పద్యమొచ్చింది
పద్య పాఠకులొచ్చారు
పద్య విమర్శకులొచ్చారు
పద్యం పోయింది
పద్య పాఠకులు పోయారు
పద్య విమర్శకులు పోయారు
గేయమొచ్చింది
గేయ పాఠకులొచ్చారు
గేయ విమర్శకులొచ్చారు
గేయం పోయింది
గేయ పాఠకులు పోయారు
గేయ విమర్శకులు పోయారు
గద్యం వచ్చింది
గద్య పాఠకులొచ్చారు
గద్య విమర్శకులు వచ్చారు
గద్యం పోయింది
గద్య పాఠకులు పోయారు
గద్య విమర్శకులు పోయారు
చోద్యమొచ్చింది
చోద్య పాఠకులొచ్చారు
చోద్య విమర్శకులొచ్చారు
చోద్యం పోయాక ఏమొస్తుందో?
తెలీక అడుగుతున్నానబ్బాయీ - దేనికి తగ్గవారు దానికి ఉండరూ?..
మాల కొండయ్య గారి పుస్తకాల / కవితల ప్రేరణతో
(Post 403)
Wednesday, December 29, 2010
Thursday, December 23, 2010
ఎందుకు చెపుతాను వెఱ్ఱికుంకా! - (Final Part)
************************************************************************
మఱి ఏలాగున నుండవలెనని యడుగుచున్నారా? ఎట్టిపిచ్చిలో నేవిధమైన వెగటును లేదో, ఎట్టియున్మాదము పాఠకోద్ధరణపటిష్ఠమో, యెట్టిమతిమాలిన తనములో జ్ఞానవిజ్ఞానములు దుర్నిరీక్ష్యమైన తేజస్సుచే వెలుగునో, యెట్టి వెర్రికి వేయివిధములు కాక కోటివిధములయ్యును పాఠక గ్రహణవిధాన మనునొక్కటే విధానమున్నదో, యెట్టి వెఱ్ఱి వెఱ్ఱులన్నిటికంటె వెఱ్ఱిదో యట్టి వెఱ్ఱిని, నట్టి వెఱ్ఱిలేని వెఱ్ఱిని గలిగి తాను ధన్యతఁ జెంది పాఠకుల ధన్యులఁ జేయు నాతఁడు కవి. ఇప్పుడైన నట్టిపిచ్చిలక్షకుఁ గోటి కెవ్వనికైన నుండినయెడల వాఁడు కవితాగానము చేయవచ్చును. అంతేగాని వాని కవిత్వమున నేదో ఘనత యున్నదని నిరూపింప అసందర్భకవితలు సృజించి యకాలపు వెర్రులై పాఠకుల కాపత్తుఁ దెచ్చిపెట్టుట పాటిఁగాదు. కవిత్వము గుణములో నున్నదికాని గణములో లేదని తెలుసుకోవలె. అభిప్రాయప్రకటన సమంజసముగానుండుటయే కావలసినది.
ఆ "జ్ఞానము" నంతను సంపాదించవలెనన్న కోరిక యుండవలెనుగాని "అజ్ఞానము" సంపాదించవలెనన్నఁ గోరికకుఁ దోడుపడనక్కఱలేదు. కొద్దిమంది పాఠకులేదైన నొక కవితనామోదించి యా కవిని, కవితను పొగుడుట సిద్ధించునెడల ఓహో వ్రాయవలసిన పద్ధతి యదియే కాఁబోలని తామరతంపరగా లోపల నీయపోహకు లోనైయుండకఁ దమ శక్త్యానుసారము, జ్ఞానానుసారము, విచక్షణానుసారము, అనుభావానుసారము, అనుభవానుసారము వ్రాయవలెను. వ్రాసినదే వ్రాయక, వ్రాతలకు పదును పెట్టుకొనవలెను.
అదియటులించినఁ బాఠకులలోఁ దక్కువవారు లేరు. నూటి కెనుబదుగురు రసగ్రహణమునఁ గేవలము మూఢులు. పామర కవితలఁ గవుల తయితక్కలకు బళీయందురు కాని రసప్రాప్తి, రసాస్వాదన యొక్క ముడుల చిక్కువిప్పిన కవితలుఁ దలకెక్కవు. కుక్కగొడుగులేవో, గులాబులేవోఁ దెలియని పాఠకులు అనుచిత కరతాళధ్వనులు మాఁని రసప్రపంచమనగనేమో ముందు తెలుసుకొనవలె. తెలిసినంత ఆలోచించవలె. ఆలోచించినంత ఆస్వాదించవలె. మామిడిపూఁత మసూచిపోఁత యొకటే యన్న, గోరంటపూవు వాసన యెట్టిదో కప్పకూఁతలట్టివి యన్న యెవరికి ముదములందును? ఆ జ్ఞానమును సంపాదించికొనవలె. అన్నియు బహిర్గతాంతసత్త్వములే. కవితలలో మంచివానిని బహుమానింపవలెను. చెడ్డవానిని బహిష్కరింపవలయును.
సమకాలీనఁ గవులలో కొలదిమంది, చాల కొలదిమంది శక్తివంచన లేకుండ శారదాదేవి పూజకై నిజమైన కవులుగాఁ బాటుపడుచున్నారో చూడుడు! ఇన్ని పాటులుపడి యేమి బాధాప్రతిఫల మొందుచున్నారో యెఱుఁగుదురా? ఎందులకు ? వారు వ్రాసిన కవితలు రచనలు మంచివో చెడ్డవో చూచినతరువాతఁగదా తెలియవలసినది? అట్లు చూచినవా రెవరు? చూచుట కోపిక యెవరికి? చూచుటకుఁ దీరిక యెవరికి? చూచుట కంత భాషాభిమాన మెవరికి? కవితాభిమామెవరికి? రసానుభవమెవరికి? చూచుట కక్షరజ్ఞానమైన నెందఱకు?
ఆంధ్ర పాఠకులలో విరివిగా లెక్కచూచుకొనిన యెడల నూటికిరువదిమంది కాంధ్రభాషాజ్ఞాన మున్నదేమో! యా యిరువదిమందిలో పదుగురకు కవితాజ్ఞాన మున్నదేమో! ఆ పదుగురిలో నిద్దఱకు కోతులభాగవతమునందున్న ఆసక్తి గోవిందనామస్మరణ యందు లేదు. మరినిద్దఱు తామేఁ బండితులమని విఱ్ఱవీగుచు మిగిలినారుగురి నెత్తిన మొట్టుచుంటిరి. ఈ పైమొట్లనుదించుఁ మిగిలిన యారుగురిలో ముగ్గురుఁ దమక్రింది మెట్టున నున్న ముగ్గురిని మొట్టుచున్నారు. ఈ సయ్యాటలుఁ యెప్పటికి యాగునో ఆ భగవంతునికేఁ దెలియవలె!
