Canvas: 14 X 11 Stretched
Acrylic Colors Used:
Ultra Marine Blue + Titanium White
Crimson + Yellow Ochre
Ultra Marine Blue + Hookers Green
Crimson + Titanium White
Hooker's Green + Yellow Ochre
Burnt Umber + Raw Siena + Light Red
Time: 41 Mins
Level Of Happiness With The Painting: Moderate
Sunday, October 30, 2011
Saturday, October 29, 2011
Friday, October 28, 2011
ఏం పేరు పెట్టాలో ఏమిటో?
Canvas: 14 X 11 Stretched
Acrylic Colors:
Cadmium Yellow (Back ground)
Ultra Marine Blue (Water)
Titanium White (Water + Skies)
Royal Violet + Titanium White (Skies + Water)
Hooker's Green+ Lime Green (For Grassy Area)
Nutmeg Brown / Burnt Umber / Raw Siena ( For the boders of water logged area)
Black (For the trees)
Time: 26 Mins
Level Of Happiness With The Painting: Low - To - Moderate
Acrylic Colors:
Cadmium Yellow (Back ground)
Ultra Marine Blue (Water)
Titanium White (Water + Skies)
Royal Violet + Titanium White (Skies + Water)
Hooker's Green+ Lime Green (For Grassy Area)
Nutmeg Brown / Burnt Umber / Raw Siena ( For the boders of water logged area)
Black (For the trees)
Time: 26 Mins
Level Of Happiness With The Painting: Low - To - Moderate
Thursday, October 27, 2011
ఈ బొమ్మల తద్దినమేమిటి బాబూ మాకు?
ఈ బొమ్మల తద్దినమేమిటి బాబూ మాకు?
అవును - తమరి ప్రేతాత్మకు తృప్తిగా భోజనం పెడదామని బొమ్మలేస్కుని వచ్చా...
తద్దినం నాదా? నీదా?
అడిగావూ? ముందు బొమ్మలు జూడు...తర్వాత నీదా నాదా అర్థమవుతుంది...
స్ట్రెచ్చ్డ్ కాన్వాస్ మీద అక్రిలిక్స్ - అక్కడక్కడా తెల్లగా కనపడేది కెమెరా ఫ్లాష్ మూలాన ..అంతే కానీ, అసలు రంగు వేరే అక్కడ
ఆనందోబ్రహ్మ
అవును - తమరి ప్రేతాత్మకు తృప్తిగా భోజనం పెడదామని బొమ్మలేస్కుని వచ్చా...
తద్దినం నాదా? నీదా?
అడిగావూ? ముందు బొమ్మలు జూడు...తర్వాత నీదా నాదా అర్థమవుతుంది...
స్ట్రెచ్చ్డ్ కాన్వాస్ మీద అక్రిలిక్స్ - అక్కడక్కడా తెల్లగా కనపడేది కెమెరా ఫ్లాష్ మూలాన ..అంతే కానీ, అసలు రంగు వేరే అక్కడ
ఆనందోబ్రహ్మ
Labels:
acrylics,
stretched canvas,
అక్రిలిక్స్,
స్ట్రెచ్చ్డ్ కాన్వాస్
Wednesday, October 26, 2011
మీరు అప్పడాలోళ్లా? వొడియాలోళ్లా?
మీరు అప్పడాలోళ్లా? వొడియాలోళ్లా?
అదైనా, ఇదైనా, అటు ఇటూ కాక మధ్యస్త "వొడప్ప"లైనా, అసలు ఏదీ కాకపోయినా - ఇది సదూకోండి....
శ్రీ భోగరాజు నారాయణమూర్తిగారు వ్రాసిన "వొడియాలు" వ్యాసం ఇక్కడ చూడవచ్చు.....
వ్యాసం 1950 - లలిత పత్రికలో ప్రచురించబడింది...
మన్నడిగితే వంకాయ పచ్చిపులుసులోకి వొడియాలు తిననోడు, గోంగూర పప్పులోకి అప్పడాలు తిననోడు - మడిసే కాదని వీర విశ్వాసం - నిజంగానేనోయి పుడింగి - ఆ అప్పడాలు వొడియాల మీద ఒట్టు
భవదీయుడు
మాగంటి వంశి
అదైనా, ఇదైనా, అటు ఇటూ కాక మధ్యస్త "వొడప్ప"లైనా, అసలు ఏదీ కాకపోయినా - ఇది సదూకోండి....
శ్రీ భోగరాజు నారాయణమూర్తిగారు వ్రాసిన "వొడియాలు" వ్యాసం ఇక్కడ చూడవచ్చు.....
వ్యాసం 1950 - లలిత పత్రికలో ప్రచురించబడింది...
మన్నడిగితే వంకాయ పచ్చిపులుసులోకి వొడియాలు తిననోడు, గోంగూర పప్పులోకి అప్పడాలు తిననోడు - మడిసే కాదని వీర విశ్వాసం - నిజంగానేనోయి పుడింగి - ఆ అప్పడాలు వొడియాల మీద ఒట్టు
భవదీయుడు
మాగంటి వంశి
ఈ తత్వం చదివి మీకేమర్ధమయ్యిందో చెబుతే ఆ "కాశీ"లో"బట్ట"లుతుక్కున్నంత పుణ్యం లభిస్తుందని...
ఈ క్రింది తత్వం చదివి మీకేమర్ధమయ్యిందో చెబుతే ఆ "కాశీ"లో"బట్ట"లుతుక్కున్నంత పుణ్యం లభిస్తుందని పరమపిత, ఆకాశవాణి మరియు అశరీరవాణితో పలికించగా వినపడ్డ మాటలు మీ చెవిన వేస్తున్నా...
ఆ కాలంలోనూ తక్కువ లేదన్నమాట ఇలాటి రాతలకి.....
తత్త్వాలు
రచన:కాశీభట్ల కృష్ణరాయ శాస్త్రి
పత్రిక: లలిత (1950)
సదువు సదివీ చావనేటికి
సదువుకొంటే కీలుదొరకదు
బట్టబయలది బత్తుడా
విన్నారామాతత్వం
సదువు సదివే సదువు వింటే
సదువులెల్లా సదివినట్లే
తెలివిలో తెలివయ్యెరా
విన్నారామాతత్వం||
పుట్టజేసి గిట్టజేసీ
పొట్టనింపే దేవులుంటే
చోటిగాంచుర బత్తుడా
విన్నారామాతత్వం||
వట్టిమాటలు కట్టి పెట్టురా
గట్టివాడవు పొట్టుదంచకు
బట్టబయలది బత్తుడా
విన్నారామాతత్వం||
ఒక్కసారిగ హంసపట్టిర
ముక్కు మీదికి పోవనిస్తే
నిండినీవే యుందురా
విన్నారామాతత్వం||
దిక్కులన్ని ముక్కులోపల
ఒక్క మూలనె యణగి యుండుర
దిక్కు వేదననేలరా
విన్నారామాతత్వం||
చిన్నవాడని పెద్దవాడని
కన్నవాడని వున్నవాడని
భేదమెంచుట యేలరా
విన్నారామాతత్వం||
అన్నితానై తెలివియుండగ
యిన్నినీలో యెఱుకయుందగ
యెఱుకతో నీకేలరా
విన్నారామాతత్వం||
పాపమంటా పుణ్యమంటా
బాపనోళ్లంటారు గాని
పాప పుణ్యాలేటిరా
విన్నారామాతత్వం||
పాపిలో గల చిన్ని పాపను
సాపుగ చూస్తేనె చాలును
తిక్క మాటలింకేలరా
విన్నారామాతత్వం||
గురుడి మర్మము నరులకెల్లా
గురుతుగా సూపేటివాడు
పీరుసాయే బొక్కడే
విన్నారామాతత్వం||
పీరు సాయెబు కాడకేగితె
పీడ మాయలు వీడిపోతే
తెలివి యొక్కటి నిల్చురా
విన్నారామాతత్వం||
వేదమంతా వెర్రివారికి
పారు తెలిసే వారికంతా
నాదముంటే చాలదా
విన్నారామాతత్వం||
నాదకుండలి మీదికొస్తే
వాదమంతా చచ్చిపోదా
నాదముంటే చాలదా
విన్నారామాతత్వం||
నిన్ను నీవే చూచుకొంటూ
యెన్నిచేసిన దిగులులేదుర
యెఱుక కేమైతేమిరా
విన్నారామాతత్వం||
అన్నదొక్కటి కన్నదొక్కటి
విన్నదొక్కటి వున్నదొక్కటి
యింకనేమై తేమిరా
విన్నారామాతత్వం||
అన్నెమెఱుగదు పున్నెమెఱుగదు
జగము తెలియదు యుగము తెలియదు
దీనినెఱుగక యుందురా
విన్నారామాతత్వం||
అన్ని తానై తెలుసుకోదది
వున్నదొక్కటి శుద్ధ తెలివిర
తెలివి తెలయని దయ్యరా
విన్నారామాతత్వం||
కిందికుండలి మీదికుండలి
అందుకుండె పొందినటెలే
గురిడిమర్మము వింటిరా
విన్నారామాతత్వం||
పందమాటలు విన్నవానికి
అందరానిది శుద్ధతెలివా
బట్టబయలున బుట్టిరా
విన్నారామాతత్వం||
ఇట్టితత్వము లిట్టి గురువులు
బుట్లి సత్యము మూతమోసిరి
మేలుకోని వినుడన్నలూ
విన్నారామాతత్వం||
ఆ కాలంలోనూ తక్కువ లేదన్నమాట ఇలాటి రాతలకి.....
