తెలంగాణ... - దుమారం లేపిన దాశరధిగారు
టైటిలేమిటా అనో, కథా కమామీషేమిటీ అనో వచ్చారా?
మీ జీవితం ధన్యం....
దాశరధి గారు కవి సమ్మేళణాల గురించి ఓ వ్యాసం రాస్తే - అందులో తెలంగాణాలో కవులెవరన్నా ఉంటే వారిలో ముగ్గురే ఘనాపాటీలనీ - వారే సర్వశ్రీ వానమామలై, సినారె, కాళోజీ గార్లనిన్నీ, వారినే నెత్తిమీద పెట్టుకున్నారనీన్నీ వెల్దండ వారు అగ్గిమీద గుగ్గిలం తీరుగా ప్రతివిమర్శ విసిరారు....
అది ఉత్త కువిమర్శేనని దాశరధి గారు దుమ్ము దులిపేసారు....
పూర్తి వ్యాక్యా(కా)ట్లాట ఎక్కడ చూడొచ్చా?
ఇక్కడ
భవదీయుడు
మాగంటి వంశీ మోహన్
PS: ఇది చూసి అఫ్సర్ గారు అదేదో పుస్తకానికి (అధూరె అనుకుంటా- పుస్తకం పేరు !) రాసిన ఓ ముందు మాట గుర్తుకొచ్చింది....
అఫ్సర్ గారూ - ఇప్పుడే కాదండీ, మీ స్నేహితులు బాబా / బాబు ల మధ్య సాహిత్య - "అస్తిత్వ, రాజకీయ, అధిపత్య" పోరు లాటివి ఆంధ్ర సాహితీరంగంలో, తెలంగాణా - సీమ, కోస్తా, ఉత్తరాంధ్ర అనే భేదాలు లేకుండా - ఎప్పటినుంచో ఉండటం సాహితీమాత చేసుకున్న అదృష్టం.... - ఈ పైనిద్దరూ దాశరధి గారి సమీపానికి కూడా రాలేరనుకోండి...అది వేరే సంగతి.... :) :)....
గుడ్డిలో మెల్ల ఏంటంటే నేనన్నదాన్ని సరైన అర్థంలో తీసుకునేవారిలో మీరొకరు....అదీ ఉపశమనం....స్వస్తి....
0 comments:
Post a Comment
ప్రొఫైల్ లేని వారి కామెంట్లు, బ్లాగులు/ఊరు పేరు లేని వారి కామెంట్లు, టపా స్ఫూర్తికి విరుద్ధంగా చేసే కామెంట్లు, చెత్త కామెంట్లు నిర్దాక్షిణ్యంగా తొలగించబడతాయి. అందుకు సిద్ధమైన వారు నిరభ్యంతరంగా కామెంటు రాయవచ్చు.