Tuesday, January 24, 2012

మొత్తానికి సాధించానయ్యా!

మొత్తానికి సాధించానయ్యా!

మొన్నేసిన బొమ్మ చె.బు లొ పడేసి, కసి కొద్దీ నిన్న మళ్ళీ కూర్చున్నా....గంటన్నర పట్టింది కానీ దీని సిగ తరగ, బాగా వచ్చిందయ్యా!....శెభాషో!....

నీకు నచ్చినా నచ్చకపోయినా నాకు సంబంధం లేదు, నాకు నచ్చింది కాబట్టి....

నచ్చకపోతే అటునించి అటే పోవచ్చు...

నచ్చితే ఓ కామెంటేసి పోవచ్చు....

భవదీయుడు
మాగంటి వంశీ మోహన్

Canvas: 11 * 14
Colors: Crimson / Yellow / Black / Pthalo Green / White..

Just 5 colors? Yes - Just 5

Time: 1hr .40 mins


3 comments:

  1. వంశీ మోహన్‌ గారూ నమస్తే..!

    కొన్ని రోజులుగా బొమ్మల దీక్ష పట్టినట్టున్నారు..., రోజుకి కనీసం ఒక్క బొమ్మైనా ఇలా వేస్తున్నారు..

    నాకైతే బొమ్మలేసేంత ధైర్యం లేదుగానీ, వేసేవాళ్లని వేళాకోళం చేసేంత ధైర్యం ఉంది. ఏం అనుకోకండి..!

    ఇంతకీ ఇది ఎవరి బొమ్మండి..? యక్షగానంలో ఎవరైనా పాత్రధారా.. లేక తాండ్ర పాపారాయుడు, ప్రోలయ వేమారెడ్డి ఇలాగ ఎవరైనానా..?

    ReplyDelete
  2. @వామనగీత గారు

    అవును ఇంతకుముందు పోష్టులో విజయమోహన్ గారికి చెప్పినట్టు "మనుషుల" పని పట్టాలని నిశ్చయించుకున్నాను.....పడుతున్నాను కూడా.....అలా పట్టేప్పుడు కిందా మీదా కూడా పడుతున్నాను, కాబట్టి ...అదీ సంగతి...

    ఇహ వేళాకోళాల సంగతికొస్తే, ఏమనుకోను కానీ - ఇలాటి "సటిల్" వేళాకోళం ఫరవాలా నా దగ్గర! అయితే మీ పొట్టి గీత, అదేనండీ "వామన" గీత దాటితే మటుకు పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ముందుగానే తెలియచేసుకుంటున్నందుకు మీరూ ఏమీ అనుకోకండి... :)

    ఇహపోతే యక్షుడా, రాయుడా, రెడ్డి రాజా - అన్న మీ ప్రశ్నలోనే సమాధానం ఉన్నది.....ఈయన యక్షగానంలోని ఒక యక్షుడే! "చుక్కల జేగురు" యక్షుడు అని పేరు....ఈయన పని - గ్రామాలకు కాపలా కాపలా కాయటం........

    ఈయన భార్య బొమ్మ ఈవేళే ప్రచురించా! ఆవిడను కూడా చూసి తరించండి....

    ReplyDelete
  3. Anita - your comment is deleted! You know why....If you did NOT know why, read the statement from COMMENT BOX....

    for your convenience - here it is - "ప్రొఫైల్ లేని వారి కామెంట్లు, బ్లాగులు/ఊరు పేరు లేని వారి కామెంట్లు, టపా స్ఫూర్తికి విరుద్ధంగా చేసే కామెంట్లు, చెత్త కామెంట్లు నిర్దాక్షిణ్యంగా తొలగించబడతాయి. అందుకు సిద్ధమైన వారు నిరభ్యంతరంగా కామెంటు రాయవచ్చు."

    ReplyDelete

ప్రొఫైల్ లేని వారి కామెంట్లు, బ్లాగులు/ఊరు పేరు లేని వారి కామెంట్లు, టపా స్ఫూర్తికి విరుద్ధంగా చేసే కామెంట్లు, చెత్త కామెంట్లు నిర్దాక్షిణ్యంగా తొలగించబడతాయి. అందుకు సిద్ధమైన వారు నిరభ్యంతరంగా కామెంటు రాయవచ్చు.