతా...అప్పటిదాకా...

పులిజూదం

పులిజూదం ఆట చూడాలని ఉందా?

పులిజూదం

వంశీ

Tuesday, December 18, 2007

అబ్బో అబ్బో అబ్బో - జానపద పాటలు మన తోటి బ్లోగర్ నుండి

అబ్బో అబ్బో అబ్బో - జానపద పాటలు మన తోటి బ్లోగర్ నుండి - ఇవి ప్లానెట్ రీడ్ వారివి కానీ..ఈయన ఎవరో అన్నీ కలిపి ఒక చోట పెట్టాడు

జానపద పాటలు

రెండవ పాట మటుకు అదిరింది... :) just kidding...

డాక్టర్ కొడవటిగంటి రోహిణీప్రసాద్, డాక్టర్.ద్వా.నా.శాస్త్రి

డాక్టర్ కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారి వ్యాసాలు కొన్ని ఇక్కడ

http://maganti.org/vyasavaliindex.html


అలాగే డాక్టర్.ద్వా.నా.శాస్త్రి గారి మిగిలిన వ్యాసాలు కూడా త్వరలో ఇక్కడ...వేచి చూడండి

Monday, December 17, 2007

ఆంధ్ర దేశ ప్రముఖుల వీడియోలు ఇక్కడ చూడండి...

ఆంధ్ర దేశ ప్రముఖుల వీడియోలు ఇక్కడ చూడండి...

మొదటి వీడియోలుగా ప్రఖ్యాత సాహితీవేత్త, రచయిత, విమర్శకుడు శ్రీ ద్వా.నా.శాస్త్రి గారి అభిప్రాయాలు - సాహిత్యంలో వ్యక్తిత్వ వికాసం మీద, సాహితీ విమర్శ మీద, సాహితీ సంస్థల మీద ఆయన వెలిబుచ్చిన అభిప్రాయాలు ఇక్కడ చూడండి

"సాహిత్యంలో వ్యక్తిత్వ వికాసం" / "సాహితీ విమర్శ" వీడియోలు


త్వరలో డాక్టర్ సి.నా.రె, తెలుగు యూనివర్సిటీ ప్రముఖులు, హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ ఆచార్యులు మొదలయిన వారి ఇంటర్వ్యూలు ప్రచురించబడతాయి...

అప్పటిదాకా వేచి చూడండి

శ్రీమతి రత్నాశాస్త్రి గారి సంగీతం పాఠాలు ఇక్కడ...

"ఇసాయి వానార్" బిరుదాంకితురాలయిన శ్రీమతి రత్నాశాస్త్రి గారి సంగీత పాఠాలు

వెలలేని ఆణిముత్యాల సోయగ సౌరభాలను ఆస్వాదించండి ఇక్కడ

త్వరలో మరిన్ని మీ ముందుకు

విధేయుడు వంశీ

Sunday, December 9, 2007

Wednesday, December 5, 2007

చిన్న పిల్లలకోసం ఒక చిన్న వ్యవసాయం బొమ్మల వీడియో

చిన్న పిల్లలకోసం ఒక చిన్న వ్యవసాయం బొమ్మల వీడియో ఇక్కడ...

వ్యవసాయం బొమ్మల వీడియో

అసలు సిసలయిన వ్యవసాయం వీడియోలు త్వరలో మీ ముందుకు

Sunday, December 2, 2007

కాలిఫోర్నియా రాష్ట్రంలోని మోంటెరే పెనిన్సులా కాలేజీలో తత్త్వ శాస్త్ర ఆచార్యుడిగా పని చేసిన శ్రీ నారాయణ మూర్తి గారి కవితా సంకలనం

కాలిఫోర్నియా రాష్ట్రంలోని మోంటెరే పెనిన్సులా కాలేజీలో తత్త్వ శాస్త్ర ఆచార్యుడిగా పని చేసిన శ్రీ నారాయణ మూర్తి గారి కవితా సంకలనం ఇక్కడ చూడండి

శ్రీ నారాయణ మూర్తి

ఆయన స్వదస్తూరితో ఉండటం ఈ కవితా సంకలన విశేషం

బుచ్చిబాబుగారి నవల - "చివరకు మిగిలేది"

బుచ్చిబాబుగారి నవల - "చివరకు మిగిలేది" మీద తూలిక వ్యవస్థాపకురాలు అయిన శ్రీమతి నిడదవోలు మాలతి గారి విశ్లేషణ వ్యాసం ఇక్కడ చూడండి..

"చివరకు మిగిలేది"


వంశీ

"97" లో తానా వారి పురస్కారం పొందిన నవల "రేగడి విత్తులు" రచయిత్రి శ్రీమతి చంద్రలత గారి వ్యాసం

విశ్వనాథ సత్యనారాయణ గారి బద్దన్న సేనాని నవలా కథనం మీద "97" లో తానా వారి పురస్కారం పొందిన నవల "రేగడి విత్తులు" రచయిత్రి శ్రీమతి చంద్రలత గారి వ్యాసం ఇక్కడ చూడండి

బద్దన్న సేనాని

వంశీ

Tuesday, November 27, 2007

పిల్లల పద్యాలు

పిల్లల పద్యాలు ఇక్కడ చూడండి

పిల్లల పద్యాలు

వంశీ

Sunday, November 25, 2007

చెంచునాటకం , కీలుగుఱ్ఱం , యక్ష గానం , చెక్కభజన , బుఱ్ఱ కథ, తోలుబొమ్మలాట , గొరవయ్యలు

మరుగునపడిపోతున్న మన జానపద కళలు - చెంచునాటకం , కీలుగుఱ్ఱం , యక్ష గానం , చెక్కభజన , బుఱ్ఱ కథ, తోలుబొమ్మలాట , గొరవయ్యలు దృశ్య రూపంలో (video)ఇక్కడ చూడండి

జానపద కళలు videos


మిత్రులు డాక్టర్ జోగధేను స్వరూప్ కృష్ణ గారి సౌజన్యంతో

Sunday, November 18, 2007

తుప్పట్టిన మోటార్ చక్రం

సరదాపాట

మాగాయీ కందిపచ్చడీ
ఆవకాయీ పెసరప్పడమూ
తెగిపోయిన పాతచెప్పులూ
పిచ్చాడి ప్రలాపం, కోపం
వైజాగులో కారాకిల్లీ
సామానోయ్ సరదాపాటకు

తుప్పట్టిన మోటార్ చక్రం
తగ్గించిన చిమ్నీ దీపం
మహవూరిన రంపప్పొట్టూ
పంగల్చీలిన త్రాం పట్టా
విశిరేసిన విస్తరి మెతుకులు
అచ్చమ్మ హోటేల్లో చేపలు
సామానోయ్ సరదాపాటకు

నడి నిశిలో తీతువు కూతా
పడి పోయిన బెబ్బులి వేటా
కర్రెక్కిన నల్లి నెత్తురూ
జుర్రేసిన ఉల్లికారమూ
చించేశిన కాలెండర్ షీట్
నపుంసకుడీ థాట్ డెవలప్మెంట్
సామానోయ్ సరదాపాటకు

త్రుళ్ళనిదీ కుళ్ళనిదీనీ
మళ్ళినదీ వెళ్ళినదీనీ
చచ్చేదీ లాభం లేనిది
ఈ జన్మకు పనికి రానిదీ
మనకెప్పుడు కలిసిరానిదీ
సామానోయ్ సరదాపాటకు

(జరుక్ శాస్త్రి పేరడీలు నుండి - శ్రీశ్రీ "నవకవిత"కు పేరడీ)

ఇలాటివి ....ఇక్కడ

తుప్పట్టిన మోటార్ చక్రం



వంశీ

Saturday, November 17, 2007

ఆవకాయ, మాగాయ పాట

స్వర్గీయ మల్లినాథ సూరి గారు ఒక వేసంకాలం బంధువుల పెళ్ళికి వెళ్ళిరావటం, ఆ నెలలోనే ఆవకాయ, మాగాయ కూడా పెట్టించటం మూలాన ఖర్చు చాలా అయ్యిందిట.అప్పుడు వారు కట్టి పాడిన పాట

మున్నాళ్ళ పెళ్ళికి ముప్ఫైయ్యి వదిలాయి రామచంద్రా||
రైలువాడికి ఇస్తి రానూపోనూ ఇరవై రామచంద్రా||
పెట్టికూలికి పోయె పైనొక్క రూపాయి
బండ్లవాళ్ళకు ఇస్తి పధ్నాలుగణాలు ||రామ||
ఇంటావిడకు కుట్టిస్తి వంటిమెడ రెవిక ||రామ||
ఒక్క రెవికకి పట్టె రొక్కమ్ము రెండు
కుట్టువాడికి ఇస్తి గట్టిగా బేడాను || రామచంద్రా ||
ఫేషన్ అనుకొని పక్కనున్న ఆమె
టిక్కట్టు నేకొంటి రామచంద్రా
టిక్కెట్టుకే పట్టె జాకెట్టు ఖరీదు ||రామ||
ఆవకాయకు అయేనా అరవయ్యి రూకలు ||రామ||
మాగాయకు పట్టె మరి ఇరవై రూకలు ||రామ||
లక్ష్మయ్యకే ఇస్తి సాక్షాత్తు యాభయ్యి ||రామ||
కారమూ, ఉప్పును ఇంట్లోనే కొట్టిస్తి ||రామ||
కాయలు స్వయముగా
చేయి చేసి తరిగితి ||రామ||
ఇంత చేసిన పిదప ఎవడో చుట్టమువచ్చి
వఱ్ఱగా తినిపోవు ఎవడబ్బ సొమ్మని ||రామ||
కొట్టులోపల అప్పు జోకొట్టితే పోవునా ||రామ||

Friday, November 16, 2007

మీగడ తరకలు

తెలుగు సాహిత్యంలో సాహిత్యాభిలాషులకి ఉల్లాసాన్నీ, ఉత్సాహాన్నీ, ఉత్తేజాన్ని ఇస్తూ రచయితల వ్యక్తిత్వ విశేషాలని, రచనా శైలినీ, ఆ రచనల్లోని ఒంపు సొంపులనీ, భావాన్నీ, ఆ రచయితల, కవుల కాలానుగుణ సాహిత్య వాతావరణాన్ని వివరించే ఎన్నో ఎన్నెన్నో మధురమయిన చిన్ని మీగడ తరకలు ఉన్నాయి. ఆ మీగడ తరకలలో కొన్ని ఈ రూపేణా మీ ముందుకు తీసుకునిరావటానికి అవకాశం లభించినందుకు సంతోషంగా ఉన్నది.

ఇక్కడ నొక్కండి

మీగడ తరకలు


తమకు తెలిసిన ఇతర విశేషాలు పంచుకోవాలనుకున్న మహానుభావులకి ఎల్లవేళలా ఆహ్వానం. ప్రస్తుతానికి కొన్నే ఉన్నా మరిన్ని మీ ముందుకు త్వరలో ..

Monday, November 12, 2007

ఇళ్ళలో ఉండి తీరవలసిన పుస్తక రాజాలు ఇవి!

"ఎల్లోరా" అసలు పేరు గొడవర్తి భాస్కరరావు అని మీకు తెలుసా?

ఈయన జానపద గేయ సాహిత్య పరిశోధన అనన్య సామాన్యం.పుస్తక ప్రియులందరి ఇళ్ళలోనూ ఉండి తీరవలసిన పుస్తక రాజాలు ఇవి.


ఆంధ్ర చరిత్ర - సంస్కృతీ వికాసం ( వ్యాస గ్రంథం)
ఆయన చేసిన రచనలు
అరుణకిరణాలు (కవితలు)
బాలగేయ కథలు
బంతిపూలు
చంద్రముఖి (నవల)
చంద్రవదన
చిన్నారి కథలు
డాక్టర్ కోకిల
దేశిపదాలు
గుడిగంటలు
హృదయవీణ
జానపదగేయాలు - 1
జానపదగేయాలు - 2
కదలిపోయిన రైలుబండి (కథానికలు)
మన ప్రాచీన కళలు - పుట్టుపూర్వోత్తరాలు
మందారాలు ( బాలల కోసం రాసిన నవల)
మాయ చిలుక (నవల)
పండిత రాయలు (బుఱ్ఱ కథ)
పండుగల పాటలు
పాపాయి పాటలు
పరిసరాలు - ప్రభావాలు (సాంఘిక నవల)
ప్రజల పాటలు
పూవులు - మొగ్గలు
సాహిత్య సమారాధన
సరాగాలు
వెన్నెల రాత్రులు (నాటికలు)
వేసవి సెలవలు (బాలల కోసం నాటికలు)
విచిత్ర కథలు

Sunday, November 11, 2007

కళాకారులే కాదండీ కళామతల్లికి సేవ చేసేది....

మిత్రులు శ్రీ డాక్టర్ జోగధేను స్వరూప్ కృష్ణగారి సౌజన్యంతో, ఆంధ్ర దేశ జానపద కళారూపాలు "వీడియో" రూపంలో మీ ముందుకు తీసుకుని రావటానికి అవకాశం కలిగినందుకు, ఆ అద్భుతమయిన జానపద కళారూపాలు మీతో పంచుకునేందుకు అనుమతి ఇచ్చిన ఆయనకు మనఃపూర్వక ధన్యవాదాలతో. ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి తన పీ.హెచ్.డి రీసెర్చి లో భాగంగా ఆయన స్వంతంగా వీటన్నిటినీ భావితరాలకోసం పదిలపరచినందుకు ఆ భగవంతుడు ఆయన్ని సదా చల్లగా చూడాలి అని కోరుకుంటూ... కళాకారులే కాదండీ కళామతల్లికి సేవ చేసేది..ఇలాంటి మహానుభావులు కూడా

www.maganti.org/page11.html

చెంచునాటకం , కీలుగుఱ్ఱం....ప్రస్తుతానికి ...

మరిన్ని వివరాలతో, మరిన్నివీడియోలతో త్వరలో మీ ముందుకు

Thursday, November 8, 2007

చల్లపల్లి రాజా యార్లగడ్డ శివరామప్రసాద్ గారి చిత్రం..


చల్లపల్లి రాజా యార్లగడ్డ శివరామప్రసాద్ గారి చిత్రం..


అసలు ఏమయ్యిందో చెప్పండి...

చాలా ...చాలా... జాగ్రత్తగా చూసి అసలు ఏమయ్యిందో చెప్పండి ఇక్కడ...
మిత్రుడు శ్రీనివాస్ పంపించిన ఒక వీడియో క్లిప్పు

హైదరాబాదు వెళ్ళినప్పుడు తెచ్చుకున్న పిల్లల పుస్తకాల పట్టీ

హైదరాబాదు వెళ్ళినప్పుడు తెచ్చుకున్న పిల్లల పుస్తకాల పట్టీ....ఇంకా మరి కొన్ని తరువాతి టపాలో ...ఇవి అన్నీ చాలా మటుకు బాలల అకాడెమి పుస్తక ప్రచురణలు

అద్భుతమయ పుస్తక ప్రపంచం - ఎం.ఆర్.వి.నరసింహారావు గారు 82లో అనువదించిన పుస్తకం. దాదాపు అరవై పుటలు కల ఇందులో పుస్తకాల పుట్టుక మొదలయిన వాటి గురించి వివరంగా ఉన్నది.

