సామిధేని
-- శ్రీ శ్రీరంగం నారాయణబాబు
రక్త పతాకం
శక్తి నాలుక
అగ్ని కిరీటం
ఆకాశమున
మునిమాపు
కేకలు వేస్తూ
పిలిచింది;
కాలం నాగు
వినువీధుల్లో
వెన్నెలపడగ
విప్పింది
శారదరాత్రి
శంకరుఫాలం
బూదిపవిత్రత
బూరా ఊదింది
దేహం వీడి
దేశం వీడవు
దిక్కుల ఉరి
కొయ్యలనుండి
దేశనాయకుల
ప్రాణాలు
మూగగాలులు
మూలుగుతు వీచాయి;
హంతకు చేతిని కత్తులు
వింతహృదయమున భావాలు
శిరసున రతనము
గళమున విషమ్ము
కలమ్ము కొసలో
కాటుక మబ్బులు
కాగితమే కంపించింది
పాటే
గ్రహపాట?
సూరన అడిదాన్ని
తిక్కన ఖడ్గాన్ని
పేలిన బిజాపూరు
ఫిరంగి గుండు
నా గుండె!
(రుధిర జ్యోతి నుండి - ప్రతిభ పత్రిక 1938 సంచిక నుంచి)
0 comments:
Post a Comment
ప్రొఫైల్ లేని వారి కామెంట్లు, బ్లాగులు/ఊరు పేరు లేని వారి కామెంట్లు, టపా స్ఫూర్తికి విరుద్ధంగా చేసే కామెంట్లు, చెత్త కామెంట్లు నిర్దాక్షిణ్యంగా తొలగించబడతాయి. అందుకు సిద్ధమైన వారు నిరభ్యంతరంగా కామెంటు రాయవచ్చు.