1976లో పావలా అంటే యమహో నీ యమా యమా అన్నమాట.....
నెలవారీ నాన్నగారిచ్చే రూపాయి - పాకెట్ మనీ కోసం ఇరవై తొమ్మిది రోజులు వెయిట్ చేసీ చేసీ చేసీ, చేతిలో ఉన్న నాలుగు పావలాలు, వారానికొక్కటి చొప్పున చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకుంటూ యమా యమాగా గడుపుతున్న కాలంలో "గురుపూజ" / "గురుపూజోత్సవ దినము" వచ్చెను....
దానికి ("గురుపూజ" / "గురుపూజోత్సవ దినము") - హైదరాబాదు అశోక్ నగరులోని లక్ష్మీ చిల్డ్రెన్స్ స్కూల్ - నాకు విద్యాబుద్ధులు నేర్పిన, నాకు బాగా ఇష్టమైన స్కూలు వారు పావలా అడిగితిరి....
దానకర్ణుని వలె ఉన్న నాలుగు "పావలా" కుండలాల్లో ఒకటి దానమిచ్చితిని....
అప్పుడు వారు ఈ రసీదు లాటి అపురూప సౌందర్యవతిని చేతిలో పెట్టితిరి.....
ఆ సౌందర్యవతిని ఈ పాతికేళ్ళూ చెక్కు చెదరకుండా కాపాడుకుంటూ వస్తిని.....(పైసకు ఒక సంవత్సరము చొప్పున ఋణానుబంధము విపరీతముగా బలపడినది)...
ఇప్పుడు అవకాశము వచ్చెను కదాయని కెమెరాలో బంధించితిని....
ఇక్కడ వేస్తిని....