అట్లతద్దోయ్ ఆరట్లోయ్ - ఎల్లోరా గారి పుస్తకం. దాదాపు 30 పేజీలు ఉన్న పుస్తకం బాగుంది.

ఆటల పాటలు - అలపర్తి వెంకటసుబ్బారావు గారు రచించిన ఈ చిన్న పుస్తకంలో పిల్లలు పాడుకునే పాటలు బావున్నాయి

ఒప్పులకుప్ప - ఏడిద కామేశ్వర రావుగారు - సుమారు 60 పేజీలు కల ఈ పుస్తకం బాలల నృత్య గేయ నాటికలు ఉన్నాయి. ఏడిద కామేశ్వర రావుగారు చాలా మంచి హాస్యం కురిపిస్తారు వీటిలో.

కలల పంట - శ్రీమతి శారదా అశోక్ వర్ధన్ గారి పిల్లల కథలు పుస్తకం

గోడమీద బొమ్మ - వెలగా వెంకటప్పయ్య గారి రచన - పొడుపు కథల గురించి

పసిడితెర - న్యాయపతి రాఘవ రావు గారి పిల్లల నాటకాల పుస్తకం

పిల్లల పాటలు - వెలగా వెంకటప్పయ్య - సుమారు 230 పేజీలు ఉన్న ఈ పుస్తకంలో చాలానే గేయాలు ఉన్నాయి

బాలభాష - వేటూరి ప్రభాకర శాస్త్రిగారి అద్భుతమయిన రచన - జానపద గేయాల సంకలనం.

లక్క పిడతలు - చింతా దీక్షితులు గారి బాలల గేయాలు

రేడియో అక్కయ్యగారి జీవిత విశేషాలు

మొన్న హైదరాబాదు వెళ్ళినప్పుడు తెచ్చుకున్న పుస్తకాల్లో - రేడియో అక్కయ్యగారి నాటకాలు పుస్తకం ఒకటి. అందులో ఆవిడ జీవిత విశేషాలు సంక్షిప్తంగా ఉన్నాయి...ఈ క్రింద చూడండి









Wednesday, November 7, 2007

మరో మంచి వెబ్ జైను

మరో మంచి వెబ్ జైను - www.ejayanthi.com

షాదాన్ మహిళా కళాశాలలో గత 14 యేళ్ళుగా ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న శ్రీమతి సుజాతా గోపాల్ గారితో పరిచయం ఏర్పడినప్పుడు ఆవిడ ఈ ఆణిముత్యం గురించి తెలియచేసారు. అందుకు ఆవిడకి ధన్యవాదాలు. సుజాతా గోపాల్ గారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో "ట్రాన్స్లేటెడ్ తెలుగు షార్ట్ స్టోరీస్" మీద పి.హెచ్.డి పరిశోధన సాగిస్తున్నారు..

Tuesday, November 6, 2007

ఏడు వారాల నగలు - కథా కమామీషు ఏమిటి?

అసలు ఏడు వారాల నగలు అంటే ఏమిటి? ఈ నగలకి "లిస్ట్" లాంటిది ఏమన్నా ఉందా ? ఒక్కొక్కళ్ళ దగ్గరినుంచి ఒక్కో సమాధానం వస్తోంది, ఒకళ్ళేమో - అసలు ఏడువారాల నగలు అనేవి "అమ్మవారు" వారంలో వేసుకునే నగలు అని చెప్తే - ఇంకొకళ్ళు ఏడు వారాల నగలు అనేవి అత్యంత సంపన్నమయిన కుటుంబానికి ఉపమాన పదం అని, అంతే కానీ అసలు అలాంటి ఏడు వారాల నగలు అనేవి ఏమీ లేవు అని చెపుతుంటే, ఇంకొకళ్ళు "వారంలో ఒక రోజు ముత్యాలు, ఒకరోజు పుష్యరాగాలు, ఒక రోజు పగడాలు - ఇలా వివిధ రత్నాలతో చేసిన నగలు వేసుకునే విధానం" అని చెప్తున్నారు...అసలు ఈ ఏడు వారాల నగలు - కథా కమామీషు ఏమిటి?

మీ అభిప్రాయం కూడా తెలిపితే సంతోషిస్తాను...ఒక వేళ అలాంటి నగలు అసలు ఉంటే, మీలో ఎవరయినా ఆ నగల "లిస్ట్" చెప్పగలిగితే మటుకు మాగంటి.ఆర్గ్ చదువరులతో పంచుకుంటాను అని ముందుగానే మనవి చేసుకుంటున్నాను.....

Sunday, November 4, 2007

కిటికీల్లో ఒక చిన్న బొమ్మల ప్రదర్శన..

మన సంగీత వాయిద్యాల గురించి కిటికీల్లో ఒక చిన్న బొమ్మల ప్రదర్శన....నాకున్న చిన్ని జ్ఞానంతో తయారు చేసిన ఈ ప్రదర్శన అంత బాగుండకపోవచ్చు...కానీ మొదటి అడుగు పడింది...

http://maganti.org/movies/vayidyam.wmv

చూద్దాం ఎక్కడికి తేలుతుందో ?

Friday, November 2, 2007

ఎగ్గేమి - సిగ్గేమి?

అసలు వీళ్ళు కవితలు ఎందుకు రాస్తున్నారో, ఈ వెబ్జైనులు ఆ కవితలను ఎలా ప్రచురిస్తున్నాయో అర్థం కాకుండా ఉన్నది. ఇప్పుడు పేర్లు గట్రా ఎందుకు కానీండి కానీ...ఈ మధ్య అంతర్జాలం లోని కొన్ని పత్రికలలో వచ్చిన కవితలని చూస్తే పరమ రోతగా ఉంది. వీళ్ళ కవిత్వం ఎవరికోసం? రాసిన వారి ఆత్మ సంతృప్తి కోసమా? వీళ్ళకి పాఠకులెవరు? అందరూ చదివేలా రాయక్కర్లేదా? ఉచ్ఛ నీచాలు, ఉచితానుచితాలు పట్టించుకోకుండా కొత్తగా గమ్మత్తుగా రాయాలి అన్న తపన అడ్డగోలగా వాడుకభాషలోని పదాలను, రోజువారీ మాటలను అటూ ఇటూ తిప్పి ఒక పద్య పాదంగా రాసి చేతులు దులుపుకుంటున్నారు...

బాబోయి ...నా వల్ల కాదు ఈ దుర్మార్గపు కవితలు చదవడం...పోనీ ఆ కవులకు లేదు అంటే, ఆ పత్రికల సంపాదకులకు ఏమయ్యింది? ఏదో రకంగా నాలుగు కవితలు ప్రచురించి కాలం గడుపుకుందాము, నాకేమి పోయె చదివేవాడి ఖర్మం అని పత్రికా సంపాదకులే ఆలోచిస్తున్నప్పుడు , అడ్డగోలుగా రాసే ఆ కవివరులకు "ఎగ్గేమి - సిగ్గేమి?".


ఉదాహరణకి ఒక కవితలో - ఓహో బాటసారి, ఇలా చేయ్యవలె మీరు , ముక్కు మూసుకోండి మీరు, పక్కకు జరగాలండి మీరు, ఎక్కడికొచ్చారో తెలుసా? కంపు కొట్టేచోటికి - ఏవండీ కవిగారు ఇది ఒక కవితా? అయ్యో జనాలు చదివి నవ్వుతారే అని కూడా అనిపించలేదాండీ మీకు? పైగా దీని పేరు భావ కవిత్వమా? హయ్యో హతవిధీ...ఇలా ఖర్మం కాలబట్టే .....సరే

ఇంకో పత్రికలో పరుపులు, మరకలు,లేవండి, పదండి, అడక్కండి, మాట్లడకండి అని ఇంకో కవిత...హయ్యయ్యో హయ్యయ్యో...

సంతృప్తి రచయితకో, లేక కవికో మాత్రమే కలిగితే సరిపోతుందా? పాఠకుడికి కలగఖ్ఖరలా? ఏ రచన అయినా సరే ఎవరూ ఏవగించుకోకుండా ఉండాలి..సరే ఎన్ని అనుకుని ఏమి లాభం...

"నేను సైతం" గారి టపా - "నేను…నా నాటకాలు "

"నేను సైతం" గారి టపా - "నేను…నా నాటకాలు " - నేనుసైతం గారు..ఎందుకో మీ టపాలో నేను కామెంటు చెయ్యలేకపోతున్నాను...ఎర్రర్ ఎర్రర్ ఎర్రర్ అని తెగ తిడుతోంది..లేదా తెల్ల కాగితం చూపిస్తోంది...అందుకని ఇక్కడ రాస్తున్నా...


"హబ్బా హబ్బా హబ్బా హబ్బా...అబ్బో అబ్బో అబ్బో అబ్బో...ఉబ్బి తబ్బిబ్బు...ఇంతవరకు నాకు ఈ అంతర్జాలంలో మా అమ్మమ్మగారి స్వగ్రామం "చల్లపల్లి" అనే మాట రాతల్లో రాసి కనపడిన మొదటి వ్యక్తి మీరే...నేను పెరిగింది చదువుకున్నది అంతా హైదరాబాదులో అయినా, సంవత్సరానికి ఏదో ఒక కారణం - పండగలు అనో, పెళ్ళిళ్ళు అనో, చుట్టాలకి ఒంట్లో బాగోలేదు అనో, ఇలా ఏదో ఒక మిష మీద నాలుగు నెలలు చల్లపల్లి, బందరులో ఉండేవాడిని... యమా సంతోషం వేసింది చల్లపల్లి అనే మాట వినగానే..అందుకని మీ టపాకి ఈ రాతకి సంబంధం లేకపోయినా ఏమీ అనుకోవద్దు. అదేదో సినిమాలో "కోట" ఎవరయినా "మాది బందరు" అనగానే వాణ్ణి వాటేసుకుని ఆనందంతో తొక్కి నారదీస్తాడు లాగా ఉంది వీడి వ్యవహారం అని మీరు అనుకున్నా ఫరవాలేదు.. "

Wednesday, October 31, 2007

తిట్టుకోండి, అరుచుకోండి, బట్టలు చింపేసుకోండి, కానీ...

మనువు మీద కోపమెందుకో? ఈ మధ్య మనువు (పెళ్ళి కాదండోయ్)మీద మనసు మళ్ళి మంత్రాంగంతో మేధ మధిస్తే ముచ్చటయిన ముత్యాలు మురిపెంగా మకిలి లేకుండా తవ్వుకొచ్చినాయి. ఆ ముత్యాలు ఏంటి అంటారా? ఈ స్త్రీవాదులు, స్త్రీవాదాన్ని సమర్ధించేవారు , మనువు మీద అక్కసు ఉన్నవాళ్ళు, ఆ అక్కసుని దాచుకోలేక వెళ్ళగక్కేవాళ్ళు కాసింత ఆ మనువు ఏర్పరచిన ప్రామాణికా ముత్యాలను చూసి ఆలోచించి, ఆ పై ఆనందించండి. ఇంకా ఏడుస్తారా ? మీ ఖర్మ..మిమ్మల్ని ఎవడూ బాగు చెయ్యలేడు, భూషయ్య, లాడెన్, మోడీల్లాగా చరిత్రలో మిగిలిపోండి. ఇలా ఎందుకు అంటున్నాను అనుకుంటున్నారా?

అసలు ఇది అంతా ఎందుకు రాయవలసి వచ్చింది అంటే ఇవ్వాళ్ళ ఒక చిత్రమయిన డాక్టరేట్ మహాతల్లి ఇక్కడి తెలుగువారి కబురూ కాకరకాయ సమావేశానికి( నా భాషలో సాహితీ గోష్టికి) మా తలకు మాసిన సంఘానికి సుధారాణి అని ఒకావిడ ఉంది లెండి..ఆవిడ ఆహ్వానం మీద వచ్చి మనువు మీద పేద్ద లెక్చర్ ఇచ్చింది.

మనువు అనే వాడు పుట్టడమే తప్పు అన్నంత ఇదిగా వాదించింది. ఆవిడకి కొత్త డాక్టరేట్ పరిశోధనాంశం మనువు అట. అక్కడ ఆవిడకి సమాధానం చెప్పడానికి వెధవ గోల - ముఖ్య అతిథి అయిపోయిందాయె. సరే లేచివచ్చేద్దాము అని అనుకున్నా కానీ అసలు ఆవిడ బాధ ఏంటో చూద్దాము అనిపించి చివరిదాకా ఉన్నాను...ఒక ఇరవై నిముషాలు ఏకింది, ఏకింది, ఏకింది...చివరికి ఒక రెండు గ్లాసుల మంచి నీళ్ళు తాగి అందరి వంక చూసి నవ్వింది...అదిగో ఆ నవ్వే నాకు ఎక్కడో కాలింది..పైగా ఈ సారి సమావేశానికి ఆవిడ వస్తోంది అనేటప్పటికి ఆడ జనాభా 22 మంది వచ్చి - ఈలలు గట్రా వేసుకుంటు ( ఈలలు అనేది మటుకు నేను కల్పించి రాసింది - ఈలలు అంటే యమా హుషారుగా అని అర్థం చేసుకోవాలి) ఉండేటప్పటికి మిగిలిన 4 మగ పుంగవులు గమ్మున అయిపోయాము అన్నమాట. సరే అక్కడ తక్కువయినా ఈ బ్లాగాయుధం ప్రయోగించి ఈనాడు మనువుకి జరిగిన అన్యాయాన్ని ప్రపంచానికి చాటి చెపుదాము అని ఇది రాస్తున్నా అన్న మాట.ఈ బ్లాగు ఆవిడ కూడా చదువుతుంది లెండి. అందుకే ఇక్కడ రాసా... :)

నేను చదివిన పుస్తకాల్లో మనువు చెడ్డవాడు అని నాకు అనిపించలేదు. ఆ పుస్తకాల్లో మనువును గూర్చి వివరించిన దాన్ని బట్టి నాకు తోచింది ఇది. యే పుస్తకం? ఎక్కడ ఉంది? అది నేను కూడా చదివి అందులో తప్పులు పట్టుకంటాను, అంటే మటుకు చెప్పేది లెదు.

1. యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః
యత్రైతాః తు న పూజ్యంతే సర్వాః తత్రాః ఫలాః క్రియాః
అంటే దీని అర్థం - స్త్రీలను ఆదరించి గౌరవించి నడిచే కుటుంబంలో దేవతల వంటి సంతానం, దివ్యమయిన సంతోషాలు లభిస్తాయి అని, అది జరగని చోట అన్నీ నిష్ఫలాలే అని భావం

2. పుత్రేణ దుహితా సమా
పుత్రిక కూడా పుత్రికతో సమానం. పుత్రిక ఆత్మతో సమానం. అందుకని ఆమె పితృసంపదకు అధికారిణి

3. పుత్రికకి తండ్రి ఆస్తిలో సమానాధికారం నిర్ణయించిన మనీషి మనువు

4. స్త్రీలను అబలలుగా భావించి, ఆమె బంధువులు ఆ స్త్రీల ధనం స్వాధీనం చేసుకుంటే దొంగలుగా నిర్ధారించి కఠిన శిక్ష వెయ్యాలి అని మనువు చెప్పాడు.

5. స్త్రీల మీద జరిగే అత్యాచారాలకు, అరాచకాలకు అత్యంత కఠిన శిక్షలు ఏర్పరచింది కూడా మనువే

6. వివాహం చేసుకోవటం లో స్త్రీ కి సంపూర్ణ స్వతంత్ర అధికారం కల్పించించి మనువే.

ఇలా ఎన్నో ఉన్నాయి...ఇవి చదివిన తరువాత అయినా మనువు మీద కోపం తగ్గించుకోండి...ఆయన పాపం అన్నీ ఖచ్చితంగానే చెప్పాడు.


దాన్ని వేరే విధంగా అమలు చేసిన దుర్మార్గపు మనుషులను తిట్టుకోండి, అరుచుకోండి, బట్టలు చింపేసుకోండి, కానీ మనువు ని ద్వేషించొద్దు.

Tuesday, October 30, 2007

ఒక వ్యంగ్యాస్త్రం - చదువు రానివేళ 'చంకరుండ'న్నాడు

కరుణశ్రీ గారు రాసిన ఒక వ్యంగ్యాస్త్రం

చదువు రానివేళ 'చంకరుండ'న్నాడు
చదువు కొనెడివేళ 'సంకరు'డనె
చదువు ముదిరిపోయి షంకరుండనెనయా
స్నిగ్ధ మధురహాస ! శ్రీనివాస!

Monday, October 29, 2007

డాక్టర్ కొడవటిగంటి రోహిణీప్రసాద్ - సితార్ తళుకు తునక ఇక్కడ విని ఆనందించండి

డాక్టర్ కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారు మంచి సంగీతాభినివేశం కల వ్యక్తి. ఆయన స్వరపరచిన "యమన్" రాగం లోని ఒక సితార్ తళుకు తునక ఇక్కడ విని ఆనందించండి.

http://maganti.org/audiofiles/krp/krpmusic.html


ఆ కళాతపస్వికి సహస్ర వందనాలతో

ఇంగ్లీషు ముష్టి బాగా కిడుతుంది అని కావును...

మా నాన్నగారి వద్ద శిధిలావస్థలో ఉన్న భమిడిపాటి కామేశ్వర రావుగారి "మన తెలుగు" పుస్తకం చదువుతూ ఉంటే ఒక అద్బుతమయిన ప్రసంగం కనపడింది. అనుమతి లేకుండా ఆయన రాసిన దానిని ఇక్కడ ఉపయోగించుకుంటున్నందుకు క్షమించమని విన్నపము.

ఆయన అంటారు... తెలుగు వాళ్ళల్లో విద్యాధికులయిన గొప్పవాళ్ళతొ ప్రసంగిస్తే ఈ కింద ఇచ్చిన నమూనా సమాధానలు వినపడతాయి అని

ఇంగ్లీషు ముష్టి బాగా కిడుతుంది అని కావును కొందరు ఈ మధ్య ఇంగ్లీషులో ఎత్తుతున్నారు. అక్కణ్ణించీ, తెలుగులో క్రియ లేకపోబట్టి, క్రియలన్నీ , ఇంగ్లీషులోనే జరిపె తెలుగు వాళ్ళు లేస్తోన్నారు. మాట్లాడ్డం, నడవడం, కోప్పడ్డం, తినడం, ఏడవడం వగైరా అన్నీ.

సరే ఇక ప్రశ్న, జవాబుల్లోకి వస్తే
ప్రశ్న - పెళ్ళానికి ఇంగ్లీషు రాదు
సమాధానం - వదిలెయ్

ప్రశ్న - తలిదండ్రులకి ఇంగ్లీషు రాదు
సమాధానం - పాతెయ్

ప్రశ్న - బంట్రోతులకి ఇంగ్లీషు రాదు
సమాధానం - తీసెయ్

ప్రశ్న - సంస్కృతం మాట ఏమిటి ?
సమాధానం - బతికున్న వాళ్ళకెందుకు! ఒక వేళ చచ్చి స్వర్గానికెడితె దేవుడితో సంభాషించవచ్చు

ప్రశ్న - ఇంగ్లీషు ?
సమాధానం - అల్లా అన్నారు - ఆల్రైటు! బానిసలమయిన మనమే కాదు, కొమ్ములు తిరిగిన వాళ్ళు కూడ ఇది నేర్చుకుంటున్నారు. ఇంగ్లీషుని ప్రపంచ భాష చెయ్యడానికి ఇంగ్లాండు వాళ్ళు వీరకంకణం కట్టి బోలెడన్నిపదాలు ఇంగ్లీషుని జల్లించి తీసి, వాట్లతోనే వెనకటి ఇంగ్లీషు గ్రంథాలన్నీ పిరాయించి రాస్తున్నారు. ఎంత నయం!

ప్రశ్న - హిందీ?
సమాధానం - అచ్చా! అందులో హుషా, మజా ఉన్నాయి. అయితేనేం? లిపి నాకు రాదు

ప్రశ్న - పోనీ తెలుగు ?
సమాధానం - చీ! తెలుగేమిటీ చప్పగా! నా బోటిగాడి కేమిటుంటుంది అందులో! స్టేల్!

ప్రశ్న - తెలుగు పుస్తకాలు?
సమాధానం - తర్జుమా, తత్సంబంధం, తస్కరణం. నా మనస్సుకి విందుగా గానీ, ఆహారంగా గానీ,పథ్యంగా గానీ, ఆఖరికి చిరుతిండిగా గానీ ఉండేదేనా ? లేదు

ప్రశ్న - తెలుగులో పాతరచన?
సమాధానం - మురుగు! విజ్ఞాన శూన్యం. పైగా అదంతా అదివరకే సంస్కృతంలో అంతకంటే రమ్యంగా ఉండేసిన బాపతుట

ప్రశ్న - తెలుగులో కొత్త రచన ?
సమాధానం - అగమ్యం, సంకరం, అసభ్యం, నీరసం

ప్రశ్న - చదివి చూశావా?
సమాధానం - కిట్టదు. అందుకనే చదవను. చదవకుండా చెప్పడం మాత్రం కళ కాదా?

ప్రశ్న - తెలుగులో పాత చిత్రకళ?
సమాధానం - అంతా ఇంగ్లీషు. అందులో పురాణ స్త్రీలు కూడా దొరసానుల్లానే ఉంటారు.

ప్రశ్న - మరి కొత్త చిత్ర కళ?
సమాధానం - బాబూ ఇది బెంగాలీ ఫక్కీ - అన్నీ భావ బొమ్మలు

ప్రశ్న - తెలుగులో క్పాత పాటలు?
సమాధానం - ఇప్పటి మూర్ఖులు, వెనకటి స్త్రీలు వినడానికోసం

ప్రశ్న - కొత్త పాటలు?
సమాధానం - గంధర్వ, వ్యాస్ - ఇమిటాషన్, ఒక్క త్యాగయ్య వీనా - అతడేనా అరవ దేశంలో ఉన్నాడు కనక. అతడికేనా తెలుగు బాగా రాదు.

ప్రశ్న - తెలుగు ఫిల్ములు?
సమాధానం - మంచిది ఒక్కటీ లేదు. నిశ్శబ్దంగా ఉండే సినీమాలోకి వెళ్ళిన తెలుగు నటుడు లేడు. ఇప్పుడు సశబ్దంగా ఉండే టాకీలో ముందు బుక్కై తరువాత తుక్కుగాని తెలుగు జనుడు లెడు.

ప్రశ్న - తెలుగు పత్రికలు?
సమాధానం - కొన్ని ఇంగ్లీషు వాటికి పుత్రికలు. కొన్ని అమ్రేడితాలు. కొన్ని ప్రచారమాత్రాలు

ప్రశ్న - తెలుగు యంత్ర పరిశ్రమలు?
సమాధానం - పేపరు మిల్లు, బట్టల మిల్లు వగైరా కొన్నింటిలో తెలుగే లేదు, తక్కిన వాటిలో పరిశ్రమే లేదు

ప్రశ్న - తెలుగు వాళ్ళ విదేశ వర్తకం?
సమాధానం - అది సాగుతుండేది అన్యభాషా పరిచయం వల్లే. తెలుగు వల్ల కాదు.

ప్రశ్న - తెలుగు పరపతి సంఘాలు?
సమాధానం - కొన్ని నరపతి సంఘాలు, కొన్ని తిరపతి సంఘాలు

ప్రశ్న - తెలుగు ప్రజల ధనాలయాలు?
సమాధానం - కొన్ని సుప్రజాలయాలు, కొన్ని స్వప్రజాలయాలు, కొన్ని లయాలు

ప్రస్ణ - తెలుగులో భీమాలు?
సమాధానం - కొన్ని హేమాలు, కొన్ని కామాలు

ప్రశ్న - తెలుగు నాయకులు?
సమాధానం - కొందరే, చాలా మంది వినాయకులు

ప్రశ్న - తెలుగు విశ్వవిద్యాలయం?
సమాధానం - అదంతా తెలుగుది కాదు

ప్రశ్న - అయితే?
సమాధానం - అప్పుడూ మజా! అదీ మెడ్రాస్ ఇమిటేషన్! పరీక్షల కార్ఖానా!

ప్రశ్న - కొత్త శాఖలున్నాయే!
సమాధానం - ఇంకా ఉండాలి - తెలుగవాలి

ప్రశ్న - డబ్బుండాలి కదా. అంతా తెలుగయితే అన్య దేశాల్లో మన పట్టాలు సాగవేమో?
సమాధానం - అన్య దేశాలు వెళ్ళనేవద్దు

ప్రశ్న - పోనీ తెలుగు రాష్ట్రం?
సమాధానం - అట్టెట్టె! ఆగాలి! సౌరాష్ట్రం


ఏతావాతా , తెలుగులో విద్య నేర్చినవాడికి తక్కిన తెలుగువాడికి మానసికంగా చాలా దూరం అయిపోయింది. కేవలం తెలుగువాడికి ఉండే భావాలు, అభిప్రాయాలు అసలయిన భావాలు, అభిప్రాయాలు కావని విద్యాధికుడయిన తెలుగు వాడు అనుకునే కర్మం తెలుగుదేశానికి పట్టింది అని భమిడిపాటి వారి విశ్లేషణ. 1948 లో వ్రాసిన ఈ పుస్తకం ప్రతి ఎక్కడయినా పూర్తిగా దొరికితే బాగుండు.

Sunday, October 28, 2007

కటింగుల్లో బయటపడ్డ ప్రముఖులు

మరి కొన్ని పాత పేపర్ కటింగుల్లో బయటపడ్డ మన ప్రముఖులు


స్థానం నర్సింహారావు


గిడుగు


చిలకమర్తి

Saturday, October 27, 2007

ఆకాశవాణి వార్తలు - 2

ఆకాశవాణి వార్తలు - 2

మరి కొద్ది మంది గుర్తుకు వచ్చారు

ప్రాంతీయ వార్తలు చదివేవాళ్ళు

తాటిబండ్ల రజని
మల్లెల జయలక్ష్మి
ఉప్పర్లపాటి జయప్రకాష్


నాటకాల్లో వేసేవాళ్ళు

సి.రామ్మోహన రావు
వి.బి.కనకదుర్గ
సీతారత్నం
మద్దాలి సుశీల
నండూరి రామ్మోహన రావు
చిట్టా శంకర్
విన్నకోట రామన్న పంతులు
చాట్ల శ్రీరాములు
సుబ్బరాయ శర్మ
కోట శంకర్ రావు
పద్మజా నిర్మల
వేదగిరి రాంబాబు
జీడిగుంట రామచంద్రమూర్తి
ఆదివిష్ణు
కోకా రాఘవరావు
శకుంతల


సంగీత విద్వాంసులు

సెమ్మంగుడి శ్రీనివాస అయ్యర్
వీణా శ్రీనివాస్ - వీణ
డాక్టర్ పద్మ - వీణ, నాదస్వరం
శ్రీమతి బుర్రా సరోజినీ మూర్తి - వయోలిన్
శ్యామసుందర్ అయ్యగారి - వీణ

Friday, October 26, 2007

శ్రీసాయిసచ్చరిత్ర గ్రంథము తెలుగులో

శ్రీసాయిసచ్చరిత్ర గ్రంథము తెలుగులో ..మంచి లంకె

http://www.shirdisaiashirvadam.org/babaframe.htm

ఇంకా ఆరతులు / హారతులు అవీ కూడా ఉన్నాయి..

Tuesday, October 23, 2007

మన వాళ్ళ తెలివితక్కువ తనమా, లేక ఇలాంటివి రాయటానికి తెగువ, ధైర్యం చాలకా?