తత్త్వాలు
రచన:కాశీభట్ల కృష్ణరాయ శాస్త్రి
పత్రిక: లలిత (1950)
సదువు సదివీ చావనేటికి
సదువుకొంటే కీలుదొరకదు
బట్టబయలది బత్తుడా
విన్నారామాతత్వం
సదువు సదివే సదువు వింటే
సదువులెల్లా సదివినట్లే
తెలివిలో తెలివయ్యెరా
విన్నారామాతత్వం||
పుట్టజేసి గిట్టజేసీ
పొట్టనింపే దేవులుంటే
చోటిగాంచుర బత్తుడా
విన్నారామాతత్వం||
వట్టిమాటలు కట్టి పెట్టురా
గట్టివాడవు పొట్టుదంచకు
బట్టబయలది బత్తుడా
విన్నారామాతత్వం||
ఒక్కసారిగ హంసపట్టిర
ముక్కు మీదికి పోవనిస్తే
నిండినీవే యుందురా
విన్నారామాతత్వం||
దిక్కులన్ని ముక్కులోపల
ఒక్క మూలనె యణగి యుండుర
దిక్కు వేదననేలరా
విన్నారామాతత్వం||
చిన్నవాడని పెద్దవాడని
కన్నవాడని వున్నవాడని
భేదమెంచుట యేలరా
విన్నారామాతత్వం||
అన్నితానై తెలివియుండగ
యిన్నినీలో యెఱుకయుందగ
యెఱుకతో నీకేలరా
విన్నారామాతత్వం||
పాపమంటా పుణ్యమంటా
బాపనోళ్లంటారు గాని
పాప పుణ్యాలేటిరా
విన్నారామాతత్వం||
పాపిలో గల చిన్ని పాపను
సాపుగ చూస్తేనె చాలును
తిక్క మాటలింకేలరా
విన్నారామాతత్వం||
గురుడి మర్మము నరులకెల్లా
గురుతుగా సూపేటివాడు
పీరుసాయే బొక్కడే
విన్నారామాతత్వం||
పీరు సాయెబు కాడకేగితె
పీడ మాయలు వీడిపోతే
తెలివి యొక్కటి నిల్చురా
విన్నారామాతత్వం||
వేదమంతా వెర్రివారికి
పారు తెలిసే వారికంతా
నాదముంటే చాలదా
విన్నారామాతత్వం||
నాదకుండలి మీదికొస్తే
వాదమంతా చచ్చిపోదా
నాదముంటే చాలదా
విన్నారామాతత్వం||
నిన్ను నీవే చూచుకొంటూ
యెన్నిచేసిన దిగులులేదుర
యెఱుక కేమైతేమిరా
విన్నారామాతత్వం||
అన్నదొక్కటి కన్నదొక్కటి
విన్నదొక్కటి వున్నదొక్కటి
యింకనేమై తేమిరా
విన్నారామాతత్వం||
అన్నెమెఱుగదు పున్నెమెఱుగదు
జగము తెలియదు యుగము తెలియదు
దీనినెఱుగక యుందురా
విన్నారామాతత్వం||
అన్ని తానై తెలుసుకోదది
వున్నదొక్కటి శుద్ధ తెలివిర
తెలివి తెలయని దయ్యరా
విన్నారామాతత్వం||
కిందికుండలి మీదికుండలి
అందుకుండె పొందినటెలే
గురిడిమర్మము వింటిరా
విన్నారామాతత్వం||
పందమాటలు విన్నవానికి
అందరానిది శుద్ధతెలివా
బట్టబయలున బుట్టిరా
విన్నారామాతత్వం||
ఇట్టితత్వము లిట్టి గురువులు
బుట్లి సత్యము మూతమోసిరి
మేలుకోని వినుడన్నలూ
విన్నారామాతత్వం||
Tuesday, October 25, 2011
Monday, October 24, 2011
ఊగవే ఊగవే ఉయ్యాలో , ఊపందుకోవే ఉయ్యాలో!!
ఊగవే ఊగవే ఉయ్యాలో
ఊపందుకోవే ఉయ్యాలో
ఆ వాడ చూడవే ఉయ్యాలో
అందాల మేడలే ఉయ్యాలో
మేడ మిద్దెలోన ఉయ్యాలో
మేలిబంగారాలు ఉయ్యాలో
ఈపాడు వాడలో ఉయ్యాలో
ఈతాకు గుడిసెలే ఉయ్యాలో
ఓటి కుండలోన ఉయ్యాలో
పూట కూడే లేదు ఉయ్యాలో
ప్రజ లందరొక రీతి ఉయ్యాలో
బ్రతుకు నడపాలంటె ఉయ్యాలో
మేడలూ, గుడిసెలూ ఉయ్యాలో
తేడాలు పోవాలి ఉయ్యాలో
కలిమి లేములు రెండు ఉయ్యాలో
కట్టు గోడలె మనకు ఉయ్యాలో
అవి కూలినా మనకు ఉయ్యాలో
ఆనందమే సొమ్ము ఉయ్యాలో
నిర్మాణమార్గాలు ఉయ్యాలో
నిలిపి గాంధీ తాత ఉయ్యాలో
దేశానికొక దారి ఉయ్యాలో
తీర్చిదిద్ది వెళ్ళె ఉయ్యాలో
సూత్రంబు పదమూడు ఉయ్యాలో
సూటి బాటను చూపి ఉయ్యాలో
ఫలితాన్ని సాధింప ఉయ్యాలో
కలిసి పొమ్మనె తాత ఉయ్యాలో
మేడ గుడిసెల్ మధ్య ఉయ్యాలో
మేలైన రాదారి ఉయ్యాలో
సూత్రంబు పదమూడె ఉయ్యాలో
సూటి తప్పక సొమ్ము ఉయ్యాలో
***********************
oogavae oogavae uyyaalO
oopaMdukOvae uyyaalO
aa vaaDa chooDavae uyyaalO
aMdaala maeDalae uyyaalO
maeDa middelOna uyyaalO
maelibaMgaaraalu uyyaalO
eepaaDu vaaDalO uyyaalO
eetaaku guDiselae uyyaalO
OTi kuMDalOna uyyaalO
pooTa kooDae laedu uyyaalO
praja laMdaroka reeti uyyaalO
bratuku naDapaalaMTe uyyaalO
maeDaloo, guDiseloo uyyaalO
taeDaalu pOvaali uyyaalO
kalimi laemulu reMDu uyyaalO
kaTTu gODale manaku uyyaalO
avi koolinaa manaku uyyaalO
aanaMdamae sommu uyyaalO
nirmaaNamaargaalu uyyaalO
nilipi gaaMdhee taata uyyaalO
daeSaanikoka daari uyyaalO
teerchididdi veLLe uyyaalO
sootraMbu padamooDu uyyaalO
sooTi baaTanu choopi uyyaalO
phalitaanni saadhiMpa uyyaalO
kalisi pommane taata uyyaalO
maeDa guDisel^ madhya uyyaalO
maelaina raadaari uyyaalO
sootraMbu padamooDe uyyaalO
sooTi tappaka sommu uyyaalO
ఊపందుకోవే ఉయ్యాలో
ఆ వాడ చూడవే ఉయ్యాలో
అందాల మేడలే ఉయ్యాలో
మేడ మిద్దెలోన ఉయ్యాలో
మేలిబంగారాలు ఉయ్యాలో
ఈపాడు వాడలో ఉయ్యాలో
ఈతాకు గుడిసెలే ఉయ్యాలో
ఓటి కుండలోన ఉయ్యాలో
పూట కూడే లేదు ఉయ్యాలో
ప్రజ లందరొక రీతి ఉయ్యాలో
బ్రతుకు నడపాలంటె ఉయ్యాలో
మేడలూ, గుడిసెలూ ఉయ్యాలో
తేడాలు పోవాలి ఉయ్యాలో
కలిమి లేములు రెండు ఉయ్యాలో
కట్టు గోడలె మనకు ఉయ్యాలో
అవి కూలినా మనకు ఉయ్యాలో
ఆనందమే సొమ్ము ఉయ్యాలో
నిర్మాణమార్గాలు ఉయ్యాలో
నిలిపి గాంధీ తాత ఉయ్యాలో
దేశానికొక దారి ఉయ్యాలో
