అలా ఉన్నదా? లేదే?
పిచ్చివాడా- "వివిధ" అనే శీర్షికలో ప్రచురింపబడిన స్పందన అని ఉన్నది కాబట్టి ఆయన ఆ పేపరు మనిషే అని చెప్పటమన్నమాట.
ఇహ టపాలోకి పూర్తిగా దిగిపోయేముందు "డిస్క్లెయిమర్" ఒకటి ...ఎవరికైనా ముల్లులా గుచ్చుకుంటే దానికి నా బాధ్యత లేదని ముందే తెలియచేసుకుంటున్నా....బాగా గుచ్చుకున్నాయనిపిస్తే ఆ బాధకు కారణమైన నా రాతల తరఫున నేనే, క్షమాపణలు కూడా - ముందే చెప్పేస్తున్నా....
నమ్మేసావా? శుభం భూయాత్! ఇహ అంతా మంచికే తమ్ముడూ
అది సరే - నేను ఆ ఆంధ్రజ్యోతి అనే వార్తా పత్రిక చదవను కాబట్టి సంగిశెట్టి ఎవరో నాకు తెలిసే అవకాశం అంతకన్నా లేదు... కాబట్టి ఈయనంటే ముందుగానే ఒక అభిప్రాయం ఏర్పరచుకుని రాస్తున్న టపా కాదని ప్రజలు,పాఠకులు గుర్తెరిగి ప్రవర్తించండి.
ఇహ ఖదీర్ బాబు ఈ పేరు కొద్దిగా తెలుసు. ఎందుకంటే అప్పుడెప్పుడో క్రితం సంవత్సరం అనుకుంటా - "బే-ఏరియా" కి వెళ్ళినప్పుడు ఒక మిత్రుడు "బాలీవుడ్ క్లాసిక్స్" అన్న పుస్తకం ఒకటి ఇచ్చాడు. ఆ పుస్తక రచయిత పేరు మహమ్మద్ ఖదీర్ బాబు అని ఉన్నది.
ఆ పుస్తకం ఓ మాదిరిగా ఉన్నది - అనగా చేతిలో పుచ్చుకుని తీరిగ్గా కుర్చీలో కూర్చుని పూర్తిగా చదివగలిగే, చదివించే పుస్తకం కాదు. అందుకు అలా పక్కన పడేసా. పడేసాననటం కన్నా గిరాటేసా అనటం సమంజసమేమో....అల్లా పక్కన పడెయ్యటం పడెయ్యటం మళ్ళీ ఇప్పుడే ఆ ఖదీర్ బాబు అనే పేరు వినటం. ఆ ఖదీర్ బాబు, ఈ టపాలో ప్రస్తావించబోయే నూరేళ్ళ తెలుగు కథ ఖదీర్ బాబు ఒహరో కాదో నాకు తెలియదు.
అయితే ఆ ఖదీర్ బాబు పుస్తకాలు రాసే ఆయనే, ఈ ఖదీర్ బాబు పుస్తకాలు రాసే ఆయనే అవటంతో - ఇద్దరూ ఒహరే అవ్వొచ్చు అన్న ఊహాగానంతో రాస్తున్న టపా కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని కామెంటండి....
ఒహటొకటిగా - ఆ స్పందనలోని భాగాల మీద నా రెండు మణుగుల అణాలు, అఠాణాలు.... బ్రాకెట్లోవి వారి అభిప్రాయాలు, పక్కనున్నవి అవ్వారి స్పందన మీద నా అభిప్రాయాలు అని ఒకటో నెంబరు హెచ్చరిక.......
[ పునఃకథనంలోనూ వివక్షే! ] -
ఈలాటి హెడ్డింగులుంటాయి చూశారూ? - ఇవి చదవగానే ఏం చదవబోతున్నాం అనేదాని మీద మనకో అభిప్రాయం ఏర్పడిపోతుంది. అనగా అసలు సంగతి మీద కాకుండా - ఆ పని చేసినాయన్ని తిట్టటానికో, విమర్శించటానికో, ఏకటానికో వాడబడే అస్త్రరాజాల్లో ఈ టైపు హెడ్డింగులు చిన్నపాటి బ్రహ్మాస్త్రాల్లాటివన్నమాట. అభిప్రాయం ఏర్పరచుకున్నాక, అనగా ట్యూను చెయ్యబడ్డాక ఆ పని చేసినాయన మనకు తెలిసినవాడైతేనూ, అందులోనూ మంచివాడని మనం అనుకుంటేనూ - ఈ హెడ్డింగు తర్వాత అసలు వ్యాసాన్ని చదివి రక్తపోటు పెంచుకోటానికి సిద్ధమవ్వనూవచ్చు లేదా మనకు తెలిసినవాడయ్యీ, మనకు ఏ కారణం చేతో ఆయన నచ్చకపోతే ఈ వ్యాసకర్త ఆయన్ని ఏమని ఏకబోతున్నాడా అని ఉప్పొంగిపోతూ పంచ, లాగూ, చొక్కా, బనీను ఊడిపోతున్నా పట్టించుకోని ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బూ అవ్వనూవచ్చు..