నిన్న బార్న్స్ అండ్ నోబుల్ కి వెళ్ళినప్పుడు ఒక మంచి పుస్తకం దొరికింది. ఎప్పటిదో "టాడ్స్ రాజస్థాన్" అని ఆ పుస్తకం పేరు. అందులో మంచి మంచి విషయాలు - మరుగున పడిపోయినవి, మనం "తేజోమహాలయ" గురించి పెద్దగా ఆసక్తి చూపనట్టే, ఇందులో విశేషాల గురించి కూడా మర్చిపోయి ఉంటాము. ఒక విదేశీయుడు మన చరిత్ర గురించి, భారతీయుల దేశ, సముద్రాభియానం గురించి సమగ్రంగా వివరించటమనేది, మన వాళ్ళ తెలివితక్కువ తనమా, లేక ఇలాంటివి రాయటానికి తెగువ, ధైర్యం చాలకా? అని అనిపిస్తుంది

సరే...ఇక ఆ పుస్తకం లోని సంగతుల్లోకి వస్తే..అందులో చెప్పబడిన విశేషాలు

1) సగర చక్రవర్తి ఈ సముద్రాభియానానికి (invasion of the ocean) కి ఆద్యుడని చెప్పబడింది. ఆయన ఈస్ట్ ఇండియన్ ఆర్చిపేలగో (హిందూ ద్వీప సముదాయం) తొ పాటు ఎన్నో దేశాలు జయించాడు. అందులో శ్యామా దేశం ఒకటి. ఈ శ్యామా దేశమే ప్రస్తుత సియాం. ఈ దేశమే 1949 లో థాయిలాండ్ గా మారింది
2) ఈ సగర చక్రవర్తే - సముద్ర దేవుడుగా పూజలు అందుకుంటున్నాడు
3) ఈ సియాం దేశానికి ముఖ్య పట్టణం "అయూధియా" - మన అయోధ్యా నగర నామం తరువాతి కాలం భ్రష్టు పట్టి అయూధియా అయ్యింది. శిధిలమయిపోయిన ఈ నగరం లోని శిల్ప కళాచాతుర్యం అనన్య సామాన్యం అని తెలుస్తోంది.
4) ఈ శిల్పకళా చాతుర్యం గురించి అనేక డచ్, పోర్చుగీస్ చారిత్రిక పుస్తకాల్లో ఉంది అట.
5) కాంబోడియా దేశం - మన కాంభోజ రాజ్య నామాన్ని సూచిస్తోంది
6) ఈ దేశానికి "ఇందుపథపురి" అనేది రాజధాని - ఇది మన ఇంద్రప్రస్థం నామ సంకేతం. అంటే ఇక్కడి భారతీయులు భారతదేశాన్ని మర్చిపోలేదు అని చెప్పటం అన్న మాట.
7) ఈ ఇందుపథపురి లో కాశ్మీర దేశ శిల్పకళా చాతుర్యం కనిపిస్తుంది
8) సియాం దేశం లోని ముఖ్య భాష "పాశామకత". ఈ మాట "భాషా మగధ" అనే పదానికి అపభ్రంశ రూపం.అంటే ఇక్కడి వారిలో మగధ రాజ్య పౌరులు ఎక్కువగా ఉండేవారు
9) బాలి ద్వీపం లో మగధ పౌరులు ఎక్కువగా ఉండేవారు అని - మగధ భాష "పాలి" అవ్వటం మూలాన ఆ ద్వీపానికి "బాలి" ద్వీపం అనే పేరు వచ్చింది
10) డ్యాకా ద్వీపం - మన దక్ష ప్రజాపతి పేరిట పెట్టబడింది
11) మెక్సికో దేశ నామం - "మాక్షి" లేక "మాక్షిక" (స్వర్ణమయమయిన) అనే పదానికి రూపాంతరం
12) ఆజ్టెక్ వీరుల గురించి మీరు వినే ఉంటారు..ఆ ఆజ్టెక్ అనే పదం "అష్ట" లేక "అష్టకా" అనే పదనికి అపభ్రంశ రూపం
13) ఇంకో విశేషం ఏమిటి అంటే నిజంగానే ఇక్కడి మెక్సికో దేశవాసుల్ని కదిలిస్తే వారు చెప్పేది - తాము సూర్యుని బిడ్డలమని - ఇది మన సూర్య వంశీయుల పదానికి సరిపోతుందేమో
14) ఈజిప్టు దేశ పూర్వ నామం - మిసర - ఇది మన "మిశ్ర" నామానికి సంకేతం. నానా రకాల జాతి జనులు ఉండటం వల్ల "మిశ్ర" పద నామం పెట్టబడింది
15) మారిషస్ ద్వీపం - మారీచ మహాముని వంశీయులు నివసించిన భూమి
16) మడగాస్కార్ - చంద్ర వంశీయులు నివసించిన ప్రదేశం
17) ఈజిప్టు లోని "షూంట్" / "షోంటా" అనే ప్రదేశం - మన పుస్తకాల్లోని శోణిత పురం అని తెలుస్తోంది
18) అలాగే ఈజిప్టు కొత్త నామధేయం - సంస్కృత గ్రంథాల్లో "ఐగుప్త" శబ్దానికి తద్భవంగా చెప్పబడింది
19) ప్రద్యుమ్నుడు ప్రభావతి ని పరిణయమాడిన వజ్రపురం ప్రస్తుత సైబీరియా ప్రదేశం


ఐప్పటివరకు ఒక 40 పేజీలు మాత్రమే చదవగలిగాను- అందులోనే ఇన్ని విశేషాలు ఉన్నాయి...

మొత్తం పుస్తకం చదివితే ఇంకా ఎన్ని బయటపడతాయో ?

Monday, October 22, 2007

డాక్టర్ సరస్వతి భట్టార్ - ఒక తెలుగు తేజం.

డాక్టర్ సరస్వతి భట్టార్ - ఒక తెలుగు తేజం. ఇక్కడ చూడండి

స్వీయ పరిచయం లంకె మీద నొక్కండి

http://maganti.org/lalitasangitamindex.html


వంశీ

Sunday, October 21, 2007

ద్వారం వెంకటస్వామి నాయుడు గారి శిష్యురాలు....

శ్రీమతి బి.సరోజినీ మూర్తిగారు పాడిన కొన్ని సంప్రదాయ మంగళ హారతులు, వయోలిన్ మీద వాయించిన కొన్ని సంగీతికా ముత్యాలు ఇక్కడ చూడవచ్చు.

http://maganti.org/page8.html

శ్రీమతి సరోజినీమూర్తి గారు గొప్ప సంగీత విద్వాంసురాలు. ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్ గా దాదాపు ఇరవై ఏళ్ళు (1965 - 1986) పనిచేసారు. ఎన్నో ఎన్నెన్నో ప్రదర్శనలు ఇచ్చారు. వీరు ద్వారం వెంకటస్వామి నాయుడు గారి శిష్యురాలు.

Saturday, October 20, 2007

"ఆకాశవాణి" వార్తలు

ఆకాశవాణి వార్తలు

చిన్నప్పటి హైదరాబాదు కేంద్రం ఆకాశవాణి మధుర స్మృతుల గురించి రాద్దాము అని ఎందుకో అనిపించింది. అసలు ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం 1950లో డెక్కన్ రేడియోలో విలీనం అయ్యిందిట. అసలు రేడియో అంటే మర్ఫీ రేడియోనే. దానికి సాటి మరోటి లేదు. మా ఇంట్లో అలాంటి మర్ఫీ రేడియో ఒకటి ఉండేది. దానికి కాలం చెల్లాక నేషనల్ పానాసోనిక్ టేప్ రికార్డర్ రేడియోతో పాటు ఉన్నది, దుబాయి నుంచి మా నాన్నగారి స్నేహితుడి ద్వారా తెప్పించారు.

మా ఇంట్లో ఆ పాత మర్ఫీ రేడియో పొద్దున్న ఆరు ఇంటి నుంచి మంద్ర స్వరంలో మోగుతూనే ఉండేది. మా అమ్మ ప్రసూన తన వంట కార్యక్రమాలు అవీ అయిపోయేదాకా నడుస్తూనే ఉండేది. తరువాత పదింటికో ఎప్పుడో ఆ కార్యక్రమాల ప్రసారం ఆగిపోయి మళ్ళీ మధ్యాహ్నం పన్నెండింటికి మొదలు అయ్యేవి. నేను సుమారు 1978-80 నుంచి అంటే నాకు కొంచెం బాగా ఊహ వచ్చాక రేడియో ప్రసార కార్యక్రమాలు నా దైనందిన జీవితంలో ఒక భాగం అయిపోయినాయి అంటే అతిశయోక్తి కాదు.

నాకు తెలిసిన కొంత మంది అనౌన్సర్లు భువనేశ్వరి, ఇందిరాదేవి, నిర్మలా వసంత్, ఇలియాస్ అహమద్, ఎం.ఎన్.శాస్త్రి, జ్యోత్స్న, శేషారత్నం, పండా శమంతకమణి, డి.శ్రీరాములు, తురగా ఉషారాణి, పోణంగి బాలభాస్కర్, పార్వతీ ప్రసాద్, గద్దే బాబూరావు, యండ్రపాటి మాధవీలత, జె.చెన్నయ్య.జ్యోత్స్న గారు తరువాత తరువాత టి.వీ లో న్యూస్ రీడర్ గా దర్శనమిచ్చేవారు. వివిధభారతి వాణిజ్య ప్రసారాల్లో ఉమాపతి, ఆకెళ్ళ సత్యనారాయణ మూర్తి, సీత, ఇందిరా బెనర్జీ, మట్టపల్లి రావు, రాజగోపాల్ మొదలయినవారు ఉండేవారు.

దండమూడి మహీధర్ అని ఒకాయన పాఠాలు చెప్పేవారు. ఇక చిత్తరంజన్ గారు , పాలగుమ్మి వారు, మంచాళ జగన్నాథ రావు గారు, వింజమూరి సీతాదేవి గారు, అన్నయ్య, అక్కయ్య (న్యాపతి దంపతులు), బాలాంత్రపు రజనీకాంత రావు, రావూరి భరద్వాజ, శారదా శ్రీనివాసన్, కేశవపంతుల వారు (సంస్కృత పాఠాలు), సరే సరి.

ఇక రానారె చెప్పినట్టు కార్మికుల కార్యక్రమంలో చిన్నక్క గారిని, ఏకాంబరం గారిని కూడా స్మరించుకోవాలి ఇక్కడ. ఇక బాలానందం, బాలవినోదం సరే సరి.

ఇక నాకు బాగా నచ్చిన న్యూస్ రీడర్, సమ్మోహకమయిన గాత్రం కల అద్దంకి మన్నార్. నాకయితే ఆయన వాక్ప్రవాహం లో పడితే సమయం అసలు తెలిసేది కాదు. అయ్యో అప్పుడే అయిపోయిందా...ఇంకా కొంచెం సేపు ఈయన కార్యక్రమం కొనసాగితే బాగుండు అనిపించేది. ఇంకా బాగా గుర్తు ఉన్న న్యూస్ రీడర్లు కందుకూరి సూర్యనారాయణ, ఏడిద గోపాల రావు, మావిళ్ళపల్లి రాజ్యలక్ష్మి,తిరుమలశెట్టి శ్రీరాములు, బండారు శ్రీనివాస రావు, బలదేవానంద సాగర్ (సంస్కృత వార్తలు), రత్నా సాగర్, , ప్రయాగ రామకృష్ణ, కొప్పుల సుబ్బారావు.

రేడియో మాస్కో, సిలోన్ రేడియో, బినాకా గీత్ మాలా, యువవాణిలోని మెహ్ఫిల్, ఉషశ్రీ గారి కార్యక్రమాలు, వోలేటి వెంకటేశ్వర్లు గారి మ్యూజిక్ ప్రోగ్రాములు నాకు నచ్చిన మరి కొన్ని ప్రసారాలు.

ఇక అమ్మమ్మగారి ఊరు వెళ్ళినప్పుడు అక్కడ విజయవాడ కార్యక్రమాలు ప్రసారమయ్యేవి. అందులో గుర్తు ఉన్న అనౌన్సర్లు , ఇందులో మా తాతయ్య గారి కాలం నాటి అనౌన్సర్లు కూడా ఉన్నారండోయి- నళిని, లింగరాజు శర్మ, వెంపటి రాధాకృష్ణ శర్మ, లత (అవును రచయిత లత గారే), వాసుదేవ మూర్తి, సుబ్రహ్మణ్య భట్ట్, శ్రీరామ్మూర్తి,కుటుంబరావు, సంజీవరావు, ఆంజనేయులు, విజయకుమారి, శారదా జయప్రకాష్, మాడ్గుల రామకృష్ణ ఇలా ఇంకా ఎంతో మంది....

ఈ గాత్ర సమ్మోహనా గంధర్వులకి నమోవాకాలతో ...

అలాగే నేను సేకరించగలిగిన వివరాల ప్రకారం కొంగర జగ్గయ్య, శ్రీ శ్రీ, నండూరి సుబ్బారావు, బందా కనకలింగేశ్వర రావుగారు, బుచ్చిబాబు, పింగళి లక్ష్మీకాంతం, మంగళంపల్లి బాలమురళి, దేవులపల్లి వారు, గొల్లపూడి ఇంకా ఎంతో మంది పేరు ప్రఖ్యాతులు కలవారు అంతా మొదట్లో ఆకాశవాణి లో పనిచేసినవారే.

ఇక ఈ తరం అనౌన్సర్లు - మొన్న హైదరాబాదు వెళ్ళినప్పుడు విందామని రేడియో పెట్టుకోగానే, ఒక్క సారి వాంతికొచ్చినంత పని అయ్యింది...అదేదో ఎఫ్.ఎం ఛానెళ్ళ వారు తమ భయంకరమయిన ఉచ్చారణతో - నోరు అంతా మైకులో దూర్చేసి అదేదో కోడి పిల్లో, కుక్కపిల్లో అన్నట్టు - "నేను అల్లరి పిల్ల గౌతమో , భూతమో అని...ఉత్సాహంగా ఉల్లాసంగా" అని ఏదేదో విచిత్ర విన్యాసాలు చేస్తున్నారు. ఖర్మ అండి ఖర్మ....ఏం చేస్తాం?

సరే కానీ మీకు ఎవరికి అయినా అద్దంకి మన్నార్ గారి జీవిత విశేషాలు ఎక్కడయిన దొరుకుతాయేమో తెలిస్తే చెప్పండి.

చాటు పద్యం

ఉత్పలమాల

రాజిత కీర్తి శాలి అగు రాయని భాస్కరు వేడబోయినన్
ఆజికి ఇట్లనున్ , పరుని ఆలికి ఇట్లను, అర్ధి కిట్లనున్;
తేజము పెంపు లేని కడు దీనుని హీనుని వేడబోయినన్
ఆజికి ఇట్లనున్ , పరుని ఆలికి ఇట్లను, అర్ధి కిట్లనున్;


వేములవాడ భీమ కవి: ఒక రోజు ఈయనని చయనులు గారింట్లో అవుతున్న విందు భోజనానికి "విధవ కుమారుడు" అని రానివ్వనందుకు కడుపు మండిపోయి చెప్పిన చాటు పద్యం ఇది

గొప్పలు చెప్పుకొంచు నను గూటికి బంక్తికి రాకు మంచు ఈ
త్రిప్పుడు బాప లందరును దిట్టిరి కావున నొక్కమారు ఈ
అప్పము లన్ని కప్పలయి, అన్నము సున్నముగాగ మారుచున్
పప్పును శాకముల్ పులుసు పచ్చడులున్ చిరు రాలు కావుతన్


కందం

వికటకవుల వారి చాటువు:
ప్తృవ్వట బాబా తలపై పువ్వట జాబిల్లి; వల్వ బూదట; చేదే
బువ్వట; హుళుళుక్ హుళుళు క్కవ్వట , తలపంగ నట్టి హరునకు జే జే


కన్యాశుల్కం గిరీశం గారి చాటువు:
ఖగపతి అమృతము తేగా
భుగ భుగ మని పొంగి చుక్క భూమిని రాలెన్
పొగచెట్టై జన్మించెను
పొగ తాగని వాడు దున్నపోతై పుట్టున్



వేములవాడ భీమ కవి గారి స్వపరిచయ పద్యం - రాజ కళింగు గంగు గారి దర్శనార్ధం వెళ్ళినప్పుడు
శాపానుగ్రహ పటువును
రాపాడెడి కవుల నెత్తి రంపం బనగా
భూపాల సభల బూజ్యుడు
నా పేరే భీము డండ్రు నరవర వినుమా

Friday, October 19, 2007

అంకెల గారడీ ?? పదివేల తలలు కల ఆదిశేషుడు

అంకెల గారడీ ??

