ప్రొఫెసర్ వెల్చేరు నారాయణరావు గారి కారికేచర్!
కామేశ్వర రావుగారి బొమ్మ లా, వేలూరి వారి బొమ్మలా - గీసే ముందు వారు ఎలా ఉంటారో అన్న సంశయం లేకుండా, గాల్లో దీపం పెట్టినట్టు పేపరు మీద పెన్సిల్లు పెట్టకుండా ఉండటానికి ఈసారి, వెల్చేరు ఎలా ఉంటారన్న సందేహానికి సమాధానం కోసం గూగులమ్మను అడిగా.....
ఓ మూడు బొమ్మలు చూపించింది...
అందులో ఒకటి పట్టుకుని ఇలా గీసా....కొద్దిగా తన్నింది అనిపించింది కానీ, మన చెయ్యి ఇంకా తిరగలేదు కదా అనిన్నూ- కారికేచరు కదా అనిన్నూ సరిపెట్టేసుకున్నా!
మీకు నచ్చితే మీరే ఆనందోబ్రహ్మ!
మీకు నచ్చకపోతే మీరు గీసి చూపిచ్చండి నేర్చుకుంటా!....