సరే ఈ గోలంతా ఎందుకు మొదలయ్యిందంటే ఈ రోజు పొద్దున్నే ఏడింటికి మీటింగుందని అల్పాహారం తీసుకోకుండా మైనస్ మూడు డిగ్రీల సెంటిగ్రేడులో హీటరేసుకుని వెచ్చగా ఆఫీసుకు రాగానే ఆకలమ్మ వారు పందికొక్కు సైజులో ఉన్న మూషికాల్ని సదరు పొట్ట మీద, లోపలా పరిగెత్తించటంతో, మీటింగు అవ్వటమేమిటి - పక్కనున్న మెక్ డోనాల్డ్సుకు వెళ్ళటమేమిటి, ఫ్రూట్ ఎండ్ మేపుల్ ఓట్ మీల్ తీసుకోటమేమిటీ, వేడివేడిగా నోరు కాలిపోతున్నా పట్టించుకోకుండా గుటకాయస్వాహా చెయ్యటమేమిటీ - అన్నీ వాయువేగ మనోవేగాలతో, కన్నుమూసి కన్ను తెరిచేంతలో అయిపోయాయి......
సరే అయిపోయింది...ఇహ తిన్న స్పూను ఓట్ మీల్ డబ్బాలో పడేసి, దాన్ని చెత్తబుట్టలోకి పారదొబ్బుదామని చూస్తే చెత్తడబ్బా పూర్తిగా నిండిపోయుంది...సర్లే అని మూతేసి, ఆఫీసులో చెత్తడబ్బాలో పడేద్దాంలే అని వెంట తెచ్చా.....ఆఫీసుకు తిరిగు రావటమయ్యింది... చెత్తడబ్బాలో పారెయ్యటం అనే బృహత్తర కార్యక్రమం నిర్వర్తించబోతూండగా, డబ్బా మీద ఎరుపు రంగులో ఒక చిన్న కాయితం రెపరెప.....ఈ రెపరెప ఇప్పటిదాకా ఎందుకు కనపడలేదు అంటే - ఆకలమ్మ ఆవహించి ఉండటంతో అన్నమాట...
సరే ఈ రెపరెప సంగతేంటో చూద్దామని డబ్బా మీంచి ఊడపెరికి చూద్దును కదా, You are a winner అని దానికింద ఓ బొమ్మేసి ఆ వచ్చిన బహుమతి ఎలా తెచ్చుకోవాలి అని ఉన్న ఇన్స్ట్రక్షన్లు ఫాలో అయిపోయి అక్కడికి కథ సమాప్తం చేసా....
సరే ఈ పరిణామక్రమంలో ఆ డబ్బా మీద ఉన్న "న్యూట్రిషన్" సమాచారం నా దృష్టిని ఆకర్షించింది.....తినటమే కానీ, ఇలాటి దిక్కుమాలిన బలాబలాల సంగతి ఎప్పుడు చూసుకుంది లేదు....అంటే ఏది తింటే ఎంత బలం, ఏది తింటే ఎంత అబలం అన్న సంగతన్నమాట.....సరే - ఆ న్యూట్రిషన్ సమాచారాన్ని మన పుస్తకాలకు బదలాయిస్తే ఎలాగుంటుంది అని వచ్చిన ఓ చిలిపి ఊహ ఈ టపాకు ఊతం నాయనా....అదీ సంగతి......
ఉపోద్ఘాతం సమాప్తం....
సరాసరి పుస్తకల్లోకి దూకేస్తూ, జాన్రాల్లోకి విడగొట్టి న్యూట్రిషన్ సమాచారం లెక్కేసా - తేలిన లెక్క ఇదీ......నీ లెక్కలేవన్నా ఉంటే అల్లా ఓ కామెంటేసి చెప్పుకో.....