తీర్చిదిద్ది వెళ్ళె ఉయ్యాలో
సూత్రంబు పదమూడు ఉయ్యాలో
సూటి బాటను చూపి ఉయ్యాలో
ఫలితాన్ని సాధింప ఉయ్యాలో
కలిసి పొమ్మనె తాత ఉయ్యాలో
మేడ గుడిసెల్ మధ్య ఉయ్యాలో
మేలైన రాదారి ఉయ్యాలో
సూత్రంబు పదమూడె ఉయ్యాలో
సూటి తప్పక సొమ్ము ఉయ్యాలో
***********************
oogavae oogavae uyyaalO
oopaMdukOvae uyyaalO
aa vaaDa chooDavae uyyaalO
aMdaala maeDalae uyyaalO
maeDa middelOna uyyaalO
maelibaMgaaraalu uyyaalO
eepaaDu vaaDalO uyyaalO
eetaaku guDiselae uyyaalO
OTi kuMDalOna uyyaalO
pooTa kooDae laedu uyyaalO
praja laMdaroka reeti uyyaalO
bratuku naDapaalaMTe uyyaalO
maeDaloo, guDiseloo uyyaalO
taeDaalu pOvaali uyyaalO
kalimi laemulu reMDu uyyaalO
kaTTu gODale manaku uyyaalO
avi koolinaa manaku uyyaalO
aanaMdamae sommu uyyaalO
nirmaaNamaargaalu uyyaalO
nilipi gaaMdhee taata uyyaalO
daeSaanikoka daari uyyaalO
teerchididdi veLLe uyyaalO
sootraMbu padamooDu uyyaalO
sooTi baaTanu choopi uyyaalO
phalitaanni saadhiMpa uyyaalO
kalisi pommane taata uyyaalO
maeDa guDisel^ madhya uyyaalO
maelaina raadaari uyyaalO
sootraMbu padamooDe uyyaalO
sooTi tappaka sommu uyyaalO
Labels:
ఊగవే ఊగవే ఉయ్యాలో
శ్రీ మల్లాది విశ్వనాథ కవిరాజు గారి నాటకం - "దొంగాటకం" - పూర్తి పాఠం
శ్రీ మల్లాది విశ్వనాథ కవిరాజు గారి నాటకం "దొంగాటకం" పూర్తి పాఠం ఈ క్రింద చూడవచ్చు......
వీరిదే - "నాటికి నేడు" రేడియో నాటకం, డాక్టర్ కె.బి.గోపాలం గారి సౌజన్యంతో వెబ్సైటులో ఆకాశవాణి కార్యక్రమాలు --> నాటికలు సెక్షన్లో పబ్లిష్ చెయ్యటం జరిగింది...
కడప ఆకాశవాణి కేంద్రం వారు ఈ దొంగాటకం" నాటకాన్ని 1983లో మూడు భాగాలుగా, వరుస ఆదివారాలలో ప్రసారం చేశారని తెలియవచ్చింది....ఎవరివద్దనైనా ఆ ఆడియోలు ఉంటే దయచేసి పంచుకోండి...
ఇలాటి అపురూపమైన ఆడియోల విషయంలో ఎనలేని సాయం చేసిన గురుతుల్యులు డాక్టర్ కె.బి.గోపాలంగారికీ, ఆప్తమిత్రులు పరుచూరి శ్రీనివాస్ గారికి సహస్రాధికంగా - హృదయపూర్వక కృతజ్ఞతలతో....
ఇక్కడ ఒక విషయం చెప్పాలండి - మోటుగా చెపుతున్నాని అనుకోవద్దండి, ఎందుకంటే అప్పటికనిపించింది అనెయ్యటం అలవాటున్న మనిషిని కాబట్టి - ముందు ఒకటో రెండో "ఆడియోలిచ్చి", ఆ తర్వాత "పోజులిచ్చి" - అబ్బో ఆయన సైటుకి ఇంత సాయం చేసాను, అంత సాయం చేసాను, ఆయనొక్కడే పని చెయ్యలేదు దాని మీద - అని వేరేవారి దగ్గర సంత మాటలు మాట్లాడేవాళ్ళు ఆడియోలు తమ దగ్గరే దాచుకోవచ్చు.....ఇష్టం లేకపోతే నాతోనే డైరెక్టుగా చెప్పెయ్యొచ్చు కూడా....నాతోనే చెబితే ఆ ఆడియోలు, ఇచ్చిన మెటీరియలు తీసేస్తాను....
"దొంగాటకం" పూర్తి పాఠం ఎక్కడ చదవచ్చా?
ఇక్కడ....
ఈ నాటకం - 1976 తెలుగువాణి పత్రిక (వాల్యూం 1, నంబర్ 3, సెప్టెంబర్ 15వ తారీకు సంచిక) లో ప్రచురితం
కాపీరైటు హక్కుల ఉల్లంఘన ఉద్దేశమేదీ లేదని సవినయంగా విన్నవించుకుంటూ....
భవదీయుడు
వంశీ
*************************************************************************
SrI mallAdi viSwanAtha kavirAju gAri nATakam "dongATakam" pUrti pATham ee krinda cUDavaccu......veeridE nATiki nEDu rEDiyO nATakam, DaakTar ke.bi.gOpaalam gAri saujanyamtO websaiTulO aakaaSavaaNi kAryakramAlu --> nATikalu sekshanlO pablish ceyyaTam jarigindi...
ee nATakam - 1976 teluguvANi patrika (vAlyUm 1, nambar 3, sepTembar 15va tArIku sancika) lO pracuritam
bhavadeeyuDu
vamSI
వీరిదే - "నాటికి నేడు" రేడియో నాటకం, డాక్టర్ కె.బి.గోపాలం గారి సౌజన్యంతో వెబ్సైటులో ఆకాశవాణి కార్యక్రమాలు --> నాటికలు సెక్షన్లో పబ్లిష్ చెయ్యటం జరిగింది...
కడప ఆకాశవాణి కేంద్రం వారు ఈ దొంగాటకం" నాటకాన్ని 1983లో మూడు భాగాలుగా, వరుస ఆదివారాలలో ప్రసారం చేశారని తెలియవచ్చింది....ఎవరివద్దనైనా ఆ ఆడియోలు ఉంటే దయచేసి పంచుకోండి...
ఇలాటి అపురూపమైన ఆడియోల విషయంలో ఎనలేని సాయం చేసిన గురుతుల్యులు డాక్టర్ కె.బి.గోపాలంగారికీ, ఆప్తమిత్రులు పరుచూరి శ్రీనివాస్ గారికి సహస్రాధికంగా - హృదయపూర్వక కృతజ్ఞతలతో....
ఇక్కడ ఒక విషయం చెప్పాలండి - మోటుగా చెపుతున్నాని అనుకోవద్దండి, ఎందుకంటే అప్పటికనిపించింది అనెయ్యటం అలవాటున్న మనిషిని కాబట్టి - ముందు ఒకటో రెండో "ఆడియోలిచ్చి", ఆ తర్వాత "పోజులిచ్చి" - అబ్బో ఆయన సైటుకి ఇంత సాయం చేసాను, అంత సాయం చేసాను, ఆయనొక్కడే పని చెయ్యలేదు దాని మీద - అని వేరేవారి దగ్గర సంత మాటలు మాట్లాడేవాళ్ళు ఆడియోలు తమ దగ్గరే దాచుకోవచ్చు.....ఇష్టం లేకపోతే నాతోనే డైరెక్టుగా చెప్పెయ్యొచ్చు కూడా....నాతోనే చెబితే ఆ ఆడియోలు, ఇచ్చిన మెటీరియలు తీసేస్తాను....
