Monday, November 28, 2011

ఈ రోజు పొద్దున్నే బాగోతం ఇదయ్యా......మాగంటి.ఆర్గ్ సైటు మూసే ఉంచుతా!!!

ఈరోజు పొద్దున్నే బాగోతం ఇదయ్యా....

మా వెబ్సైటు హోస్టింగు వాడి దగ్గరనుంచి ఈమెయిలు.....

We have noticed that downloading the file "/andhrakalalu/videos/burrakatha.wmv" from your site was tying up our server. There were around 206 hits from IP '115.249.95.186' to '.wmv file' in the past 30 minutes. This is against our terms of service.  You need to edit or delete the offended file so that the server load can be reduced. Please look into this issue and take relevant action at the earliest. Until such time we will take the site off-line


అర్థం కాని వాళ్ళకి - మాగంటి.ఆర్గ్ వెబ్సైటులో జానపద కళలు వీడియో సెక్షన్లో ఉన్న బుర్రకథ వీడియోను ఏకబిగిన 206 సార్లు నొక్కి సర్వర్ను బంధించటానికి చూశారన్నమాట......:) .

ఒకవేళ తెలియక 206 సార్లు నొక్కి ఉంటే అంతటి మూర్ఖులు ఉండరని సరిపెట్టుకోవచ్చు...తంటా ఎక్కడంటే, ఇది తెలిసిన మూర్ఖులు చేసిన పనే అని మనసు చెబుతోంది......పైగా ఆ ఐ.పి.అడ్రెస్సు హైదరాబాదు నుండి అని తెలిసాక........ :)

సరే కానీ - ఇంతకీ ఇలాటివి ఎవడైనా ఇలా పబ్లిక్కుగా చెబుతాడా? రేపటినుంచి నీ మీద కసి ఉన్నవారు ఒకటే ఫైలు అదే పనిగా నొక్కుకుంటూ పోరూ?

మహ బాగా చెప్పావయ్యా........:)

తెలిసో తెలీకో చేసారనే అనుకుంటే, పోనీలే అనుకోవచ్చు....

నాకు నష్టమేమీ లేదు నాయనా......నాక్కావలసింది నాదగ్గరే ఉంచుకుంటా...జనాలతో పంచుకోవాల్సిన అవసరమూ తగ్గిపోతుంది.....బోలెడు సమయమూ మిగులుతుంది.....వెధవ గోలా తప్పుతుంది....అల్లా సైటు మూసే ఉంచుతా...........

మాగంటి.ఆర్గ్ సైటు ఎప్పుడు తిరిగి ఓపెను చేయబడుతుందన్నది మీ మీ ఊహలకే.........ఆనందో బ్రహ్మ

భవదీయుడు
మాగంటి వంశీ

4 comments:

  1. మొన్నే శ్రీరామరాజ్యం చిత్రం చూసాను. ఎవడో గొట్టం అన్న మాటలకు శ్రీరాముడు సీతమ్మవారిని అడవులకు పంపాడు. ఎవడో కొణంగి తెలిసో తెలియకో ఒకే ఫైల్ ను పదే పదే నొక్కితే మాగంట్.ఆర్గ్ సైట్ ను మూసెయ్యటమా? తగదు. మరలా తెరవాలని కోరుతాను.

    ReplyDelete
  2. Plz.. Dont close the site. Lakhs of fans waiting for Maganti site.

    ReplyDelete
  3. వంశీ గారు,

    సైట్ పునః ప్రారంభించినందుకు ధన్యవాదాలండీ.

    ReplyDelete
  4. @సి.బి.రావ్ సాహెబ్ - బలేటోళ్లండి బాబూ.....అల్లా అప్పుడప్పుడు "మూస్తా మూసేస్తా మూసేసా" బాంబులేస్తూ ఉంటే మీలాటోరు ఇటేపొస్తారు......

    అది సరే కానీ నాస్తికులూ, మానవవాదులూ అయిన మీరు శ్రీరామరాజ్యం సినేమాకెళ్ళారా? బాపూ కోసమా? బాలకృష్ణ కోసమా? రాముడి కోసమా?

    అయినా ఇల్లాటి నొక్కుళ్ళ కోణంగులు బోలెడు మంది మనకు....ఈళ్ళను చూసి చూసి ఊడిపోయిన బొచ్చు ఓ వెటకారపు నవ్వు నవ్వుతోంది....వాళ్ళ కామెంటు బ్లాగులో డిలీట్ చేసానని ఉక్రోశం తట్టుకోలేక ఈ పని చేసిన కుర్రకుంక శంకర్లు, మహేశులు - నా ఊడిపోయిన జుట్టులో చుట్ట చుట్టి పక్కనబెట్టొచ్చు...

    మహా అయితే ఓ రోజు సైటు ఆఫ్ లైను అవుతుంది - నష్టమేముంది? ఇదే పని ఇంకో రెండు సార్లో, ఇంకో వందసార్లు చేస్తే - అదే ఐ.పి.అడ్రెస్ నుంచైనా, వేరే ఐ.పి.అడ్రెస్ నుంచైనా - పట్టుకోటం కష్టం కాదు కాబట్టి - వందరోజులు సైటు ఆఫ్ లైనులో ఉన్నా ఫరవాలా, ఖచ్చితంగా వంద ఊచలూ లెక్కబెట్టిస్తా....

    @జాహ్నవి - లక్షల్లో అభిమానులా? బాబోయ్ , అబ్బు-తబ్బు-ఇబ్బు అయిపోతోందండీ ఇక్కడ....

    @ జవహర్ - సైటు నిన్న సాయంత్రానికే పైకొచ్చింది......కాకుంటే ఎలాగూ ఆఫ్లైను అయ్యిందని, ఎప్పటినుంచో అనుకుంటున్న కొన్ని మార్పులు చేస్తున్నా....ఈలోపల మీకు ఏదైనా పేజీ ఓపెను అవ్వకపోతే , మీరు ఆ మార్పులు పూర్తయ్యేవరకూ ఓపిక పట్టాల్సిందే... :)

    ReplyDelete

ప్రొఫైల్ లేని వారి కామెంట్లు, బ్లాగులు/ఊరు పేరు లేని వారి కామెంట్లు, టపా స్ఫూర్తికి విరుద్ధంగా చేసే కామెంట్లు, చెత్త కామెంట్లు నిర్దాక్షిణ్యంగా తొలగించబడతాయి. అందుకు సిద్ధమైన వారు నిరభ్యంతరంగా కామెంటు రాయవచ్చు.