ఉన్నట్టుండి నిన్నో మొన్నో శ్యాం నారాయణ గారికి దాసరి వెంకట రమణ గారు ఆయన దగ్గరున్న కాపీని స్కాన్ చేసి పంపటం, శ్యాం నారాయణ గారు ఆ కాపీని అందరితో పంచుకోటంతో ఆ నా బాధ మొత్తం తీరిపోయింది.
ఆ సూవెనీర్ లోని ప్రముఖుల / సాహితీకారుల చిత్రరాజాలు కొన్ని ఇదిగో మీకోసం....
ఆ సూవెనీర్ లోవే కాకుండా ఇతర ఫోటోలు కూడా జతపరిచాను ఇక్కడ..
దాసరి గారికి, శ్యాం నారాయణ గారికి బోల్డు ధన్యవాదాలతో
ఇహ మీరు ఆనందోబ్రహ్మ అయిపోవచ్చు......ఒక్కొక్క మహానుభావుడి వివరాలు సవివరంగా రేపో ఎల్లుండో.....
ఇచ్ఛాపురపు జగన్నాథ రావు
ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి
జమ్ములమడక మాధవరాయ శర్మ
జటావల్లభుల పురుషోత్తం
కలాపాటపు రామగోపాల రావు
కొర్లపాటి శ్రీరామ మూర్తి
మానవల్లి రామకృష్ణ కవి
కాశీ కృష్ణాచార్యులు








































$వంశీ మోహన్ గారు
ReplyDeleteకృష్ణా పత్రిక పెద్దల౦దరి చిత్రరాజాలను ఇంతకాలం అపురూపంగా దాచడమేగాక శ్రమ కోరి ఇక్కడ ప్రచురించి మాతో పంచుకున్నందులకు కృతజ్ఞతలు!
శ్రీ దాసరి గారికి, శ్యాం నారాయణ గారికి నావీ బోల్డు ధన్యవాదాలు :)
ధన్యవాదాలు.
ReplyDeleteవంశీ గారు
ReplyDeleteఆ వజ్రోత్సవ సంచిక డిజిటల్ కాపినీ నాకు వేగు చేయగలరా ...? 00drk00@gmail.com కుదరకపోతే scribd.com లో అప్లోడ్ చేయవలసిందిగా మనవి. ఇక్కడ ఈ కొన్ని చిత్రాలు ఉంచినందుకు కృతఙ్ఞతలు.
జమ్మలమడక మాధవరాయశర్మగారి నవల ఒకటి ఈ మధ్యే నావద్ద పాతపుస్తకాల దుకాణంలో దొరికింది. అలాగే ఆయన సంస్కృతం దశకుమారచరితం పూర్వపీఠికను తెనుఁగు చేశారు. ఆ పుస్తకపు డిజిటల్ కాపీ నావద్ద ఉంది. ఆ పుస్తకం చదివిన దగ్గర నుండి ఆ మహానుభావుడి వివరాలు వెతుకుతున్నాను.
ReplyDeleteవంశీ గారూ, మీరు ఇవన్నీ డిజిటైజ్ చేసి మాకు ఎప్పుడిస్తున్నారు? :))
అన్ని ధన్యవాదాలు, అభినందనలు - దాసరి గారికి, శ్యాం గారికి.....వీరిద్దరికే...
ReplyDelete@దేవభక్తుని - మీకు ఈమెయిలులో పంపిస్తాను
@రవి - All I can say is - He's an outstanding gem and one of a kind - డిజిటైజు చెయ్యాలండీ.... సమయమే దొరకట్లా....చేసినప్పుడు తప్పక మీకు తెలియచేస్తాను....
వంశీమొహన్ గారూ పాత కృష్ణా పత్రిక లత పత్రికలలో సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచర్యులుగారి గురించి ఏవైనా పపెర్ కటింగ్స్ మీవద్ద వుంటే దయచేసి
ReplyDeleteజమ్మలమడక మాధవరాయశర్మ గారు,దాశరధి గారు,సముద్రాలగారు ఎందరోమహనీయులను దర్శించే భాగ్యం చిన్నతనాన్నే మాకు కలిగింది.మా నాన్న గారి జ్ఞాపకాలను సేకరించటంలో మాకు సహకరించగలరని ఆశిస్తున్నాను.
అనురాధ గారూ - చూసి ఏవన్నా ఉంటే, ఆ ఉన్నవి స్కాన్ చేసి పంపించటానికి ప్రయత్నిస్తాను...స్కానింగుకు కొద్దిగా సమయం పడుతుందని సవినయంగా తెలియచేసుకుంటున్నాను.......వీలున్నప్పుడు మీ ఈమెయిల్ వివరాలు contact@maganti.org కు పంపండి...
ReplyDeleteశ్రీ వంశీ మోహన్ గారికి నమస్కారం
ReplyDeleteఅందుకొన్న వెంటనే సత్వరమే స్పందించి ఆ అరుదైన విషయాలను మీ బ్లాగులో ప్రచురించి నందుకు మీకు ధన్యవాదాలు. అభినందనలు.
దాచివుంచుకోవడం కాదు పంచుకోవడంలో వున్న ఆనందాన్ని అనుభవంలోకి తెచ్చినవాడు శ్యామ్నారాయణ ఏ ప్రశంసలకైనా అతడే పాత్రుడు.
దాసరి గారు
ReplyDeleteనమస్కారం....నేను చెయ్యలేని, బద్ధకం ఎక్కువై చెయ్యని పని మీరు చేసారు కాబట్టి మీది సింహభాగం.....ఇలాటివి ఒక్కరి పని కాదుగా! పని చేసినందుకు మీరు, పంచుకున్నందుకు ఆయనా - అన్ని అభినందనలకూ మీ ఇద్దరూ అర్హులే! మీలాటివారు ఇంకా బోల్డు మంది కావాలి మనకు !
వీళ్ళంతా ఎవరో నాబోటి పామర జనాలకి ఎలా తెలుస్తుందంటారు??
ReplyDeleteశ్రీ యుతులు మాగంటి గారు!
ReplyDeleteనమస్తే!
ఇప్పుడే మీ జాను తెలుగు సొగసు లో ఆ నాటి కృష్ణా పత్రిక చూసాను.
నిజం గానే బోల్డ్ సంతోషం వేసింది.
ఇన్నాళ్ళకి నాకు బ్లాగ్ లో రాయాలని పించింది
మీరు చేస్తున్నది ఎందరికో చాలా చాల ఉపయోగం, మీ ప్రయత్నానికి
మా శుభా కాంక్షలు
మణి