Friday, January 20, 2012

దానికి ఇంత ఇదైపోతావేమిటీ? నిన్ను తగలెయ్య!

ఈవేళ ఖాతాలో నాలుగు పడ్డాయి....

వీళ్లంతా ఎవరెవరో ఏమిటో? అసలు నువ్వెలా గీస్తున్నావో చెప్పు!

పెన్సిలుతో పేపరు మీద

యెహ్హా! ప్రొసీజరు చెప్పు ప్రొసీజరు

ఓ ! అదా....ఏముందీ - మా అమ్మాయి దాచిపెట్టుకున్న పెనసిల్లు ముక్కల్లోంచి ఓ రెండు పెన్సిలు ముక్కలు దొంగిలించా! పేపర్లు అప్పనంగా వచ్చాయ్....ఇహ నా సామిరంగా! పెన్సిలు చెక్కుకోనూ, పేపరు తియ్యనూ, గీతలు గియ్యనూ.....

అది సరేరా మగడా! ఎలా గీస్తున్నావ్?
  • ఊహించా? 
  • బొమ్మలు చూసా?
  • ట్రేసు కొట్టా? 
  • అవుట్లైనేసుకునా? 
ఎలా రా నాయనా?

ఓహో! అదడుగుతున్నావా? ఊహించీ, అవుట్లైనేసుకోని, ఓ షేపుకొచ్చాకా ముల్లు చెక్కని పెన్సిల్లు తీసుకుని గట్టిగా నొక్కుతూ వేసెయ్యటమే ఆ ఫైనల్ అవుట్ లైను మీద....ట్రేసు అనీ, బొమ్మలు చూసావా అనీ - గుండెలో బాకులు దించేసావు గదరా! దించేసావు గదరా! ఇంకా ఆ ఖర్మ కాలలా! కాలలా....లా...లా...

ఆపెయ్, ఆపెయ్....ఊరకే అన్నారా నాయనా! దానికి ఇంత ఇదైపోతావేమిటీ? నిన్ను తగలెయ్య!

అంతేనంటావా? సరే ఐతే పోయి మళ్ళీ ఏస్కొనొస్తా!

అది సరే కానీ - ఆ మూడో ఆయన ఎవరు ? నాగేశ్వరరావులా ఉన్నాడే?

కాదురా! విద్వాన్ విశ్వం గారని ఒహాయన ఉన్నారు....ఆయన బొమ్మ వేద్దామని కూర్చుంటే ఇలాగొచ్చింది.....హేమిటి చెబుతాం? అంతా మాయ!

మరి ఆ నాలుగో బొమ్మేంటి? అలాగుంది.....నిన్న చెంఘిజ్ బొమ్మ  చించేసావు, అదరగొట్టేసావు....ఇవ్వాళ్ళ కుదరలేదే?

ఏమో పెన్సిలును కనుక్కుని చెబుతా! ఉండు....

పైగా ఆ కత్తేంటి అలా భుజం మీద ఇటేపుకుంది?

ఏమో ఆయన అలాగే చేస్తాడేమో కత్తి యుద్ధం!

ఆ ఈకేంటి నెత్తి మీద...

మరి పీకలు కొయ్యాలిగా అందుకు ఈకలు పెట్టుకు తిరుగుతున్నాడు.....

ఈకలతో పీకలు కోస్తే మరి ఆ కత్తెందుకు ఇహ?

నీకోసమేమో !