ఇక్కడో మాట చెప్పాలె - బ్రహ్మాస్త్ర ప్రయోగం చాలా తక్కువమందికి తెలుసు. ఆ ప్రయోగం తెలిసినవారిట్లో చాలా మందికి ప్రయోగం మటుకే తెలుసు, అస్త్ర ఉపసంహరణం తెలీదు. వెయ్యటం తప్ప తియ్యటం తెలియని మనిషి చేతిలో అస్త్రాలు లోకానికి ఎంత చేటు చేస్తాయో ఆ వేసినవాడికి తప్ప మిగిలిన అందరికీ తెలిసిన విషయమే! ప్రయోగం చేసేవారందరినీ కాసేపు శిఖామణులనుకుందాం. మణుల్లో బోల్డు రకాలుంటాయన్నమాట అందరికీ తెలిసిన విషయమేగా. అల్లాటి శిఖామణుల్లో కొంతమంది, అదేనండి - (***) శిఖామణులు చేతిలో ఉన్న చెక్కపేళ్ళను చూసుకుని, అవే బాణాలనీ, అస్త్రాలని భ్రమసి విచ్చలవిడిగా విసురుతూ ఉంటారు.
బ్రహ్మాస్త్ర విద్య తెలిసినవాడు చెక్కపేళ్ళని విసురుతాడా ఎక్కడైనా అని అనుమానం వచ్చిందా? శుభం....అందుకే అక్కడ చుక్కలు పెట్టింది...
నాకు ఆయనా తెలీదు, ఈయనా తెలీదు - కానీ హెడ్డింగు చదవగానే అచ్చంగా కలిగిన "ఫీలింగు" - సంగిశెట్టి ఆయన చెక్కపేడు విసిరేసారు అని. ఆ మాత్రం "ఫీలింగు" కలగకపోతే ముడ్డి కిందున్న నాలుగు దశాబ్దాల పైనున్న ఏళ్ళు విరగబడి నవ్వవూ?
ఏమిటేమిటీ - ఆయనా తెలీదు, ఈయనా తెలీదు అంటూ "(***)" పదప్రయోగాలు చేస్తావా?
ఓ! అదా నీ అనుమానం? అయితే నివృత్తి చెయ్యాల్సిందే.... అది ఉపమానం మాత్రమే? దేనికి చెక్కపేడుకి, బాణాలకి, ఫీలింగుకు....సంగిశెట్టి వారి నామానికి, మనిషికి కాదు....అర్థమయ్యిందా? అర్థం కాకపోతే చేతులెత్తు, తూర్పు తిరుగు, వంగో, లే, ఇప్పుడు దణ్ణం పెట్టు....ఏం?
సరే హెడ్డింగు అయ్యిందిగా? ఇహ పూర్తిగా స్పందనలోకి దిగిపోదాం....
[తెలుగు కథా సాహిత్యానికి నివాళిగా ‘నూరేళ్ల తెలుగు కథ’ పేరిట నూరుగురు కథల నూరు ప్రసిద్ధ కథలు పునఃకథనం చేసిన మహమ్మద్ ఖదీర్‌బాబు అభినందనీయుడు. కథకుల ఒరిజినల్ కథను భావం చెడకుండా సంక్షిప్తం చేయడం కష్టసాధ్యమైన పని. అయితే ఈ పనిని ఖదీర్‌బాబు సరిగ్గానే పూర్తి చేసిండు. ఇది కచ్చితంగా తెలుగు కథకు కొత్త మేలు చేర్పు. అయితే ఈ చేర్పుతో తెలంగాణకు మొత్తంగా, సీమాంధ్ర ప్రాంతాల్లోని దళిత, బీసీ రచయితలకు ఖదీర్‌బాబు చేసిన చేటు అంతా ఇంతా కాదు.]
- ఖదీర్ బాబు సరిగ్గానే పూర్తిచేసిండు....ఇది బాగుంది
- తెలుగు కథకు కొత్త మేలు చేర్పు .....ఇదీ బాగుంది
ఆ తర్వాత అన్నారే "చేటు అంతా ఇంతా కాదు అని" - అక్కడో చిక్కొచ్చి పడింది నాకు. చెప్పాల్సింది ముతకగా చెప్పాననుకునేరు. కానీ ఆ వాక్యం చదవగానే రెక్కలు తొడిగిన ఊహలు మాటల్లో పెట్టేద్దామని చేసిన ప్రయత్నం ఈ క్రింది విధంగా తేలింది - కాబట్టి, ఇహ చదువుకోండి........
మీరు చాలా మంచివారండి, సమాజానికి ఉపయోగపడేలా బోల్డు మంచి పనులు చేసారు - కానీ మా పిల్లోడు వరండాలోనో లేదా లివింగు రూములోనో (*) వంట పడగ్గదిలోనూ (**) దొడ్లోకెళ్ళాడు.....మీరు మా పిల్లోడి ముడ్డి కడగలేదు. మా ఇంట్లో ఆ వరండా మొత్తమూనూ, వంటపడగ్గదుల్లో కొన్ని మూలలూనూ కంపు లేచిపోతున్నాయి - కాబట్టి మీరు నాకు, నా కుటుంబానికి చేస్తున్న చేటు అంతా ఇంతా కాదు..వాసన తట్టుకోలేకపోతున్నాం - అని ఎవరన్నా అన్నారనుకోండి - మీరేం చేస్తారు?
- అయ్యా ఆ పిల్లోడు మీ పిల్లోడు, అయినా సరే ఆ పిల్లోడి ముడ్డి కడిగే బాధ్యత మటుకు నేను నెత్తినేసుకుంటా, మూలలు, మొత్తాలూ మీ ఇష్టం అంటారా?
- బాబూ ఆ మాత్రం ముడ్డి కడగలేని వాడివి, ఇల్లు శుభ్రంగా పెట్టుకోలేనివాడివి పిల్లాడిని ఎందుకు కన్నావయ్యా అంటారా?
- మీ పిల్లోడు మీవాడు, మీ వరండాలు, వంట, పడక గదులు మీవి, మీ పిల్లోడి ముడ్డి మీది, మీ కుటుంబానిది, ఆ వాసనా, శుభ్రంగా ఉంచుకునే బాధ్యతా మీదే అంటారా?