ఇదివఱకు మనము కాంచిన మహాకవులందరు గతించినారు. వారంతా ఒడలు జలదరించునట్లు, కనులు కృతార్థములగునట్లు, మనస్సు పుష్పించునట్లు, జన్మను తరించునట్లు పాఠకులకు సాక్షాత్ శారదామాత దర్శన భాగ్యముఁ గలిగించినారు. వారి స్థాయిని అందుకోమనిఁ జెప్పుటలేదు, కవులన్న నామము తగిలిచుకున్నందుకు కనీస బాధ్యతగా ఆ దిశగాఁ బ్రయత్నము చేయుడు.
ఆ శారదాదేవినిఁ బరికింపుడు. అనేక సహస్రచంద్రమండల సన్నిభమైన యాస్యమండలము వీణాదండమువంక రవంత యొఱిగి యున్నది. అందుచే@ గిరీటమునుండి వ్రేలాడుచున్న ముత్తెములగుత్తి మేరువునొద్దనున్న వీణబిరడపై వ్రేలాడుచున్నది. బాగుగాఁ బరిశీలింపుడు. ఎడమమోఁ కాలిపై మడఁచినకుడిమోఁకాలివంపు ప్రక్కను రవంత వెనుకగ దేవతాచందన నిర్మితమైన వీణకుండ ప్రకాశించుచున్నదే. దివ్యసర్వసుధాసేచనమున వీణాదండము తీఁగచెట్టు చిగిర్చిన ట్లామె యెడమ చేయివ్రేళ్ళు తంత్రులపై నెట్లు కదలుచున్నవో! అహా! అదిగో గుడివైపున రాజరాజనరేంద్రుఁడు, నెడమవైపునఁ గృష్ణదేవరాయలు వింజామరములు చేతఁ బుచ్చుకొని యెట్లు వీచోపులిడుచున్నారో! అదిగో! ఆపీఠము మొదటఁ బీతాంబరపు నడకట్టుతో నిలువఁబడి దేవికి వీవనలు విసురుఁచున్న ఆనాటి మహాకవులుఁ గనపడుటలేదా! ఎంతటి సుందరమైన దృశ్యము. మీకునూ యాదేవికి వీవనలు విసరాలనిపించుటలేదా? ఆ కోరికయే మా బోఁటి పాఠకులదీ. మేల్కొనండి కవులారా! మేల్కొనండి...
ఎవని కవిత్వము దుక్కు, ఎవని కవిత్వము ముక్కు, ఎవని కవిత్వము పెంట, ఎవని కవిత్వము పంట అని జుట్లు పట్టుకొను భాగ్యము నుండిఁ బాఠకులను రక్షింపుడు. అందరుఁ బ్రయోజకులే! అంద ఱప్రయోజకులే! మీకు బుద్ధిలేకపోవుటచేత నెప్పటి కప్పటికే పరాకు. ఆ "బుద్ధి" ప్రసాదించమని ఆ శారదమ్మను వేడుకొనుడు..
మీరు మీ ఉన్మాదముతోఁ జిన్నమెదడును బెద్దమెదడుగాఁ జేయునెడల పాఠకునికి ఉన్మాదము, పిచ్చి హెచ్చును. బలిపశువైనఁ బాఠకుడు "ఇటువంటి" వ్రాతలు వ్రాయును. కావున జాగురూకులై వ్యవహరించుడు.
చూడవలయును జూడవలయున నని మనస్సు వాంచించుట చేతనే కదా శరీరమునకుఁ గన్నులు కలిగినవి! తినవలయును తినవలయునని సంతతవాంఛ కలుగుటచేతనే కదా శరీరమునకు నోరు వచ్చినది! మనస్సులోని సంచలనములవలననే కదా దేహమున కవయవవైవిధ్యము కలిగినది. అటువంటి మనసును మీ అపరిపక్వపు గవితలతో పారిశుద్ధ్యసంఘమువారి బండితుక్కువలెఁ బాఠకుల మీదకుఁ బోయక పరశురామప్రీతి జేయక, జాగరూకులై వ్యవహరించుడని హెచ్చరించుచు -
మఱియొకసారి పానుగంటివారికి, జంఘాలశాస్త్రి గారికి హృదయ పూర్వక క్షమాపణలతో ......శలవు...
సర్వేజనా స్సుఖినోభవంతు
************************************************************************
మొదటి భాగం ఇక్కడ...
రెండవ భాగం ఇక్కడ...
పూర్తి పాఠం పి.డి.ఎఫ్ పత్రంగా ఇక్కడ...
భవదీయుడు
మాగంటి వంశీ
Monday, December 20, 2010
ఎందుకు చెపుతాను వెఱ్ఱికుంకా! - (Part 2)
పురజనుల కోరిక మీద, ఈమెయిళ్ల దాడివల్ల రెండో భాగం ఈవేళే విడుదల.
మొదటి భాగం ఇక్కడ...
ఇహ చదువుకోండి...మూడో భాగానికి మటుకు కొద్దిగా సమయమివ్వుడి మహానుభావులారా! ఏలయనగా ఈవారము పనివత్తిడి వలన ప్రతి భాగానికి అవసరమైన ముప్ఫది నిముషములు సమయము వెచ్చించలేను. అర్థము చేస్కోగలరని భావిస్తూ....మళ్లీ వచ్చే వారం .....
**************************************************************************
బోలు మాటలచే తెఱచాఁపగుడ్డ పాఠకుల చక్షువులకు బిగించుట గాదు. వ్యాకరణసహిత కవితలచే పాఠకుల మనస్సును బిగింపవలెను. కల్లుపాకలనుండి వెలువడిన వదరుబోతు కవులెందరున్నారో యెరుఁగుదురా? నూటికి తొంభది శాఁతము వారేనన్న మాఁట నిశ్చల స్థంభము. అట్టివారిని జూచుటతోనే, వారిఁ గవితలు చదువుటతోనే పాఠకుని దేహము చచ్చినది. కవితల యందు ఆసక్తి చచ్చిన దనవలయునిగాదా? కవిత కవిత యని తెగసాగెద రెందులకు? ఓ సుద్దముక్క సమ్రాట్టులారా! తాడిచెట్టునెక్కి తాటికాయలాగఁ జూచుచున్న మీకు కవితలెందులకు?
తనకుఁ పాఠకునకుఁ దత్త్వమున భేదము లేదనియు, భేదము మిథ్య, యేకత్వము సత్యమనియు నెఱిఁగి యనుభవములోకిఁ దెచ్చుకొనని నీవు వ్రాయు కవితలన్నియు డాంబికములు, కాలహరణములు, శ్మశానమందున్న కాష్ఠములు.చెప్పవలెననిన కాష్ఠములు ఆరిపోకముందు వెలుగునుఁ బ్రాసాదించునేమో గానీ, మీ వల్ల యా యుపయోగముఁ గూడ లేఁదు
ప్రపంచము కవితామయ మైయున్న దని సభాపీఠముల బోధించు నిన్నూ, నీతోటి సుద్దముక్కల నే మనవలయును? మోసగాఁడనినఁ జాలునా? కటికవాడన్నఁ జాలునా? లొడలొడమని యుపన్యసించువాఁడవు కదా? ఏదీ? నీ తరమగునా? అసలు సిసలు కవి చేయు, వ్రాయు సక్రమకవిత, నీవు నీ శబ్దజాలమునఁ జూపఁ గలవా? పెద్దనో రున్నవారికిఁ బెద్దమాట. పెద్దచేయి యున్నవానికిఁ బెద్దచేష్ట. పెద్దబుద్ధి యున్నవానికిఁ బెద్దయాశ. పెద్దకడుపున్న వానికిఁ బెద్దతిండి. పెద్దబల మున్నవానిది పెద్దపెట్టు. మఱి సుద్దముక్కలున్నవానిది? అదియే భేదము.
