ఒరే రామారావు, మళ్లీ ముంబైలో పేలుళ్ళు జరిగినాయిరా....ప్రస్తుతానికి 8 మంది మరణం, 70 మంది క్షతగాత్రులట...
ఎప్పుడు ఒక రాజకీయ సంక్షోభం వచ్చినా, వస్తుందనుకున్న అనుమానం ఉన్నా , ఏ ప్రముఖులు అన్నా ఇబ్బందుల్లో ఉన్నా చక్కగా పక్కదారి పట్టిస్తూ ఉంటారన్నమాట మనకు తెలిసిందే గదరా. ఇది కూడా అలాటిదే అయ్యుంటుందని నా అనుమానం. అనుమానం నిజమైనా కాకపోయినా పాపం ఏ ఇబ్బందులైనా సామాన్యులకేగా - ప్రాణాలైనా, ధరలైనా, జీవితమైనా? May God Bless The Politicians
అలా అనమాకురా ఒరే, మనకు దేశభక్తి లేదనుకునేరు....
ఎవడురా నా కన్నా దేశభక్తుడు? చేతకాక - దేశాన్ని, మనుషులని రక్షించుకోలేని దద్దమ్మల్లా ఉండటమే దేశభక్తైతే........
ఆపెయ్యి ఆ బుసలు ఆపెయ్యి - సరే కానీ టెర్రరిష్టులంటారు, ఆనవాలు తెలుసంటారు, ఎవరు చేసారో తెలుసంటారు - మరి ఉపేక్ష ఎందుకంటావు?
అందుకే నిన్ను వెఱ్ఱిమాలోకం అనేది. ఆ వెఱ్ఱి కుదిరినప్పుడు అదే అర్థమవుతుందిలే...
వంశీమోహన్‍గారూ!నాకూ ఇదే అనుమానం వచ్చింది.ఇలాంటి రాజకీయాలలో మనోళ్ళు బాగా ఆరితేరారుకదా!
ReplyDelete