- ఎవడి కంపు వాడికింపు కాబట్టి మీ పిల్లోడి కంపు, వరండాల పడక గదుల కంపులో మీరే కుళ్ళిపోండి అంటారా?
- ఈ పైవన్నీ కాక ఇంకేదన్నా అంటారా?
(*) - (వరండా, లివింగు రూము - తెలంగాణా అనుకోండి ఫర్ సపోసు!)
(**) (వంట, పడక గదులు - సీమాంధ్ర అనుకోండి ఫర్ సపోసు)
ఫర్ సపోసు ఎందుకులెండి కానీ - వారన్న మాటే - తెలంగాణా మొత్తంగానూ, సీమాంధ్రలో కొంతమందివి గానూ అని - ఆ రూములూ ఇవి అటు ఇటూ చేసుకున్నా నాకు అభ్యంతరమేమీ లేదు ....
ఇహ ఆ తర్వాత విసిరిన కొన్ని చెక్కపేళ్ళు -
[నిజానికి తొలి తెలుగు కథ వెలువడి ఇప్పటికీ 113 యేండ్లు గడిచినవి.తొలి తెలుగు కథ రాసిన భండారు అచ్చమాంబ కథను (ధనత్రయోదశి-1902) ఈ సంకలనంలో జోడించుకుంటూనే ఈ పుస్తకానికి ‘నూరేళ్ల తెలుగు కథ’ అని పేరు పెట్టిండు. అలాగే లోపల కూడా వందేళ్ల కథలు అని చెప్పుకున్నాడు. అంటే ఇది తెలుగు పాఠకుల్ని తప్పుదోవ పట్టించడమే! గురజాడ కన్నా 12 యేండ్లకు ముందే తొలి తెలుగు కథ అచ్చయిందని ‘అచ్చమాంబ కథలు’ వెలుగులోకి తీసుకొచ్చి చెప్పడం జరిగింది.]
"నూరేళ్ళ తెలుగు కథ" అని పేరు పెట్టి, భండారు వారి కథ ఉటంకించినందుకు ఉక్రోశం పట్టలేక ఆక్రోశం చెందారా అన్న విషయమూ ఆలోచించాల్సిన విషయమే. అయితే అందులో పాఠకులను తప్పు దోవ పట్టించేదేముందో నాకు అర్థం కాలా. పోనీ ఆయన నూటపదమూడేళ్ళ తెలుగు కథ అని పేరు పెట్టుంటే -
అ) ప్రేతాత్మ వైతరిణి దాటేదా అన్నది అర్థం కాలా!
ఆ) నూటా పదమూడేళ్ళ కథ అని పేరు పెట్టారు కాబట్టి, అందులో పదమూడు సంఖ్య అరిష్ట సూచకం కాబట్టి మరో పేడు ఏమన్నా విసిరేవారా అన్నదీ అర్థం కాలా....
తప్పు దోవ పట్టేవాడిని పోకుండా ఎవడూ ఆపలేడు. తప్పు దోవ పట్టకుండా ఉండాలనుకున్నవాడిని ఆ దోవ పట్టించేవారూ ఉండరు. అది జగద్విదితం. కాబట్టి ఈ స్పందనా వాక్యం కూడా తూగిపోయేదే! విలువనివ్వఖ్ఖరలా!
ఏ స్పందనకీ - విలువనివ్వక్కరలేదంటున్నావూ?
అడిగావూ? తఁవరి తెలివికి తాటాకుతో దణ్ణాలు...
ఇహ ఇప్పుడు -
[ఈ సంకలనంలోని మొత్తం వంద కథల్లో తెలంగాణ ప్రాంతం వారి కథలు రెండు పదులకు మించి లేవు. న్యాయంగా తెలంగాణ కథకులవి నలభై కథలుండాలి. అట్లా కాకుండా కేవలం 20 కథలు మాత్రమే ఇందులో చేర్చడం వెనుక ఆయనకు తెలంగాణ కథకులపై ఉన్న చిన్నచూపు, చులకన భావం అర్థమవుతుంది ]
వంద కథల్లో నలభై కథలు తెలంగాణావి ఉండాలి అన్న సంఖ్యను, న్యాయాన్ని ఎవరు నిర్ణయిస్తారు?
ఎందుకు నిర్ణయిస్తారు?
న్యాయంగా ఉండటమేమిటి?
ఇదేమన్నా తీర్పా?
అయితే ముద్దాయిలెవరు?
ప్రతివాదులెవరు?
జడ్జి ఎవరు?
ఈ చిన్న, మెలిక ప్రశ్నకు సమాధానం ఎవ్వరు ఇవ్వగలరు?
తెలుగులో రాసిందాన్ని తెలుగులో చదువుకుని అర్థం చేసుకునేవాళ్ళూ, మతిస్థిమితం ఉన్నవాళ్ళు.....
చిన్న చూపు, చులకన భావం అన్న మాటలకు అర్థం ఏమిటో?
ఇప్పుడు ఒక కూరల బండాయన మన ఇంటి గుమ్మం ముందు నుండి పోతున్నాడు...ఇంట్లో మీరొక్కరే ఉన్నారు...మీకు వంట బాగా వచ్చు....వంకాయలంటే ప్రాణం...మీకు వంకాయ కూర తినాలనిపించి ఓ అబ్బీ ఇలా రా అని పిలిచి, వరండాలో కూచోబెట్టి, ఆయన నెత్తి మీద ఉన్న బుట్ట కిందకి దింపించారు...ఆ బుట్టలో మంచి చచ్చు పుచ్చు పురుగు పుట్రా కలగలుపుగా ఉన్న వంకాయలు బోలెడు.....