పదివేల తలలు కల ఆదిశేషుడు మిమ్ములను ధన్యుల చేయుగాక అని ఒక చాటుకవి తన ప్రతాపాన్ని ఇలా చూపించాడు అట

పదియునైదు పదునైదు పదునైదు
నిఱువదైదు నూటయిఱువదైదు
నెలమి మూడునూరు లిన్నూరు మున్నూరు
తలలవాడు మిమ్ము ధన్యుజేయు


ఇలాంటివి అన్నీ మాగంటి.ఆర్గ్ లో "మీగడ తరకలు" అనే కొత్త పుట లో ప్రచురిద్దాము అని సంకల్పించడం అయినది. ఇక ఆ మధురమయిన తరకలు త్వరలో మీ ముందుకు

"కాశీనాథుడు" అంటే అర్థము?

"కాశి" పదం ఈ విధంగా వచ్చింది - క + అశి (నీరు తాగి జీవించునది - అనగా చేప)

"కాశీనాథుడు" అంటే - మత్స్య శ్రేష్ఠం అని అర్థము అట.

"టెంకిపాట" - "ఎంకి పాట"

నవ్వుల తోట అనే పత్రికలో 1922 వ సంవత్సరం ప్రచురణలో నండూరి వారి ఎంకి పాటకి ఒక పేరడీ / అనుకరణగా "టెంకిపాట" ఒకటి అచ్చయ్యింది. రచయిత పేరు ఎవరో తెలియదు.ఈ విషయం మా మావయ్య ద్వానా.శాస్త్రి గారు చెప్పారు

రావెరావె నా టెంకిరావె ముద్దులటెంకి
గోరంచు కోకెడ్త, కొప్పులో పూలెడ్త
కోరిన నగలెడ్త, కులికించి ముద్దులెడ్త రావె
నిన్నటి రేయి నేను నిన్నుకలలో జూచి
కన్నీరు గారిస్తి కనకంపుముద్దుల టెంకి రావె
పాలీల పండగనాడు పొట్టనిండ తాగితాగి
పక్కనున్న నిన్నుజూచి సంకల్లన్ని గుద్దుకొంటి రావె


************

Image Updated on Feb 17, 2019

Interesting that it was to be continued.... 



Thursday, October 18, 2007

వ్రేళ్ళు - వాటి సంగతులు

వ్రేళ్ళు - వాటి సంగతులు


చుట్టాల సురభి బొటన వ్రేలు
కొండీల కొరవి చూపుడు వ్రేలు
పుట్టుసన్యాసి మధ్య వ్రేలు
ఉంగరాల భోగి ఉంగరపు వ్రేలు
పెళ్ళికి పెద్ద చిటికెన వ్రేలు

అల్లల్లా కోడి

అల్లల్లా కోడి
పిల్లల్లా కోడి
గట్టు మీద కోడి
గవ్వల్లా కోడి
కొక్కొరొకోయన్నది
నిద్రలేచి కూర్చోమన్నది

"అతివ వర్ణన"

సన్యాసి కవి గారు 1850 రాసిన "గంగా వివాహం" అనే రచన లోనుంచి ఒక మంచి జానపదం "అతివ వర్ణన" ఇక్కడ చూడండి

http://maganti.org/janapadapatalu/janapadapata/ativavarnana.pdf


ఇతరమయిన జానపదాలకోసం ఇక్కడ...

http://maganti.org/janapadamindex.html

గుఱ్ఱం జాషువా గారి "ఆంధ్ర మాత"

గుఱ్ఱం జాషువా గారి "ఆంధ్ర మాత" రచన , శ్రీ రాయప్రోలు సుబ్బారావు "కన్నె పాటలు" ఇక్కడ చూడండి

http://maganti.org/page5.html

Wednesday, October 17, 2007

వ్యాస రచన - పిల్లల ప్రతిభ

వ్యాస రచన - మీ చిన్నారుల వ్యాసాలకు ఆహ్వానం.

మళ్లీ అందరీకీ గుర్తు చేద్దాము అని .......

అందరు పిల్లలూ ప్రతిభావంతులే. వారిలోని ప్రతిభను సానబెట్టి బయటకు తీసుకుని రావటం పెద్దవారిగా మన కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని అమలు చేయటం కోసం మొదలు పెట్టిన ఈ చిన్ని ప్రయత్నానికి మీ అందరి సహాయ సహకారాలు ఆశిస్తూ.

మీ పిల్లల చేత వారికి ఇష్టమయిన వాటి గురించి వ్రాయించండి,అక్షర రూపంలో ప్రాణంపోసి తీర్చిదిద్దిన ఆ రూపాన్ని మాగంటి.ఆర్గ్ కి పంపండి. సంతోషంగా ప్రచురిస్తాను.మీ పిల్లలలోని దాగి ఉన్న సృజనాత్మకతని వెలికితీయండి, వారికి ఇష్టమయినవి ఏమిటో తెలుసుకోండి, వారి భవిష్యత్తుని తీర్చి దిద్దండి.

వ్యాసాలు దేని మీద రాయొచ్చు అంటారా పిల్లలూ ? వివరాల కోసం ఇక్కడ చూడండి ....

http://maganti.org/page15.html


మీ వ్యాసాల కోసం ఎదురు చూస్తూ

మీ వంశీ

Tuesday, October 16, 2007

ఆకళ్ళచేత, మీ వాకిళ్ళలోను

ప్రాధేయపు పదము

కటకటా మీకెంత కరుణలేదయ్య
యిటువచ్చి యడుగమా కిది పద్ధతయ్య
ఏదయా మీదయా మామీద లేదు
యింతసేపుంచుట యిదిమీకు తగునా?
ఉత్తమాజనులార చిత్తగించండి
ఆలస్యముంచకం డాకలవుతుంది
ఆకళ్ళచేత, మీ వాకిళ్ళలోను
ఉంచుట మీకిది మంచిపని కాదు
పావులా బేడైతె పట్టేది లేదు
అర్ధరూపాయిస్తే అంటేదిలేదు
ముప్పావులా యిస్తే ముట్టేది లేదు
రూపాయి యిస్తేను ప్రాపకము కాదు
హెచ్చువరహా యిస్తే పుచ్చుకొంటాము
పైపావులా మాకు పప్పుబెల్లాళు
తెప్పించి కట్నంబు లిప్పించరయ్య
శీఘ్రమే పంపుడీ శ్రీమంతులార

Monday, October 15, 2007

పకోడీ గురించి తిరుపతి వేంకటేశ్వర కవుల వారు

పకోడీ గురించి తిరుపతి వేంకటేశ్వర కవుల వారు, తాము జరిపిన ఒక శతావధానము లోని "చంపకమాల" పద్యం

కరకరలాడు కొంచెమగుకారము గల్గు బలాండువాసనా
హర మగుగొత్తిమీరయును నల్లము గన్పడు నచ్చటచ్చట
ధరను బకోడిబోలెడు పదార్థము లేదని తద్రసజ్ఞు లా
దరమునబల్కుచుందు రదితాదృశమే యగునంచుదోచెడిన్

Sunday, October 14, 2007

విశ్వకవి రవీంద్రుల వారు - రాజమహేంద్రవరం

హైదరాబాదులో ఉండగా మా నాన్న గారి పాత ఫోటో ఆల్బం లో దొరికిన ఒక ఆణిముత్యం - ఎవరో ఏమిటో చెప్పుకోండి చూద్దాం ?


- విశ్వకవి రవీంద్రుల వారు - 1930 లో రాజమహేంద్రవరానికి కవితాగోష్టికి వచ్చినప్పుడు తీసిన ఛాయాచిత్రం ఇది. మిగిలిన వారు ఎవరో , నాకు తెలియదు..అ విషయం కనుక్కునే బాధ్యత మా నాన్నగారి భుజస్కంధాల మీద వదిలి వచ్చా..

Saturday, October 13, 2007

బహు పరాక్....వేచి చూడండి

మావయ్య ద్వానా.శాస్త్రి గారి మిత్రులు ఆచార్య డాక్టర్.వెలుదండ నిత్యానందరావు గారు అడిగిన వెంటనే కాదనకుండా తన పుస్తకం "తెలుగు సాహిత్యం లో పేరడీ" ఇచ్చి మాగంటి.ఆర్గ్ చదువరులతో పంచుకోమని అనుమతి ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలతో....ఆ మణి"పుస్తక"పూస పూర్తి ప్రచురణ త్వరలో మీ ముందుకు. ఆ ఆణిముత్యం లో నుంచి మచ్చుకి కొన్ని ఇప్పుడు చూడండి

జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారు శ్రీ శ్రీ "ప్రతిజ్ఞ" గేయానికి "ప్రతిష్ఠ" అనే పేరడీ రచించారు.

అవాకులన్నీ
చవాకులన్నీ
మహారచనలై మహిలో నిండగ
ఎగబడి చదివే పాఠకులుండగ
విరామ మెరుగక పరిశ్రమిస్తు
అహోరాత్రులు అవే రచిస్తూ
ప్రసిద్ధికెక్కే కవిపుంగవులకు
వారికి జరిపే సమ్మానాలకు
బిరుదుల మాలకు
దుశ్శాలువలకు
కరతాళాలకు ఖరీదు లేదోయ్


అలాగే

నేను సైతం
తెల్లజుట్టుకు
నల్లరంగును కొనుక్కొచ్చాను
నేను సైతం
నల్లరంగును
తెల్లజుట్టుకి రాసిదువ్వాను
యింత చేసీ
యింత క్రితమే
తిరుపతయ్యకు జుట్టునిచ్చాను


శ్రీ శ్రీ "జయభేరి"ని జొన్నవిత్తుల "గుండుభేరి" గా మార్చేసారు

అరే ప్రకాశం
ఒరే గణేశం
ఆకలి లోకం పిలిచింది
పదండి ముందుకు
పదండి తిండికి
పోదాం పోదాం హోటల్ కి

ఇలా ఎన్నో ఉన్నాయి.....మాగంటి.ఆర్గ్ చదువరులూ - బహు పరాక్ గా వేచి చూడండి

Friday, October 12, 2007

షోడశ మహారాజులు

షోడశ మహారాజులు

రామ
శిబి
రంతి
గయ
నృగు
పృథు
మాంధాతృ
యయాతి
మరుత్
దిలీప
సుహోత
భరత
అంబరీష
శశిబిందు
భగీరథ
పరశురామ

నవ కల్పములు

నవ కల్పములు

పార్థివ
అనంత
కూర్మ
బ్రహ్మ
వరాహ
స్వేత వరాహ
ప్రళయ
పద్మ
సావిత్రి

Wednesday, October 3, 2007

ఉడుకుమోత్తనం, అవస్థ

మా చిన్నమ్మ (పిన్ని) కూతురిని ఉడికించటానికి నిన్న, నన్ను ఎప్పుడో చిన్నప్పుడు మా మేనమామలు ఉడికించి ఏడ్పించిన ఒక కథ గుర్తుచేసుకుని దాని మీద ప్రయోగించా

ఇక చూడాలి దాని ఉడుకుమోత్తనం, అవస్థ


నేను: "అమ్మడూ నీకు ఒక కథ చెప్పనా?"
ఉదయ : " చెప్పన్నయ్యా"
నేను: "సరే చాలా జాగ్రత్తగా విను. ఎక్కడయినా మిస్ అయ్యావో, మరి ఇక నేను చెప్పను"
ఉదయ: "సరే మిస్ అవ్వను అన్నయ్యా . చెప్పు "
నేను: " ఒక ఊర్లో ఒక ముసలి అవ్వ ఉండేది. పాపం ఆ అవ్వకి కళ్ళు సరిగ్గా కనపడేవి కాదు. ఏం ?"
ఉదయ : "ఊం"
నేను : "ఆవిడ చీర ఒకటి చినిగిపోతే , కుట్టుకుందాము అని ఎలాగో కష్టపడి ఒక సూది తీసుకుని, దాని బెజ్జం లోకి ఎక్కించి, ఇక చీర కుట్టడనికి పూనుకుంది.
ఉదయ: "ఊం"
నేను: అప్పుడు ఆ సూది కాస్తా దారం నుంచి జారి ఎక్కడో పడిపోయింది"
ఉదయ: "ఊం"
నేను:
ఉదయ: "ఊం"
నేను:
ఉదయ: "ఊం అన్నయ్యా "
నేను: "ఊం అన్నయ్యా అంటే పోయిన సూది వస్తుందా?"
ఉదయ:"ఏంటి అన్నయ్యా?"
నేను: "ఏంటి అన్నయ్యా? అంటే సూది వస్తుందా?"
ఉదయ: " హబ్బా - ఇదేంటి అన్నయ్యా?"
నేను: "హబ్బా - ఇదేంటి అన్నయ్యా అంటే సూది వస్తుందా?"
ఉదయ: "ఫో అన్నయ్యా, ఇదెక్కడో సుత్తి కథలాగా ఉంది"
నేను: "ఫో అన్నయ్యా, ఇదెక్కడో సుత్తి కథలాగా ఉంది అంటే సూది వస్తుందా"
ఉదయ: "ఇదిగో , ఇంక నాకు కోపం వస్తున్నది"
నేను: "ఇదిగో , ఇంక నాకు కోపం వస్తున్నది అంటే సూది వస్తుందా"

ఇలా ఒక ఐదు నిముషా అయ్యేటప్పటికి అది నా దగ్గర నుంచి ఒకటే పరుగు....

చివరకి తేలిందేమిటయ్యా అంటే చెప్పేవాడికి చిలిపితనం ఉంటే, వినేవాడికి ఉడుకుమోత్తనం కలిగించగలడన్న పెద్దల మాట చద్దిమూటలాగా రుజువయ్యింది అన్న మాట

Tuesday, October 2, 2007

జరుక్ శాస్త్రిగారి - కాఫీ పానం కరిష్యామి

జరుక్ శాస్త్రిగారి పేరడీలలో ఒకటి మచ్చుకి

"సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ" అనే శ్లోకానికి ఆయన చేసిన వినోదానుకరణ
చోటాహజ్రీ నమస్తుభ్యం
వరదే కామరూపిణి
కాఫీ పానం కరిష్యామి
సిద్ధిర్భవతు మే సదా...

ఇలా అసంఖ్యాకమయిన పేరడీలు రాసిన ఆయనకు నమస్సుమాంజలి

Friday, September 28, 2007

పలక నీది నల్లన ...పైన రాత తెల్లన

పలక నీది నల్లన
పైన రాత తెల్లన
అ ఆ ఇ ఈ రాశాను
అమ్మ ముందు పెట్టాను
అమ్మ లడ్డూ బూందీ ఇచ్చింది
ఆనందంగా తిన్నాను

గుటుక్కున మింగూ ...

