Monday, November 28, 2011

జాజితీగ - శ్రీ దాశరథి

జాజితీగ

జాజితీగ జాజితీగ
జాజితీగ
పూయవేమె పూయవేమె
వేగ వేగా
వసంతుడు వచ్చినాడు
వనంలోకి చొచ్చినాడు
చెట్లన్నీ చిగురించి
సింగారం చేసినాయి
కోవెలలూ కూసినాయి
మామిడులూ పూసినాయి
రంగుపూలతో పొదలు
తొంగితొంగి చూచినాయి


-- శ్రీ దాశరథి
-- ఆంధ్రప్రదేశ్ బాలల మహాసభలు సంచిక
-- ఫిబ్రవరి 10 - 13, 1977
-- ప్రెస్ అకాడెమీ వెబ్సైటు నుండి

0 comments:

Post a Comment

ప్రొఫైల్ లేని వారి కామెంట్లు, బ్లాగులు/ఊరు పేరు లేని వారి కామెంట్లు, టపా స్ఫూర్తికి విరుద్ధంగా చేసే కామెంట్లు, చెత్త కామెంట్లు నిర్దాక్షిణ్యంగా తొలగించబడతాయి. అందుకు సిద్ధమైన వారు నిరభ్యంతరంగా కామెంటు రాయవచ్చు.