తపేళా బిళ్లలు నాయనా!
తపేళా బిళ్లలా? అంటే?
తప్పు తప్పు...చెవుడొస్తే తపాలా కూడా తపేళాలానే వినపడుతుంది...కొండొకచో కనపడుతుంది!!
చెవులకు కనపడుతుందా? ఓహో! కొత్త విషయం నేర్చుకున్నాను నాయనా నీ పుణ్యమా అని...సరే కానీ సంగతి చెప్పు..
ఏమీ లేదబ్బాయీ! రెండో బోషాణం తీసా! అందులో ఎవరికీ కనపడకుండా ఎప్పటినుంచో దాస్తూ వస్తున్న తపాలమ్మ కనపడింది....బయటకు తియ్యి నాయనా, ఊపిరాడటల్లా ఇక్కడ, పైనుంచి ముక్కిపోతున్నాను కూడానీ - అని వేడుకుంది...సరేనని బయటకు తీసా, ఫోటోల్లో పట్టేసా, ఇక్కడ పెట్టేసా...
అసలు మొత్తం ఎన్నున్నాయి తమరి దగ్గర? 5,60,000 స్టాంపులు ఉండేవి.. ఆరేళ్ల క్రితం షికాగో నుంచి శాక్రమెంటో మూవ్ అవుతున్నప్పుడు ఓ లక్ష స్టాంపుల డబ్బా గల్లంతైపోయింది. పోష్టలు వాడు ఇన్స్యూర్ చేసినందుకు 400$ ఇచ్చి చేతులు దులుపుకున్నాడు...కానీ ఆ పోయిన లక్షా తిరిగిరావుగా...ఇప్పుడు 4,70,000 స్టాంపులు మటుకు ఉన్నాయి....ఓ 50,000 స్టాంపులు ఆల్బమ్ముల్లోకి ఎక్కేసున్నయి....ఇంకా 4,20,000 స్టాంపులు ఆల్బమ్ముల్లోకి ఎప్పటికెక్కేనో! ఎట్టెట్టా? లక్ష పోతే 4,60,000 రావాలిగా లెక్క ప్రకారం....అదే పప్పు సోమేశ్వర్రావు గారూ, అలా అడుగుతారనే మీరంటే యమా ఇది నాకు...పైన పదివేలు ఈ మధ్యలో వచ్చి చేరినవన్నమాట!
తపాలమ్మ ఇరుక్కుపోయిన డబ్బాల్లో సాంపిలు డబ్బా ఒహటి
కొన్ని తపాలమ్మలు మీ కోసం - ఆఫ్ఘనిస్తాను, బెలారూస్, క్యూబా, రొమేనియా, రష్యా దేశాలవి
మరి భారద్దేశంవి లేవా? ఉన్నాయి - ఇక్కడ
అల్లప్పుడెప్పుడో తీరికున్నప్పుడు ఎన్వలప్పుల్లో పెట్టిన తపాలమ్మలు ఇక్కడ
వైష్ణవి సాయం ఇక్కడ - రోజు విడిచి రోజో, మూడు రోజులకోసారో ఆవిడకు పని కల్పిస్తూ ఉంటానన్నమాట...
అమ్రికా సారువాడి 50 రాష్ట్రాల "బర్డ్స్ అండ్ ఫ్లవర్స్" ఫర్స్ట్ డే కవర్లు (1967 వ సంవత్సరం), స్టాంపుల ఆల్బమ్ము ఇక్కడ..ఈ ఆల్బమ్ములోనే జపాను వాడి ఒక్క షిల్లింగు నోటు, ఇంకా బోల్డు పాత నోట్లు వివిధ దేశాలవీ ఉన్నాయి...ఫుటోలు తీస్తే ఎందుకో సరిగ్గా రావట్లా...సంగతి చూడాలి...
ఇతరంగా ఉన్న 34 అల్బమ్ముల్లో కొన్ని - ఇవిగో
ఎవ్వరికీ సూట్టానికి కూడా ఇచ్చేది లేదండోయి....మొహమాటంగా అడిగినా, నిర్మొహమాటంగా చెప్పేస్తా...లేదనీ, పోయి పని చూసుకోమని.... అయ్యా అదండయ్యా!!
సరే ఇయ్యన్నీ సూసేసారు కాబట్టండే - మీరు దొంగల్నంపకుండా నా జాగ్రత్తలో నేనుంటానండే....పొద్దుటేళే ఎల్లి బాంకు లాకర్లో ఎట్టొస్తా! ఇహ ఎవ్వుడికీ కనపడవండే....
ఉంటానండే..
వంశీ
Amazing!!!
ReplyDeleteకన్నం వేయాల్సిందే ఐతే. కనీసం రెండు భోషాణాలెత్తెయ్యాల్సిందే :)
పప్పు సోమేశ్వర్రావుగారు కూడా తవరికి తెలుసన్నమాట. ఇవన్నీ భారద్దేశానికి తరలించాలని మేమొక ఉద్యమం లేవదీస్తాం.