"దొంగాటకం" పూర్తి పాఠం ఎక్కడ చదవచ్చా?
ఇక్కడ....
ఈ నాటకం - 1976 తెలుగువాణి పత్రిక (వాల్యూం 1, నంబర్ 3, సెప్టెంబర్ 15వ తారీకు సంచిక) లో ప్రచురితం
కాపీరైటు హక్కుల ఉల్లంఘన ఉద్దేశమేదీ లేదని సవినయంగా విన్నవించుకుంటూ....
భవదీయుడు
వంశీ
*************************************************************************
SrI mallAdi viSwanAtha kavirAju gAri nATakam "dongATakam" pUrti pATham ee krinda cUDavaccu......veeridE nATiki nEDu rEDiyO nATakam, DaakTar ke.bi.gOpaalam gAri saujanyamtO websaiTulO aakaaSavaaNi kAryakramAlu --> nATikalu sekshanlO pablish ceyyaTam jarigindi...
ee nATakam - 1976 teluguvANi patrika (vAlyUm 1, nambar 3, sepTembar 15va tArIku sancika) lO pracuritam
bhavadeeyuDu
vamSI
Labels:
దొంగాటకం,
నాటికి నేడు,
శ్రీ మల్లాది విశ్వనాథ కవిరాజు
"నా రచనలు దొంగిలిస్తున్న శిష్యబ్రువులు" - శ్రీ పుట్టపర్తి నారాయణచార్యులు
"నా రచనలు దొంగిలిస్తున్న శిష్యబ్రువులు" - శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యులు
1960 - తెలుగు సంక్రాంతి అనే పత్రికకు గౌరవ సంపాదకత్వం వహించి ఆ పత్రికలో - "కొంతమంది శిష్యులు తన రచనలు దొంగిలించి తమ పేరు వేసుకుని చలామణి చేస్తున్నారని" ప్రకటించిన శ్రీమాన్ పుట్టపర్తి వారు - ఆ రచనలు, చాటువులు తామే అందరికీ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేసారు....
సరస్వతీపుత్రులకే తప్పలేదన్న మాట ఈ బాధలు....ఆ దొంగలెవరో కూడా ఆ పత్రికా ముఖాన చెప్పేసుంటే పోయేది...ఎందుకనుకున్నారో ఏమో...
ఎక్కడ చదవచ్చా?
ఇక్కడ....
భవదీయుడు
వంశి
1960 - తెలుగు సంక్రాంతి అనే పత్రికకు గౌరవ సంపాదకత్వం వహించి ఆ పత్రికలో - "కొంతమంది శిష్యులు తన రచనలు దొంగిలించి తమ పేరు వేసుకుని చలామణి చేస్తున్నారని" ప్రకటించిన శ్రీమాన్ పుట్టపర్తి వారు - ఆ రచనలు, చాటువులు తామే అందరికీ అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేసారు....
సరస్వతీపుత్రులకే తప్పలేదన్న మాట ఈ బాధలు....ఆ దొంగలెవరో కూడా ఆ పత్రికా ముఖాన చెప్పేసుంటే పోయేది...ఎందుకనుకున్నారో ఏమో...
ఎక్కడ చదవచ్చా?
ఇక్కడ....
భవదీయుడు
వంశి
పేరు ప్రతిష్టలు బట్టి దగ్గర జేరేవాణ్ణి. కాని వారి ప్రవర్తన, వారి మాటలు బెడిసికొట్టేవి - శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు
నేను దర్శించిన పెద్దలు
----శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు
పుట్టపర్తి వారి అభినందన సంచిక నుండి
(3-5-1977 - కడప వివేకానంద ఆడిటోరియంలో జరిగిన అభినందన సభ)
"తెనుగుదేశంలో నన్నాకర్షించినవారు తక్కువ. వారి పేరు ప్రతిష్టలు బట్టి దగ్గర జేరేవాణ్ణి. కాని వారి ప్రవర్తన, వారి మాటలు బెడిసికొట్టేవి" - అని నిర్భయంగా చెప్పిన ఆ మహామహుడికి, సరస్వతీపుత్రుడికీ నమస్సులతో!
నిర్భయంగానే చెప్పినా - చివరివరకూ చదివితే కాని విషయం అర్థం కాదబ్బాయి
ఎక్కడ చదవొచ్చా?
ఇక్కడా
భవదీయుడు
వంశి
----శ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు
పుట్టపర్తి వారి అభినందన సంచిక నుండి
(3-5-1977 - కడప వివేకానంద ఆడిటోరియంలో జరిగిన అభినందన సభ)
"తెనుగుదేశంలో నన్నాకర్షించినవారు తక్కువ. వారి పేరు ప్రతిష్టలు బట్టి దగ్గర జేరేవాణ్ణి. కాని వారి ప్రవర్తన, వారి మాటలు బెడిసికొట్టేవి" - అని నిర్భయంగా చెప్పిన ఆ మహామహుడికి, సరస్వతీపుత్రుడికీ నమస్సులతో!
నిర్భయంగానే చెప్పినా - చివరివరకూ చదివితే కాని విషయం అర్థం కాదబ్బాయి
ఎక్కడ చదవొచ్చా?
ఇక్కడా
భవదీయుడు
వంశి
Labels:
కడప,
పుట్టపర్తి
Sunday, October 23, 2011
ఆకాశవాణిలో పింగళి వారి వాణి
ఆకాశవాణిలో పింగళి వారి వాణి
శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు గారి ఆచార్య పింగళి లక్ష్మీకాంతం గారి గురించి చెప్పిన మాటలు - సంస్మరణ సంచిక నుండి.
ఎక్కడ చదవొచ్చా?
ఇక్కడా
ఆచార్య పింగళి వారంటే అన్నిటికన్నా ముందు భారత యుద్ధ వ్యూహాలే గుర్తుకొస్తాయి నాకు....చక్కగా విడమరచి చెప్పిన ఆచార్యుల వారికి నమోన్నమహలతో
భవదీయుడు
వంశి
శ్రీ బాలాంత్రపు రజనీకాంతరావు గారి ఆచార్య పింగళి లక్ష్మీకాంతం గారి గురించి చెప్పిన మాటలు - సంస్మరణ సంచిక నుండి.
ఎక్కడ చదవొచ్చా?
ఇక్కడా
ఆచార్య పింగళి వారంటే అన్నిటికన్నా ముందు భారత యుద్ధ వ్యూహాలే గుర్తుకొస్తాయి నాకు....చక్కగా విడమరచి చెప్పిన ఆచార్యుల వారికి నమోన్నమహలతో
భవదీయుడు
వంశి
ఆకాశవాణి ప్రసారిక - శ్రీ వింజమూరు శివరామరావు - కృష్ణవేణి మణిమేఖల
ఆకాశవాణి ప్రసారిక - (1958) లో శ్రీ వింజమూరు శివరామరావు గారు వ్రాసిన "కృష్ణవేణి మణిమేఖల" పాఠం ఇక్కడ చూడవచ్చు
Saturday, October 22, 2011
చందమామలో - ఆలూరి బైరాగి బాల గీతాలు....
చందమామలో ఆలూరి బైరాగి బాల గీతాలు....
స్నేహ ధర్మం
అనగనగా మరి, ఒక ఊళ్ళో
ఉన్నారిద్దరు కుర్రాళ్ళూ
దిక్కులేని వారిద్దరునూ
ముక్కుపచ్చలారని వాళ్ళూ.
కొంపాగోడు లేదేమీ,
పూటకూటికే గతిలేదు
చిరిగిన, మరక ఉడుపులకూ
మసిగుడ్డయినా సరిరాదు.