బండంటావు? ఆయన నెత్తి మీద బుట్టెందుకుంది అని అడిగావా? అదీ సం(గ)తన్నమాట!
మీకు కళ్ళకలక జబ్బు లేకపోతేనూ, పాక్షిక అంధత్వం లేకపోతేనూ
- కళ్ళకు కనపడ్డ వాటిల్లో కొన్ని మంచి వంకాయలు ఏరుకుని "ఆ పూట" కూరకో, "నాలుగు పూటల" కూరకో సరిపడేన్ని కొనుక్కుని అబ్బికి డబ్బులిచ్చి పంపేస్తారా?
- అయ్యో ఆ బుట్టలో మంచి వంకాయలు ఇంకా మిగిలిపోయినాయే అని కంటికి మింటికి ధారగా ఏడుస్తూ కూర్చుంటారా?
- నా "పూటలకు" సరిపడేన్ని మంచి వంకాయలు "మాత్రమే" తీసుకుని రాని ఆ కూరలబ్బిని మెటికలు విరుచుకుంటూ శాపనార్థాలు పెడతారా?
- చేసుకుని తినటానికి అన్ని మంచి వంకాయలు తెచ్చిచ్చిన కూరలబ్బిని - ఒరే నీకు ఆ బుట్టలో మిగిలిపోయిన మంచి వంకాయలంటే చులకన , చిన్నచూపు అని అమ్మ ఆలి బూతులు తిడతారా?
[ ట్యాంక్‌బండ్‌పై సీమాం«ద్రుల విగ్రహాలు నెలకొల్పిన కుట్రే ఇందులో కనబడుతోంది. ట్యాంక్‌బండ్‌పై మచ్చుకు ఐదారుగురు తెలంగాణ వాళ్ల విగ్రహాలు నెలకొల్పి మిగతావి సీమాంద్రులవే స్థాపించి తెలుగు నేలలో ఉన్న వైతాళికులు వీరు మాత్రమే అని ప్రపంచానికి ప్రదర్శన పెట్టారు. ఇన్నేండ్లుగా తెలంగాణలో ఐదారుగురికి మించి వైతాళికులు లేరు అనే భావన వ్యాప్తిలోకి వచ్చింది. ఆ భావన ఆగ్రహంగా మారి మార్చి పదిన ప్రాంతేతరుల విగ్రహాల తొలగింపుకు దారి తీసింది. తెలంగాణలో ఇన్ని ఉద్యమాలు జరుగుతూ ఉండి, తమకు న్యాయంగా దక్కాల్సిన వాటా కోసం, హక్కుల కోసం తెలంగాణ బిడ్డలు నిత్యం రోడ్డెక్కుతున్నారు. ]
ఇంత విచిత్రమైన వాదన మన తెలుగు వారికే సొంతం. కన్ను, ముక్కు, చెవులొదిలేసి - బుర్ర సరిగ్గా ఉన్నవారెవరూ చెయ్యని, చెయ్యలేని, రాయని, రాయలేని మాటలు ఈయన రాసారంటే వారి వైతాళిక ప్రతిభ - కళ్ళ ముందు నిలబడిపోయి ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతూన్న "సకల జనులూ సమ్మె"ట తీసుకుని పరుగులెత్తాల్సిందే....
ఎక్కడికి?
ఇంకెక్కడికి? వారి వద్దకే!
[అయినా కూడా సీమాంధ్ర పాలక వర్గాలు, వారి తాబేదార్లు గత ఆరు దశాబ్దాలుగా తెలంగాణపై చూపించిన వివక్ష, వ్యతిరేక వైఖరినే ఖదీర్‌బాబు ఈ సంకలనం ద్వారా మరోసారి విచ్చలవిడిగా ప్రదర్శించాడు. తెలంగాణలో పరిగణనలోకి తీసుకోవాల్సిన కథకులు రెండు పదులకు మించి లేరని చెప్పకనే తన ఉద్దేశ్యాన్ని చెప్పిండు. మహమ్మద్ ప్రవక్త ‘అజాఁ’ ఇచ్చే అవకాశం ఆఫ్రికన్ బ్లాక్, బానిస హజ్రత్ బిలాల్‌కు దక్కినట్టుగానే ఈ కథలను మళ్లీ చెప్పడానికి తనకు అవకాశం దక్కిందని మురిసిపోయిన ఈ మహమ్మద్ ఖదీర్‌బాబు తన ‘పిలుపు’ను ‘తమ ప్రాంతం వారికి మాత్రమే’ పరిమితం చేయడం విషాదం.]
"పిలుపు"లు కుటుంబాల వారీగా, బంధుజన వారీగా, తమ ప్రాంతాల వారిగానే ఉంటాయన్న సంగతి విషాదం ఎందుకవుతుందో అర్థం కాలా. విషాదం అంటే అర్థం ఏమిటి అన్న సంగతి ఈ రాసినాయనకు తెలుసా అన్న అనుమానం ఎవరికైనా రాకపోతే వారు ధన్యులు.
మంచి వంకాయలు ఇంకా కొన్ని ఆ బుట్టలో మిగిలిపోయాయన్న మాట విషాదం ఎందుకవుతుందో తెలియలా....కొనుక్కుని, వండుకుని తినేవారెవరో ఒకరు మిగిలే ఉంటారుగా! అది మీరే అవ్వొచ్చుగా.
