ష్..ష్....మనలో మన మాటండి.....మా ఆవిడ - "మీది అల్లాటి ఇల్లాటి చేతిరాత కాదు, అందుకని ఆ చేత్తో కాస్త ఇది రాసిపెడుదురూ....అది రాసిపెడుదురూ" అని ఓ ఉబ్బేసి, తన ఎం.పి.3 మ్యూజిక్ కలక్షన్లోంచి కొన్ని ఎం.పి.3 లు ఎత్తి - నా మీదకు విసురుతూ ఉంటుందని శాక్రమెంటో రేడియోలో వార్త ....
ఆ ఉబ్బానందం తట్టుకోలేక అలా వేళ్ళు, చేతులూ నొప్పులు పెట్టేదాకా రాసిపెడుతూ ఉంటానన్నమాట.....అదే ఆ హెడ్డింగు కథ, అదే ఆ హెడ్డింగు కమామీషు అన్నమాట....
ఆలాటిదే ఒహ రాత ఇక్కడ....ఇహ మీరు తరించటం మిగిలింది......ఏం?
అప్పుడెప్పుడో మూడు సంవచ్చరాల క్రితం వినాయక చవితి ముందు వారం రాసిచ్చినట్టు గుర్తు...ఇప్పుడు మళ్ళీ బయటపడ్డది....బయట పడింది కదాని మీ మీదకు విసిరేస్తున్నా....చక్కగా కింద పడిపోకుండా పట్టుకో.... లేకపోతే గణపయ్యకు కోపం వస్తుంది....
మరే! ఎళ్ళెళ్ళవయ్యా!....చూసుకుంటాంలే.....
జాగ్రత్తగా చూడండేం? ఎన్ని తలకట్లు, ఎన్ని వత్తులు ఉన్నాయో?
ఎన్ని కట్లో, వత్తులో చెప్పినవాళ్లకు వీరతాడు....
ఎన్ని కట్లో, వత్తులో చెప్పినవాళ్లకు వీరతాడు....
భవదీయుడు
వంశీ
మీ చేతివ్రాత చాలా బాగుంది. ఏదో పెద్దవాళ్ళమైపోయామనుకుంటూ చెడగొట్టేసుకోలేదు... నాలాగా.
ReplyDeleteఅంతా చదివేసి ఊరుకుంటే నా మేష్టరు బుద్ధులెక్కడికిపోతాయి!! అంచేత కొన్ని సవరణలు-
'నవోదితార్క భాస్వరం', 'వరేభవక్త్రమక్షరం', 'మనస్కరమ్ నమస్కృతమ్' , 'కపోలదానవారణమ్', 'యో2న్వహమ్', 'హృదిస్మరన్ గణేశ్వరమ్', 'అష్టభూతిమభ్యుపైతి సో2చిరాత్'.
పదికి ఏడు మార్కులు వేస్తున్నా. నా కామెంటు చూశాకా 'నక్కలు బొక్కలు వెదకును' పద్యం గుర్తుతెచ్చుకోకండి దయచేసి.
అవునూ, మీకెంత ఓపికండీ బాబు!! ఇలా ఏమైనా పాటలకి సాహిత్యం కావాలని మా శ్రీమతి పొరపాట్న అడిగితే (ఎప్పుడూ అడగదనుకోండి), గూగుల్లో చూసుకో అని సమాధానం చెప్తా నేనైతే.
నేనూ ఓ తప్పు కనిపెట్టేశానోచ్!
ReplyDeleteమహేశ్వరం తమాశ్రయే
సంపూర్ణం. :))
ReplyDeleteసమ్పూర్ణమ్ అని రాయడమే కరెక్టు సంస్కృతంలో (తప్పైతే కాదు, కనీసం).
ReplyDelete@నాగమురళి:
ReplyDeleteదేవనాగరిలో రాసేప్పుడు 'సమ్పూర్ణమ్' correక్టే. కానీ తెలుగులో సున్నా ఎందుకు రాయ(కూడదో)రో!
అనునాసికాలన్నింటినీ ఒకే వర్ణంతో సూచించగలిగియుండీ, చదివేందుకు సౌలభ్యంగా ఉండే సున్నా ఎందుకు రాయ(కూడదో)రో!!
దేవనాగరిలో (संपूर्णम्) అని ఎందుకు రాయరు?
అనునాసికాలన్నిటికీ పూర్ణానుస్వారమే వాడితే ఇంక అనునాసికాలు ఎందుకు?
ReplyDeleteఖచ్చితమైన వ్యాకరణ సూత్రాల్ని కోట్ చెయ్యలేను కానీ, నేను గుర్తుపెట్టుకున్న విషయం చెప్తాను. హల్లులలోని ఏ వర్గంలోని అనునాసికాన్ని ఆ వర్గంలోని మిగతా హల్లులముందు పూర్ణానుస్వారానికి బదులుగా వాడాలి. (వర్గాలంటే క,చ,ట,త,ప వర్గాలు. వాటిల్లోని అనునాసికాలు ఙ, ఞ, న, ణ, మ.) ఉదాహరణలు -
గంగకి బదులుగా గఙ్గ అనాలి.
