Wednesday, December 7, 2011

డిలన్ థామస్ గీతం - శ్రీ శ్రీ అనువాదం (1948)

గీతం

రచన: డిలన్ థామస్
అనువాదం: శ్రీ శ్రీ
పత్రిక: తెలుగు స్వతంత్ర, 1949 ఫిబ్రవరి
క్రెడిట్స్: ప్రెస్ అకాడెమీ వెబ్సైటు

చిన్నపిల్లల సర్కస్ లో
ఫిడేళ్లు ధరించిన నర్తకులు
కష్టాలన్నీ మైమరచిన
కాలం అనేది ఉండేదా?

గ్రంథాల మీద పడి వాళ్లేడ్చే
కాలమ్మ్ ఒకటి ఉండేది
కాలం అయితే వాళ్లమీదకి
కాష్ఠాన్నే ఉసికొల్పింది

ఆకాశపు అర్ధవలయంకింద
ప్రమాదమైన బతుకు వాళ్లది
అజ్ఞేయం మాత్రమే ఈ లోకంలో
అత్యంత సురక్షితమైనది

ఆకాశపు సన్జల కింద
హస్తాలు లేనివాళ్లవే
అతిశుభ్రమైన చేతులు!

గుండెల్లేని శవానికి
గాయాలబాధ లేనట్టు
గుడ్డివాడు మాత్రమే
జాస్తీగా చూస్తాడు

0 comments:

Post a Comment

ప్రొఫైల్ లేని వారి కామెంట్లు, బ్లాగులు/ఊరు పేరు లేని వారి కామెంట్లు, టపా స్ఫూర్తికి విరుద్ధంగా చేసే కామెంట్లు, చెత్త కామెంట్లు నిర్దాక్షిణ్యంగా తొలగించబడతాయి. అందుకు సిద్ధమైన వారు నిరభ్యంతరంగా కామెంటు రాయవచ్చు.