యీ సుద్దముక్కలలోఁ ఎంతసేపు ఒకనికవితకంటెఁ దనకవిత పైనున్నదను సంతోషము మిగులవలెను. పాఠకుని బాధించుటకుఁ దగిన శక్తి తన కున్నదను సంతోషము తనకు మిగులవలయును. ఎవరికి భట్రాజులెక్కువున్న, వారికి అంతటి భజన మిగులవలయును.
అకాలగాఢాంధకారభయంకర కవితలచేఁ బట్టపగలు కీచుకీచు మనుచు గీరుగారు మనుచుఁ బక్షుల రొదతో, ఆవు లంభాలతో, పందులు నెలుకలు గాడిదలు మొదలిగునవి ఘుర్ఝరించుచుఁ గిచకిచలాడుచు నోండ్రపెట్టుచున్నటుల నటునుండి యిటు నిటునుండి యటు నొడలు తెలియని యవస్థతోఁ బరుగులిడుచుంటివి కవితలతో. అయ్యవిఁ గవితలుఁ జదువలేక ఎవరిమట్టునకువారు మహాభయోద్రిక్తహృదయములతో స్వప్రాణము లెట్టులయినఁ గాపాడు కొను నాత్రముతోఁ గటిక చీఁకటిలో కనఁబడనియాదుర్దశలోనే యెక్కడికో యెఱుఁగకుండఁ బారిపోవఁ జూచుటకు కారణము నీవుగాదా? నీఁ గవితలుఁ గావా?
పిచ్చియాసుపత్రి యనఁగా, పిచ్చివారి రోగమును కుదుర్చు నాసుపత్రి యని యర్థము కాదు, పిచ్చిడాక్టర్లు గలయాసుపత్రి యని యర్థము చెప్పినట్లు మీకు మీరే సన్మానపత్రాలిచ్చుకొనుచున్నారు. నీకుఁ బిచ్చిలేదన్నమాట పాఠకమూలమున సిద్ధాంతపడవలె గానీ, నీకు నీవే నిశ్చయించుకొనిన యెట్లు?
గానుగ యెద్దుల లాగున సుద్దముక్కలందరు తిరిగిన దారులలోనే యల్లాడుచున్నారు. ముందునకుఁ బోయినవారేరి? తెన్నా? కన్నా? ఏమున్నది? పటలములు పటలములుగఁ బైకెగయుచున్న ధూమరాశిలో నుండి చిన్నచిన్న విస్ఫులింగములు చిటచిటాయమాధ్వనులతో మించి నక్షత్రములవలె రాత్రి తమాలవృక్షమునఁజేరిన మిడుఁగుఱులకోటులవలెఁ, సాలీళ్లవలెఁ బాఠకుని మస్తిష్కము బూజు చేయుచుంటివి.
పాఠకు లాకాఁకాకు నిలువలేక, చర్మములు బొబ్బలెక్క, దాహముచే జిహ్వలీడ్చుకొనిపోవ, నతికాంతిచేఁ గన్నులు చీఁకటులు గ్రమ్మ, దయ్యములు పట్టినవారివలెఁ బిచ్చివారివలె జుట్లు పీఁకికొనుచు గుండెలు కొట్టుకొనుచు నట్లిట్లు పోవుచు నాకసము పగులునట్లాక్రోశ మొనర్చుచున్నారు. ఈయేడ్పులు విన్నవారెవరు? దయ యెవరికి? దాక్షిణ్య మెవరికి ?ఆహారనిద్రావ్యత్త్యస్తపరిస్థితులచేఁ గలిగిన వాతపిత్తశ్లేష్మదోషములకు చికిత్సలున్నవిఁ గానీ మీఁ గవితలుఁ జదివినఁ బాఠకుల వేదనకు చికిత్స లేదు.
కృతి పాడఁదగినది. కథ యూఁ కొట్టఁదగినది. నాటక మాడఁ దగినది. ఉపన్యాసము వినఁదగినది. కవిత ఉత్సాహోల్లాసాలుఁ గలిగించునది. మఱి నీవు వ్రాసే కవితల స్వరూపమిది - నోరార్చుకొనిపోయినప్పు డక్కలకఱ్ఱ, ముక్కులార్చుకొనిపోయినప్పుడు పొడుము వేసుగొనినట్లు రూపము సంతరించుకుని యున్నవి.ఈ దౌష్ట్యానికి శిక్ష అతిత్వరితముగా నిర్ణయించవలెనని మనసు ఉద్రేకపడుచున్నది.
కడవలంత బానలంత ద్రోణములంత చుట్టు గుడిసెలంత యెఱ్ఱగఁ గ్రాగినఱాలు, సలసల తెల్లగ మరిఁగిన గంధక ధారలతో ధారాపాతముగా శతకోటి శతకోటి అభిషేకములుఁ గావించవలెనన్న కోరిక తీవ్రమగుచున్నది. చెదలున్నపుట్టలోఁ దాటియాకు మంట పెట్టినయెడల నేమగునో యదియే యంతకంటె భయంకరముగ బీభత్సముగ మిమ్ములని తగులవెట్టవలెనని హృదయముఁ గుతకుతలాడుచున్నది. వాంతులతో భేదులతో మూత్రబంధములతో, నెక్కుపట్టిన నరములతోఁ, గంటిగుంటలతో, నొడలిచలువతో, నాసన్న మరణలాంఛనమగు నాభీలశిరోవేదనతో, భరింపరాని బాధలు పెడుచున్న ఈ సుద్దముక్కలనూడ్చి పెట్టుటకుఁ దోఁకచుక్క యంతచీఁపురు చేతఁబట్టుకొని, మురికికాలు వలప్రక్కలను గోడిరెట్టగుట్టలనడుమను పారవేయవలెనన్న ఆశ నటరాజనర్తనవలె తాండవించుచున్నది.
నీబుద్ధికందని విషయములు, నీశక్తికి మించిన సన్నివేశములుఁ బట్టుకొని సుద్దముక్కలు పేర్చి అవియే అత్యద్భుతములని ఢక్క కొట్టుకొనుచు, ఓ చెలరేఁగి అఖిలైకకార్యమిదియే యని కవితావీథులవెంట నోండ్రపెట్టుచు పరగడలు ద్రొక్కుచున్న నీనాలుకఁ గోయింపవలదా? నీ కలము విఱగఁ గొట్టవలదా?
(సశేషం!!)

*************************************************************************
(సశేషం!!)
Sunday, December 19, 2010
ఇంకోసారి సరిగ్గా గీస్తా అని చెప్పా....
