"నర్తనశాల" హరికథ - కథకులు శ్రీ ముదపాక (మండపాక ??) బాలసుందరం.
నవరసాలు అలాగ్గా అలా జాలువారిపోయి మన మీద పడిపోతున్నాయా అన్నంత ఇదిగా శ్రోతలను రంజింపజేసి, మధ్యలో అవసరమైన ధిక్కారం , దర్పం, వాక్పారుష్యం బిట్లు బిట్లుగా వేసేసి షడ్రుచులు వడ్డించేసారు ఈ హరికథలో.
ఈ హరికథ ఈయనే చెప్పాలన్నంత, ఈయన చెపితేనే వినాలన్నంత బ్రహ్మాండంగా ఉన్నది.ఒకవేళ ఎస్వీ.రంగారావు గారిచేత నర్తనశాల హరికథ చెప్పిస్తేనో, చెప్పించి ఉంటేనో ఆయన వెర్షను ఈ వెర్షను ముందు దిగదుడుపేనేమో అన్న ఓ చిన్న అనుమానం కూడా పొడసూపింది.
అయినా అసలు రంగారావు గారు హరికథా గానం చెయ్యటమేమిటి సుబ్బారావూ?
ఊరకే ఐడియా బాగుందని రాసా! "నర్తనశాల" కీచకులు వారేగా!
వెరైటీగా కీచకుల వారి చేతే హరికథ చెప్పిస్తే?
ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారం
ప్రసార తేదీ: మే 24, 2011
ఆడియో సౌజన్యం: మాగంటి వంశీ
ఎక్కడ వినవచ్చా?
ఇక్కడ - ఈ లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "ఆకాశవాణి కార్యక్రమాలు" లంకె నొక్కి, ఆ తర్వాత హరికథా కార్యక్రమాలు లంకె నొక్కి వినటమే!
భవదీయుడు
మాగంటి వంశీ
0 comments:
Post a Comment
ప్రొఫైల్ లేని వారి కామెంట్లు, బ్లాగులు/ఊరు పేరు లేని వారి కామెంట్లు, టపా స్ఫూర్తికి విరుద్ధంగా చేసే కామెంట్లు, చెత్త కామెంట్లు నిర్దాక్షిణ్యంగా తొలగించబడతాయి. అందుకు సిద్ధమైన వారు నిరభ్యంతరంగా కామెంటు రాయవచ్చు.