చంచల - చఞ్చల.
కంఠ - కణ్ఠ
నందన - నన్దన
సంభాషణ - సమ్భాషణ
అయితే ఈ సూత్రాన్ని మరీ గట్టిగా పట్టించుకోనవసరం లేదనుకుంటా. అలాగే తెలుగులో ఈ సూత్రాన్ని పాటించరనుకుంటా. నేను 'పణ్డితుణ్ణి' కాదు కాబట్టి పట్టింపూ లేదు, ఇంకా ఎక్కువ వివరాలూ తెలియవు.
నాగేస్రావ్ - వేళాకోళంగా ఉన్నా మంచి ప్రశ్నే విస్రేసార్ .....
ReplyDeleteనేనూ నాగమురళిగారిలానే "పణ్డితుడిని" కాను ....దేవభాష అంటే విపరీతమైన గౌరవం ఉన్నా, ఓనమాలు కూడా నేర్చుకోలా....అయినా నాకు తెలిసింది చెప్పే ప్రయత్నం చేస్తా....ఇదీ, ఈ క్రింద వ్రాయబోయేది అంతా దేవనాగరి లిపిలో ఎలా రాయాలో తెలిచ్చావదు...లేకుంటే అందులోనే చూపిచ్చే పని....
ఒకటే పదంలో ర, ష ల తర్వాత అచ్చులు గానీ, న, మ, య, వ లు కానీ చేరిస్తే అది "ణ" అయ్యి ఊరుకుంటుంది అని చదివినట్టు గుర్తు....అందుకే సంస్కృతంలో "పూర్" + "అనం" ఈ రెండూ కలిస్తే "సన్ధి" కుదిరి(చి) పూర్ణం చేస్తారని/అవుతుందని అప్పుడెప్పుడో ఎరికలోకి వచ్చింది.....అల్లాగే పదాంతంలో ఉన్న హల్లుకు అనునాసికం పరమైతే ఆ వర్గంలో ఉన్న అనునాసికం వైకల్పికంగా వస్తుందని కూడా చదివినట్టు గుర్తు. ఉదాహరణకి - "షట్" + "ముఖః" అని ఉన్నదనుకోండి....పైన చుక్క పెట్టకుండా....షణ్ముఖ అని వ్రాస్తాం....అదే సంపూర్ణానికి వర్తిస్తుందని అనుకోలు....
నాగమురళి అన్నట్టే ఈ సూత్రం తెలుగులో పాటించరనే నా నమ్మకం కూడా.....వెర్రితలలు కాకపోయినా సంస్కృతం / తెలుగూ భాఘా తెలిసున్నవారు - ప్రయోగాలు చేయాలనుకున్నవారు చేస్తారేమో అని అనుమానం కూడా........
నేను చెప్పింది తప్పు అయ్యుండొచ్చు కానీ, డాక్టర్ కొలిచాల సురేశ్ లాటి వాళ్లేమన్నా ఇల్లాటివి వివరించే పనికి పూనుకుంటే బాగుంటుంది.....
@ నాగమురళి - ఏడు తప్పులు పట్టేసుకుని మొత్తానికి ఏడు మార్కులిచ్చారన్నమాట.... :) ధన్యవాదాలు.....
ఇహ పోతే నేను పైనన్న మూడేళ్ళ క్రితం వినాయక చవితి తప్పు అని తేలింది....అది నాలుగేళ్ళ క్రితం వినాయక చవితి అట....అప్పటికి నాకు తెలుగే అంతంతమాత్రంగా వచ్చు....ఓహో ఛా! అవునా! తెలుగా? అంతంతమాత్రమా? అని మీరు మళ్ళీ ప్రశ్నవేసేరు.....ఊరకే అన్నా కానీ.... అయితే అప్పటికి సంస్కృతం - టీక ఉంటే తప్ప అర్థం తెలియని రోజులు....కాబట్టి బెత్తం దెబ్బలెయ్యకుండా ఒగ్గేయ్యొచ్చు....
అన్ని పాత దేవనాగరీగ్రంథాల్లోనూ పూర్ణానుస్వారమే ఉంటుంది, అనునాసికాలు ఉండవు. శాసనాల్లో కూడా అంతే! ఈ అనునాసికాల వ్యామోహం తమిళనాడు నుంచి సంస్కృత పండితులకు అంటుకున్నది ఎప్పుడో, ఎందుకో, ఎలాగో ! వాళ్ళ నుంచి హిందీవాళ్ళకి అంటుకుంది. ఉచ్చారణలో కరెక్టే అయినా వ్రాయడానికి అనునాసికాలు మహా ఇబ్బందికరం. అందుచేత సంస్కృత పదాల్ని కూడా అనునాసికాలతోనే లాగించేయొచ్చు. తప్పులేదు.