నిన్న సాయంత్రం - ప్రదోషానికి శివ జేజికి చేసే రుద్రాభిషేకానికి వెళ్లా! ఎందుకు? నాన్న కూడా చదువుతాడుగా రుద్రం అందుకు!. అయితే మధ్యలో బాగా ఆకలి వేసి వెళ్లిపోదాం అని గోల చేసా. నేను అలా గోల చేస్తున్నానని ప్రసాదం ఇచ్చేదాకా ఉండకుండా, శివ జేజికి అలంకారం చేస్తుంటే వచ్చేసాం. నాన్నకు బాగా కోపం వచ్చింది - నేను ప్రసాదం తీసుకోనివ్వలేదని.
మళ్లీ ఇవాళ మా గుళ్లో పొద్దున్నే 10.30కి గణపతి జేజికి అభిషేకానికి మళ్లీ రుద్రం చదువుతారుగా. అందుకు మళ్లీ తీసుకెళ్లాడు. ఈసారి రెండు పేపర్లు తెచ్చాడు. ఎందుకో అనుకున్నా. నాన్న రుద్రం వల్లిస్తూ, నిన్నట్లాగా మళ్లీ గోల చేస్తానేమోనని ఒక పేపరు నాకిచ్చి గణపతి జేజి బొమ్మ వెయ్యమని సైగ చేసాడు. అప్పుడర్థమయ్యింది, పేపర్లు ఎందుకు తెచ్చాడో..వెంటనే వేసేసా!
బొమ్మలో....అరటిపళ్లు, దీపాలు, ఎలక, కొబ్బరికాయలు, లడ్లు, చేతిలో పువ్వు అన్నీ వేసేసా....ఇంటికొచ్చాకా కలర్ వెయ్యమంటే అది కూడా వేసేసా...అదే ఇది....
ఐపోయిందని చూపిస్తే, ఇంకో పేపరిచ్చాడు - సైగ చెయ్యలా...ఏం వెయ్యాలో అర్థం కాక అప్పుడు పావురం బొమ్మలు వేసేసా....ఇసిటి ఫామిలీ అని మా టీచర్ జేన్ చెప్తుందిగా...ఆ ఫామిలీ పేరు పెట్టేసా...
బిగ్ కిస్స్ ఇచ్చి - చాలా బాగుంది చిన్నమ్మా, కానీ గణేశ్ జేజి బొట్టు ఏమిటే అలా వేసావు అని మాత్రం అన్నాడు నాన్న...త్రిశూలం బొమ్మ వేద్దామంటే ఎలాగో వచ్చింది ఆ బొట్టు మరి....ఇంకోసారి సరిగ్గా గీస్తా అని చెప్పా....

Saturday, December 18, 2010
ఎందుకు చెపుతాను వెఱ్ఱికుంకా! - (Part 1)
జంఘాల శాస్త్రి ప్రేరణతో ఈ క్రింది ఉన్మత్త విహారం మొదలుపెట్టాను - దమ్మున్న వాళ్లు చదువుకోండి. అంతకు మించి ఇంకేదన్నా వున్నవాళ్లు కామెంటండి. :)
ఉన్మత్తుడవే కదా అని అంటారా?
అవును - ఈ సారి ఉన్మత్తుడవటానికి కారణభూతులు ఈనాటి కవులే.
వాళ్లను అనే బదులు, రాబందులా పీక్కు తినే బదులు మరి నువ్వే వ్రాయొచ్చుగా?
అదే ఉంటే నిన్ను మంగలి కత్తెర తీసుకురా అని ఎందుకు చెపుతాను వెఱ్ఱికుంకా!
సరే కుంకలను వదిలి విషయంలోకి వచ్చేస్తూ -
పానుగంటివారికి నమస్సుమాంజలులతో, వారి జంఘాల శాస్త్రి గారికి, చదువుకుని, భుజాలు తడుముకుని బాధపడ్డవారికి క్షమాపణలతో
ఉపోద్ఘాతం:
ఈనాటి కవితల్లో 'క్రమం' అనేది సున్న. కవుల్లో మరింత నున్నగానున్న గండుపిల్లిలాటి గుండు సున్న. శిల్పం, వస్తువు అనేది ఎండమావి. ప్రేరణ అనేమాట పచ్చి అబద్ధం. చెప్పక తప్పదంటే కీర్తికండూతే తప్ప కవితాప్రేమ ఈ ప్రపంచంలో లేదు. కవిత అనే మాటకి - చంపి తినడం అని అర్థమైతే, సృష్టిలో కావలసినంత, కావలసినన్ని భావప్రేరకాలున్నాయి. ఎంతసేపు ఈనాటి కవికి తన కీర్తి, తన భజన, అచ్చేస్తే వచ్చే డబ్బుల ఆలోచన, ముఖస్తుతి, తనకి ఎంతవరకు ఉపయోగపడుతుందో అంతవరకే ఆలోచన. అంతకు మించి పోడు. ఇందులో కొంచెం హెచ్చుతగ్గులుండవచ్చుగాని మూలసూత్రం మాత్రం స్వార్థమే. పరోపకారం, పాఠకోపకారం అనేది ఎక్కడైనా పొరపాటున వుంటే, అది కూడా మారువేషం వేసుకున్న స్వార్థమే.
మూలకారణమైన అనిర్వచనీయమైన మహాశక్తి నుంచి అనేక అంధప్రాయాలైన శక్తులు పుట్టాయి. భావప్రేరకాలు పుట్టాయి. మనుషుల్ని, పాఠకుల్ని పునాదుల్లోకంటూ కదిలించి ఆకారణంగా సంఘాలకు సంఘాలే కూల్చేసే ప్రాకృతిక, కవితా శక్తులివి. ఆటలమ్మ, మశూచి వంటివి జబ్బులు కావు. ఇలాటి అకారణ, ఉన్మత్త శక్తులైన కవులే జబ్బులు. భయంకర కవుల్ని సైతం పండితుల పేర్లతో పూజిస్తాం. అయినా మనుషులకి, పాఠకులకి మతిలేదు.
ఉన్మత్త విహారం:
సృష్టిలోనున్న...అంత వద్దనిన ఆంధ్రదేశ కవితాలోకములోనున్న యొక్కొక్కని యాకిట్లు చింప నిశ్చయించినాను. ఈ కవిత్వమునంత నాశనమొనర్చుటయే మంచిది. కవిత, పనికిమాలిన కవిత, అర్థము లేని కవిత, నశించుటయే సమంజసము. ఈ గవితలలో నొక యుద్దేశమున్నాదా? నీతి యున్నదా? శాసనమున్నదా? ప్రేమయున్నదా? ఒక క్రమమైన నున్నదా?