గోరు గోరు ముద్ద
కాకమ్మ ముద్ద
చందమామ ముద్ద
చక్కనైన ముద్ద
అమ్మమ్మ ముద్ద
అందమయిన ముద్ద
నానమ్మ ముద్ద
నాణ్యమైన ముద్ద
తాతయ్య ముద్ద
తళ తళ ముద్ద
పాపాయి ముద్ద
పానకాల ముద్ద

ఆసి బూసి నోట్లో ముద్ద
గుటుక్కున మింగూ

Thursday, September 27, 2007

కాకరపువ్వులు పూచేటి వేళ....

మోచేటి పెద్దమ్మ నోము పాట

ఈ జానపద పాట నాకు అందచేసిన శ్రీమతి చల్లా లీలావతిగారికి ధన్యవాదాలతో

మోచేటి పెద్దమ్మ నోచేటి వేళ
మొగ్గలు తామరలు పూసేటి వేళ
బీరాయి పువ్వులు పూసేటి వేళ
బిందెలతో ఉదకమ్ము తెచ్చేటి వేళ

గుమ్మడి పువ్వులు పూచేటి వేళ
గుండిగలతో ఉదకము తెచ్చేటి వేళ
కాకరపువ్వులు పూచేటి వేళ
కడవలతో ఉదకమ్ము తెచ్చేటి వేళ
ఆనబాయి పువ్వులు పూచేటి వేళ
అటికలతో ఉదకమ్ము తెచ్చేటి వేళ
చిక్కుడు పువ్వులు పూచేటి వేళ
చిప్పలతో గంధాలు తీసేటి వేళ
ఆవులు దూడలు వచ్చేటి వేళ
ఆంబోతు రంకెలు వేసేటి వేళ
సందిటి దీపాలు పెట్టేటి వేళ
చాకింటి మడతల్లు తెచ్చేటి వేళ
అన్నల్లు అందలా లెక్కేటి వేళ
తమ్ముళ్ళు తాంబూలాలు వేసేటి వేళ
మరుదుల్లు మరిజూదమాడేటి వేళ
కూతుళ్ళు గుండిగలు దింపేటి వేళ
కోడళ్ళు కాటు కొట్టేటి వేళ
చెల్లెల్లు చేమంతులు ముడిచేటి వేళ
వదినల్లు వంటల్లు చేసేటి వేళ
ముద్దుల్ల మొగము అద్దాన బోలు
తనముఖము తామర పద్మాలుబోలు

Tuesday, September 25, 2007

ఇది సాహిత్యమా , లేక ఇంకేదన్నానా...

బాబోయి....నాయనోయి.... కెవ్వు కెవ్వు కెవ్వు...ఇది సాహిత్యమా , లేక ఇంకేదన్నానా...
రాత్రి అదేదో చానెల్ లో వెంకటేశ్, సౌందర్యల పాట ఒకటి ఇలా సాగుతోంది

కాలం కలిసొస్తే
దేవుడు దిగివస్తే
మంచం మీదకి
నలగని బెడ్ షీటే అడగాలి

అని ఉదిత్ నారాయణుడు - వెంకి బాబుకి గాత్రం ధారపోసి

రాజస్థాన్ లో
ఒంటెలకన్నా
నువ్వే హైటేలే

అని ఆ పాడిన ఆవిడ ఎవరో కూడా తెలీకుండా - సౌందర్య గారు రెచ్చిపోయి పాడుకుంటున్నారు...

అప్పుడే భోజనం చేసి కుర్చీలో కూర్చున్నానేమో... ఆ పాట సాహిత్యం విని కడుపులో అంతా దేవేసి ఏవన్నా అవుతుందేమో అని భయం వేసింది

సిగ్గుతో తలదించుకోవాలండి, మన సినిమా సాహిత్యం ఇంతలా దిగజారిపోయినందుకు, పోతున్నందుకు...ఈ దిక్కుమాలిన సినిమాలు చూడటం కన్నా, ఇలాంటి పాటలు వినడం కన్నా ఊర్లో అందరి ఇళ్ళ ముందు కళ్ళాపి జల్లుకోవటం మంచిది.మిగిలిన ఊర్ల సంగతి ఏమో కానీ, మా ఊర్లో అయితే కళ్ళాపి ఇంకా జల్లుకుంటున్నారు...అసలు కళ్ళాపి అంటే ఏమిటి అని అడిగే దురదృష్టమయిన రోజు రాకూడదు అని కోరుకుంటూ....

Monday, September 24, 2007

ఎన్నో మంచి లలిత సంగీతం పాటలు ఇవిగో ...

ఎన్నో మంచి లలిత సంగీతం పాటలు ఇక్కడ

http://www.maganti.org/page8.html


పాటలు అందించిన శ్రీమతి సరస్వతి భట్టార్ గారికి ధన్యవాదాలతో

వరసైన బావల్లు వరహావతారం

ఈ పాటలు అన్నీ ఓపికగా కూర్చుని నాకు వినిపించిన శ్రీమతి లంక లలిత గారికి ధన్యవాదాలు

మా పాప మామల్లు మత్స్యావతారం
కూర్చున్న తాతల్లు కూర్మావతారం
వరసైన బావల్లు వరహావతారం
నట్టింట నాయత్త నరసింహావతారం
వాసిగల బొట్టెల్లు వామనావతారం
పరమ గురుదేవ పరశురామావతారం
రక్షించు మావయ్య రామావతారం
బంటైనా బంధువులు బలభద్రావతారం
చిట్టి నాకన్నోడ శ్రీ కృష్ణావతారం
బుద్ధితో మాచిట్టి బుద్ధావతారం
కలివిడితో మాయన్న కలికావతారం
వర్ధిల్లు పసిపాప వర్ధిల్లు నా తల్లి

పాపాయి జునపాలు పట్టుకుచ్చుల్లు

పాపాయి కన్నులు కలువ రేకుల్లు
పాపాయి జునపాలు పట్టుకుచ్చుల్లు
పాపాయి దంతాలు మంచి ముత్యాలు
పాపాయి పిక్కలు మొక్కజొన్న పొత్తులు
పాపాయి చెక్కులు పసివెన్నముద్దల్లు
పాపాయి వన్నెలు పసినిమ్మపండుల్లు
పాపాయి పలుకులు పంచదార చిల్కల్లు
పాపాయి చిన్నెలు బాలకృస్ణువన్నెల్లు

సంతకు పోదాం చెయి వూచు

చెయి ఊచమ్మా చెయి వూచు
సంతకు పోదాం చెయి వూచు
శనగలు తెద్దాం చెయి వూచు
చల్లగ తిందాం చెయి వూచు
మిఠాయి తెద్దాం చెయి వూచు
మెల్లగ తిందాం చెయి వూచు
ఉలవలు ఉలవలు వేయించి
ఉట్ల నిండుగ పోయించి
కందులు కందులు వేయించి
కడువల నిండుగ పోయించి
సెనగలు సెనగలు వేయించి
చేటల నిండగ పోయించి
చేయూచు బాలా చేయూచు
చిన్నారి బాలా చేయూచు
అడ్డాల దిడ్డీ చేయూచు
అరవ మాణిక్యాలు చేయూచు
పండ్లు తెద్దాం చేయూచు
పాపకు ఇత్తాం చేయూచు

Sunday, September 23, 2007

మహాభారతంలోని యుద్ధ వ్యూహాల గురించి

మహాభారతంలోని యుద్ధ వ్యూహాల గురించి నాకు లభించిన సమాచారం ఇక్కడ...

http://www.maganti.org/JanPDFdoc/yuddhavyuham.pdf

ఎన్నో రోజుల నుండి ప్రయత్నిస్తున్నాను, ఇంకా సమగ్రమయిన సమాచారం ఎక్కడయినా దొరుకుతుందేమో అని...కానీ సఫలం కాలేదు...మీకు ఈ వ్యూహాల గురించి ఇతరంగా ఏవేని వివరాలు తెలిస్తే, అంటే వీటి గురించి వ్రాసిన పుస్తకాల వివరాలు కానీ, తెలిస్తే దయ ఉంచి నాకు తెలియచెప్పమని విన్నపము...

Saturday, September 22, 2007

గడ్డానికున్నది గరక - గుఱ్ఱమొచ్చి పెఱక

అనంతపురం జిల్లాలోని పిల్లల గేలిపాట ఒకటి ఇక్కడ చూడండి

చన్నంపల్లి సాయిబ్బు
సాయిబ్బుకున్నది గడ్డము
గడ్డానికున్నది గరక
గుఱ్ఱమొచ్చి పెఱక
లబలబ మొత్తుకుని ఉరక
చన్నంపల్లి సెనిగలు
యేగుతున్నయి పొప్పులు
బావకున్నది తిప్పలు
మీ యక్క కున్నవి నొప్పులు
మీ యప్పకున్నవి అప్పులు
యింటెనక దొడ్డి
పొరుగూరి రెడ్డి
కిరసనాలు బుడ్డి
జెట్టికున్నది సెడ్డి
కల్లకున్నది గెడ్డి

ఊగాడమ్మా....ఊగిందమ్మా!!!

ఈ "ఊగాడమ్మా" పిల్లల పాట గోదావరి జిల్లాల్లో ప్రచారం పొందిన పాట అని తెలియవచ్చింది.బాలుడయితే ఇలా మోకాళ్ళ మీద ఊగిస్తూ ఇలా పాడుతూ ఉంటారు

ఊగాడమ్మా ఊగాడూ
ఊగే చిలుకా ఊగాడూ
బంగరు బొమ్మా ఊగాడూ
తంగేడు పువ్వా ఊగాడూ
గుడిపావురమా ఊగాడూ
కన్నుల వెలుగా ఊగాడూ
సొగసుల గువ్వా ఊగాడూ
శుకమా పికమా ఊగాడూ
చక్కని నెమలీ ఊగాడూ
చక్కెర బొమ్మా ఊగాడూ

అదే బాలికలయితే ఇలా పాడుతూ పిల్లలకి ఆనందం కలిగిస్తారు

ఊగిందమ్మా ఊగిందీ
ఊగే చిలుకా ఊగిందీ
బంగరు బొమ్మా ఊగిందీ
తంగేడు పువ్వా ఊగిందీ
గుడిపావురమా ఊగిందీ
కన్నుల వెలుగా ఊగిందీ
సొగసుల గువ్వా ఊగిందీ
శుకమా పికమా ఊగిందీ
చక్కని నెమలీ ఊగిందీ
చక్కెర బొమ్మా ఊగిందీ

బిరుదుల వ్యామోహం ఎందుకో?

మావయ్య గారు డాక్టర్ ద్వానా శాస్త్రి గారితో దగ్గర దగ్గర ఆరేళ్ళ తర్వాత ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకోవటానికి అవకాశం లభించింది నిన్న.నేను హైదరాబాదు చాలా సార్లు రావటం జరిగినా, ఆ సమయంలో ఆయన ఐ.యే.ఎస్స్ పాఠాలు బోధించడంలో ఉండటం వల్లో, సాహితీ సభలకి వేరే ఊర్లు వెళ్ళటం లాంటివి జరగటం వల్లో, ఆరోగ్యం బాగోపోవటం వల్లో కుదిరింది కాదు. మొత్తానికి నిన్న ఒక మూడు గంటల పైనే కూర్చుని ముచ్చటించుకున్నాము.

అడగకూడదు అనుకుంటూనే అడిగాను..... "మావయ్యా - ఒక వ్యాసం ఏమన్నా రాసివ్వగలవా" అని...వెంటనే ఆయన రాసిన "ద్వానాంతరంగం" అనే "విమర్శ వ్యాసాలు" పుస్తకం ఒకటి తీసి ఇచ్చి ఇందులో నీకు నచ్చింది ప్రచురించుకో అని చెప్పారు.

సరే ఇక ఆ 44 విమర్శా వ్యాసాల సంకలనంలోని ఒకటొకటి వరుసగా మీ ముందుకు...ఇక్కడ చూడండి

డాక్టర్.ద్వానా శాస్త్రి -"ద్వానాంతరంగం"

http://www.maganti.org/vyasavaliindex.html

ఈ వ్యాసాల మీద మీ అభిప్రాయాలు ఏవన్నా ఉంటే తెలియపర్చండి

Friday, September 21, 2007

"కన్నె పాటలు" - శ్రీ రాయప్రోలు సుబ్బారావు

శ్రీ రాయప్రోలు సుబ్బారావు గారు "కన్నె పాటలు" అని ఒక అద్భుతమయిన గేయ రచన చేసారు. అడుగడుగునా అద్భుతమయిన రచనా సౌందర్యం ఉట్టిపడుతూన్న ఈ అచ్చ తెనుగు పాటలు ఒకటొకటిగా మీ ముందుకు

http://maganti.org/kannepatalu/kannepatalu.html


భవదీయుడు

వంశీ

అబ్బో - ఇదండీ సంగతి

Sunday, September 2, 2007

మేధస్సు, జయంతి, వర్ధంతి, పాత్రికేయులు, రైతాంగం, శంఖుస్థాపనలు

ఈవేళ ఒక మంచి సాహితీ సమాలోచనం జరిగింది - ఎక్కడ ? మావయ్య ద్వా.నా.శాస్త్రి గారు తీసుకెళ్ళిన ఒకానొక ప్రదేశంలో....పెద్ద పెద్ద వారు అంతా సమావేశమయ్యారు - ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు గారు, రామబ్రహ్మం గారు, కవితా ప్రసాద్ గారు, నారాయణ రెడ్డి గారు ఇలా ఇంకా ఎంతో మంది...ఒక ఆసక్తికరమయిన విషయం చర్చకు వచ్చింది - ఆసక్తి అని ఎందుకు అంటున్నాను అంటే - మన తెలుగు భాషలో పదిమంది వాడే మాటల్లో దొర్లే తప్పుల గురించి జరిగిన చిన్నపాటి చర్చ - "పదుగురాడు మాట పాడియై ధరజెల్లు" తో మొదలయి మేధస్సు, జయంతి, వర్ధంతి, పాత్రికేయులు, రైతాంగం, శంఖుస్థాపనలు ఇలా ఇంకా చాలా వాటి గురించి మాటలు దొర్లినాయి
మచ్చుకి ఒకటి చూద్దాం - మేధస్సు - " ఫలానా ఆయన భలే మేధస్సు కలవాడు" లేదా "ఆయన మేధస్సు గొప్పది" అని అంటారు జనాలు. కానీ "మేధ" అని మాత్రమే అనాలి ఇవ్వాళ్ళ తెలియవచ్చింది. మేధస్సు అంటే - ఎముక, మెదడు అని అర్ధం అట. మేధ అంటే "బుద్ధి"...అదండీ సంగతి

కొసమెరుపు

భాష అనే పదం సంస్కృతం నుంచి మనం అరువు తెచ్చుకున్నది....అసలు "భాష" కి తెలుగు పదమే లేదని ఘంటాపధంగా నొక్కి వక్కాణించారు ఇక్కడి పెద్దవారు...

మరి ఇక్కడ ఉన్నన్నాళ్ళూ, మావయ్యతో పాటూ తిరిగితే ఇంకా చాలా విషయాలు తెలిసేటట్టు ఉన్నాయి...