ఖదీర్ బాబు వంకాయ కూర బాగా వండాడు కానీ ఆయన ఏరుకున్న వంకాయలు కాకుండా, ఆ బుట్టలో మిగిలిపోయిన మంచి కాయలతోనో, నేను కొనుక్కున్న కాయలతోనో వంట చెయ్యలేదు. అందుకూ, అది విషాదమైన వార్త అయ్యింది అన్నారనుకోండి? అప్పుడు ఏమవుతుంది?
[ ఖదీర్‌బాబు ఈ పుస్తకానికి ముందుమాట రాస్తూ ‘కథను గుట్టు చప్పుడు కాని ఒక కత్తిలా బొడ్లో దోపుకొని సైలెంట్‌గా ఉండటం అంటే ఏమిటో అర్థమయింది. దానిని నేను ఒదల్లేదు’ అన్నాడు. ఒక్క ఖదీర్‌బాబేమి గతంలో తెలుగు కథలు సంకలనం చేసిన అందరూ అదే పనిచేశారు. దాన్ని ఖదీర్‌బాబు కొంచెం పదునుపెట్టి తెలంగాణ గొంతుమీద పెట్టిండు. అంతే తేడా. తెలుగులో గతంలో సంకలనాలు వేసిన మధురాంతకం రాజారాం, వాకాటి పాండురంగారావు, వేదగిరి రాంబాబు, వాడ్రేవు చినవీరభద్రుడు, వాసిరెడ్డి నవీన్-పాపినేని శివశంకర్, జంపాల చౌదరి-ఎ.కె.ప్రభాకర్-గుడిపాటిలు చేసిన అన్యాయమే ఈసారి ఖదీర్‌బాబు చేసిండు.]
ముందు మాట సంగతికి వస్తే - కత్తి అన్నాక పదును ఉండాలిగా. అది కూడా తెలియని దద్దమ్మల్లా తెలుగు కథాభిమానులు వంటలు చేస్తున్నారా? ? పదునున్న కత్తికి మంచి / పుచ్చు వంకాయల తేడా తెలీదు. కానీ ఆ కత్తి పట్టుకున్న మనిషికి మంచి వంకాయల విలువ తెలిస్తే పుచ్చుల జోలికి పోయి సమయం వ్యర్థం చేసుకోకుండా పని తొందరగా పూర్తి చేసుకుంటాడు.
సంకలనాలు వేసారు, అన్యాయం చేసారు అన్నారు....అన్ని వంకాయల సంకలనాలు వారు వేసుకుంటే వీరు ఏం చేస్తున్నారన్నది అర్థం కాని విషయం. ఆ వంకాయల ముచ్చికలు పీకుతూ కూర్చున్నారేమోనని అనుమానం వచ్చిందా? మీరు ధన్యులు సుమతీ !...
అలా పీక్కుంటూ ఉంటే ఆ ముచ్చికలే చేతిలో మిగిలేది అని తెలాంధ్రాయలోత్తర ప్రాంతానికి చెందిన ఓ పెద్దాయన ఉవాచ...
అసలు ఆ స్కై బాబా అనే ఆయన, సంగిశెట్టి అనే ఆయన ఓ గుంపనీ - ఒకళ్ళ భుజాలు ఒకళ్ళు చరుచుకుంటూ కంపు కంపు అని అరుస్తూ వ్యక్తిగత అజెండాల కోసం డప్పులు కొట్టుకుంటున్నారన్న అనుమానం మీకేవన్నా వచ్చిందా?
అలాగైతే పైన పేర్కొన్న సంకలనకర్తలూ భుజాలు చరుచుకుని అలాటి పనులు చేసుకున్నారనీ మీకు ఖరారు అయిపోయిందా?
శుభం!
ఈ పైన పేర్కొన్న సంకలనకర్తల్లో గోడ మీద పిల్లులు బోల్డంత మంది ఉన్నారన్న సంగతి మీకు ఎరికలోకొచ్చిందా?
ఇంకా శుభం!
[ఖదీర్ చేసిన అన్యాయానికి అస్తిత్వాల ముసుగేసే ప్రయత్నం చేసిండు. అస్తిత్వాల ముసుగులో ఏది చేసినా చెల్లుతుందనే ధిక్కార, ఆధిపత్య స్వభావాన్ని ప్రదర్శించుకున్నాడు. ‘వందేళ్లలో జరిగిన మార్పులు, చేర్పులు, పోరాటాలు, ఎదుగుదలలు, అధోపాతాలు, బాధితుల ఘోష, నిచ్చెన పట్టుకొని ఎగబాకేందుకు స్త్రీలు, బహుజనులు, దళితులు, ముస్లింలు చేసిన పెనుగులాట, ఒక మౌన అశ్రువు, ఒక మందహాసం… ఇవన్నీ తెలియాలని అనుకున్నాను’ అని ముందుమాటలో చెప్పుకున్నాడు. ఇవన్నీ పైకి కనిపించే మెత్తటి మాటలు. రహస్యంగా ఎవరికీ అంతు చిక్కకుండా సైలెంట్‌గా బొడ్లె దోపుకున్న కత్తిని విశృంఖలంగా వినియోగించిండు.]
రహస్యం రచ్చ అయ్యిందన్న సంతోషం మిగిలిందేమోనన్న అనుమానం వచ్చింది కానీ ఈ తర్వాత చెక్కపేడు చూసినతర్వాత ఆ అనుమానం వీరన్నంత విశృంఖలంగానే అన్నీ విరబోసుకుని పరుగులెత్తింది...