మన పండితులేమని చెప్పిరో వింటివా? ఈ కవితలలో సత్తు లేదు, అసత్తు లేదు, పగలు లేదు, రాత్రి లేదు, శాశ్వతత్వము లేదు, ఒక్కటియే యున్నది. వెఱ్ఱి. అది తనంత తానే కాక కవియందు నిలబడుకుని యున్నది. దానికి వేరు లేదు. అయిననూ మహావృక్షముద్భవించును. ఫెళ్లున జనపదుల నెత్తిన బడుటకునూ, బుఱ్ఱలు బద్దలు గొట్టుటకునూ. ఇట్లెందులకు ఉద్భవించెనో దానికే తెలయును. అదికూడ నెఋఁగునని చెప్పవలనుపడదు. ఆ గవితలలో వస్తువు యొక్క యునికి యున్నది, లేదు. వెఱ్ఱివాని మస్తిష్కమునుండి తన సృష్టి కలిగిన దనుసంగతి యా కవిత ఎఱుఁగును, ఎఱుఁగదు. ఇట్టిదే ఆ కవితా తత్త్వమనియు, స్వరూపమనియు మనఁ బండితులు స్థిరపఱచినారు. ఆ తత్త్వమూ, స్వరూపమూ పాఠకునికి తెలియుటా, తెలియకపోవుటా? తెలియుట కాదు, తెలియకపోవుట కాదు. తెలియకపోవుట, తెలియుట యనఁగా నిదియే. కవి గూర్చి యెఱుఁగకపోవుటయే జ్ఞానము. ఎఱుఁగుట యజ్ఞానము. యీ బుద్ధి యున్నవాడు బుద్ధిమంతుడని ఎల్లరూ అంగీకరించవలసిన విషయము.
మఱి ఇక్కడనున్న పాఠకుని స్థితి యెట్లున్నది? కొద్దిపాటి జ్ఞానమున్నదనుకొందము. మంచి ఉద్దేశమున్నదనుకొందము. బుద్ధి యున్నదనుకొందము. అట్టి పాఠకునికి ఈ గవితలు చేతి కరదండములుగఁ, గాళ్ళకు సంకెలగఁ, గంటికి గంతలుగ, మనస్సుకు దిగపీఁకుడుగ నుండుటచేఁ బాఠకులు యెదుగు బొదుగులేక, శరీరమున నల్పులగుచు, బుద్ధియందు అత్యల్పులగుచు, జ్ఞానమున నంధులై, కవి చిత్తమను చెఱసాలలో బానిసవలె యున్నారనియు, నీపిశాచమునుండి యెంతత్వరగ విముక్తినొందుదుమో యంతత్వరలో అయ్యద్ది పాఠకులకు సమస్తజనసోదరత్వమే కాక, సర్వజీవులయందు దయ గల్గుననియు, అట్లగుటకుఁ దగిన వీర్యము, వెన్నెముక, విదగ్ధత కలవారగుననియు, దేశమునకు, జాతికీ యథార్థముగ మనుజజన్మమునకుఁ గూడ లాఘవకరమైన, లజ్జాకరమైన ఈ "నన్నుఁ జదవవద్దన" బుద్ధిహీనపు పశుప్రాయపు వ్రాతలెప్పుడు పరశురామప్రీతి యగునో యప్పుడే పాఠకులకు జాత్యైక్యము సంభవించుననియు, జాత్యైక్యముతో దూరతీరాలకేగినఁ శరీరపాటవము, శరీరపాటవముతో సౌఖ్యసంపదయు, సౌఖ్యసంపదతోఁ జిత్తవికాసము, చిత్తవికాసముతో పిడచగొట్టుకొనిబోయిన బుద్ధిస్థైర్యము తిఱిగి వచ్చుననియు మనముపన్యాసపీఠములపై సింహగర్జనము లొనరించవలెను.
తెల్లసుద్దకవికి మరి విభూతిపాఠకునికి బడదు, సుద్దముక్కల రెంటికిఁ జుక్కయెదురు, పగిలిన విభూతిపండునకు తెల్లరసుద్దకు నైధనతారవరుస, సుద్దదారి సుద్దది విభూతిబూడిదలకు. ఇంతటితో సరిపోయినదా. ఊహూఁ. బెడ్డవ్రేట్లను సహించినట్లు, సుద్దవ్రేట్లనూ, ఆపైని సుద్దల వారి గవితలను సహించిననూ పాఠకునకుఁ దీయని ఫలము ద్రక్కుట లేదు. పట్టులేక గాలిలో సర్వశ్రమములఁ బొంది యల్లాడుచు మేఘములు మనకు అమృతసుధలవంటి నీరములిచ్చుచున్నవి, కత్తికోఁతను సహించుచు మేకఁలు మన కాహార మగుచున్నవి. తమగడ్డి తాము దినుచు గోవులు మనకుఁ గుంభవృష్టిగ మధుమధుర క్షీరముల నిచ్చుచున్నవి. పేఁడచేఁ బెంటచే సంతుష్టినొంది సమస్తధాన్యసమృద్ధిని సర్వం సహాదేవి సమకూర్చుచున్నది. పశువులు సైతము ప్రానహీనములగు వస్తువులు సైతము స్వార్థపరిత్యాగ మాచరించి పదార్థసంవిధాన మొనర్చుచున్నవి. మఱి "సుద్దముక్కలేమిఁ" జేయుచున్నవి యని అడిగిన సమాధానము దొఱకదయ్యె! ఇంతటి దైన్యస్థితి నుపహరింపుటకు కెక్కడనైనఁ యవకాశము నున్నదేమో కానీ ఆంధ్రదేశమునందలి పాఠకవరేణ్యులకు మటుకు లేదు. జంతువులను ప్రేమించవచ్చును, కఠినత్వమునుఁ బ్రేమించవచ్చును, పాచి మఱియు పెంటలనుఁ బ్రేమించవచ్చును, గానీ ఈ సుద్దముక్కలఁ గవులనుఁ బ్రేమించుట యసాధ్యము, దుర్లభము, దుస్సాధ్యము మఱియు కాలహరణమూ.
సూర్యుఁడు దాను గర్భానలజ్వాలాజాలముచే మండి పోవుచుఁ బ్రపంచమున కారోగ్యమును బ్రాసాదించునట్లు సర్వకష్టనిష్ఠుర తలకోర్చి జనోపకారమాచరించవచ్చను కొద్దిపాటి జ్ఞానము, బుద్ధి నీగవులకు లేకపోయినదే! హతవిధీ! కూపములేని కుగ్రామమున్నది. కోమటిదుకాణములేని కుగ్రామమున్నది. బ్రాహ్మణుడులేని కుగ్రామమున్నది. సుద్దముక్క కవులు లేని కుగ్రామమున్నదా? లేదు. లేనేలేదు. గతించిన కాలములోనైన యీ సుద్దముక్కలు బ్రద్దలుగొట్టుటకుఁ యవకాశముండినదేమో గానీ సమకాలీనఁ గాలమునందు, భవిష్యత్ కాలమునందుఁ యా యవకాశము లేదని నొక్కి వక్కాణించవచ్చును.
తిట్లు దీవనచే నడఁగుననియుఁ, గొట్టు పెట్టుచే శాంతించుననియుఁ, గత్తివ్రేటు కౌఁగిలిచేఁ బోవు ననియు, శత్రుత్వము మిత్రత్వముచే సడలుననియుఁ అనుభవైకవేద్యమే. గానీ యీ కవులు మంచిమాటలతోనేమి, వట్టిమాటలతోనేమిఁ గృతార్థులు కాఁగలరా యన్నది శేషప్రశ్నయే!