బాల సాహిత్యం సంగతికొస్తే -
- విటమినులు = 20
- మాంసకృత్తులు = 20
- కొవ్వు పదార్ధం = 20
- పిండి పదార్ధం = 10
- ఉత్తేజం = 10
- ఉల్లాసం = 10
- ఆనందం = 10
ఆత్మకథలు, వీటికొస్తే
- విటమినులు = 0
- మాంసకృత్తులు = 0
- కొవ్వు పదార్ధం = 5
- పిండి పదార్ధం = 10
- రక్తపోటు = 10
- ఉత్తేజం = 5
- ఉల్లాసం = 5
- ఆందోళన = 35
- ఆనందం = 5
- ఏడుపు = 15
- కోపం = 10
డిటెక్టివ్ సాహిత్యం - అనగా షాడో, గంగారాం, పెడ్రో వగైరా వగైరా
- విటమినులు = 1
- మాంసకృత్తులు = 2
- కొవ్వు పదార్ధం = 2
- పిండి పదార్ధం = 7
- రక్తపోటు = 20
- ఉత్తేజం = 10
- ఉల్లాసం = 5
- ఆందోళన = 25
- ఆనందం = 10
- కసి = 10
- కోపం = 10
పురాణాలు, ఐతిహాసికాలు
- విటమినులు = 10
- మాంసకృత్తులు = 20
- కొవ్వు పదార్ధం = 0
- పిండి పదార్ధం = 10
- రక్తపోటు = 0
- ఉత్తేజం = 15
- ఉల్లాసం = 20
- ఆందోళన = 0
- ఆనందం = 25
- ఏడుపు = 0
- కోపం = 0
చారిత్రకాలు
- విటమినులు = 10
- మాంసకృత్తులు = 10
- కొవ్వు పదార్ధం = 0
- పిండి పదార్ధం = 10
- రక్తపోటు = 15
- ఉత్తేజం = 10
- ఉల్లాసం = 0
- ఆందోళన = 10
- ఆనందం = 15
- ఏడుపు = 10
- కోపం = 10
స్త్రీవాద సాహిత్యం
- విటమినులు = 0
- మాంసకృత్తులు = 0
- కొవ్వు పదార్ధం = 0
- పిండి పదార్ధం = 20
- రక్తపోటు = 25
- ఉత్తేజం = 0
- ఉల్లాసం = 0
- ఆందోళన = 25
- ఆనందం = 0
- ఏడుపు = 29
- కోపం = 1
ఆధునిక కవితా సాహిత్యం
- విటమినులు = 0
- మాంసకృత్తులు = 0
- కొవ్వు పదార్ధం = 10
- పిండి పదార్ధం = 10
- రక్తపోటు = 40
- ఉత్తేజం = 0
- ఉల్లాసం = 0
- ఆందోళన = 20
- ఆనందం = 0
- ఏడుపు = 0
- కోపం = 20
ప్రేమ సాహిత్యం
- విటమినులు = 0
- మాంసకృత్తులు = 0
- కొవ్వు పదార్ధం = 0
- పిండి పదార్ధం = 10
- రక్తపోటు = 10
- ఉత్తేజం = 0
- ఉల్లాసం = 0
- ఆందోళన = 50
- ఆనందం = 0
- ఏడుపు = 20
- కోపం = 10
వేదాంత (ఫిలాసఫీ) సాహిత్యం
- విటమినులు = 0
- మాంసకృత్తులు = 0
- కొవ్వు పదార్ధం = 0
- పిండి పదార్ధం = 10
- రక్తపోటు = 10
- ఉత్తేజం = 0
- ఉల్లాసం = 0
- ఆందోళన = 0
- ఆనందం = 0
- ఏడుపు = 80
- కోపం = 0
మైనారిటీ, దళిత, ముస్లిం, హాస్య ......వగైరా వగైరా సాహిత్యం...ఇలాటి వాటి మీద ఉజ్జాయింపుగా
- విటమినులు = 0
- మాంసకృత్తులు = 0
- కొవ్వు పదార్ధం = 0
- పిండి పదార్ధం = 0
- రక్తపోటు = 60
- ఉత్తేజం = 0
- ఉల్లాసం = 0
- ఆందోళన = 0
- ఆనందం = 0
- ఏడుపు = 10
- కోపం = 30
అయ్యా - ప్రస్తుతానికి ఇంతటితో సరిపెడుతున్నా...
ఇవన్నీ నాకు ఎదురైన అనుభవాలు....మీ అనుభవం వేరైతే ఆ రోట్లో తలపెట్టి తెచ్చుకున్న నొప్పులు ఇక్కడ కక్కు కొట్టండి
ఈ మోడల్ పుచ్చుకుని మీరు తెలుగు బ్లాగుల న్యూట్రిషన్ సమాచారానికి సిద్ధపడితే సెలవియ్యండి.....అలాటి ఉద్దేశమెవరికీ లేకుంటే నేనే వచ్చే వారం ఇంకో పోష్టేస్తా....
భవదీయుడు
మాగంటి వంశీ మోహన్
బాగా చెప్పారండీ..:):):)
ReplyDelete