Friday, August 31, 2007

హైదరాబాదు ప్రయాణంలో పదనిసలు

హైదరాబాదు ప్రయాణంలో పదనిసలు

ఈ రోజు తెల్లవారు ఝామున రెండు గంటలకి హైదరాబాదు విమానాశ్రయంలోకి రొద పెట్టుకుంటూ కె.ఎల్.ఎం వారి విమానం దిగింది.అందులో ఎవరు ఉన్నారు అనుకుంటున్నారు? ఇంకెవరు - నేను, నా సతీమణి, 24 గంటల ప్రయాణంలో తిండి తిప్పలు లేక అలసిపోయి మా భుజాల మీద వాలిపోయిన మా చిన్నారి పాప వైష్ణవి. నా దురదృష్టమో ఏమో కానీ , నేను ఎప్పుడు హైదరాబాదు వచ్చినా ఒక ఐదారుగురు "జింగులకా" గాళ్ళు నేను వచ్చే విమానంలో తిష్ట వేసి ఉంటారు. జింగులకా గాళ్ళు అంటే అవసరం ఉన్నా లేకపోయినా చెవులు చిల్లులు పడేటట్టు మాట్టాడేవాళ్ళు, చిన్నపాటి చతుర్లకి గాఠ్ఠిగా దడుసుకునేటట్టు నవ్వే వాళ్ళు, అవసరం ఉన్నా లేకపోయినా గాలిసత్రపు (ఎయిర్ హోస్టెస్) దాని కాళ్ళకి, ఆవిడ తెచ్చే పానకపు బళ్ళకి అడ్డం పడుతూ, మూత్రశాలల దగ్గర తచ్చాడుతూ, ఒళ్ళు విరుచుకుంటూ, అలా ఒళ్ళు విరుస్తూ పక్కనున్న వాళ్ళు మనలని చూస్తున్నారా లేదా అని ఓరచూపులు చూస్తూ, విమానం ఇంకో నిముషంలో కిందకి దిగుతుందనగా పైనున్న వాడి పెట్టెలో సామాను సరిగ్గా ఉందా లేదా అని ఒక సారి సరిచూసుకుంటూ, ఆ గాలిసత్రపువారిచేత చీవాట్లు తిని తమ ఆసనాలకి తిరిగి వెళ్ళేవాళ్ళు - ఇలా అన్న మాట. అలా ఈ సారి కూడ వీళ్ళ బాధితుడిని అయి మొత్తానికి ఆ విమానంలో నుంచి బయటపడ్డాము.దిగాక వలస (ఇమ్మిగ్రేషన్) అధికారుల వద్దకి వెళ్ళాలి కదా. ముగ్గురమూ కలిసి ఆయన వద్దకి చాంతాడంత క్యూలో నిలబడి వెళితే ఆయన ఒక చిరునవ్వు నవ్వి " ఏం సార్ పాపకి ఎన్నేళ్ళు - అమెరికన్ సిటిజనా?. ఐతే ఇక్కడ మీ ఎడ్రస్ రాయండి.ఎన్నాళ్ళు ఉంటారు సార్" అని పలకరించేటప్పటికి ఉబ్బితబ్బిబ్బు అయ్యాను. అబ్బో ఇంత మధురమయిన స్వాగతం, పైగా అది కూడా నవ్వుతూ, ఇన్నేళ్ళ నా ప్రయాణంలో ఎప్పుడూ చూడలేదు అని సంతోషించి, పెట్టె బేడ ఎత్తుకుని మన సుంకం (కస్టంస్) సుబ్బారావు గారి వద్దకి వెళ్ళాను.ఆయన ఎవరికీ వినపడకుండా మంద్ర స్వరంతో "సార్" అన్నాడు. నాకు నిజంగానే వినపడలేదు.నేను విని కూడా పరాకు నటిస్తున్నాను అని సుబ్బారావు గారు మళ్ళీ "సార్" అన్నాడు. ఈ సారి వినపడి ఆయన వంక చూసా - ఆయన "సార్ - బచ్చే హై - ఏదో తోచింది ఇవ్వండి...మీ దగ్గర ఐదు వందల రూపాయలు నోటు లేకపోతే డాలర్లు అయినా ఫరవాలేదు" అన్నాడు. ఉలిక్కిపడ్డా , అసలు ఈయన ఏమిటి అడుగుతున్నాడు అని, తేరుకుని కొంచెం ఈ లోకంలోకి వచ్చిన తరువాత జాలిపడ్డా - హతవిధీ ఇలా సుంకాధికారులు కూడా అడుక్కోవడం మొదలు అయ్యేంతగా పరిస్థితి దిగజారిందా అని. సరే అలా సిగ్గు విడిచి అడుక్కున్నందుకు అయినా ఏదో మొహాన పడేద్దామా అని అనిపించింది కానీ - మళ్ళీ ఇలాగే అందరూ ఇస్తూ పోతూ ఉంటే, ఈ మహమ్మారి ఎప్పటికి వదలదు అని గుర్తుకు వచ్చి "నా దగ్గర ఏమీ లేవు అండి - కావాలి అంటే నా పెట్టే బేడ వెతుక్కోండి" అని అచ్చ తెలుగులో అన్నాను. వెంటనే సుబ్బారావు గారు నన్ను ఎగా దిగా చూసి "వో కస్టంస్ పేపర్ దేకే జావ్" అని హిందిలో ఒక సమాధానం ఇచ్చి పాస్పోర్టు అవీ చూసి అక్కడినుంచి పంపించాడు.

రెండో భాగం త్వరలో ......

అన్నట్టు ఒక రెండు గంటలు పడుకుని 10 గంటల ప్రాంతంలో కొత్త పెళ్ళికొడుకు "త్రివిక్రముడికి" దూరతంత్రి లో శుభాకాంక్షలు తెలియచేసి మళ్ళీ ముసుగేసా

Friday, August 17, 2007

ఇది కలా నిజమా!!

ఇది కలా నిజమా...అద్భుతం,అమోఘం,అనిర్వచనీయం...ఇంతకన్నా చెప్పటానికి మాటలు రావట్లేదు నాకు......చేవ గల చేతులు చక్కని చిత్రాలను చిత్రీకరించగలవని నిరూపించిన మహామనీషి.. ఈ కళాకారుడు ఎవరో కానీ, ఆయనకు శిరసు వంచి పాదాభివందనం

http://www.youtube.com/watch?v=HtP4FjvfBFo

SICAF - SEOUL 2003

Friday, August 10, 2007

విశ్వదాభిరామ అంటే అర్ధం ?

విశ్వదాభిరామ వినురవేమ అనే పదప్రయోగం తెలియని తెలుగువాడు ఉంటాడా అన్నంత ఇదిగా మన జీవితాలతో పెనవేసుకుని పోయిన వేమనగారు, అసలు విశ్వదాభిరామ అన్న మాట యే అర్ధంలో వాడారో చెప్పండి చూద్దాం?

విశ్వదాభిరామ అంటే అర్ధం - విశ్వ+ద+అభిరామ = సమస్తమును ఇచ్చుటచే మనోహరమయినవాడా అని...

ఇక వేమనగారు ఆ మాటే ఎందుకు వాడారు అనేది విడమరచి చెప్పడాన్ని మన పెద్ద గురువులకే వదిలివేస్తున్నాను

బుర్ర అనే తుట్టెని కదిపితే?

ఎప్పుడో చదువుకున్న కొన్ని పొడుపు కథలు కొన్ని ఇవిగో..నెమ్మదిగా బుర్ర అనే తుట్టెని కదిపితే వచ్చిన మధురమయిన తేనియ చినుకులు


కాళ్ళు గల్గియుండు, గదల దట్టిట్టును
నోరు లేదు, పెక్కునీరు ద్రావు
తనకు నుసురు లేదు, తరువుల భక్షించు
దీని భావమేమి తిరుమలేశా ?

గంధపుసాన

నేలం బడి పొరలాడును
గాలికి నోరావలించి గ్రక్కున మ్రింగు ్
తూలించుచుండు మంటల
నాలస్యము లేక చెప్ప నగు నది యేదో?

కొలిమితిత్తి


ఆకసమున నుండు నది పక్షియును గాదు
తోక గల్గి యుండు మేక గాదు
త్రాడు గలిగియుండు దలప నెద్దును గాదు
దీని భావమేమి తిరుమలేశా?


గాలిపటం లేదా గాలిపడగ


కడుపు మిగుల బెద్ద కాళ్ళుసేతులు లేవు
కంట గూడు మెక్కు కలహకంఠి
అంటిన మొరపెట్టు నది యేమి చోద్యమో
దీని భావమేమి తిరుమలేశా!


మద్దెల

Thursday, August 9, 2007

సుత్తి పద్యం ? సుత్తి మీద పద్యం?

సుత్తి సుత్తియనుచు
సుత్తిగొట్టుచుంటివి
కత్తి లాంటి నీ సుత్తి ఎత్తిన
ఎత్తగలరే ఎవరయిన వారి సుత్తిన్?


సుత్తి పద్యం - ఇది ఎప్పుడో సుమారు ఇరవై ఏళ్ళ క్రితం అనుకుంటా, మా నాన్నగారు నేర్పిన ఆహ్లాదకరమయిన పద్యం..ఈ పద్యం ఆయన రాయలేదు కానీ, ఆయనకి కూడా ఇప్పుడు అది ఎవరు రాసారో గుర్తులేదు..ఉన్నట్టు ఉండి హాస్యనటుడు వీరభద్రరావు గారిని ఒకానొక చలనచిత్రంలో చూడగానే గుర్తుకొచ్చిందీ పద్యం

డాక్టర్ కొడవటిగంటి గారి వ్యాసాలు

బహుముఖ ప్రజ్ఞాశాలులయిన ఆంధ్ర దేశ ప్రముఖుల వ్యాసాలు కొన్ని ఇక్కడ http://maganti.org/vyasavaliindex.html చూడవచ్చు. అడిగిన వెంటనే కాదనకుండా వ్యాసాలు రాసి పంపించిన ఈ సహృదయమూర్తులందరికీ హృదయ పూర్వక ప్రణామాలు.చిరుమొలక లాంటి ఈ వ్యాసావళిని మరిన్ని వ్యాసాలతో పరిపుష్ఠం చేయటానికి శక్తికొలదీ ప్రయత్నిస్తాను అని మనవి చేసుకుంటూ..

ప్రస్తుతానికి డాక్టర్ కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారి వ్యాసాలు ప్రచురించాను. మిగిలినవి త్వరలో మీ ముందుకు

వంశీ

Wednesday, August 8, 2007

లేఖినిలో ఇది రాయటం కష్టమే!

మామూలుగా అయితే ఎడా పెడా రాసేసేవాడినేమో...లేఖినిలో ఇది రాయటం కష్టమయ్యింది..కానీ సాధించా ...ఇంకా అర్ధం కాకపోతే వాక్యాన్ని ఉర్దూ రాతలో చదువుకోండి..

"యినాచ్చిలొక్కరె కుహఊ ఆ డుప్పుఇ ళ్ళీమ....నుసానేమా నోకదుంఎ...డాకూ నిడివాసేరా ర్లుసా న్నికొ డుప్పున్నచి...దిఇ కఒ నిఅ లియారా లాఇ కునా"

Saturday, July 14, 2007

అబ్బో! అప్పుడే రెండో వార్షికోత్సవమా!

మాగంటి.ఆర్గ్ మూడవ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఒక పక్క తప్పటడుగుల నుంచి, తప్పుటడుగుల నుంచి బయటపడినందుకు సంతోషంగా ఉన్నా, ఈ రెండేళ్ళలో మన భాషకి,ఈ తరం పిల్లలకి మరింత చెయ్యలేకపోయానే అని చిన్న క్లేశం మిగిలిపోయింది.

కొంత మంది "అసలు ఈ వెబ్సైటు ప్రారంభించడానికి మీకు ప్రేరణ ఏమిటి" అని అడిగినదానికి సమాధానం ఏమిటీ అంటే స్థూలంగా ఇదిగో

"ఎంతో ప్రేమ ఆప్యాయత పంచి, తరతరాలుగా పెద్దలందరూ కాపాడుకుంటూ వస్తున్న మన సంస్కృతి, సాంప్రదాయాలు గురించి వారికి తెలిసినవి నాకు అందజేసి,అలా నాకు నేర్పిన ఆ విజ్ఞానాన్ని పదిమందితో, అందులోనూ ముఖ్యంగా తరువాతి తరం పిల్లలతో పంచుకోమని, అది ఒక మనిషి కనీస బాధ్యత అని బోధ చేసి, మమ్మల్ని వదిలి వెళ్ళిన తాతగార్లు,నానమ్మ,అమ్మమ్మగార్ల ఋణం తీర్చుకోవటానికి మొదలు పెట్టిందే ఈ మాగంటి.ఆర్గ్. "

మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ అని పెద్దలు ఊరకే అనలేదు కదా. నా మొట్టమొదటి గురువు నాన్న శ్రీ మాగంటి శివరామ శర్మగారు. ఆయనకి ఉన్న సాహిత్యాభిలాష వల్ల ఎన్నో ఎన్నెన్నో మంచి మంచి పుస్తకాల మధ్య పెరిగే అవకాశం లభించింది నాకు. ఇంట్లో అన్ని పుస్తకాలతో ఒక పెద్ద గ్రంథాలయంలాగా ఉండేది. అమ్మ శ్రీమతి ప్రసూనగారు సంగీతం నేర్చుకోకపోయినా ఎన్నో పాటలు - కృతులు, కీర్తనలు, తత్త్వాలు, లలిత సంగీతం, ఇలా ఒక్కటేమిటి ఎన్నో పాటలు చాలా చక్కగా పాడేవారు. అలా సంగీతం, సాహిత్యం అనే రెండు జీవజ్యోతుల మధ్య పెరిగిన వాతావరణం నన్ను ఎంతో ప్రభావితం చేసింది అని గర్వంగా చెప్పుకోగలను. అలాగే నాకు విద్య నేర్పి ఈ సమాజంలో ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా జీవించడానికి అవకాశం కల్పించిన ఎందరో ఆచార్యవర్యులు - అందరికీ పేరు పేరునా శతసహస్రకోటి పాదాభివందనాలు.

కొన్ని సద్విమర్శలు, కొన్ని కువిమర్శలు, కొన్ని మెచ్చుకోళ్ళు, కొన్ని తిట్లు, ఎంతో మంది కొత్త మిత్రులతో పరిచయం - ఇలా కలగూరగంప లాగా ఈ రెండేళ్ళ ప్రస్థానం సాగిపోయింది. చాలానే మధుర స్మృతులు ఉన్నా, అలా వచ్చిన విమర్శలలో ఈ మధ్య నన్ను బాగా ఆలోచింపచేసిన వ్యాఖ్యలు కొన్ని -
  • "నేను గత ఆరు నెలలుగా నీ వెబ్సైటు చూస్తున్నాను. అసలు మాగంటి.ఆర్గ్ మొదలు పెట్టి నువ్వు సాధించింది ఏమిటీ",
  • "మనకున్న శతకోటి లింగాల్లో నీ వెబ్సైటు ఒక బోడిలింగం",
  • "అసలు ఇలాంటి వెబ్సైటులు శుద్ధ దండగ"

అని ఇద్దరు ముగ్గురు -పేర్లు ఎందుకులెండి కానీ- నాకు ఈమెయిలు పంపించారు.