జాతిద్రోహము, మిత్రద్రోహము, దేశద్రోహము, మతద్రోహము, దైవద్రోహము కవితలతో సమూలముగ నెగిరిపోవచ్చును. ఆ జ్ఞానమున్న కవులెందరు? పంగనామములచే భాగవతోత్తముఁడవు కాఁగలవా? ఆనపకాయచే సన్న్యాసివి కాఁగలవా? అటులనే సుద్దముక్కఁల మాఁటలచే కవివి కాఁగలవా?
కవితారాధన కవితారాధన యని యందువుకద, కవితకు ముక్కా, నోరా? తలయా? తోఁకయా? వ్యాకరణము ననుచరించి వాక్కుల నాచరించువాడు కవి. పాఠకులనే గాక సర్వభూతములను తనతో సమానముగఁ జూచుకొనువాడు కవి. తాను తన కవిత, తన బుద్ధి, తన సర్వస్వము పాఠకజనసేవ కని త్రికరణశుద్ధిగ నమ్మి ప్రతిఫలవాంఛాశూన్యుఁడై పాఠకసేవ యొనర్చువాఁడు కవి. అంతేకాని నోటియందాడిన అర్థములేని మాటలు జంకు, సిగ్గు యెగ్గు లేక సంభాపీఠమున నిలువఁబడి యసత్యము పలికినట్లుఁ బలుకుచు నామూల నుండి మరియొక మూలకుఁ బనిలేక తిరుగుతు పాఠకులను యల్లాడించు నద్భుతపురుషులగు మీరు కవు లగుదురా?
(సశేషం!!)
తదుపరి భాగం వచ్చేవారం!

Tuesday, December 14, 2010
శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యుల శివతాండవం - ఆకాశవాణి ప్రసారం
మొలక మీసపు గట్టు, ముద్దుచందురు బొట్టు
పులితోలు హొంబట్టు, జిలుగు వెన్నెల పట్టు
నెన్నడుమునకు చుట్టు క్రొన్నాగు మొలకట్టు
క్రొన్నాగు మొలకట్టు గురియు మంటల రట్టు
సికపై ననల్పకల్పక పుష్పజాతి, క
ల్పక పుష్పజాతి జెర్లాడు మధురవాసనలు
బింబారుణము కదంబించు దాంబూలంబు
తాంబూల వాసనల దగులు భృంగ గణంబు
గనుల పండువుసేయ, మనసునిండుగ బూయ
ధణధణధ్వని దిశతతి బిచ్చలింపగా
ఆడెనమ్మా! శివుడు
పాడెనమ్మా! భవుడు
పుట్టపర్తి వారి శివతాండవ కావ్యం - అద్భుతమైన కావ్యం ఆకాశవాణి వారు ప్రసారం చేస్తే, ఆ అద్భుతాన్ని మనకందించిన వారు తెలుగుథీసిస్.కాం రంజని గారు. వారికి హృదయ పూర్వక కృతజ్ఞతలతో
******************************************************
శివతాండవం సంగీత రూపకం (1993)
శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యుల శివతాండవం గేయకావ్యానికి
రేడియో అనుసరణని వారి కుమార్తె శ్రీమతి నాగపద్మిని చేసారు.
సంగీతం: శ్రీ యెల్లా వేంకటేశ్వరరావు
పునఃప్రసారం : 12 Dec 2010

ఎక్కడ? ఇక్కడ
ఈ లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "పరిచయాలు - నాటికలు" లింకు నొక్కి వినవచ్చు
భవదీయుడు
వంశీ

Saturday, December 11, 2010
తనికెళ్ల భరణి, ఆచార్య అక్కిరాజు రామ కృష్ణ - నేను !!!
అనుకోకుండా లాస్ వేగాస్ ట్రిప్పు చాప చుట్టుకుపోవటంతో, కొలొరాడో నుంచి నిన్న మధ్యాహ్నం ఊళ్లోకి వచ్చా. ఆ మధ్యాహ్నం పూట తిరిగి రావటం బోల్డు అదృష్టాన్ని తెచ్చిపెట్టింది.
ఎలా?
నిన్న సుబ్రహ్మణ్య షష్టి కావటం వల్ల రుద్రాభిషేకంలో పాల్గోటానికి సాయంత్రం సిద్ధివినాయక ఆలయానికి వెళ్లా..రుద్రాభిషేకంలో పాలుపంచుకున్నా.... అభిషేకం అయిపోయింది. గుడి నుంచి బయటకు వస్తూ ఎందుకో తల తిప్పాను. సాధారణంగా తిప్పను. అనగా తలవంచుకుని నా దోవన నేను వచ్చేస్తానన్నమాట ....
అసలు ఎందుకు తిప్పాలి? ఎటువైపు తిప్పాలి? ఎటువైపు తిప్పావు?
వస్తున్నా....
గుడి ప్రధాన ద్వారం పక్కనే ఉన్న అడ్వర్టైసుమెంట్ల బోర్డు వంక తిప్పాను. వేంఠనే కంటపడింది.
ఏమిటీ?
ఒక అడ్వర్టైసుమెంటు. వార్షికోత్సవ దినమని.
ఎవరిది?
మా ఊళ్లో ఉన్న ఒక తెలుగు అసోసియేషన్ దినమని, దినమణి పత్రికలో వచ్చిన అడ్వర్టైసుమెంటులా, ఓ పేద్ద కటౌటు కనపడ్డది.
సరే ఈ దినాలు, తద్దినాలకి మనం ఎప్పుడూ వెళ్లింది లేదు.
ఎందుకు? వచ్చే తెలుగు జనాభా వారి వేషాలతో తగని చిరాకు. ఆ చిరాకు వివరాల్లోకి తర్వాత తీరిగ్గా...ఇప్పుడు, ఈ దినం సంగతి మాట్లాడుకుందాం.
ఓ రెండు బొమ్మలు చూపు తిప్పనివ్వలా?
ఎవరివి ఆ బొమ్మలు?
తనికెళ్ల భరణి, ఆచార్య అక్కిరాజు రామ కృష్ణ
కట్ చేస్తే.... ఈవేళ మూడింటికి మొదలుపెడతామన్న ప్రోగ్రాము, దాదాపు నాలుగింటికి కానీ మొదలుకాలా....మొదలైంది ఫో....తెలుగు సంఘ దినోత్సవానికి తమిళ అమ్మాయి, తమిళ అబ్బాయి గణపతి ఆరాధనతో త్యాగరాజుల వారి కీర్తనలతో మొదలయ్యింది. తెలుగు పిల్లలు ఎందుకు దొరకలేదో ఆ భగవంతుడికే తెలియాలె....ఇహ మిగతా ప్రోగ్రాములకొస్తే ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది....అసలే నోరు ఊరుకోని మనిషిని, నిక్కచ్చిగా మాట్లాడే మనిషిని అయినా, ఆ ప్రోగ్రాముల్లో జరిగిన వింతలు విశేషాలు రేపో ఎల్లుండో వచ్చే టపాలో వివరిస్తానని తెలియచేసుకుంటూ .......
క్లుప్తంగా ......