[నిజానికి ఇందులోని మొత్తం కథల్లో ఇంతకు ముందే చెప్పుకున్నట్టుగా 70 శాతం కథలు అగ్రవర్ణాల వారివి. మొత్తం కథల్లో 50 శాతం బ్రాహ్మణులవి. మహిళల (బ్రాహ్మణులతో కలిపి) కథలు 16కు మించి లేవు. దళితుల కథలు ఎనిమిది దాటలేదు. దళితుల కథలు జాజుల గౌరి, గోపి భాగ్యలక్ష్మిలను కలిపినా ఏడెనిమిదిమందికి మించి లేవు. అలాగే బీసీ కథకుల సంఖ్య డజను దాటలేదు. మరి ఈ కులాల నుంచి కథలు రాసినవారు లేరా? అంటే చాలామంది ఉన్నారు. సీమాంధ్ర ప్రాంతలో ఉన్న చాలామంది దళిత, బీసీ, ఎస్సీలకు, తెలంగాణలోని పై వర్గాలతో పాటుగా ముస్లిం మైనారిటీలకు దక్కాల్సిన వాటా దక్కలేదు.]
కులాల వారీగా ఆయా కులాల వారు రాసిన కథలు ఎంచుకోవాలన్న సంగతి, నగ్న సత్యం ఇహ మీదట సంకలనకర్తలు గుర్తుపెట్టుకోవాలని జ్ఞానోదయం చేసిన వీరికి నమోన్నమహ! పైగా 50 శాతం బ్రాహ్మణులవి అని వాపోటం ఏమిటో? నూరేళ్ళ కథల్లో ఖచ్చితంగా బ్రాహ్మణులవే ఎక్కువ ఉంటాయన్న సత్యం పాత సాహిత్యం చదివిన ముంగికైనా తెలిసిన విషయమే! ఆ రోజుల్లో రాసినవారంతా కాకపోయినా ఎక్కువ శాతం బ్రాహ్మలేగా! అందులో ఆశ్చర్య పడాల్సిందేమున్నదో, గుండెలు బాదుకోటానికేమున్నదో కారణం అర్థం కాలా!
ఆ రోజుల్లో బి.సి.లు, దళితులు, ముస్లిములు - వీరంతా రాసి ఉండి ఉంటే ఈ ఆ కథలు కూడా బావుంటే ఖదీర్ బాబుకు కనపడేవేమో, ఈ సంకలనానికి ఎక్కేవేమో.....వాళ్ళు రాయకపోటమో, ఒక వేళ రాసి ఉంటే ఆ ఖదీర్ బాబు కళ్ళ పడకపోటమో ఆయన తప్పెలా అవుతుందో ఇంకా అర్థం కాని విషయం.
ఇందులో కూడా, అనగా సాహిత్యానికి కూడా అస్తిత్వాల, కులాల, వాటాల గోల అంట గట్టే ప్రయత్నం చేసిన ఈ సంగిశెట్టి గారిని ఆ సరస్వతీ మాత ఎప్పటికి క్షమిస్తుందో! సిగ్గుపడాల్సిన విషయం, సిగ్గుతో తల తీసుకెళ్ళి ఎక్కడో పెట్టుకోవాల్సిన విషయం. నగ్నంగా బట్టలూడదీసి గాడిద మీద ఊరేగించి సున్నపు బొట్లు పెట్టి శాంతి చేయిస్తే తప్ప కొంతమందికి పిచ్చి కుదరదుట. అంత దారుణంగా కాకపోయినా ఈ "పిచ్చి రాతల" పిచ్చి ఎవడు తగ్గిస్తాడో చూడాలన్న ఆశ ప్రబలమైపోతోంది...
[కథ తనకు తానుగా ఎంచుకున్న వందమంది వీళ్లు అన్నాడు ఖదీర్. కచ్చితంగా వాటినే పునఃకథనం చేసే వ్యక్తే వాటిని ఎంచుకుంటాడు. కథే నడిచి వచ్చి ముందు నిలబడదు కదా! ఈ ఎంపిక చేయడంలో పునఃకథనం చేసే ఖదీర్ యిష్టాయిష్టాలు పనిచేశాయి. తన ప్రాంత మూ పనిచేసింది. ఇన్నేండ్ల నుంచి తాను చదువుకున్న సాహిత్యమూ పనిచేసింది. తన పరిసరాలు పనిచేశాయి. ఇవన్నీ కలగలిపి తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరింపజేశాయి. సీమాంధ్ర ఎస్సీ, బీసీలకు అన్యాయం చేశాయి.]
పాడిందే పాటరా అన్నట్టు - మళ్ళీ అదే అర్థం పర్థం లేని ద్రోహాల, అన్యాయాల గోల......
[సంతోషంగా, పరవశిస్తూ, ప్రతి రచయితా వదిలి వెళ్లిన కథాస్థలిని ఎంతో కుతూహలంతో ఖదీర్ రీవిజిట్ చేసిండు. ఈ రీవిజిట్‌లోనైనా గతంలో ఎవ్వరూ తిరగని ప్రదేశాలను, ప్రసిద్ధ కథకులనూ, భిన్న జీవితాలను, అట్టడుగు బతుకులనూ, మైనారిటీల వ్యథలను ఖదీర్ తిరగాలని ఆశించాము. అయితే ఆయన ఈ విషయంలో తెలుగు కథాభిమానులందర్నీ నిరాశ పరిచాడు. ఖదీర్‌బాబు ఇప్పటికైనా ఈ కథలు ‘తనకు తానుగా’ ఎంచుకున్న పద్ధతి ఏంటిదో చెబితే భవిష్యత్తరాల వారికి మేలు చేసినవాడు అవుతాడు. ఎందుకంటే ఆ ముండ్ల దారి కాకుండా వాళ్లు కొత్తదారి వేసుకోవడానికి ఇది తోడ్పడుతుంది.]
