ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమైన నాలుగు ఆణిముత్యాలు. డాక్టర్ కె.బి.గోపాలం గారి సౌజన్యంతో...
అవి వరుసగా - బొందితో కైలాసం, ఇంటి నంబరు , ఊహల పల్లకీ , తస్మాత్ జాగ్రత్త నాటకాలు
**************************************************
తస్మాత్ జాగ్రత్త నాటకం వివరాలు
విజయవాడ కేంద్రం ప్రసారం
రచన: శ్రీ జంధ్యాల
నిర్వహణ: శ్రీ శంకరమంచి సత్యం
ఇందులో నటించినవారు:
శ్రీ శనగల కబీర్ దాసు
సి.రామ్మోహన రావు
కుమారి వి.బి.కనక దుర్గ
శ్రీ నండూరి సుబ్బారావు
శ్రీ విన్నకోట విజయరాం
శ్రీ ఏ.ఆర్.ఎస్.శర్మ
శ్రీ రామినేని రాధాకృష్ణ
శ్రీ పేరి కామేశ్వర రావు
శ్రీ లక్కా నరసింగ రావు
శ్రీ జి.శ్రీనివాస మూర్తి
************************************************
ఎక్కడ? ఇక్కడ
ఈ లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "పరిచయాలు - నాటికలు" లింకు నొక్కి వినవచ్చు
భవదీయుడు
వంశీ
ఈ నాటకాలు ( నాటికలా?) అందించినందుకు ధన్యవాదాలు. విన్న తర్వాత మళ్ళా చెప్తాము. గోపాలం గారికి కూడా ధన్యవాదాలు.
ReplyDeleteకల్పన గారూ
ReplyDeleteఅవి నాటికలనే పడవలె అచ్చులో.....కాపీ పేష్టు తప్పులు తప్పించుకోలేకపోయినందుకు అక్షరాల తరఫున క్షమాపణలతో......శిక్షగా, అనగా నాకు - ఈ టపాలో, నాటకాలు అని పడ్డ చోట మార్చబడవు....ప్రతిసారీ కనపడుతూ ఉంటాయి చక్కగా! అప్పుడు గుర్తుపెట్టుకుంటా! అదన్నమాట సంగతి...:)
ఇటేపు వచ్చినందుకు ధన్యవాదాలు, మప్పితాలు, నెనరులు......
నాటికకి, నాటకానికి తేడా ఏంటండి?
ReplyDeleteనాటకం - ఆంధ్ర ప్రదేశ్
ReplyDeleteనాటిక - కృష్ణా జిల్లా...
"టిక" అనబడు పదార్థము "టకం" లో ఓ భాగం.......
ఇంతకు ముందో వ్యాఖ్య రాశానే ఇక్కడ! రాలేదా?
ReplyDeleteఆలిండియా రేడియో వారి భాషలో పావు గంట లేదా అరగంట నిడివి లో ఉండేవి నాటికలు! గంట సేపు నడిచేవి నాటకాలూనూ!
నాటకము = అంకములు = ఆంధ్ర ప్రదేశ్
ReplyDeleteనాటిక = అంకము = కృష్ణా జిల్లా
ఏకాంకిక "నాటకములు" ఉన్నాయి కానీ, వాటి పరిస్థితి వేరు....
నేనుకూడా ఇన్నాళ్ళూ సుజాతగారు చెప్పినట్లుగానే (తక్కువ నిడివి ఉండేవి నాటికలు, ఎక్కువ, అంటే సుమారు గంట నిడివి (ముఖ్యంగా ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు విశాఖపట్నం ఆకాశవాణి కేంద్రంనుండి వచ్చేవి) ఉండేవి నాటకాలని) అనుకుంటున్నాను. ఇప్పుడు మీ వ్యాఖ్యలు చూసి అనుమానంతో అడిగా.
ReplyDelete