ఏదిదొరికితే అది తింటూ
ఆకలి తీర్చుకొనేవాళ్ళు
రోడ్డు ప్రక్కనే పంపుంటే
దప్పిక ఆర్చుకునేవాళ్ళు
వాన విసురుగా ముసురొస్తే
ఏపంచో వెదికే వాళ్ళు
వేసవికాలపు రాత్రిళ్ళూ
ఆరుబైట గడిపేవాళ్ళు
వారిని చూచిన వారంతా
అన్నదమ్ము లనుకొన్నారు
కాని వాస్తవంగా వారు
చుట్టా లెట్లాగూ కారు
చుట్టరికంగా దారిద్ర్యం
వారిని దగ్గర చేసింది
స్నేహం ఉచ్చులుగా పన్నీ
కాళ్ళకు బంధాలేసింది
చలికాలం ఒకరోజు ఉదయం
వారాకలిగా లేచారు
ఎక్కడ ఏం దొరుకుతుందా
అని చుట్టూ కలజూచారు
రోడ్డు వెంబడే పోతుంటే
నారింజొక్కటి దొరికింది
పెద్దవాడు పరుగెత్తాడు
కాయకేసి చెయ్యురికింది
దానిని తీసుక ఆత్రంగా
తోలు ఒలిచి తినబోయాడు
కాని అంతలో ఇంకొకడూ
ఉన్నాడని గుర్తించాడు
చిన్నవాడనీ దయదలచి
కాయ అతనికే ఇచ్చాడు
అయ్యో తొందరపడ్డానే
అని మనసున కడు నొచ్చాడు
చిన్నవాడు సగపాలు గొని
సగమాతనికే ఇచ్చాడు
ఇద్దరి ఆకలి తీరేట్టు
న్యాయంగా సరిపుచ్చాడు
ఇతరులు నీయెడ ఏ విధిగా
వర్తించా లనుకొంటావో
నీవు వారి యెడ అట్లాగే
వర్తించాలని అనుకోవాలి
వేటగాని సాహసం
ఒక కారడవిని
వేటగాడు ఒకడుండేవాడు
తప్పదతని గురి
ఎంతో నేర్పరి ఆ విలుకాడు
బాలు డనాధుడు
ఒక డతనికి తోడుగ ఉన్నాడు
నీడవలే ఆ
వేటగాణ్ణి వెన్నాడేవాడు
వేటగాని గురి
చూచి ముగ్ధుడై ఆ పిల్లాడు
ఆనందంతో
కేరి చప్పటులు చరిచేవాడు
క్రూర మృగాలను
చూచి కొంచెమైనా భయపడడు
వేటగానిలా
ఓరిమిగలవాడా బాలకుడు
వారిద్దరునూ
ఒకరోజున వేటకు వెళ్ళారు
ఎలుగు బంటులను
రెంటి నొక్క చోటున చూచారు
వీరిని గని ఆ
మృగాలొక్క అదటున ఉరికాయి
అరణ్యమంతా
దద్దరిల్లిపోయే ట్టరిచాయి
ఒక భల్లూకం
వేటగాని మీదకు ఉరికింది
రెండవదానికి
బాలునివైపు కదను దొరికింది
దురదృష్టమది
అతనివద్ద అమ్మొక్కటే ఉంది
ఏం చేయటం
కడకతనికి ఒకటే తోచింది
ఆ బాణంతో
బాలునిపై కురికే జంతువునూ
కూల్చి కాచుకొని
నిలుచున్నాడు, కదలడెంతకునూ
మీది మీది కా
ఎలుగుబంటి తిన్నగ వస్తున్నది
వేటగాడు కను
లార్పడు ఎరుగడసలు భయమన్నది
కొంచెం సేపా
ఎలుగుబంటి నిలుచుందొకలాగే
వెళ్ళిపోయినది
వచ్చిన త్రోవను తిరిగి అలాగే
సాహస ముంటే
చాలు, మనిషి కెన్నడు ముప్పుండదు
ఇతరుల కోసం
సాహసించినా ఏ తప్పుండదు
కలవారి అబ్బాయి
కలవారి అబ్బాయి రాముడను వాడు
పండుగకు క్రొత్త ఉడుపులు తొడిగినాడు
తళ తళ మెరిసేటి పట్టు చొక్కాయి
పట్టులాగూ చూచి మురిసె నబ్బాయి
సరిక్రొత్త చొక్కాయి తొడగిన నాడు
ఇంటిలో కూర్చుంటే ఎవడు చూస్తాడు
అని మనసులో రాముడూహించినాడు
ఆడుకొంటానమ్మ బయట నన్నాడు
అమ్మ అన్నది ' బయటికెళ్ళ కబ్బాయి
క్రొత్తబట్టలు నీవి మాసిపోతాయి
బయట కెళ్ళావంటె జాగ్రత్త నీవు
బూచులుంటవి, ఇంక తిరిగిరానీవు
కాని ఆ అబ్బాయి మాట వింటాడా?
అందులోనూ క్రొత్త బట్టలేశాడా
తుదకు మనసును పట్టలేక పొయ్యాడు
గుట్టుచప్పుడు గాను బయటకెళ్ళాడు
బయట ఒక కుర్రాడు ఎదురువచ్చాడు
వెర్రి బాగులవాడు, కడుపేదవాడు
చింకి బట్టలవాడు, జిబ్బి తలవాడు
ఒంటిపై దళసరిగ దుమ్మున్నవాడు
రాము డతనిని ఏవగించుకున్నాడు
చీదరించుక త్రోవ తొలగిపొయ్యాడు
కాని కాలొక అరటి తొక్కపై వేసి
పడి, చూడసాగాడు ఆకసం కేసి
తల చెరగి పోయి, వలువలు మాసిపోయి
మురుగు కాలవనీట మరకలైపోయి
కలవారి అబ్బాయి బావురన్నాడు
పేదపిల్ల డతణ్ణి లేవదీశాడు
చేయూత ఇచ్చాడు, దుమ్ము దులిపాడు
ప్రేమతో తలనిమిరి బుజ్జగించాడు
భయపడకు పాపమని ఊరడించాడు
ఇంటివరకూ తాను సాగనంపాడు
రాముడింటికి వచ్చి భోరుమన్నాడు
జరిగింది తల్లితో చెప్పి వేశాడు
అతడు దాచక నిజం చెప్పటం వల్ల
పల్లెత్తుమాటైన అనలేదు తల్లి
రాము డారాత్రి ఒక కలగాంచినాడు
మరల ఎదురయ్యాడు పేదపిల్లాడు
కాని అతనిని చూచి రాము డీసారి
ఏవగించుక తొలగిపోలేదు దారి
స్నేహ ధర్మం
అనగనగా మరి, ఒక ఊళ్ళో
ఉన్నారిద్దరు కుర్రాళ్ళూ
దిక్కులేని వారిద్దరునూ
ముక్కుపచ్చలారని వాళ్ళూ.
కొంపాగోడు లేదేమీ,
పూటకూటికే గతిలేదు
చిరిగిన, మరక ఉడుపులకూ
మసిగుడ్డయినా సరిరాదు.