స్పందనలో మొదటి లైను, ఈ చివరి పెరాలో మొదటి లైను తప్ప మిగిలిందంతా ద్వేషం కక్కటానికే ఉపయోగించారన్నది సుస్పష్టం. దానికి కారణాలేవన్నది కూడా సుస్పష్టం...
ఇహ కథాభిమానుల ఖర్మను కాలమే నిర్ణయించాలె.....
ముండ్ల దారి అని మనకు తెలిసినప్పుడు ఆ ముళ్ళు దారిలో వేసిన పద్ధతి ఏమిటో అవతలివారిని అడగటం ఎందుకు అన్నది ప్రశ్న....
సందేశాలివ్వటం మన పని కాదు కాబట్టి - పనికిమాలిన ఏడుపులు, పనికిరాని కబుర్లూ చెప్పటం ఆపి - కళ్ళు బాగా విచ్చుకత్తులతో విచ్చేయించుకుని సాహిత్యానికి ఉపయోగపడే పనులు చేస్తే అందరికీ మంచే జరుగుతుందీ...నా లాటి వారికి ఇలా సమయం వృధా చేసె బాధా తప్పుతుంది...
వీలుంటే అన్ని కులాల వారిగా , మనుషుల వారిగా, అస్తిత్వాల వారీగా , దళితుల వారీగా, బి.సి.ల వారీగా, ముస్లిముల వారీగా ....ఇతరవేవైనా వారీగా - కథలు సంకలనాలకెత్తించి మీరూ రికార్డు సృష్టించండి...చప్పట్లు కొట్టడమేమిటీ, భుజాల కెక్కించుకుని తిప్పే బాధ్యత మాది...కథాభిమానులది....
ఇహ గోల ఆపేసి విశ్రాంతి తీసుకుంటా...
సర్వేజనా స్సుఖినోభవంతు...
భవదీయుడు
వంశీ
sky has conflict with khadeer for domination in Muslim Minority Literature. Sangisetti and sky belong to one group. Sky's differences with khadeer are not new. Now T angle is an additional front for sky.
ReplyDeleteఫణీంద్ర - దిగజారుడుతనానికి వందనం చేస్తూ జెండా ఎవరైనా ఎగరెయ్యాలనుకుంటే ఇలాటి వ్యక్తుల వద్దకు, ఇలాటివి ప్రచురించిన ఆ పత్రికా ఆఫీసుకు వెళ్ళి సుబ్బరంగా నేర్చుకోవచ్చునేమో అని ఓ నిముషం అనిపించింది...అనిపించడంలో తప్పు లేదుగా? ఏం?.
ReplyDeleteసాహిత్యానికి మేలు చేద్దామని ఖదీర్ బాబు ఆ పుస్తకం ప్రచురించాడో, ఇంకేదన్నా ఉద్దేశంతో ప్రచురించాడో తెలియదు కానీ - అది ఒక రకంగా కొద్దిమందికైనా, అనగా సాహిత్యాభిమానులకు ఉపయోగపడే "మంచి" పనే అని చెప్పొచ్చు... ఆ సంకలనకర్త చుట్టూ భజనలు చేసేవాళ్ళు, అవసరమున్నా లేకున్నా తియ్యటి ముందుమాటలు చెప్పేవాళ్ళు, చప్పట్లు కొట్టుకునేవాళ్ళు ఉంటే ఉన్నారుగాక.....అది వేరే సంగతి....
రాసినదాన్ని, పునఃకథనం చేసినమాటలని, పునస్సమీక్ష చేసిన మాటలని విమర్శించు దమ్ముంటే, అంతే కానీ ఈ కథ ఎందుకు వెయ్యలేదు, ఆ మనిషిని ఎందుకు ఎక్కించలేదు అని "దద్దమ్మ" మాటలు, "పిచ్చి" మాటలు , పనికి మాలిన మాటలు, సంబంధం లేని విషయాలతో రంగరించి (ఉర్దూలో గామాలు - "హౌలా" మాటలు అంటారు - తప్పైతే సరిదిద్దండి) మాట్లాడితే ఎవడికీ ఉపయోగం? ఒహడు చెయ్యడు, ఇంకోడు చేస్తే ఓర్చుకోలేడు అని అనిపించడంలో తప్పు లేదుగా? ఏం?. దాలిగుంట , కుక్క కథ గుర్తుకొస్తోందా? శుభం!
సాహిత్యంలో రిజర్వేషన్లేమిటి, కోటాలేమిటి, కులాలేమిటి ? రాతలకివ్వాల్సిన విలువ రాతలకీ, మనుషులకివ్వాల్సిన విలువ మనుషులకి ఇస్తే గొడవ లేకపోను....రెండూ కలగలిపి "అజెండాల" పేలాలు ఏరుకోటానికి చూస్తున్నారే అదీ చిరాకు కలిగించే విషయం.
బురదలో దొర్లే పంది - నన్ను అందరూ అసహ్యించుకుంటే కున్నారు గాక, నా బురద నాకు పన్నీరు అని పొర్లుతుందిగా, అదే ఇక్కడా కనపడుతోంది....ఇహ ముందు కూడా ఇలాగే ఉంటుందా, ఇంకా దిగజారుతుందా అని ప్రశ్నల మీద ప్రశ్నలు బుర్రలో ఏర్పడుతున్నాయి....
ఆ పోనీలే అది పంది, మనం మనుషులం - దాని పన్నీరుకి, మన బురదకి బోలెడు తేడా ఉన్నదని దులిపేసుకుపోతే ఎవడు ఏం చెయ్యలేడు కానీ....
you dared to air your views sir
ReplyDeletekudos
waste of time and breath, my friend.