కొన్ని దిక్కుమాలిన ప్రోగ్రాముల బెడద తప్పించుకుందామన్నా గతిలేక ఆడిటోరియంలోనే ఉండిపోయినా....బ్రేక్ సమయంలో అక్కిరాజుగారితో ఓ పదిహేను నిముషాలు, భరణిగారితో ఓ ఐదు నిముషాలు మాట్లాడే భాగ్యం కలిగింది. ఈ మాట్లాడే భాగ్యానికి ముందు ఒ కథ ఉంది. అక్కడ వాలంటీర్ దుర్మార్గులు ఇద్దరు - కుదరదండి వాళ్లతో మాట్లాడడం అని బోసుబాబుల్లా అరుస్తుంటే ఒకణ్ని పక్కకు పిలిచి చెప్పా. ఒరే ఓబులేసు - ఇదీ సంగతి, నా పేరు ఇదీ, వాళ్లతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని. ఆ పక్కనే ఉన్న ఆయనెవరో నా పేరు ఆయనకు చెప్పటం విని, ఓ మీరా - వెళ్లండి వంశీ గారు అని ఓబులేసుని గదిమాడు. ఓబులేసు ముఖం చిన్నబుచ్చుకుని పక్కకు తొలిగి పోయాడు. ఐతే నేను లోపలికి వెళ్లే సమయానికి బ్రేక్ / భోజనం సమయం అవ్వటంతో అంతా హడావిడిగా ఉన్నది. సరే అని బయటకొచ్చేసా. ఓ ఇరవై నిముషాలయ్యింది. ఇంతలో అక్కిరాజు గారు బయటకొచ్చి, ఓ పక్కన టేబిలేసి దాని మీద పరిచి పెట్టిన, తను వ్రాసిన పుస్తకాలు, పాడిన పద్యాల సి.డిలు చూస్తూ, ఓ నిముషం తర్వాత అక్కడే ఓ ఆసనం మీద గోడకు చేరగిలబడ్డారు. అదను చూసుకుని పక్కన చేరా. పరిచయం చేసుకున్నా. (కొత్తపాళీ) నారాయణస్వామి, దుర్యోధనుడు, డెలావేరు అని మాటల ప్రస్తావన రాగానే మతాబాలా వెలిగిపోయింది ఆయన ముఖం. అక్కడినుంచి బ్రహ్మాండంగా సాగినై మాటలు. పదిహేను నిముషాల్లో ఆయనతో బోల్డు విషయాలు చర్చించా...
ఈ లోపల భరణి గారు బయటకొచ్చి ఓ మూలన నిలబడ్డారు. ఇంతలో ఆచార్య వారిని కార్టూనిష్టు రమేస్ గారు పలకరించటానికి రావటంతో నేను భరణి గారి దగ్గరికి వెళ్లి పరిచయం చేసుకున్నా.
రుద్రుడి అభిషేకానికి వెళితే శివభక్తుడిక్కడే ఉన్నాడు, వెళ్లి చూసిరా అని ఆ శివయ్యే చెప్పాడని ఆయనతో అన్నా - సంతోషమండీ, శివభక్తులనెప్పుడు కలుపుతూనే ఉంటాడు ఆ శివయ్య. అదే ఆ మహాదేవుడి గొప్పతనం అని ఓ చిరునవ్వు నవ్వి భుజం మీద చెయ్యేసారు. ఇదే అదను అని కామెరా చేతికిచ్చి ఒకాయన్ని నొక్కమన్నా. ఆయన క్లిక్కాడు. ఇదీ ఆ క్లిక్కు...
ఇహ భరణిగారితో ఐదు నిముషాల బాతాఖానీ విశేషాలు నా వద్దే దాచుకుంటా...
కానీ ఆచార్యుల వారి బాతాఖానీ రేపు నెమ్మదిగా ఇంకో పోష్టులో....
ఆచార్యులు - స్టేజి మీద, బయట కుర్చీలో
ఇహ ఆచార్యులవారితో నేను....
ఆచార్యుల వారితో, భరణి గారితో మాట్లాడే అవకాశం వచ్చినందుకు, ఆ అవకాశం కలిగించిన నా శివయ్యకు, సి.టి.ఎస్ సంఘానికి బోల్డు ధన్యవాదాలతో ...ఐతే ఒకటి మటుకు చెప్పాలె .......
పిల్లల తీన్ మార్ ఆట పాటలకు వచ్చిన చప్పట్లు "రాయబారానికి" రాలా! ప్చ్చ్...ముమైత్ ఖాన్ సినిమా పాటలేసి పిల్లలచేత డాన్సులు చేయించినప్పుడు కళ్లప్పగించి చుస్తూ, అక్కడ ఏమీ లేకపోయినా మైమరచిపోతూ, నిశ్శబ్దంగా ఉన్న ఆడిటోరియం - రాయబారం జరుగుతున్నప్పుడు మటుకు జనాల తిండి గోల, పకోడి బాగుందా, చికెన్ కర్రీ లేదే, అది కూడా ఉంటే బాగుండేదే, అర్రే అది ఉందే మీరు చూడలేదా? వాటితోనూ అరుపులతోనీ నిండిపోయింది....
పిల్లలు - భరతనాట్యం ప్రోగ్రాం, చిన్ని కృష్ణుడి లీల ప్రోగ్రాము మటుకు బాగుంది....సరేలెండి ...ఇతర వివరాలు తర్వాత ఎప్పుడైనా....రాస్తూ ఉంటే సూర్యకాంతం బయటకొచ్చేను, ఎందుకొచ్చిన గోల....వెధవ గోలాని...
బాటరీలు అయిపోతున్నాయి అని చూస్కోకుండా తీసుకెళ్లిన నా కెమేరాలో తీసిన వీడియో క్లిప్పులు కొన్ని....ఇన్ని ఎందుకు వచ్చాయీ? చెప్పాగా బాటరీలు అయిపోవచ్చినాయని...నొక్కా, ఆపా...నొక్కా, ఆపా...నొక్కా - ఆపా...అదీ సంగతి...
Sunday, December 5, 2010
ఆచార్య కేతవరపు రామకోటి శాస్త్రి / వరంగల్ ఆకాశవాణి కేంద్రం ప్రసారం
1931లో జన్మించి తెలుగు సాహిత్యలోకానికి అపారమైన సేవనందించిన ఆచార్య కేతవరపు రామకోటి శాస్త్రిగారి జీవిత విశేషాల గురించి వరంగల్ ఆకాశవాణి కేంద్రం ఒక మంచి కార్యక్రమం ప్రసారం చేసింది. కార్యక్రమంలో పాల్గొన్నవారు డాక్టర్ వెన్నవరం ఈరారెడ్డి, మారేడుకొండ బ్రహ్మచారి గారు.
కార్యక్రమాన్ని అందించిన కేశరాజు భానుకిరణ్ గారికి ధన్యవాదాలతో...
