Thursday, January 5, 2012

అవునా! భలే చెప్పావురా అబ్బాయ్ .....సంతోషం....!!

కొత్త సంవత్సరం వచ్చిందయ్యా....బాగుంది....మరి బ్లాగులోకొచ్చి నాలుగు రోజులయ్యింది.....ఎందుకో?

వెబ్సైటు పనుల్లో బిజీగా ఉన్నానయ్యా.....తవరు తాగి తందనాలాడో - ఊగిపోతోనో ఆంగ్ల సంవత్సరాది పండగ చేసుకుంటే, నా పండగ వెబ్సైటు మీద గడిచింది.....

సరే కానీ ఈ నాలుగు రోజుల్లో వెబ్సైటులోకెక్కించినవి ఏమిటో చెప్పు!

50 చిన్న పిల్లల కథలు - పిల్లల కథలు సాహిత్యము సెక్షన్లో

90 రచనలు - అపూర్వ సాహిత్యము సెక్షన్లో

ఇదేమిటీ ? ఇంతకు ముందు ఈ సెక్షను (అపూర్వ సాహిత్యము)  నీ వెబ్సైటులో చూడలేదే?

అవును - కొత్త సంవత్సరం కదాని కొత్త సెక్షను ప్రారంభించా! ఈ సెక్షన్లో చేర్చాల్సినవి ఇంకా బోలెడు ఉన్నాయి....ఒక్కడిని ఎంత పని చేసుకోవాలి? నీలాగా పనీ పాటా లేకుండా......

ఆపెయ్...ఆపెయ్....అక్కడికి ఆపెయ్ ....

అవునూ - ఇంతకీ ఇవన్నీ నువ్వు చదివావా?

భలే ప్రశ్నేసావురా అబ్బాయ్ - చదవకుండా అక్కడికెక్కడానికి , అనగా వెబ్సైటులోకెక్కడానికి నా రూల్స్ అనుమతించవురా! చక్కగా చదివా.....బుర్రలోకింకిపోయేలా అర్థం చేసుకున్నా.......

నువ్వేమో ఇట్లా అంటున్నావు - మరి అక్కడ  బ్లాగుల్లో ,  సైట్లల్లో నేను 10 కథలో / పుస్తకాలో చదివాను, 20 కథలో/పుస్తకాలో చదివాను.....కొన్నాను కానీ చదవలేదు......చదివాను కానీ నాకెక్కలేదు.....ఎక్కింది కానీ అర్థం కాలేదు....అర్థమయ్యింది కానీ అర్థమయ్యిందేమిటన్నది అర్థం కాలేదు.....అర్థమయ్యిందాన్ని పరిచయం చెయ్యాలంటే ఎలా ప్రొసీడవ్వాలో తెలీట్లేదు - ఇల్లాగ ఓ ఇదైపోతున్నారేమిటీ?  

ఏమో నువ్వే చెప్పు....అయినా అగ్నిలో ఆజ్యం పోస్తున్నావా? మసైపోతావు! అర్భకుడివని వదిలెస్తున్నా...ఫో!

సరే, ఇవి అంటే నువ్వు చదివి ఎక్కించినవి చిన్నవి, ఓ పదినిముషాలు కూర్చుంటే అయిపోతాయి.....మరి వాళ్ళనేదేమో పేద్ద పేద్ద పుస్తకాలనుకుంటాగా?

అవునురా! నేన్నీకు పుస్తకాలు చదవలేదు అని చెప్పానా?

లేదు....

మరి?

చదివావా? అయితే ఎన్ని చదివావు, ఏమిటి చదివావు - కథా కమామీషు వివరించి పుణ్యం కట్టుకో....

ఈ పోష్టు అందుకు తగదురా!

సరేలే దాటేస్తున్నావ్!

అవునా! మంచిది - నువ్వేమనుకున్నా నాకు "దాంతో" సమానమేరా అబ్బాయ్.....కానీ వచ్చే పోష్టుల్లో నీకు సమాధానం దక్కుతుంది....అప్పుడొచ్చి మళ్ళీ ప్రశ్నలెయ్యి...అందాకా.....

సరే! బాగుంది.....అలా నీ పని నువ్వు చేసుకుంటూ పోతూ ఉండు.....

అవునా! .భలే చెప్పావురా అబ్బాయ్ .....సంతోషం....

భవదీయుడు
మాగంటి వంశీ మోహన్