Wednesday, January 18, 2012

దొరికిపోయిన భైరవభట్ల కామేశ్వరరావు గారు!!

దొరికిపోయిన భైరవభట్ల కామేశ్వరరావు గారు

ఏమిటి బాబూ ఆ హెడ్డింగు?

ఆయన చిక్కడు దొరకడు టైపు....నీకు ఎలా దొరికారన్నది ఆశ్చర్యం!

ఎలా? ఎక్కడ? ఎందుమూలాన? వివరాలు కావాలి....చెప్పుకో

వినుకో! ఈమధ్య కొత్తగా నన్నావరించిన బేతాళ భూతం, పెనసిల్లు పిశాచ మహిమల వల్ల నేనేసిన బొమ్మల గురించి ఆయనతో మాట్లాడుతూ ఉంటే, ఆయనో చిలిపి సలహా నామీద మెత్తగా పూలచెండులా విసిరారు ...

ఏమిటా సలహా?

"మీకు ముఖపరిచయం లేని బ్లాగర్లని, వాళ్ళ రాతలబట్టి, ఎలా ఉంటారో ఊహించి స్కెచ్చులు వేస్తే ఎలా ఉంటుందీ అని!"

ఆయన ఆలోచన నచ్చింది...అయితే నేను చదివే బ్లాగులు చాలా తక్కువ.....ఆ చదివే బ్లాగుల వారందరితో "ముఖపరిచయం" లేకపోయినా కొద్దిమందితో మాత్రం "ముఖ" పరిచయం ఉన్నది...అనగా ఫోటోల్లో చూడటం వల్ల అని అర్ధం.....

కామేశ్వరరావు గారితో నాకు "ముఖ" పరిచయమూ లేదు, "ముఖపరిచయమూ" లేదు....ఒక్క బ్లాగ్ పరిచయం తప్ప....సరే సలహా ఇచ్చారు కదాని, జమ్మిచెట్టు మీదనుంచి గాండీవం దించి ఆయన మీదకే ఓ పెన్సిలు ఎక్కుపెట్టా.....

ఇహ ఉపోద్ఘాతం అయ్యిందిగా.....ఆయన ఎలా దొరికిపోయారో ఈ కింద చూడండి.....

ఆయనిలా ఉండకపోతే ఎలాగుండొచ్చో తెలిసినవారో, ఆయనే స్వయంగానో చెప్పొచ్చు.....

PS: Remember that, this is a caricature!!