Monday, February 27, 2012

ఆ సంగతి ఇప్పుడు తెలిసిందా ఏం?

అమ్మమ్మగారి ఊరు చల్లపల్లిలో అల్లప్పుడెప్పుడో ఉన్న ఒకే ఒక ఫుటో స్టూడియో - చుట్టూ ఉన్న నలభై మైళ్ళకు ఒకే ఒక్క ఫుటో స్టూడియో - అదే, అదే - కృష్ణాజిల్లాలోని వరల్డ్ ఫేమస్ శ్రీనివాసా ఫోటో స్టూడియోలో అల్లప్పుడెప్పుడోనే, అనగా నాలుగు దశాబ్దాల క్రితం పైమాటేనన్నమాట .......

అప్పుడు తీయించుకున్న ఫుటో ఇదిగోనయ్యా! 





హబ్బా! ఎంత సుందరాంగుడివిరా నాయనా!

ఆ సంగతి ఇప్పుడు తెలిసిందా ఏం? లేకుంటే ఎక్కడన్నా కాలిందా?

ఈ ఫుటో ఎనకాతల ఉన్న వివరాలు కూడా చూసి సంతోషించండే!

7 comments:

  1. నిన్నటి రోజున పామర్రు,కూచిపూడి,కొడాలి,చల్లపల్లి,మోపిదేవి,కోడూరు మీదుగా ఉల్లిపాలెంలో శ్రీమన్నారాయణ ఆలయ ప్రతిష్టా మహోత్సవానికి వెళ్ళి వచ్చాము.

    ReplyDelete
  2. అవునా? సంతోషం....

    ఉల్లిపాలెంలో గరుత్మంతుడి విగ్రహం చూసారా? చాలా బాగుంటుంది....అలాగే కోడూరులో అయ్యప్పస్వామి ఆలయం కూడా చాలా బాగుంటుంది....

    మా ఊరి (చల్లపల్లి) కోట చూసారా? మోపిదేవి గుడికి వెళ్ళారా? :)

    ReplyDelete
  3. :-)చూశారా ఎంత పకడ్బందీగా ప్రకటన వేయించారో? నలభయ్యేళ్ళ తర్వాత కూడా నిలిచి ఉండేంతగా!
    ఫొటో వెనక సమాచారం మాత్రం చక్కగా ఉంది."బెల్జియం చూపుడు అద్దాలు" అట! చూపుడు అద్దాలు అంటే మొహాలు చూసుకునే మిర్రర్లు అనా?

    ReplyDelete
  4. నేను సులోచనాలు అనుకుంటున్నాను.

    ReplyDelete
  5. @సుజాత - ప్రకటనేమిటీ అన్నీ పకడ్బందీగానే ఉంటాయి ఆ శ్రీనివాసా ఫోటో స్టూడియోతో.......ఏమనుకున్నారు? :)

    బెల్జియం చూపుడు అద్దాలు అనగా, బెల్జియం నుంచి దిగుమతి చేసుకున్న అద్దాలు - మొహాలు చూసుకునేవే లెండి....

    ఇందులో రెండు రకాలు ఉండేవి - చిన్నవీ, పెద్దవీ - చేత్తో పట్టి చూసుకునే చిన్నవాటికి ఉన్న హాండిల్సు భలేగా ఉండేవి.....కింద భాగం గుండ్రంగా మంచం కోడులానూ, మధ్య భాగం గొగ్గులు గొగ్గులుగా గరుకుగానూ, పై భాగం నలుచదరంగానూ - అన్ని భాగాలూ నగిషీలతో మెరిసిపోతూ ఉండేవి....

    ReplyDelete
  6. ఈ పేరుకి బలమెక్కువేమో, 30 క్రితం మా నాగార్జున సాగర్ -పైలాన్ కాలనీ ఒకేఒక్క స్టూడియో కూడా "శ్రీనివాస' యే :) మీ కుడి చేతిలో వస్తువు తెలియాలంటే ఎలా? చల్లపల్లి, మోపిదేవి గురించి హాస్టల్ మేట్ చెప్తుండేది నేను మా గోదారూర్లు, కోనసీమ అందాలు చెప్పినప్పుడల్లా...అలాంటి పాత అద్దాలపెట్టెలు మొన్నీ మద్య వరకు మా అమ్మ/అత్తయ్యల సామాన్ల లో ఉండేవి.

    ReplyDelete
  7. Sorry for the "tenglish" / "RTS" reply - I cannot connect to lekhini or google translate - wierd!..huh! Anyways -

    @usha - okka addapu peTTannA dAcukOnDi veelunTE.... :)

    meedi cAlA niSita dRshTanDOyi....mana blAgarlalO cAlaa takkuvamandiki unDE guNam adi... nA kuDi cEtilO vastuvuku O pEdda katha unnadi... :) adi nemmadigA lEkhini ki kanakT ayyAka rAstA....ee RTS nOTsulO cadavaTAniki cAlAMandiki ibbamdigA unTundi....

    ReplyDelete

ప్రొఫైల్ లేని వారి కామెంట్లు, బ్లాగులు/ఊరు పేరు లేని వారి కామెంట్లు, టపా స్ఫూర్తికి విరుద్ధంగా చేసే కామెంట్లు, చెత్త కామెంట్లు, నాకిష్టం లేని కామెంట్లు నిర్దాక్షిణ్యంగా తొలగించబడతాయి. అందుకు సిద్ధమైన వారు నిరభ్యంతరంగా కామెంటు రాయవచ్చు.