ReplyDeleteమాగంటి గారూ,
ReplyDelete[కానీ ఆ వాక్యం చదవగానే రెక్కలు తొడిగిన ఊహలు మాటల్లో పెట్టేద్దామని చేసిన ప్రయత్నం ఈ క్రింది విధంగా తేలింది]
ఈ ఒక్క వాక్యముతో ఆ విమర్శ విలువను తేల్చేసినట్టున్నారు! ఇటువంటి చవకబారు రాతలకు ఆంధ్రజ్యోతి పెట్టింది పేరు.
కొత్తపాళీ గారూ,
వృధా అనో మరోటో అనుకుని అందరూ గమ్మున ఉంటే పిచ్చివాగుళ్ళే నిజం అనుకునే పరిస్థితి రావచ్చు.
Hmmm, Sehwag style hard-hitting :)
ReplyDeleteఒహడు చెయ్యడు, ఇంకోడు చేస్తే ఓర్చుకోలేడు అని అనిపించడంలో తప్పు లేదుగా?
ReplyDelete________________________________________________________________
ముఖ్యంగా తమను తామే గొప్పగా ఊహించుకునే చౌకబారు రచయితల విషయంలో అంతే మరి
పిచ్చి బాగా ముదిరి పోతోంది జనాలకు. ఈ రాతలు చూసే నన్నమాట ఆ పెద్దాయన బాధ పడ్డారు.
ReplyDeleteఖదిర్ బాబు పత్రికల్లో కధలు వ్రాస్తారు. ఈ మధ్యకాలంలో నాకు రచయిత పేరు గుర్తుపెట్టుకోవాలని పించే కధలు ఈయనవే కన్పించాయి. తీసివేయ దగ్గ వ్యక్తి కాదు.
అసలు హీరో గారి పేరు నేను ఎక్కడా వినలేదు. పేరు రావటానికే వ్రాసి ఉంటారు. అయినా వ్రాయటానికి అర్హతలేముంటాయి? ఎవరు పడితే వారు వ్రాయటం ఎట్టాగో పబ్లిష్ చేయించుకోవటం. పత్రికలకు కూడా ఎక్కువ తిట్లు పడితే సంతోషం, సంచలనం అని చెప్పుకోవచ్చు. అందరూ వ్రాసినట్లు కాకుండా తిక్కగా వ్రాస్తేనే ప్రచురిస్తారు. తిక్కగా వాగితేనే టి.వీ లో చూపుతారు.
బాగా గడ్డి పెట్టారు. ఇలాంటివి కనీసం పది వ్యాసాలైనా కావాలి. గడ్డి ఒకటే సరిపోదుగా, కుడితి కూడా పడాలి.
ReplyDeleteతెలుగులో పేరు రాసుకోలేని ఒకాయన తెలుగు కథల సంకలనం మీద విమర్శ చేయడం వల్ల ఇప్పుడు బయల్దేరిన శని ఏవంటే - ఇకమీదట ఎవరు ఇలాంటి ప్రయత్నం చేయాలనుకున్నా మనశ్శాంతిగా చేయలేరు.పోనీ అలాగని నిజంగా తెలంగాణా మీద ప్రత్యేకశ్రద్ధ చూపించి తెలంగాణా రచయితలను గురించి తెలుసుకుని, కేవలం తెలంగాణాలో ఉన్నకారణాన నెత్తిన మోస్తే - మరో ఫైర్ బాబా (లేదా పంచభూతాల్లో మరో భూతబాబా) బయల్దేరి, చూడున్రి, మీ వాళ్ళే తెలంగాణాను గుర్తించిన్రు, మా తెలంగాణా మాగ్గావాలె అన్నా అంటాడు.
ఛీ ఛీ - భాషానపుంసక జాతి అని ఒకాయన అప్పుడెప్పుడో అంటే నాకు మంట రేగి అప్పట్లో ఆయనమీద విరుచుకుపడినట్లు గుర్తు. ఇప్పుడు దౌర్భాగ్యపు జాతి అని మన మిత్రుడు అంటే ఏమీ అనలేక ఊరుకున్నాను. అవును. మనది ఎంతైనా దౌర్భాగ్యపు జాతేగా.
సృజనాత్మక సాహిత్య,కళా రంగాల్లోనూ దామాషా పద్ధతిన తమక్కూడా వాటాలుండాలని వాదించే మూర్ఖత్వాన్ని కొలవడానికి ఎవరైనా కొత్తగా ఏదైనా మీటరు కనిపెట్టాల్సిందే! అది వీళ్లకు అణువణువునా పనికొస్తుంది ఇకపైన!
ReplyDeleteప్రతి విషయంలోనూ వివక్షనే చూడ్డానికి అలవటు పడ్డ వీళ్ళ కళ్ళు ఇహ తెరుచుకునేలా లేవు!
వీళ్ల మూర్ఖ వాదనలకు కొన్ని పత్రికలు కూడా ఆజ్యం పోసి పబ్బం గడుపుకుంటూ, తమాషా చూడ్డం మరీ ఘోరం!
ఏం చేస్తాం? రవి గారు చెప్పినట్టు దౌర్భాగ్యపు జాతేగా మనది! కానీండి, ఎన్నాళ్ళు చేస్తారో ఈ దాష్టీకాలు..చూద్దాం!
కామెంటు చెయ్యటానికి, సమయం వెచ్చించిన వారందరికీ ధన్యవాదాలు...
ReplyDeleteబాగా చెప్పారు.
ReplyDelete