బొంగరం బొంగరం
గంగరావి బొంగరం
తాడు లేని బొంగరం
తాతయ తెచ్చిన బొంగరం
చూడవయ్యా బొంగరం
ఆడిస్తున్నా బొంగరం
చిన్నారి బొంగరం
చిటికకు తిరిగే బొంగరం
పిల్లలు విసరే బొంగరం
ముల్లూ లేని బొంగరం
గిర గిర తిరిగే బొంగరం
గిరాట్లు తిరిగే బొంగరం
బరువూ లేని బొంగరం
బాగా ఉంది బొంగరం
బొంగరం బొంగరం
గంగరావి బొంగరం||
-- శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి
("బాల" పత్రిక - 1946)
చిన్నప్పుడెప్పుడో ఈ గంగరావి బొంగరాలు తిప్పిన గుర్తు :)
ReplyDeleteసూర్యుడు
ReplyDeleteఅవును...అన్నీ గుర్తులుగానే మిగిలిపోయినై ఇప్పుడు... :)
ఈ గంగరావి చెట్టు ఆకులు దోనెలు చేసుకుని పడవల్లాగా ఆడుకున్న రోజులు, అదే గంగరావి చెట్టు ఆకుల పొట్లంలో రామం తాత కట్టిచ్చిన ఇడ్లీలు తిన్న రోజులు, ఆ గంగరావు చెట్టుకున్న మాంచి కొమ్మ ఒకటి ఊడపీకి ఆకులన్నీ దూసేసి ఆ కొమ్మతో టైర్లు కొట్టుకుంటూ తిరిగిన రోజులూ - ఇల్లా బోలెడు గుర్తులు - అన్నీ మిగిలిపోయిన గుర్తులే!...