ఏదిదొరికితే అది తింటూ
ఆకలి తీర్చుకొనేవాళ్ళు
రోడ్డు ప్రక్కనే పంపుంటే
దప్పిక ఆర్చుకునేవాళ్ళు
వాన విసురుగా ముసురొస్తే
ఏపంచో వెదికే వాళ్ళు
వేసవికాలపు రాత్రిళ్ళూ
ఆరుబైట గడిపేవాళ్ళు
వారిని చూచిన వారంతా
అన్నదమ్ము లనుకొన్నారు
కాని వాస్తవంగా వారు
చుట్టా లెట్లాగూ కారు
చుట్టరికంగా దారిద్ర్యం
వారిని దగ్గర చేసింది
స్నేహం ఉచ్చులుగా పన్నీ
కాళ్ళకు బంధాలేసింది
చలికాలం ఒకరోజు ఉదయం
వారాకలిగా లేచారు
ఎక్కడ ఏం దొరుకుతుందా
అని చుట్టూ కలజూచారు
రోడ్డు వెంబడే పోతుంటే
నారింజొక్కటి దొరికింది
పెద్దవాడు పరుగెత్తాడు
కాయకేసి చెయ్యురికింది
దానిని తీసుక ఆత్రంగా
తోలు ఒలిచి తినబోయాడు
కాని అంతలో ఇంకొకడూ
ఉన్నాడని గుర్తించాడు
చిన్నవాడనీ దయదలచి
కాయ అతనికే ఇచ్చాడు
అయ్యో తొందరపడ్డానే
అని మనసున కడు నొచ్చాడు
చిన్నవాడు సగపాలు గొని
సగమాతనికే ఇచ్చాడు
ఇద్దరి ఆకలి తీరేట్టు
న్యాయంగా సరిపుచ్చాడు
ఇతరులు నీయెడ ఏ విధిగా
వర్తించా లనుకొంటావో
నీవు వారి యెడ అట్లాగే
వర్తించాలని అనుకోవాలి
ఒక కారడవిని
వేటగాడు ఒకడుండేవాడు
తప్పదతని గురి
ఎంతో నేర్పరి ఆ విలుకాడు
బాలు డనాధుడు
ఒక డతనికి తోడుగ ఉన్నాడు
నీడవలే ఆ
వేటగాణ్ణి వెన్నాడేవాడు
వేటగాని గురి
చూచి ముగ్ధుడై ఆ పిల్లాడు
ఆనందంతో
కేరి చప్పటులు చరిచేవాడు
క్రూర మృగాలను
చూచి కొంచెమైనా భయపడడు
వేటగానిలా
ఓరిమిగలవాడా బాలకుడు
వారిద్దరునూ
ఒకరోజున వేటకు వెళ్ళారు
ఎలుగు బంటులను
రెంటి నొక్క చోటున చూచారు
వీరిని గని ఆ
మృగాలొక్క అదటున ఉరికాయి
అరణ్యమంతా
దద్దరిల్లిపోయే ట్టరిచాయి
ఒక భల్లూకం
వేటగాని మీదకు ఉరికింది
రెండవదానికి
బాలునివైపు కదను దొరికింది
దురదృష్టమది
అతనివద్ద అమ్మొక్కటే ఉంది
ఏం చేయటం
కడకతనికి ఒకటే తోచింది
ఆ బాణంతో
బాలునిపై కురికే జంతువునూ
కూల్చి కాచుకొని
నిలుచున్నాడు, కదలడెంతకునూ
మీది మీది కా
ఎలుగుబంటి తిన్నగ వస్తున్నది
వేటగాడు కను
లార్పడు ఎరుగడసలు భయమన్నది
కొంచెం సేపా
ఎలుగుబంటి నిలుచుందొకలాగే
వెళ్ళిపోయినది
వచ్చిన త్రోవను తిరిగి అలాగే
సాహస ముంటే
చాలు, మనిషి కెన్నడు ముప్పుండదు
ఇతరుల కోసం
సాహసించినా ఏ తప్పుండదు
కలవారి అబ్బాయి
కలవారి అబ్బాయి రాముడను వాడు
పండుగకు క్రొత్త ఉడుపులు తొడిగినాడు
తళ తళ మెరిసేటి పట్టు చొక్కాయి
పట్టులాగూ చూచి మురిసె నబ్బాయి
సరిక్రొత్త చొక్కాయి తొడగిన నాడు
ఇంటిలో కూర్చుంటే ఎవడు చూస్తాడు
అని మనసులో రాముడూహించినాడు
ఆడుకొంటానమ్మ బయట నన్నాడు
అమ్మ అన్నది ' బయటికెళ్ళ కబ్బాయి
క్రొత్తబట్టలు నీవి మాసిపోతాయి
బయట కెళ్ళావంటె జాగ్రత్త నీవు
బూచులుంటవి, ఇంక తిరిగిరానీవు
కాని ఆ అబ్బాయి మాట వింటాడా?
అందులోనూ క్రొత్త బట్టలేశాడా
తుదకు మనసును పట్టలేక పొయ్యాడు
గుట్టుచప్పుడు గాను బయటకెళ్ళాడు
బయట ఒక కుర్రాడు ఎదురువచ్చాడు
వెర్రి బాగులవాడు, కడుపేదవాడు
చింకి బట్టలవాడు, జిబ్బి తలవాడు
ఒంటిపై దళసరిగ దుమ్మున్నవాడు
రాము డతనిని ఏవగించుకున్నాడు
చీదరించుక త్రోవ తొలగిపొయ్యాడు
కాని కాలొక అరటి తొక్కపై వేసి
పడి, చూడసాగాడు ఆకసం కేసి
తల చెరగి పోయి, వలువలు మాసిపోయి
మురుగు కాలవనీట మరకలైపోయి
కలవారి అబ్బాయి బావురన్నాడు
పేదపిల్ల డతణ్ణి లేవదీశాడు
చేయూత ఇచ్చాడు, దుమ్ము దులిపాడు
ప్రేమతో తలనిమిరి బుజ్జగించాడు
భయపడకు పాపమని ఊరడించాడు
ఇంటివరకూ తాను సాగనంపాడు
రాముడింటికి వచ్చి భోరుమన్నాడు
జరిగింది తల్లితో చెప్పి వేశాడు
అతడు దాచక నిజం చెప్పటం వల్ల
పల్లెత్తుమాటైన అనలేదు తల్లి
రాము డారాత్రి ఒక కలగాంచినాడు
మరల ఎదురయ్యాడు పేదపిల్లాడు
కాని అతనిని చూచి రాము డీసారి
ఏవగించుక తొలగిపోలేదు దారి
Labels:
ఆలూరి బైరాగి,
చందమామ,
బాల గీతాలు
శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి సంస్మరణ సంచికలో!!!
శ్రీ శ్రీ - శ్రీ మల్లాది రామకృష్ణశాస్త్రి గారి గురించి చెప్పిన మాటలు....
శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి సంస్మరణ సంచికలో ప్రచురితం - ఆనందవాణి - ఆరుద్ర గారి సమర్పణలో
శ్రీ మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి సంస్మరణ సంచికలో ప్రచురితం - ఆనందవాణి - ఆరుద్ర గారి సమర్పణలో
Labels:
మల్లాది రామకృష్ణశాస్త్రి,
శ్రీ శ్రీ
ఆలూరి బైరాగి గీతానికి శ్రీ శ్రీ ఆంగ్లానువాదం చదివి నోటిమాట లేకుండా మ్రాన్పడిపోయా!
"నాకు కొంచెం నమ్మకమివ్వు" - ఆలూరి బైరాగి గీతానికి శ్రీ శ్రీ ఆంగ్లానువాదం
(ఆలూరి బైరాగి సంస్మరణ సంచిక 1979)
అనువాదం చదివి, గగుర్పాటు చెంది, అలా నోటిమాట లేకుండా మ్రాన్పడిపోయా!
బైరాగి ఒకందుకు కారుణజన్ముడైతే, ఈయన ఇంకొకందుకు కారణజన్ముడని - ఈ మనిషి నిజంగా కారణజన్ముడే అని మరోసారి - మరోసారి తెలుసుకున్నా....
Grant me a grain of faith
And I'll pulverize the hills
And throw out the tomato sun
and the pancake moon
And make a clean sweep of the sky
I'll crush the universe in my arms
And wipe out the destiny of destitute man
With a single stroke of my pen
And neck out injustice and iniquity
from the mighty mansion of life
And a lot more I'll do
But grant me a grain of faith
Then I'll challenge Time
Balance myself, head downwards
on the pin-point of Siva's trident
And make every home a flower garden
and the heavenly park an orchard
of ambrosial fruits
I'll scare the crows away with my toy gun
And fill up the wells with the world's rubbish
and dig up new water tanks
Beneath the canopy of the sky
I'll set up new drinking places
with thirst quenching mirages
of my invention
When the tavern of the world is over crowded
I'll build another by its side
Tearing the indigo coloured cloth of the sky
I'll stich shirts for all the bare backed poor
I'll do anything anything
Only do grant me a grain of faith
For the faithless being is an empty cigarette tin
The faithless heart is an empty box of matches
The faithless life is burnt out cigarette ash
One may have everything everything
but life is nothing without faith
So grant me faith faith faith faith
(ఆలూరి బైరాగి సంస్మరణ సంచిక 1979)
అనువాదం చదివి, గగుర్పాటు చెంది, అలా నోటిమాట లేకుండా మ్రాన్పడిపోయా!
బైరాగి ఒకందుకు కారుణజన్ముడైతే, ఈయన ఇంకొకందుకు కారణజన్ముడని - ఈ మనిషి నిజంగా కారణజన్ముడే అని మరోసారి - మరోసారి తెలుసుకున్నా....