ReplyDeleteతాడేపల్లి గారు
ReplyDeleteఅరవల అనునాసిక వ్యామోహం సంస్కృత పండితులకు అంటుకోడం - ఇది కొద్దిగా ఆసక్తికరంగా ఉన్నది....ఇంకొద్ది సమాచారం / వివరాలేమన్నా వ్రాసి పంచుకోగలరు అని ఆశిస్తూ......
సరే అది అలా పక్కనబెట్టి - వ్యాకరణం గురించి తెలుసుకోవాలనుకునేవారికి ఉపయోగపడుతుందేమోనని ఓ చిన్న దండోరా - వెబ్సైటుకు వెళ్ళి, సాహిత్య భండారం పేజీలోకెళ్ళి, శ్రీ పుదూరి సీతారామ శాస్త్రి గారి ప్రశ్నోత్తరాంధ్ర వ్యాకరణం అని ఉన్న లంకె నొక్కండి....ఓ యాభై పేజీల పుస్తకమే....కానీ ప్రశ్న జవాబు రూపంలో చిన్న చిన్నగా - పాకెట్ బుక్కులా ఉండి అనంతమైన సమాచారాన్ని పంచుతుంది...ఆనందో బ్రహ్మ
"తమిళనాడు నుంచి సంస్కృత పండితులకు అంటుకున్నది"
ReplyDeleteతాడేపల్లిగారూ, అమ్మయ్య బ్రతికించారు. అరవలకు సున్నాలేదుకదా! విష్ణుసహస్రనామం జాలంలోంచి దించుకొని చదూకునేవేళ ఈఅనునాసికాలు ఊపిరాడనియ్యవు. పూర్తిగా పూర్ణానుస్వారాలతో తిరగరాసుకుంటా ఇహ.
నాగమురళిగారూ, సంయుక్తాలు కానప్పుడు అనునాసికాలు అవసరమే కదండీ.
మాగంటిగారూ, వేళాకోళంగా కాదుకాని, చాన్నాళ్ళనుండీ నన్ను వేధిస్తున్న అనుమానమిది.
కొలిచాల సురేశ్ గారి విశ్లేషణకై వేచిచూస్తూ,
వంశీ గారు,
ReplyDeleteమీ " ఉబ్బానందం" అర్థమయింది. మీ చేతివ్రాత మీ శ్రీమతి చెప్పినట్లు ( పేరు చెబుదురూ ప్రేమ గా...ఈ సారి నుంచి గుర్తు పెట్టుకొని పేరు రాస్తాను.ఈ శ్రీమతి లాంటి విశేషణాలు తీసేసి) చక్కగా ఉంది.
టపా కన్నా ఈ కామెంట్ల లోని చర్చ నచ్చింది. తప్పదు నాగమురళి గారో, తాడేపల్లి గారో మనకందరికీ సీరియస్ గా తెలుగు పాఠాలు చెప్పాల్సిందే. అది నా విజ్నప్తి.తప్పుల్లేని తెలుగు రాయాలని ఉంటుంది. నేర్చుకోవాల్సిన వయసులో శ్రద్ధ పెట్టకపోతే ఇప్పుడు ఇలాగే ఉంటుందని తెలుస్తోంది.
తెలుగు పాఠాలు చెప్పాల్సిందే....అలా అని ఓ ఉద్యమం లేవదీయొచ్చు......
ReplyDeleteమీ సంగతి అలా పక్కనబెదితే - నాకు తెలుగు పాఠాలకన్నా సంస్కృత పాఠాలు అవసరమెక్కువగా ఉన్నది....టీక టిప్పణి ఉన్న దానితో తిప్పలు లేకపోయినా, "పంచ షట్" లాటివి రాసినప్పుడు, అర్థం చేసుకోనప్పుడు, చేసుకోలేనప్పుడు కొద్దిగా బెరుకు కలుగుతుంది....తెలుగుతో ఆ తిప్పలు లేవు....
నా యొక్క పై వ్యాఖ్యలో చివఱి వాక్యాన్ని--
ReplyDelete"అందుచేత సంస్కృత పదాల్ని కూడా అనుస్వారాలతోనే లాగించేయొచ్చు. తప్పులేదు."
అని సవరించుకోవాల్సినదిగా ప్రార్థన. పఠితలను అయోమయానికి గుఱిచేసినందుకు క్షంతవ్యుణ్ణి.
పేరుతో పిలిచినా శ్రీమతి అనక తప్పదు గదండీ, శిష్ట సందర్భాలలో ?
తాడేపల్లి గారు,
ReplyDeleteశ్రీమతి అనకూడదని, అది మర్యాద తక్కువ అని కానీ నా ఉద్దేశం కాదు. కానీ వంశీ గారి శ్రీమతి గా మాత్రమే కాక పాపం ఆమెకంటూ ఒక పేరు వుంటుంది కదా. ఆమెకు శ్రీమతి వంశీ గా పిలిపించుకోవటమే ఇష్టమైనా, నాకు చక్కగా శ్రీదేవి గారు అని పిలుచుకోవాలని ఉంటుంది. అందుకన్న మాట..:-))