పిచ్చా!
శ్రీ కొడాలి ఆంజనేయులు
(విశ్వనాథ వారి ఆప్త మిత్రులు - జంటకవుల్లో ఒకరు)
గణ గణ మోగే
గంటల చప్పుడు
మిధ్యా దైవము
మేలు కొల్పునా!
విప్రులు చదివే
వేదపు పనసలు
రాతి బొమ్మలను
రంజిస్తయ్యా !
భక్తులు చేసే
భజనల మోతకు
శిల కాకుంటే
చెవుడు పుట్టదా !
అతని పేరుతో
అయ్యే హత్యల
కస లత డుంటే
హడిలి పోవడా !
మతము పిచ్చతో
మానవ లోకం
మురుగెత్తించే
మొద్దా దైవం?
(ప్రతిభ పత్రిక - 1937, ప్రెస్ అకాడెమీ వెబ్సైటు నుండి )
0 comments:
Post a Comment
ప్రొఫైల్ లేని వారి కామెంట్లు, బ్లాగులు/ఊరు పేరు లేని వారి కామెంట్లు, టపా స్ఫూర్తికి విరుద్ధంగా చేసే కామెంట్లు, చెత్త కామెంట్లు నిర్దాక్షిణ్యంగా తొలగించబడతాయి. అందుకు సిద్ధమైన వారు నిరభ్యంతరంగా కామెంటు రాయవచ్చు.