Friday, January 20, 2012

ఎవరు ఒకసారి కామెంటు రాస్తే కామేశ్వరరావు గారు కూడా కొద్దిగా తడుముకుంటారో ఆయనే!!!

కామేశ్వర రావుగారి సూచన బుర్రలో  నేనిక్కడే ఉన్నానంటూ పెన్సిలుతో నరాల మీద తడుతూ ఉంటే, ఆ పెన్సిలు బుర్రలోంచి బయటకు తీసి చేతిలో పట్టుకున్నా....

నేను చదివే బ్లాగుల్లో నాకు నచ్చిన ఇంకో వ్యక్తి ఎవరా అని ఆలోచిస్తూంటే - ప్రత్యక్షమయ్యారు.....

ఎవరు ఆయన చెప్పు బాబూ....

ఎవరు ఒకసారి కామెంటు రాస్తే కామేశ్వరరావు గారు కూడా కొద్దిగా తడుముకుంటారో ఆయనే ఆ ప్రత్యక్షమైనాయన....

ఈయనతో కూడా నాకు "ముఖ పరిచయం" కానీ, "ముఖ" పరిచయం కానీ లేదు...కానీ ఆయన రాసే కామెంట్లు బాగా నచ్చుతాయి నాకు....

ఎవరు బాబూ, ఇక్కడ రక్తపోటు పెరిగిపోతోంది చెప్పు , చెప్పు త్వరగా!

చూస్తావుగా! తొందరెందుకు? చూస్తావు, ఆ తర్వాత తెలుసుకుంటావు....



చూసావా? ఆయన ఇలా ఉంటారని నా ఊహ....ఊహ మాత్రమే!

ఆయన్ని చూసినవారు, ఆయన ఎవరో తెలిసినవారు - ఆయన ఇలా ఉండకపోతే చెప్పండి....ఏం?

ఇంతకీ ఎవరు నాయనా ఈయన - బాంచను, నీ పెన్సిలు కాళ్ళు మొక్కుతా చెప్పు....

అదీ అలా రా దారికి

ఆయనే - బ్లాగాడిస్తా రవి......బ్లాగాడిస్తా రవి.....బ్లాగాడిస్తా రవి.....

హమ్మయ్య , ఇప్పుడు కుదుటపడ్డా.....బాగుంది బాగుంది....

రవి గారూ, రవి గారూ - - మీరు ఇలా ఉండకపోతే ఓ సారి ఫోటో ఒకటి పంపించండి...మీరెలా ఉంటారో తెలుసుకోవాలి అని నిజంగానే ఉన్నది...అలాగే కొచ్చెన్లు ఏమన్నా ఉంటే, అంటే ఇలాగే ఎందుకు వెయ్యాలనిపించింది గట్రా గట్రా ఎవన్నా ఉంటే కూడా అడగండి.... :)

Note: Remember that this is caricature

3 comments:

  1. నేనలా ఉండను కానీ, నేనెలా ఉంటే బావుంటుందనుకుంటానో అలా గీశారు.

    పోతే కామేశ్వరరావు గారిని గీకి, నన్ను ఇబ్బంది పెట్టారు. :) ఆయనంటే కొన్ని విషయాల్లో తీవ్రమైన విభేదం, ఎన్నో విషయాల్లో చెప్పుకోలేనంత అభిమానం రెండూ ఉన్నాయి నాకు.

    నా ఫుటో ఓర్కుట్ లోనూ, నా ప్రొఫైల్లోనూ, పొద్దులోనూ ఓపెన్ గానే ఉంది.

    ReplyDelete
  2. రవి గారూ

    కామేశ్వరరావు గారు ఎవరైనా సరే, ఎలా ఉంటారో ఊహించి గియ్యమని చెప్పారుగా! అందుకే అలా ఉన్నది...మీ బ్లాగు మూసేసినట్టు ఉన్నారు....ఇప్పుడే చూద్దును కదా, "నువ్వు అనవసరంగా ఇక్కడికొచ్చావు, నీకు అనుమతి లేదు, ఆయన్ని ఒక "ఇన్వైట్" పంపమని అడిగి ఆయనిస్తే మళ్ళీ రా" అని చెబుతోంది....మీ ఫోటో చూడలేకపోయా....పొద్దులో చూసా కానీ మీ ముఖం సరిగ్గా కనపడలా!.....

    పోతే ఆయన్ని గీకటానికి నాకు ఆయన మీదున్న అభిమానమే కారణం.....ఒకటి చెప్పాలె - కారణాలేవైనా కానీ మన బుర్రలో కొందరు తిష్ఠ వేసుకుపోతారు....ఈ తిష్ఠ రెండు రకాలు...ఒకటి మన ఆహ్వానం మీద వచ్చేవారు.....రెండు మన ఆహ్వానం లేకుండా వచ్చేవారు....ఈ రెండో దానిలో - నా బుర్రలోకి వచ్చేవారు ఎప్పుడూ, నా ప్రమేయం లేకుండా రాజఠీవితో ఆప్యాయత, అభిమానం కలగలుపుకుని వచ్చేసి సింహాసనం అధిష్టించేస్తారు.....అలా వచ్చినవారిలో మచ్చుకి కొంతమంది - సర్వశ్రీ కామేశ్వరరావు, మీరు, డాక్టర్ కె.బి గోపాలం, పరుచూరి శ్రీనివాస్, చదువరి, తాడేపల్లి, అఫ్సర్, లైలా, డాక్టర్ జెజ్జాల కృష్ణమోహన రావు, ఆచార్య వేమూరి వెంకటేశ్వర రావు, వేలూరి...ఇలా ఇంకా చాలామందితో ఓ లిష్టు ఉన్నది......

    ఇహ మొదటి రకం, అంటే నేను ఆహ్వానించగా వచ్చేసి తిష్ఠ వేసినవారిలో కొంతమంది - సర్వశ్రీ కొత్తపాళీ, నాగమురళి, సనత్ శ్రీపతి, కంది శంకరయ్య మాష్టారు, సుధామ, మాచవరం మాధవ్....ఇలా ఇంకో పెద్ద లిష్టు ఉన్నది.....

    వేరేగా అనుకుంటారేమోనని చిన్న వివరణ - మొదటి దానికి రెండో దానికి తేడా పెద్దగా లేదు.... అందరూ కావలసిన వాళ్ళే.....అందరినీ అభిమానించే వాడినే! కాబట్టి ఎవరూ కోపగించుకోవద్దు సుమాండీ! :)

    సరే చెప్పటం అయిపోయింది.....

    ఇహ కామేశ్వర రావు గారిని గీకటానికి మళ్ళీ వచ్చేస్తే, మీ ఇద్దరూ మాట్లాడుకుంటూంటే నాకు భలేగా ఉంటుంది....అందుకు గీకా.....అభిమానంతోనే లెండి....విభేదంతో కాదు.... :)

    అదీ సంగతి....

    ReplyDelete
  3. రవి, వంశీగారు, :-) :-)

    ReplyDelete

ప్రొఫైల్ లేని వారి కామెంట్లు, బ్లాగులు/ఊరు పేరు లేని వారి కామెంట్లు, టపా స్ఫూర్తికి విరుద్ధంగా చేసే కామెంట్లు, చెత్త కామెంట్లు నిర్దాక్షిణ్యంగా తొలగించబడతాయి. అందుకు సిద్ధమైన వారు నిరభ్యంతరంగా కామెంటు రాయవచ్చు.