Grant me a grain of faith
And I'll pulverize the hills
And throw out the tomato sun
and the pancake moon
And make a clean sweep of the sky
I'll crush the universe in my arms
And wipe out the destiny of destitute man
With a single stroke of my pen
And neck out injustice and iniquity
from the mighty mansion of life
And a lot more I'll do
But grant me a grain of faith
Then I'll challenge Time
Balance myself, head downwards
on the pin-point of Siva's trident
And make every home a flower garden
and the heavenly park an orchard
of ambrosial fruits
I'll scare the crows away with my toy gun
And fill up the wells with the world's rubbish
and dig up new water tanks
Beneath the canopy of the sky
I'll set up new drinking places
with thirst quenching mirages
of my invention
When the tavern of the world is over crowded
I'll build another by its side
Tearing the indigo coloured cloth of the sky
I'll stich shirts for all the bare backed poor
I'll do anything anything
Only do grant me a grain of faith
For the faithless being is an empty cigarette tin
The faithless heart is an empty box of matches
The faithless life is burnt out cigarette ash
One may have everything everything
but life is nothing without faith
So grant me faith faith faith faith
Labels:
ఆలూరి బైరాగి
"కొండగాలి తిరిగింది" పాటకు ప్రేరణ ఓ బుడ్డోడి బూతు పాట - ఆరుద్ర
"కొండగాలి తిరిగింది" పాటకు ప్రేరణ ఓ బుడ్డోడి బూతు పాట - ఆరుద్ర
పెండ్యాల నాగేశ్వర రావు గారి చలనచిత్ర జీవిత రజతోత్సవ సంచికలో ప్రచురితం
అదండీ - అలాటి బూతు పాట ఆరుద్రగారి చేతిలో హొయలు పోతూ ఎంత సుందరంగా రూపుదిద్దుకుందో - ఆశ్చర్యం!
పెండ్యాల నాగేశ్వర రావు గారి చలనచిత్ర జీవిత రజతోత్సవ సంచికలో ప్రచురితం
అదండీ - అలాటి బూతు పాట ఆరుద్రగారి చేతిలో హొయలు పోతూ ఎంత సుందరంగా రూపుదిద్దుకుందో - ఆశ్చర్యం!
Friday, October 21, 2011
శ్రీ శ్రీ ఆకాశవాణి ప్రసంగం (1958)
కొందరు సాహితీ సేవకే పుడతారని తెలుస్తుంది. ఆ పని చేసి హడావిడిగా వెళ్ళిపోతారెందుకో మరి ! అలా వెళ్ళిపోయిన విమర్శకుడు, కవి అయిన శ్రీ శ్రీ ఆప్త, ఆత్మీయ మిత్రుడి చిత్రమిది ! శ్రీ శ్రీ కి కుడి భుజం, కుడి కన్నూ ఇతడే. "ఉదయిని" పత్రికను నడిపి, నష్టపోయి, ఆరోగ్యం పోగొట్టుకొని అకాల మృత్యువు వాత పడ్డాడు. డా. ఏటుకూరి ప్రసాద్ ఇతనిపై మంచి పుస్తకం రాసేదాకా ఈ ప్రతిభా వంతుని గురించి లోకానికి తెలియదు. ఆధునిక కావ్యాలలో ముప్ఫైసార్లు పునర్ముద్రణ పొందిన ఏకైక కావ్యం "మహాప్రస్థానం" ! ఈ గొప్ప కావ్యాన్ని
"తలవంచుకు వెళ్ళిపోయావా నేస్తం !
సెలవంటూ ఈ లోకాన్ని వదిలి......!
అంటూ శ్రీ శ్రీ ఇతనికి అంకితమిచ్చాడు.
అతనే ఈ చిత్రంలో ఉన్న కొంపెల్ల జనార్దన రావు !
శ్రీ శ్రీ - కొంపెల్ల జనార్దనరావు - సమానధర్మాలు - ఆకాశవాణి ప్రసంగం (1958)
ఇది ఆ ప్రసంగం పూర్తి పాఠం కాదు కానీ - శ్రీ శ్రీ గారు 1958 - ఆకాశవాణి ప్రసారికలో జనార్దన రావు గారి గురించి ఇలా చెప్పుకొస్తారు
"మా ఇద్దరి మధ్యా సమానధర్మాలేమిటి. ఒక్కొక్కటే చెప్పుకొస్తాను.
1. ఇద్దరం యించుమించు సమవయస్కులం.
2. ఇద్దరికీ ఆడంబరం అంటే ఇష్టం లేదు.
3. ఆ రోజుల్లో ఇద్దరం సాహిత్యం అంటే పడి చచ్చేవాళ్ళం.
4. విశ్వనాథ కవిత్వం అంటే ఇద్దరికీ ఎడతెగని మోజు.
5. సాహిత్యానికొక సాధికారమైన వేదిక ఉండాలనీ, అదీ పత్రికారూపంలో ఉండాలని ఇద్దరం దృఢంగా విశ్వసించాం.
6. పత్రికల నిర్వహణలో పెట్టుబడిదారీ విధానం ప్రత్యక్షంగా పనిచేస్తోందని అతను లోపల నుంచీ, నేను పై నుంచీ ఆరోజుల్లో గ్రహించాం.
7. డబ్బులేని పత్రికలు బతకవని ఇద్దరికీ తెలుసు కని ఆ డబ్బు ఎలా ఆర్జించాలో ఇద్దరికీ తెలియదు. ఇరవై యేళ్ళ తర్వాత ఇప్పుడిప్పుడే నాకు ఈ టెక్నిక్ తెలుస్తోంది.
8. ఇద్దరి జీవితాలనీ సాహిత్యానికే అంకితం చెయ్యాలని అనుకున్నాం
9. ఇద్దరిలోని మితవాదతత్వం లేదు. ఏ యెండకాగొడుగు పట్టడం అంటే ఇద్దరికీ అసహ్యం.
మరి వైరుధ్యాల మాట
1. అతనికున్నంత క్లాసికల్ లెర్నింగ్ నాకు లేదని నా దిగులు. నాకున్న కాలేజి ఎడ్యుకేషన్ తనకు లేదని అతని బెంగ. కాని స్వయంకృషితో అతను ఆంగ్ల సాహిత్యాన్ని అధ్యయనం చేశాడు. సంస్కృతంతో సరాసరి పరిచయం లేకపోయినా మన సంస్కృతిని నేను ఒంటపట్టించుకున్నాను.
2. అతను చచ్చిపోయీ బతికున్నాడు. నేను బతికుండీ చచ్చినట్టు పడి ఉన్నాను. అతను చెయ్యదలచుకున్నంతా చెయ్యలేకపోయాడు. నేను కొంతలో కొంతైనా చేశాను. ఇంకా చేస్తాననే ధైర్యమూ ఉంది. ఈ ధైర్యమే ఇంకా నేను బ్రతికుండడానికి కారణం.
జనార్దనరావు గురించి నేను చెప్పిందీ చెప్పగలిగిందీ ఇంకేముంది - ఈ ప్రసంగం ఎలా ముగించడం? ఏమీ తోచలేదు. కీట్సు చనిపోయినప్పుడు షెల్లీ మూల్గిన మూల్గుతో ముగిస్తా...
ఐ లివ్ ఫర్ ఎడోనిస్.
"
నాలుగు పేజీల పూర్తి పాఠం ఒకట్రెండు రోజుల్లో వెబ్సైటులో చూడవచ్చు....
ఆడియో ఎవరి వద్దనైనా ఉంటే పంచుకోవలసిందిగా మనవి...
భవదీయుడు
వంశీ
Labels:
ఆకాశవాణి ప్రసంగం,
కొంపెల్ల జనార్దనరావు,
శ్రీ శ్రీ
ఆధునిక బాలసాహిత్యంలో తొలి రచనలు - 1907
ఆధునిక బాలసాహిత్యంలో తొలి రచనలు - కళాప్రపూర్ణ గిడుగు వేంకట సీతాపతి గారు 1907 రచించిన ఈ క్రింది గేయాలట.
"బాలానందం" పత్రిక (1974) నుండి
రైలు బండి
మదిలో పుట్టిన ఊహల కంటే
మంటల లేచిన పొగసుడి కంటే
వడివడిగా దడదడగా
మన పొగబండీ
మన రైల్ బండీ
జఫ్ జఫ్ జ జ జఫ్
జ జ జ జ జ జ జ జఫ్
పరుగిడుతున్నది పరుగిడుతున్నది
మరియొక స్టేషన్ వస్తూ వున్నది
దెబ్బలు తగిలిన దెయ్యము వలెనే
దేవత లంపిన దూతల వలెనే
తరతరగా బిరబిరగా
చెట్లూ చేమలు చెరువులు పుట్టలు
ఏళ్లూ కొండలు ఊళ్లూ పొలములు
వెనకకు వరుసగ పరుగిడుతున్నవి
మనమటు చూడగ కనబడకున్నవి
బూచిని చూచిన బాలలవలెనే
ముంగిని చూచిన పాములవలెనే
తొందరగా సందడిగా
వస్తూ ఉండే బండీ బింకము
అగపడినంతనె
ఆవుల మందలు
బెదరి బెదరి తమ తోకలెత్తుకొని
వెనుకకు చూడక పరుగిడుతున్నవి
మెరసిన మెరుపులు కనబడనట్లే
విరిగిన కిరీటము పోయినయట్లే
అదిగదిగో ఇదిగిదిగో
అదిగో వంతెన! అగపడుతున్నది
ఇదిగో వంతెన! ఇప్పుడె వచ్చెను
కనబడదేమీ వచ్చిన వంతెన
కనబడునా మరిపోయిన వంతెన?!!