ReplyDeleteతంతే తపాలా బుట్టలో పడటం అంటే ఇదేనేమో
ReplyDeleteఒకటా..రెండా..వందలా..వేలా...లక్షల కొద్దీ తపాలా బిళ్ళలు....ఇంత భా........................................................................రీ ఎత్తు సేకరణ చూడటం ఇదే మొదటి సారి. అమ్మ బాబోయ్..... మీకు అన్ లిమిటెడ్ వీరతాళ్ళు.
అమ్మో!! భలే దాచారండి. గ్రేట్! మీ ఓపికకు జోహార్లు.
ReplyDeleteఐదు లక్షల స్టాంపులు!...అయ్య బాబోయ్..ఏం సేకరణ అండి. సేకరించటమే కాదు వాటిని ఇంత పదిలంగా భద్రపరిచినందుకు టోపీలు ఎత్తేసాం.
ReplyDeleteచిన్నప్పుడు ఓ వందో యాభయ్యో స్టాంపులు సేకరించి అహో నా దగ్గర ఎన్ని స్టాంపులున్నాయో అని మురిసిపోయేదాన్ని!
అర్జంటుగా మీ స్టాంపులకి దిష్టి తీసేయ్యండి.
అద్బుతం! మీ సేకరణ ,వీలుంటే నా బ్లాగ్ చూసి సలహాలు ఇవ్వండి
ReplyDeletehttp://stampsofandhra.blogspot.com/
aidu lakshalaaaaaaa???ammo ,.....too good..tappundaa records try cheyyandi...
ReplyDeleteఅయ్యా బాబోయ్!! లక్షల్లో స్టాంపులా!! అసలు ఈ పని మీద మీకెంత ఆసక్తి, ఇష్టం లేకపోతే.. ఇన్ని లక్షల స్టాంపులు సేకరించి ఉంటారో కదా... అని ఆలోచనలో పడిపోయా నేనైతే!
ReplyDeleteహమ్మో!
ReplyDelete@ మైత్రేయి, శంకర్, సుభద్ర, మధురవాణి, విజయమోహన్ గారు(ర్లు) - కామెంటుకు ధన్యవాద్!
ReplyDeleteభా.రా.రె - నాకు చింత లేదు.... :) కన్నమేస్తే పూడ్చడానికి ఇన్స్యూరెన్సు వాడున్నాడు. మీకు దొరికేది మటుకు సున్న...స్టోరేజిలోకి వెళ్లిపోయాయి ఆల్రెడీ...
అరుణ - ఉద్యమాలవసరం లేదు. లేవదీస్తే జరగబోయే విపత్కర పరిణామాలకు మీరే బాధ్యులు.. :) భారద్దేశం నుంచే వచ్చాయి అందులో కొన్ని. మా నాన్నగారికి ఇలాటివి "భాఘా" ఇష్టం. ఆయన 30 ఏళ్ల క్రితం అందించిన 6000 స్టాంపుల అల్బంలే ఇప్పుడు ఇన్ని లక్షలతో సావాసం చేస్తున్నాయి.....రోజుకు 24 గంటలు కాక 48 గంటలైతే బాగుండేది...ఇంకా చెయ్యవలసిన, చేసుకోవలసిన పనులు బోల్డు మిగిలిపోయాయి.... :)
సిరిసిరిమువ్వ - దిష్టి తీసేసా....తీసేసి మళ్లీ స్టోరేజీలోకి పంపించేసా....
కొడాలి శ్రీనివాస్ - సలహాలిచ్చేంతవాడిని కాదు కానీ - మీ బ్లాగు ఈవేళ తప్పక చూస్తాను.
బోధోపన్యాసముక్తావళి అని కాదు కానీ - నాకున్న ఒకటే నియమం..... Do what you can with what you have ...ఈ టపాకు ఆ నోటు ఎలా సరిపోతుంది అని ఆలోచిస్తున్నారా? శుభం!
సర్వేజనా స్సుఖినోభవంతు...
బాబోయ్!!!
ReplyDeleteyou mean with out any repetitions?
ReplyDeleteoh i see
వామ్మో
అయితే ఓఖే.....
బాబా గారూ
ReplyDeleteఅన్ని లక్షల స్టంపుల్లో "రిపిటీషన్స్/డూప్లికేట్లు" తప్పకుండా ఉంటవి.....ఇప్పటివరకు ఆల్బముల్లోకెక్కించిన 55,000 స్టాంపుల సమూహంలో, తీసి పక్కకు బెట్టినవి దాదాపు 1800 డూప్లికేటు స్టాంపులు .....ఆ డూప్లికేటువన్నీ ఎవరికన్నా ఇచ్చెయ్యాలని ఓ ఆలోచన ఉన్నది....అయితే మిగిలినవాటిని కూడా ఆల్బమ్ముల్లోకెక్కించేస్తే బయటపడే డూప్లికేట్లన్నీ కలిపి కట్టగట్టి స్టాంపులంటే ప్రేమ ఉన్నవారికి ఎవరికో ఒకరికి ఇచ్చేస్తా....అదెప్పటికయ్యేనో కానీ... :)
వామ్మో వామ్మో అవి స్టాంపుల లేక డబ్బులా? నాట్ imaginable lacks of stamps.....యు are రియల్లీ గ్రేట్....Na చిన్నపుడు 50 coins collect చేసి అందరికి చూపించి ఎంతో ఫీల్ అయ్యేవాడిని
ReplyDelete