శ్రీ కె.ఎ.అబ్బాస్ 1968లో రచించిన When Night Falls నవలని, శిల్పసౌందర్యం ఏమాత్రం చెక్కుచెదరకుండా తెలుగులోకి అనువదించిన ఘనత శ్రీ దొడ్డవరం కామేశ్వర రావు గారికి దక్కుతుంది. "చీకటి పడ్డాక" అనే పేరుతో 1975 సంవత్సరంలో ప్రచురించినవారు ఎమెస్కో వారు.
ఆ నవలలోని విశేషాలను ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం నుండి ప్రతివారం ప్రసారమయ్యే లిటరరీ భోజన హోటల్ - ఉదయతరంగిణి కార్యక్రమంలో వివరించినవారు శ్రీ పైడి తరేశ్ బాబు గారు.
ఎప్పటిలానే చాలా చక్కగా వివరించారు.
ప్రతివారం ఒక వండిన వంటకాన్ని శ్రోతలకు అందించే ఈ ప్రయత్నం అభినందనీయం
ఎక్కడ వినవచ్చా?
ఇక్కడ - ఈ లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "ఆకాశవాణి కార్యక్రమాలు" లంకె నొక్కి, ఆ తర్వాత ఇతర కార్యక్రమాలు లంకె నొక్కి వినొచ్చు!
భవదీయుడు
మాగంటి వంశీ
0 comments:
Post a Comment
ప్రొఫైల్ లేని వారి కామెంట్లు, బ్లాగులు/ఊరు పేరు లేని వారి కామెంట్లు, టపా స్ఫూర్తికి విరుద్ధంగా చేసే కామెంట్లు, చెత్త కామెంట్లు నిర్దాక్షిణ్యంగా తొలగించబడతాయి. అందుకు సిద్ధమైన వారు నిరభ్యంతరంగా కామెంటు రాయవచ్చు.