గుమ్మసారి గుమ్మన్నా
--- శ్రీ చాగంటి సోమయాజులు
(1945 ప్రతిభ పత్రిక నుండి, ప్రెస్స్ అకాడెమీ వెబ్సైటు సౌజన్యంతో!)
వానపడ్డది వానా
వానంటె వానా?
వరహాల వాన
గొడుగుల్లో
ఉడుపురో !
గుమ్మసారి గుమ్మన్నా !
పదమట్టె పిల్లా
తందానతాన పదం
పండు గల్లె
పడుకుంట
పదమట్టె పిల్లా
గుమ్మసారి గుమ్మన్నా !
అప్పుల్ల పెరిగిపోయి
ఆకాశపు తాళ్ళూ
దెయ్యంలా సింతా
దేవతల్లె సెందురుడు
గుమ్మసారి గుమ్మన్నా !
ఎన్నెలెక్కిందెన్నెలా !
ఎన్నెలంటెన్నెలా?
ఎన్నలాసందమామ
ఎండిలాగెన్నెలా
గుమ్మసారి గుమ్మన్నా !
పండు గల్లె
పడుకుంట
పదమట్టె పిల్లా
గుమ్మసారి గుమ్మన్నా !
0 comments:
Post a Comment
ప్రొఫైల్ లేని వారి కామెంట్లు, బ్లాగులు/ఊరు పేరు లేని వారి కామెంట్లు, టపా స్ఫూర్తికి విరుద్ధంగా చేసే కామెంట్లు, చెత్త కామెంట్లు నిర్దాక్షిణ్యంగా తొలగించబడతాయి. అందుకు సిద్ధమైన వారు నిరభ్యంతరంగా కామెంటు రాయవచ్చు.