చిలుకమ్మ పెండ్లి
చిలుకమ్మ పెండ్లియని చెలికత్తెలందరు
చీరె సింగారించి చేరికూర్చున్నారు
పందిట పిచుకలు సందడి చేయగ
కాకుల మూకలు బాకాలూదగ
కప్పలు బెకబెక డప్పులు కొట్టగ
కుక్కొరొకోయని కోడి కూయగ
జుమ్మని తుమ్మెద తంబుర మీటగ
కుహూకుహూ కోయని కోయెల పాడగ
పిల్ల తెమ్మెరలు వేణువూదగ
నెమలి సొగసుగ నృత్యము చేయగ
సాలీడిచ్చిన చాపు కట్టుకొని
పెండ్లికుమారుడు బింకము చూపగ
సీతాకోకల చీరె కట్టుకొని
పెండ్లికుమారిత ప్రేమ చూపగ
మల్లిక మాలతి మాధవీ లతలు
పెండ్లికుమారుని పెండ్లికూతురిని
దీవిస్తూ తమ పూవులు రాల్ప
మైనగోర మంత్రము చదివెను
చిలుకమ్మ మగడపుడు చిరునవ్వు నవ్వుతూ
చిలుకమ్మ మెడగట్టె చింతాకు పుస్తె
"బాలానందం" పత్రిక (1974) నుండి
రైలు బండి
మదిలో పుట్టిన ఊహల కంటే
మంటల లేచిన పొగసుడి కంటే
వడివడిగా దడదడగా
మన పొగబండీ
మన రైల్ బండీ
జఫ్ జఫ్ జ జ జఫ్
జ జ జ జ జ జ జ జఫ్
పరుగిడుతున్నది పరుగిడుతున్నది
మరియొక స్టేషన్ వస్తూ వున్నది
దెబ్బలు తగిలిన దెయ్యము వలెనే
దేవత లంపిన దూతల వలెనే
తరతరగా బిరబిరగా
చెట్లూ చేమలు చెరువులు పుట్టలు
ఏళ్లూ కొండలు ఊళ్లూ పొలములు
వెనకకు వరుసగ పరుగిడుతున్నవి
మనమటు చూడగ కనబడకున్నవి
బూచిని చూచిన బాలలవలెనే
ముంగిని చూచిన పాములవలెనే
తొందరగా సందడిగా
వస్తూ ఉండే బండీ బింకము
అగపడినంతనె
ఆవుల మందలు
బెదరి బెదరి తమ తోకలెత్తుకొని
వెనుకకు చూడక పరుగిడుతున్నవి
మెరసిన మెరుపులు కనబడనట్లే
విరిగిన కిరీటము పోయినయట్లే
అదిగదిగో ఇదిగిదిగో
అదిగో వంతెన! అగపడుతున్నది
ఇదిగో వంతెన! ఇప్పుడె వచ్చెను
కనబడదేమీ వచ్చిన వంతెన
కనబడునా మరిపోయిన వంతెన?!!
చిలుకమ్మ పెండ్లి
చిలుకమ్మ పెండ్లియని చెలికత్తెలందరు
చీరె సింగారించి చేరికూర్చున్నారు
పందిట పిచుకలు సందడి చేయగ
కాకుల మూకలు బాకాలూదగ
కప్పలు బెకబెక డప్పులు కొట్టగ
కుక్కొరొకోయని కోడి కూయగ
జుమ్మని తుమ్మెద తంబుర మీటగ
కుహూకుహూ కోయని కోయెల పాడగ
పిల్ల తెమ్మెరలు వేణువూదగ
నెమలి సొగసుగ నృత్యము చేయగ
సాలీడిచ్చిన చాపు కట్టుకొని
పెండ్లికుమారుడు బింకము చూపగ
సీతాకోకల చీరె కట్టుకొని
పెండ్లికుమారిత ప్రేమ చూపగ
మల్లిక మాలతి మాధవీ లతలు
పెండ్లికుమారుని పెండ్లికూతురిని
దీవిస్తూ తమ పూవులు రాల్ప
మైనగోర మంత్రము చదివెను
చిలుకమ్మ మగడపుడు చిరునవ్వు నవ్వుతూ
చిలుకమ్మ మెడగట్టె చింతాకు పుస్తె
Labels:
గిడుగు వేంకట సీతాపతి,
చిలుకమ్మ పెండ్లి,
బాలానందం,
రైలు బండి
మహామహోపాధ్యాయ శ్రీ జటావల్లభుల పురుషోత్తం గారు శ్రీ విశ్వనాథ గురించి చెప్పిన మాటలు
శ్రీ జటావల్లభుల పురుషోత్తం గారు శ్రీ విశ్వనాథ గురించి చెప్పిన మాటలు / వ్యాసం...
శ్రీ జటావల్లభుల పురుషోత్తం గారెవరో తెలీనివారికి - క్ ఌ ప్తంగా - బాలలు కూడా సులభం గా నేర్చుకొనే వీలుగా సంస్కృత ప్రబోధినులు రచించి, జీవిత సర్వస్వం ఆ భాషాసేవకే అంకితం చేసిన వారిలో శ్రీ జటావల్లభుల పురుషోత్తం గారిది అగ్రస్థానం అని చెప్పుకోవచ్చు...వీరు విజయవాడ SRR కాలేజీలో సంస్కృత శాఖాచార్యులుగా పనిచేసారు....
వీరి గురించి మరింత తెలుసుకోవాలంటే ఈ యూట్యూబు వీడియోలో చూడండి
ఈ వ్యాసం ఎక్కడినుంచి తీసుకొన్నానో గుర్తులేదు....
అప్పుడెప్పుడో సేవ్ చేసుకున్న ఫైళ్ళు
శ్రీ జటావల్లభుల పురుషోత్తం గారెవరో తెలీనివారికి - క్ ఌ ప్తంగా - బాలలు కూడా సులభం గా నేర్చుకొనే వీలుగా సంస్కృత ప్రబోధినులు రచించి, జీవిత సర్వస్వం ఆ భాషాసేవకే అంకితం చేసిన వారిలో శ్రీ జటావల్లభుల పురుషోత్తం గారిది అగ్రస్థానం అని చెప్పుకోవచ్చు...వీరు విజయవాడ SRR కాలేజీలో సంస్కృత శాఖాచార్యులుగా పనిచేసారు....
వీరి గురించి మరింత తెలుసుకోవాలంటే ఈ యూట్యూబు వీడియోలో చూడండి
ఈ వ్యాసం ఎక్కడినుంచి తీసుకొన్నానో గుర్తులేదు....
అప్పుడెప్పుడో సేవ్ చేసుకున్న ఫైళ్ళు
Labels:
శ్రీ జటావల్లభుల పురుషోత్తం,
శ్రీ విశ్వనాథ
Thursday, October 20, 2011
విశ్వనాధ సాహిత్య సంచిక (జనవరి 1954) - జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి గారు విశ్వనాధ వారి గురించి
విశ్వనాధ సాహిత్య సంచిక (జనవరి 1954) - ఈ ప్రతిలో జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి గారు విశ్వనాధ వారి గురించి చెప్పిన మాటలు / వ్యాసం....
భవదీయుడు
వంశీ
PS: ఇది పి.డి.ఎఫ్ గా మార్చి అందించాలి...
భవదీయుడు
వంశీ
PS: ఇది పి.డి.ఎఫ్ గా మార్చి అందించాలి...
Labels:
జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి,
విశ్వనాధ
Subscribe to:
Posts (Atom)














































