బిచ్చగాళ్ళామండి నారాయణా, కాశిని
బియ్యం పెట్టించండి నారాయణా
పట్టెడన్నం లేదు నారాయణా! మాకు
కట్ట గుడ్డా లేదు నారాయణా!
కొంప గోడూ లేదు నారాయణా! చింపి
గుడ్డ లిప్పించండి నారాయణా! ఆ
కలికి చస్తున్నాము నారాయణా! మేము
చలికి నొస్తున్నాము నారాయణా!
లేనివాళ్ళమండి నారాయణా! మాకు
లేదనబోకండి నారాయణా!
శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి గారి ఇంటి ముందు బిచ్చానికి వచ్చిన బిచ్చగాళ్ళు పాడే పాటట ఇది...
ప్రతిభ వారపత్రిక నుండి
బాగుందండీ! మంచి సమాచారం!సాహిత్యం కూడా బాగుంది! ఆ కలికి అని విడగోట్టడంలోని ఆంతర్యం బాగుంది!
ReplyDeleteమన బిచ్చగాళ్ళకి జాతీయ గీతం ఒకటి ఉండాలని అనుకునేదానిని! ఏక్ నిరంజన్ అనే సినిమాలో అమ్మా లేదు నాన్నా లేడు అనే పాట వచ్చాక ఇన్నాల్టికి ఒకటి దొరికింది అనుకున్నా! అయితే ఇటువంటి పాట ఇంతకుముందే ఉందనమాట!
@ రసజ్ఞ - బిచ్చగాళ్ళకో జాతీయగీతం - బాగుంది :)
ReplyDeleteఅంటే అన్నానని మళ్ళీ నా మీద పడేరు, పాడింది ఆ బిచ్చగాళ్ళైనా ఆ పాట మనకిచ్చిందెవరు ? - వేటూరి గారు...మహా పండితులు...విడగొట్టినా, కలిపేసినా - అన్నీ అద్భుతాలే!....అర్థం చేసుకునే దమ్ము మనకుండాలి కానీ - ఇల్లాటివి బోలెడు....
అర్థం చేసుకునే దమ్ము మనకుండాలి కానీ - ఇల్లాటివి బోలెడు....
ReplyDeletebagundi