Tuesday, November 15, 2011

మౌఢ్యం - స్వార్ధం - క్రౌర్యం

పురాకృతం
-- శ్రీ పురిపండా అప్పలస్వామి
(ప్రతిభ, 1936 నవంబరు సంచిక)

గౌతమముని ఛిన్నాస్థుల కోసం
కలహించిన నాపూర్వుల మౌఢ్యం

కబళంకోసం భిక్షాపాత్రిక
పగిలించిన మావ్యాసుని స్వార్ధం

తగవుమాలి సీతమ్మ నడవులకు
వెడలించిన మారాముని క్రౌర్యం

బానిసీనిగా
బిచ్చగానిగా
పతితజీవిగా
చేసి నన్నిపుడు
పీడిస్తున్నవి,
కన్నీళ్లారని నానట్టింటను
కరాళ నృత్యం సాగిస్తున్నవి
నరకజ్వాలలు వెలిగిస్తున్నవి!

0 comments:

Post a Comment

ప్రొఫైల్ లేని వారి కామెంట్లు, బ్లాగులు/ఊరు పేరు లేని వారి కామెంట్లు, టపా స్ఫూర్తికి విరుద్ధంగా చేసే కామెంట్లు, చెత్త కామెంట్లు నిర్దాక్షిణ్యంగా తొలగించబడతాయి. అందుకు సిద్ధమైన వారు నిరభ్యంతరంగా కామెంటు రాయవచ్చు.