అందరూ గుజరాత్ వెళ్ళిపోండిరా! బాగుపడతారు....న్యూస్ పంచుకున్న ఉష గారికి (రేడియో అక్కయ్య శ్రీమతి తురగా జానకీ రాణి గారి అమ్మాయి) ధన్యవాదాలతో
నర్మదా నది (బ్రాంచ్ కెనాల్) మీద 100 కి.మి సోలార్ పానెల్స్ వేసి అటు నీరు ఆవిరైపోకుండానూ, ఇటు విద్యుత్ ఉత్పత్తి సాధిస్తూనూ....వాహ్ మోడీ వాహ్! నాయకులంటే నీవంటి వారే!
ఇందులో కూడా మింగితే మింగుండొచ్చుగాక, జనాలకు ఉపయోగపడే పని ఇలాటిది ఒక్కటన్నా చెయ్యని మా ప్రభుత్వాలను, మా రాజకీయనాయకులను చూసి ఎంత సిగ్గుపడుతున్నామో నీకు తెలియదులే!

వంశీ మోహన్ గారూ..! నమస్తే..!
ReplyDeleteగుజరాత్ కెళ్లిపోవాలని మీరు ప్రత్యేకంగా చెప్పాలా..?
గత రెండేళ్ళుగా మన రాష్ట్రంలోని పరిస్థితుల వల్ల ఉద్యోగార్థులు ఎక్కువగా క్యూ కట్టింది గుజరాత్‌కేగా..! ఉద్యోగంకోసం గుజరాత్‌కెళ్ళినవాడు ఉత్తచేతులతో తిరిగిరాడని ఇంజనీరింగ్ విద్యార్థులలో ఓ నమ్మకం ఉంది.
`ఇందులో కూడా మింగితే మింగుండొచ్చుగాక'
ReplyDeleteఅవసరం లేదక్షా!నాకు పిల్లా జెల్లా ఎవరూ లేరు.
సౌర విద్యుత్‌లో మత పరమైన అంశాలు ఏమయినా ఉన్నాయా అధ్యక్షా? :)
ReplyDeleteఅద్భుతమైన వార్త పంచుకున్నారు. ధన్యవాదాలు. ఈ వ్యాసం మీరూ చదవండి.
ReplyDeletehttp://kaipullai.com/2012/02/24/dr-elattuvalapil-sreedharan-the-bharat-ratna-no-one-talks-about/#comment-676
చాలా మంచి ఐడియా.
ReplyDeleteగుజరాత్‌లో రాజకీయాలు తక్కువ, వ్యాపారం ఎక్కువ.
అక్కడ లంచం ఇచ్చినా, ఖచ్చితంగా పని జరుగుతుందన్న నమ్మకం.
అందుకే ఆ రాష్ట్రం అంతగా అభివృద్ధి చెందుతోంది.
@ వామనగీత, బోనగిరి - :)
ReplyDelete@విజయమోహన్ గారు - పిల్లల కోసమే దోచేసుకుంటున్నారని డిసైడైపోతే మటుకు రాజకీయాల్లో చేరేముందు పిల్లలుండకూడదు అని ఒక కండిషనూ, బ్రహమచారిగానే మిగిలిపోవాలని ఒక కండిషనూ, అదీ కాదూ ఇదీ కాదూ అంటే పిల్లలు పుట్టకుండా "చితక్కొట్టించుకుంటాము" అన్న కండిషనూ - వీటన్నిటినీ ప్రయోగించేసి దేశమేమన్నా బాగుపడుతుందేమో ఆలోచించాలె...
@ ఫణీంద్ర - ఇలాటి మంచి పనులు, ఉపయోగపడే పనులూ చేస్తే - మతమేం ఖర్మ, ఇంకేం ఉపయోగించుకున్నా నా పూర్తి మద్దతు ప్రకటించేస్తా!
@సూర్య - మంచి వార్త! అవును ఇలాటివారు కోకొల్లలుగా లేకపోయినా, కొల్లలుగా ఉన్నారు....గుర్తించలేకపోటం వారిదో, మనదో విధిలిఖితం అనను కానీ ఖర్మ / కర్మ రెండూ కాలినాయని మటుకు చెప్పగలను
గుజరాతీ సహోద్యోగి మావగారి వలన అడపా దడపా ఇలాటి విషయాలు, విశేషాలు తెలుస్తాయి మాకు. కాస్త పక్కదారి పట్టే వార్త గానీ, 2011 దేవీ నవరాత్రుల్లో ఆయన స్వయంగా పాల్గొన్న గుజరాత్ గర్బా వేడుక గూర్చి - 40 వేల మందిమి ఒక ప్రదేశంలో అన్నీ సాంప్రదాయ పాటలకి నర్తిస్తూ, కోలాటం చేస్తూ, ఒక్క సెల్ ఫోన్ గానీ, కామేరా గానీ వాడకుండా దేవిని సేవించాము - సంతృప్తిగా చెప్తే మీరు అన్న ఖర్మ/కర్మ ల తాలూకు ఎన్నే అనేకానేక మన వారిని గూర్చిన సందర్బాలు విసిగించాయి (వ్రతాల్లోనూ ఫోటోలకి ఎగబడేవారు, కళాకారులకి మర్యాద చూపలేని వారు ఇలాగ)
ReplyDelete