ఇవి ఎవరో కోపం ఉన్నవాళ్ళు పంపించారులే అని పట్టించుకోకుండా ఉండొచ్చు కానీ - ఆ ఈమెయిళ్ళు చదివి ఒక వేళ నేను నిర్వహిస్తున్న బాధ్యతలో ఎక్కడయినా తప్పు చేస్తున్నానా, తప్పు జరిగిందా అని ఆలోచించాను. వారు అలా వ్రాసినందుకు ఏ మాత్రం బాధ లేదు నాకు, కానీ ఒక వేళ ఏదన్నా లోపం కనపడి ఉంటే నిర్మొహమాటంగా తెలియచెయ్యండి ఆ లోపాన్ని సరిదిద్దుకోవటానికి ప్రయత్నిస్తాను.

అందుకే సభాముఖంగా మిమ్మల్నందరినీ అడుగుతున్నాను, ఎక్కడయినా తప్పులు, లోపాలు కనపడితే నిర్మొహమాటంగా తెలియచెయ్యమని.

అనుకోకూడదు కానీండి - ఈ వెబ్సైటు నిర్వాహణ అనేది ఒక వ్యసనం లాంటిది.ఈ వెబ్సైటు గొడవలో పడి కొన్ని రోజులు మా ఆవిడతో, కుటుంబంతో ఎక్కువ సమయం కూడా గడపలేకపోయేవాడిని. అయితే అవి అన్ని సహించి నాకు ప్రోత్సాహం (అలాంటివి సహించటమే ఒక ప్రోత్సాహం!) అందించిన నా శ్రీమతి శ్రీదేవికి, తన స్వచ్చమయిన బోసినవ్వుతో నా అలసటని అలా తీసిపారేసే మా అమ్మాయి వైష్ణవికి, మిగిలిన కుటుంబ సభ్యులకు ధన్యవాదాలతో.

జేజిమామయ్య పాటలు - 1

జేజిమామయ్య పాటలు ఒకటొకటిగా

రచన - శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు

తాయిలం

ఆటలు ఆడీ పాటలు పాడీ అలసీవచ్చానే
తియ్యతియ్యని తాయిలమేదో తీసిపెట్టమ్మా

పిల్లిపిల్లా కళ్ళూమూసి పీటా ఎక్కిందీ
కుక్కాపిల్లా తోకాడిస్తూ గుమ్మామెక్కిందీ

కడుపులోనీ కాకీపిల్లా గంతులేస్తోందీ
తియ్య తియ్యని తాయిలమేదో తీసిపెట్టమ్మా

గూటిలోని బెల్లం ముక్కా కొంచెం పెట్టమ్మా
చేటాలోని కొబ్బరి కోరూ చారెడు తియ్యమ్మా

అటకామీది అటుకుల కుండా అమ్మా దింపమ్మా
తియ్య తియ్యని తాయిలమేదో తీసిపెట్టమ్మా

Sunday, July 8, 2007

ప్రాస పాట ఒకటి

పిల్లల ప్రాస పాట

పిల్లల ప్రాస పాట ఒకటి చూడండి ఇక్కడ. ఈ పాట అందించిన మిత్రుడు రాగంపేట శ్రీనివాస్ కి ధన్యవాదాలు.తన చిన్నప్పుడు వాళ్ళ అమ్మమ్మ వద్ద ఈ పాట వింటూ ఉండేవాడిని అని శ్రీనివాస్ తెలియచేసాడు.

పిట్టమ్మ పిట్ట
ఏమి పిట్ట
చిలక పిట్ట
ఏమి చిలక
తెలుపు చిలక
ఏమి తెలుపు
హంస తెలుపు
ఏమి హంస
రాజ హంస
ఏమి రాజు
మృగరాజు
ఏమి మృగము
వన మృగము
ఏమి వనము
పూల వనము
ఏమి పూలు
జాజి పూలు
ఏమి జాజి
గుత్తి జాజి
ఏమి గుత్తి
కవ్వం గుత్తి
ఏమి కవ్వం
చల్ల కవ్వం
ఏమి చల్ల
మంచు చల్ల
ఏమి మంచు
పొగ మంచు
ఏమి పొగ
దీపం పొగ
ఏమి దీపం
గోడ దీపం
ఏమి గోడ
కోట గోడ
ఏమి కోట
తులసి కోట
ఏమి తులసి
రామ తులసి
ఏమి రామ
ఆత్మా రామ

Saturday, July 7, 2007

యానాదోళ్ళ పెళ్ళిళ్ళు

యానాదోళ్ళ పెళ్ళిళ్ళు


వెన్నెలకంటి రాఘవయ్యగారు యానాది వాళ్ళ పెళ్ళిళ్ళగురించి తన యానాది అనే రచనలో ఎలా వివరించారో చూడండి


యానాదోళ్ళ పెళ్ళిళ్ళు, ఎంత మంచి పెళ్ళిళ్ళు
బొట్టుతో పనిలేదు, బోనాలఖ్ఖరలేదు
కొత్త చీరలొద్దు, అత్త పోర్లు వద్దు
చుట్టాలు రావొద్దు, చూడనయినా వొద్దు
కలుసుకుంటె చాలు, మురుసుకుంటుండొచ్చు
అల్లుళ్ళ పోరొద్దు, ఆస్తిపాస్తులు వద్దు
మేళతాళాలొద్దు, మంత్రతంత్రాలు వొద్దు
మంగమూరు దేముడికి మొక్కుకుంటే చాలు
గోత్రాలు మాకేల, గీత్రాలు మాకేల
నేత్రాలు ఒకటైతే సూత్రాలు ఏలయ్య
తినడానికి తిండి లేదు, కట్టడానికి బట్టలేదు
వండుకోను కుండలేదు, పండుకోను పంచ లేదు
ఎందుకయ్య పెండ్లి ఎందుకయ్య మాకు
"సత్యశోధన" సత్యసాయి మాష్టారు గారి పిల్లల వ్యాసాలు

http://maganti.org/page15.html

Friday, June 22, 2007

అది కూడా యూనీకోడులో? భళారే విచిత్రం!

కోలాచలం శ్రీనివాస రావు గారు 1895 లో వ్రాసిన సునందినీ పరిణయము అనే నాటకము నుండి ఒక అద్భుతమయిన మధురగతి రగడ ఇక్కడ చూడండి.

http://maganti.org/janapadapatalu/madhuragatiragada.html

ఆ నాటక రచన మొత్తం త్వరలో మీ ముందుకు, మాగంటి.ఆర్గ్ లో.అది కూడా యూనీకోడులో.. కొందరు మిత్రుల ఆనందం కోసం.

నా మటుకు నాకుగా ఈ యూనీకోడు ఫాంటు ఎన్నడూ నచ్చలేదు, నచ్చబోదు. వేరే ఇతర ఫాంటులు వస్తే తప్ప ఈ యూనీకోడు గురించి ఆలోచించనేమో మరి...చూద్దాము...

ప్రస్తుతానికి ఈ నాటిక మటుకు యూనీకోడులో ప్రచురించి చూసి, చదువరుల అభిప్రాయాలు తెలిసాక తరువాతి మెట్టు ఎక్కడానికి ప్రయత్నిస్తాను... :)

Saturday, June 9, 2007

హాస్యం.కాం లో సందేశం..

హాస్యం.కాం ఎడిటర్ గారు శ్రీ గణేష్ రావూరి గారు సహృదయంతో తమ పత్రికలో ఈ వ్యాసరచన గురించి ప్రకటించినందుకు ఆయనకి సభాముఖంగా హృదయపూర్వక ధన్యవాదాలు.

మంచి మంచి హాస్య రచనలకి ఆలవాలమయిన హాస్యం.కాం మరింత వృద్ధి పొంది, తెలుగు ప్రజలకి మరింత చేరువ అవ్వాలి అని ఆశిస్తూ


http://www.haasyam.com/092/index1.php

విధేయుడు

వంశీ

Friday, June 8, 2007

రేగుపళ్ళ ముసలమ్మ

ఆ మధ్య ఎక్కడో చదివిన జోకు ఒకటి

బాబు: మామ్మా రూపాయికి ఎన్ని రేగుపళ్ళు?
ముసలమ్మ: రూపాయికి పాతిక.బాబు: అదేంటి మొన్న యాభై ఇచ్చావుగా?
ముసలమ్మ: సరే నీ కోసం ఇస్తాలే..యాభై తీసుకో, ఏదీ రెండు చేతులూ పట్టు, నీ చేతిలో రేగుపళ్ళు పోస్తా..యాభై లెక్ఖెట్టు
బాబు: సరే ఇదిగో రూపాయి. పొయ్యి మరి
ముసలమ్మ: లాభం, రెండు, మూడు
ముసలమ్మ: బాబూ నీకెన్నేళ్ళు?
బాబు: నాకా? ఏడేళ్ళు.
ముసలమ్మ: ఏడా..ఎనిమిది,తొమ్మిది, పది పదకొండు, పన్నెండు..అయితే మీ అమ్మకి ఎన్నేళ్ళు బాబూ?
బాబు: మా అమ్మకా? ఏమో ఇరవై ఏడో ఏమో.
ముసలమ్మ: ఓ ఇరవై ఏడా, ఇరవై ఎనిమిది,ఇరవై తొమ్మిది, ముప్ఫై...మరి మీ నాన్నకి?
బాబు: నాన్నకా? ముప్ఫై ఐదు
ముసలమ్మ: ఓ ముప్ఫై ఐదా..ముప్ఫై ఆరు, ముప్ఫై ఏడు..మరి మీ పెద్ద మావయ్యకి?
బాబు: ఏమో..నలభై ఐదు ఏమో..
ముసలమ్మ: ఓ ...నలభై ఐదు, నలభై ఆరు, నలభై ఏడు, నలభై ఎనిమిది, నలభై తొమ్మిది, ఇదిగో యాభై...ఇదిగో బాబూ ఆ రేగుపళ్ళు కింద పడేసుకునేవు..చక్కగా కడుక్కుని తినెయ్యి..మళ్ళీ రేపు వస్తాను...
బాబు: సరే మామ్మా...

Thursday, May 31, 2007

రాక్షస స్త్రీ నామాలు

సీతమ్మ వారికి అశోకవనంలో కాపలా ఉన్న రాక్షస స్త్రీ నామాలు మచ్చుకి కొన్ని...ఇంకా చాలా మంది ఉన్నారు కానీ, ఈ తొమ్మిది మంది సీతమ్మవారికి అంగరక్షిణుల మాదిరి విడువకుండా కాపలా కాయటానికి రావణుడు నియోగించిన స్త్రీలు

త్రిజట
త్ర్యక్షి
లలాటాక్షి
ఏకాక్షి
దీర్ఘజిహ్వ
త్రిస్తని
అజిహ్వ
ఏకపాది
ఏకలోచని

ఈ రాక్షస స్త్రీలలో కొంచెం ఉత్తమమయినది త్రిజట. ఈవిడ సీతమ్మవారిని ఓదారుస్తూ ఉండేది.(కాపలాగా ఉన్నా కూడా!!)


మిగిలిన రాక్షస స్త్రీల గురించి తరువాతి టపాలో

Monday, May 28, 2007

తిట్లు - తీరు

తిట్లు - తీరు

ఆవేశపూరితమయిన మనిషి కోపానికి రూపం తిట్టు. ఆవేశం ఎక్కువయ్యేకొద్దీ వేడెక్కే బూతులు కూడ తోడవుతూ ఉంటాయి. సరే బూతులు మనకెందుకు కానీండి కానీ, అసలు తిట్లు ఎలా తిడతారో చూద్దాం

ఊతపదాలయిన తిట్లు కొన్ని

పళ్ళు రాలగొడతాను పిచ్చి పిచ్చిగా వాగావంటే
ముక్కలు ముక్కలుగా కోసి కాకులకీ గద్దలకీ వేస్తా
పీక పిసికి పారేస్తా
గోతిలో కప్పెట్టేస్తా దొంగ వెధవా
వీపు విమానం మోతే
చంపి పారేస్తా ఏమనుకుంటున్నావో
తల్లి తోడు నీ ప్రాణం తీయకపోతే
చెంప పగిలిపోతుంది
నీ మొఖం మండనీ నోరు పడిపోను
నీ నోట్లో పురుగులు పడ
నీ శవం కాటికెళ్ళ
నీ జిమ్మడ
నీ పెళ్ళాం ముండ మొయ్య
నీ పెళ్ళాం రేవులోకెళ్ళ
నీ తెలివి సంతకెళ్ళ
నిన్ను అమ్మోరు యేసుకుపోను
నీ తాడు తెగ
నీ కాళ్ళూ చేతులు పడిపోనూ
నువ్వు దిక్కులేని చావు చస్తావు
నిన్ను గోతిలో పెట్ట
నీ అమ్మ కడుపు కాలా
వెధవసచ్చినోడా
బుర్ర రామకీర్తన పాడించేస్తాను వెధవ
నిన్ను కోదండం తీయించకపోతే నా పేరు కాదు
ఒక్క తన్ను తన్నానంటే ఆమడ దూరం పడతావు
దిక్కున్న చోట చెప్పుకోరా ఫో
అడ్డంగా నరికి పారేస్తా
నోరు ముయ్యి
ముక్కలు ముక్కలుగా నరికేస్తా
గూబ గుయ్యిమంటుంది వెధవ వాగుడు వాగావంటే
కళ్ళు పీకేస్తాను
గుడ్లు పెరికేస్తాను
మేకగుడ్ల వెధవ
సోంబేరి నాయాల
సాచి లెంపకాయ కొడితే మంచినీళ్ళు కూడా అడగవు
దవడ పగిలిపోతుంది
పెంట వెధవ
ఊరపంది
నరుకుతా - దిక్కున్న చోట చెప్పుకో పోరా
నీ దెవసం పెట్ట
నీ తద్దినం పెట్ట
నిన్ను తగలెయ్య
ఏం పోయే కాలం వచ్చిందిరా దరిద్రుడా

ఇలా కొన్ని వందలు ఉన్నాయి

సరే మరి కొన్ని వచ్చే భాగంలో...

సశేషం

శెలవురోజుల్లో చేసిన పని ఏమిటయ్యా అంటే...

ఈ శెలవురోజుల్లో చేసిన పని ఏమిటయ్యా అంటే - ఎప్పటినుంచో అనుకుంటూ, బద్ధకంతో పక్కన పడేస్తూ వచ్చిన ఈ బ్లాగు తయారీ, మొత్తానికి మొదలుపెట్టాను.

అదండీ సంగతి.

ఇక రాతలు రాయటం మిగిలింది.