పద్యమొచ్చింది
పద్య పాఠకులొచ్చారు
పద్య విమర్శకులొచ్చారు
పద్యం పోయింది
పద్య పాఠకులు పోయారు
పద్య విమర్శకులు పోయారు
గేయమొచ్చింది
గేయ పాఠకులొచ్చారు
గేయ విమర్శకులొచ్చారు
గేయం పోయింది
గేయ పాఠకులు పోయారు
గేయ విమర్శకులు పోయారు
గద్యం వచ్చింది
గద్య పాఠకులొచ్చారు
గద్య విమర్శకులు వచ్చారు
గద్యం పోయింది
గద్య పాఠకులు పోయారు
గద్య విమర్శకులు పోయారు
చోద్యమొచ్చింది
చోద్య పాఠకులొచ్చారు
చోద్య విమర్శకులొచ్చారు
చోద్యం పోయాక ఏమొస్తుందో?
తెలీక అడుగుతున్నానబ్బాయీ - దేనికి తగ్గవారు దానికి ఉండరూ?..
మాల కొండయ్య గారి పుస్తకాల / కవితల ప్రేరణతో
(Post 403)
ఉంటారు, ఉంటారు! :)
ReplyDeleteఎందుకుండరు?? ఉంటారుంటారుంటారు.. :)
ReplyDelete