చాలా రోజుల తరువాత , నిన్న - సాఫ్టువేరు బోషాణం, అనగా హార్డ్ డ్రైవును బయటకు తీసా...
అందులో బయటపడిన "విమర్శిని - Annual Research Journal విశ్వనాథ వాఙ్మయ జీవిత విశేష సంచిక - జనవరి 1977" పిడి.ఎఫ్ ఫైల్లో ఉన్న ఒక ముత్యం - "నా తొలి రచన" - అనగా "విశ్వనాథ వారి తొలి రచన" - పంచుకోవాలనిపించి......
వారు అక్టోబరు 1941లో వ్రాసిన వ్యాసం ఇది.....
ఇదిగో ఈ క్రింద చదువుకోండి........
చక్కని చుఱకలు - ఇతరులకు వెయ్యటమే కాక తనమీద తాను వేసుకున్న చెణుకులు కూడా చూడండి
జ్ఞాపికానుబంధంలో ఉన్న జ్ఞాపకాలు, ముఖ్యంగా కొడాలి వారు, జలసూత్రం వారు, మల్లాది వారు - ఇలా ఎందరో మహామహులు అందించిన జ్ఞాపకాల జ్ఞాపికలు చాలా బావున్నవి....
వ్రాత, మాట, భాష - నమోన్నమః
ఆచార్య కేతవరపు రామకోటి శాస్త్రి గారు ఎడిటరుగా, సుప్రసన్నాచార్య గారు అసొసియేట్ ఎడిటరుగా ఈ జర్నల్ నడిచిందని ఆ ఫైలులో ఉన్నది....ఈ జర్నల్ గురించిన ఇతర వివరాలు తెలిసినవారు, ఒకవేళ ఆ జర్నల్ యొక్క కాపీలేమన్నా మీ వద్ద ఉంటే పంచుకోగలరన్న ఆశతో.....
భవదీయుడు
వంశి.....
PS: ఆ Journal విషయసూచిక ఇదిగో ఇక్కడ....






పెద్ద సారు గారి తొలి రచన అద్బుతం.మీ ఇంటికి యీ నిధుల కోసం కన్నం వెయ్యాలి అని వుంది.thanks for sharing vamsi garu.
ReplyDeletethanks vamsi garu for sharing such a nice piece.
ReplyDeletesatyasai
బహు కృతఙతలు.
ReplyDeleteవిజయవాడలో విశ్వనాథవారి ఇల్లు చూస్తూంటే ఆయన కళ్ళముందుకు వచ్చినట్టు అనిపించింది. ఇప్పుడిది చదువుతూంటే ఎదురుగా కూచుని నాతోనే చెప్తున్నట్టు అనిపిస్తోంది. మరోసారి ధన్యవాదాలు.
సత్యసాయి గారు - బహుకాల దర్శనం
ReplyDeleteమురళీకృష్ణ గారు - :)
అన్వేషి గారు - కన్నాలేస్తే ఏం దొరక్కుండా అన్నీ మా రామారావు దగ్గర భద్రపరచా! వాడు 2000 డాలర్లు పోసి కొన్న పేద్ద సేఫ్టీ బాక్సే అన్నిటికీ శ్రీరామ రక్ష.... :)
వంశీ గారూ! ఆ జర్నల్ నెట్ లో ఎక్కడైనా దొరుకుతుందా... లింకులేమైనా ఉంటే ఇవ్వగలరు.. అందులో ఉన్న చాలావరకు వ్యాసాలు సంపాదించగలిగాను. కొన్ని లేవు...మీ వద్ద లింకులేమైనా ఉంటే అందించగలరు... ధన్యవాదాలు
ReplyDeleteకౌటిల్య,
ReplyDeleteఈ పుస్తకం అంతర్జాలపుస్తకకల్పవృక్షంలో (అదే, DLI:)) ఉంది.
http://www.dli.gov.in/scripts/FullindexDefault.htm?path1=/data/upload/0002/284&first=1&last=451&barcode=2020120002283
కామేశ్వరరావు గారూ!
ReplyDeleteబాబోయ్! మీరివ్వాళ నాకు పేద్ద బహుమతిచ్చారు.డౌన్లోడు చేసేస్తున్నాః)...అసలు DLI అంతా మీకు బుఱ్రలో ఉంటుందనుకుంటా.;).ఆ కల్పవృక్ష సముద్రంలో పడి ఎలా వెతుకుతారండీ బాబూ!... మీకు శతసహస్ర వందనాలు...
ఇందులో చివరిపేజీ లేదు..ః(.. చెళ్ళపిళ్ళవారు రాసింది..ః(..వాఆఅ..వాఆఆ..
కౌటిల్య
ReplyDeleteనా వద్ద ఉన్న పి.డి.ఎఫ్ కాపీ పంపించాను మీకు - ఈమెయిల్లో.
ఈమెయిలు పంపించాక ఇప్పుడే చూశాను...అర్కైవ్.ఆర్గ్ లో vimarshini అని సెర్చి చేసి చూడండి...మొదటి పుస్తకం అదే....