****************************************************************
ఇక రామకోటి శాస్త్రి గారి సంక్షిప్త వివరాల్లోకి వస్తే - 1969లో ఉస్మానియా విశ్వవిద్యాలయం పి.జి.సెంటర్ వరంగల్లులో ప్రారంభమైనప్పుడు తెలుగు విభాగానికి ఆచార్య బిరుదురాజు రామరాజుగారు పునాదులు వేస్తే ఆచార్య కేతవరపు రామకోటి శాస్త్రి గారు పటిష్టపరిచారు. రామకోటి శాస్త్రిగారంటే సాహిత్య అధ్యయనం, సాహిత్య సంభాషణ. గుడివాడ కాలేజీలో అధ్యాపకుడిగా కె.జి.సత్యమూర్తి, చలసాని ప్రసాద్, త్రిపురనేని మధుసూదనరావు మొదలైనవారికి విద్యాబోధన చేసి ఈ సాహిత్య ప్రపంచానికి ఆణిముత్యాలవంటి ఎందరో సాహితీకారులని అందించారు. ప్రముఖ సాహితీవేత్త కాత్యాయనీ విద్మహే గారు ఆచార్యుల వారి కుమార్తె.
*****************************************************************
ఎక్కడ వినవచ్చు ? ఇక్కడ
ఈ లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "పరిచయాలు - నాటికలు" లింకు నొక్కి వినవచ్చు
భవదీయుడు
వంశీ
కార్యక్రమాన్ని అందించిన కేశరాజు భానుకిరణ్ గారికి ధన్యవాదాలతో...
****************************************************************
ఇక రామకోటి శాస్త్రి గారి సంక్షిప్త వివరాల్లోకి వస్తే - 1969లో ఉస్మానియా విశ్వవిద్యాలయం పి.జి.సెంటర్ వరంగల్లులో ప్రారంభమైనప్పుడు తెలుగు విభాగానికి ఆచార్య బిరుదురాజు రామరాజుగారు పునాదులు వేస్తే ఆచార్య కేతవరపు రామకోటి శాస్త్రి గారు పటిష్టపరిచారు. రామకోటి శాస్త్రిగారంటే సాహిత్య అధ్యయనం, సాహిత్య సంభాషణ. గుడివాడ కాలేజీలో అధ్యాపకుడిగా కె.జి.సత్యమూర్తి, చలసాని ప్రసాద్, త్రిపురనేని మధుసూదనరావు మొదలైనవారికి విద్యాబోధన చేసి ఈ సాహిత్య ప్రపంచానికి ఆణిముత్యాలవంటి ఎందరో సాహితీకారులని అందించారు. ప్రముఖ సాహితీవేత్త కాత్యాయనీ విద్మహే గారు ఆచార్యుల వారి కుమార్తె.
*****************************************************************
ఎక్కడ వినవచ్చు ? ఇక్కడ
ఈ లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "పరిచయాలు - నాటికలు" లింకు నొక్కి వినవచ్చు
భవదీయుడు
వంశీ
Thursday, December 2, 2010
వాద్య కళాకారులు శ్రీ సత్యేంద్రనాధ్ పరిచయం / ఆకాశవాణి ప్రసారం
వాద్య కళాకారులు శ్రీ సత్యేంద్రనాధ్ పరిచయం
పరిచయకర్త : శ్రీ సుమనస్పతిరెడ్డి (PEx - AIR)
ప్రసారం తేదీ : 02 డిసెంబరు 2010
తెలుగు థీసిస్ డాట్ కాం రంజని గారి సౌజన్యంతో.
ఆడియో అందించిన రంజని గారు ఇలా అంటారు
_______________________________________
ఒక పాట లేదా ఓ రూపకం అద్భుతంగా ఉందని మనం
చెప్పుకున్నప్పుడు ముఖ్యంగా సంగీత దర్శకుల ప్రతిభని
కొనియాడుతాము. వాయిద్య సహకారాన్ని అందించిన
కళాకారుల గూర్చి అంతగా పట్టించుకోము...
50 సంవత్సరాలకి పైగా అనేక ఆకాశవాణి కార్యక్రమాలకి
స్టేజి కార్యక్రమాలకి వాయిద్య సహకారాన్ని అందించిన
కళాకారులు శ్రీ సత్యేంద్రనాధ్. ఒక రిధమ్స్ కళాకారునిగా
పత్రికలలో ఈ పేరు అప్పుడప్పుడూ కనిపించేది - జీవన
వివరాలు ఇప్పుడు ఈ పరిచయ కార్యక్రమంలో...
_______________________________________
ఎక్కడ? ఇక్కడ
ఈ లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "పరిచయాలు - నాటికలు" లింకు నొక్కి వినవచ్చు
భవదీయుడు
వంశీ
పరిచయకర్త : శ్రీ సుమనస్పతిరెడ్డి (PEx - AIR)
ప్రసారం తేదీ : 02 డిసెంబరు 2010
తెలుగు థీసిస్ డాట్ కాం రంజని గారి సౌజన్యంతో.
ఆడియో అందించిన రంజని గారు ఇలా అంటారు
_______________________________________
ఒక పాట లేదా ఓ రూపకం అద్భుతంగా ఉందని మనం
చెప్పుకున్నప్పుడు ముఖ్యంగా సంగీత దర్శకుల ప్రతిభని
కొనియాడుతాము. వాయిద్య సహకారాన్ని అందించిన
కళాకారుల గూర్చి అంతగా పట్టించుకోము...
50 సంవత్సరాలకి పైగా అనేక ఆకాశవాణి కార్యక్రమాలకి
స్టేజి కార్యక్రమాలకి వాయిద్య సహకారాన్ని అందించిన
కళాకారులు శ్రీ సత్యేంద్రనాధ్. ఒక రిధమ్స్ కళాకారునిగా
పత్రికలలో ఈ పేరు అప్పుడప్పుడూ కనిపించేది - జీవన
వివరాలు ఇప్పుడు ఈ పరిచయ కార్యక్రమంలో...
_______________________________________
ఎక్కడ? ఇక్కడ
ఈ లింకు నొక్కి వెబ్సైటుకు వెళ్ళాక ఎడమవైపున ఉన్న "పరిచయాలు - నాటికలు" లింకు నొక్కి వినవచ్చు
భవదీయుడు
వంశీ
Wednesday, December 1, 2010
ఆచార్య తిరుమల రామచంద్ర - భారతి పత్రిక అనుబంధం
మహామనీషి ఆచార్య తిరుమల రామచంద్ర గారు భారతి పత్రికతో తనకున్న అనుబంధం గురించి వివరించిన ఈ వ్యాసం వారాంతం దేనికోసమో వెతుకుతుంటే ఎక్స్టర్నల్ హార్డ్ డ్రైవ్లోనుంచి ఆణిముత్యంలా బయటపడింది.....
స్కాన్ ఫైళ్ల తేదీలు చూస్తే సంవత్సరన్నర క్రితం ఉన్నవి....బోల్డు ఆశ్చర్యపోయా నేనే - ఎలా మిస్సైపోయిందబ్బా అని!
ఇప్పుడు ప్రచురించేసా! మీరు చదువుకోవటమే మిగిలింది......ఎక్కడ?
http://www.maganti.org/newgen/index1.html
వ్యాసావళి సెక్షన్లో ...

Labels:
ఆచార్య తిరుమల రామచంద్ర,
భారతి పత్రిక
Subscribe to:
Posts (Atom)