కాపీలందు టివి.9 కాపీ వేరయా!
వీరి విన్యాసాలకు, కాపీలకు, అక్నాలెడ్జిమెంటులు లేని ప్రసారాలకు చెయ్యెత్తి జై కొట్టవలెను.
సంగతి ఏమనగా - ఈ మధ్య అనగా 12వ తారికున కాబోలు Legendary Cinematographer Sri Marcus Bartley గారి గురించి ఒక కార్యక్రమం ప్రసారం చేసారుట. దాని సంబంధించిన వీడియో లింకులు ఇక్కడ
FYI - If Clicking on the above link does not work - copy the below text and paste it in your browser
http://www.gulte.com/videos/watchvideo.php?mantra-nagari--cinematographer-marcus-bartley&vid=10017
ప్రసారం చేసినందుకు సంతోషమే! ఐతే మార్కస్ వారికి సంబంధించిన సమాచారం, ఫోటోలతో సహా 80+ % ఈ మదీయ వెబ్సైటు నుంచి ఎత్తి అక్కడ ఆ వీడియోలో పోసారు.
కనీసం అక్నాలెడ్జిమెంటు ఇవ్వాలన్న ఒక నీతీ, నియమం లేకుంటే ఎట్లా అన్నది ప్రశ్న!!
ఓవర్ లుక్ అయిపోయినదన్న సమాధానం వస్తే అంతకన్నా "సంతోషకరమైన" వార్త ఈ ప్రపంచంలో లేదని తెలియచేసుకుంటూ.....ఫెయిర్ యూసేజ్ కిందకు వస్తుందన్న సమాధానం వస్తే - అబ్బో! మరింత సంతోషకరమైన వార్త అనీ తెలియచేసుకుంటూ....
శ్రీ మార్కస్ బార్ట్లే గారి వెబ్సైటు కోసం అడగగానే వారి గురించిన అపురూపమైన వీడియోలు, ఫోటోలు అందించిన పరుచూరి శ్రీనివాస్, "సినిమా సినిమా" కార్యక్రమ సారధి శ్రీ సాయిచంద్, మార్కస్ బార్ట్లే వారి కుమార్తె మార్సియా గారికి హృదయ పుర్వక కృతజ్ఞతలతో.....
ఇంతకీ ఏమిటంటావు నాయనా?
మీకు పబ్లిసిటీ కావాలా? వెబ్సైటుకు పబ్లిసిటీ కావాలా?
నాకు కాదు చిన్నారి - వెబ్సైటు కోసం అపురూపమైన సమాచారం అందించిన ఈ పై ముగ్గురి కష్టం కోసం ఓ నిముషం బాధ పడ్డానన్నమాట...
కొసమెరుపు: ఒకాయన ఎవరో నెట్టులోనుంచి వీడియోలు డవున్లోడు చేసుకునిన్నీ, ఇలాటి టి.వి కార్యక్రమాలూ అవీ రికార్డు చేసుకునిన్నీ 300 Rs కి హైదరాబాదులో అమ్ముకుంటున్నారన్నమాట కూడా వినపడింది. ఇహనేం! ఏక్ నిరంజన్!
ఫలానా వారి సౌజన్యంతో అనిగానీ,వీరికి కృతజ్ఞతలు అని గానీ గతంలో ఎవరికన్నా చెప్పుంటే,,లేదు రానున్న 23శతాబ్దం లోనైనా చెప్తామని గానీ ఆలోచనుంటే మీకు అలాంటివి చెప్పొచ్చు.యెంత దురాశ మీది!!!???మీరు వారికో మెయిలు కొట్ట్టండి,లేదా ఫోను చెయ్యండి.వివరాలు ఇక్కడ:http://www.tv9.net/contact.html
ReplyDeleteలేదా వారెందుకో తెలీదుగాని Complaint Redressal అనే విభాగం కూడా పెట్టారు.అక్కడ మీకో పీడీయఫ్ ఫైలు దొరుకుతుంది.అద చదివి నిర్ణయించుకోగలరు.అది ఇక్కడ:http://www.tv9.net/websitetv9.pdf
రాజేంద్ర - :)
ReplyDelete