నిన్న సాయంత్రం - ప్రదోషానికి శివ జేజికి చేసే రుద్రాభిషేకానికి వెళ్లా! ఎందుకు? నాన్న కూడా చదువుతాడుగా రుద్రం అందుకు!. అయితే మధ్యలో బాగా ఆకలి వేసి వెళ్లిపోదాం అని గోల చేసా. నేను అలా గోల చేస్తున్నానని ప్రసాదం ఇచ్చేదాకా ఉండకుండా, శివ జేజికి అలంకారం చేస్తుంటే వచ్చేసాం. నాన్నకు బాగా కోపం వచ్చింది - నేను ప్రసాదం తీసుకోనివ్వలేదని.
మళ్లీ ఇవాళ మా గుళ్లో పొద్దున్నే 10.30కి గణపతి జేజికి అభిషేకానికి మళ్లీ రుద్రం చదువుతారుగా. అందుకు మళ్లీ తీసుకెళ్లాడు. ఈసారి రెండు పేపర్లు తెచ్చాడు. ఎందుకో అనుకున్నా. నాన్న రుద్రం వల్లిస్తూ, నిన్నట్లాగా మళ్లీ గోల చేస్తానేమోనని ఒక పేపరు నాకిచ్చి గణపతి జేజి బొమ్మ వెయ్యమని సైగ చేసాడు. అప్పుడర్థమయ్యింది, పేపర్లు ఎందుకు తెచ్చాడో..వెంటనే వేసేసా!
బొమ్మలో....అరటిపళ్లు, దీపాలు, ఎలక, కొబ్బరికాయలు, లడ్లు, చేతిలో పువ్వు అన్నీ వేసేసా....ఇంటికొచ్చాకా కలర్ వెయ్యమంటే అది కూడా వేసేసా...అదే ఇది....
ఐపోయిందని చూపిస్తే, ఇంకో పేపరిచ్చాడు - సైగ చెయ్యలా...ఏం వెయ్యాలో అర్థం కాక అప్పుడు పావురం బొమ్మలు వేసేసా....ఇసిటి ఫామిలీ అని మా టీచర్ జేన్ చెప్తుందిగా...ఆ ఫామిలీ పేరు పెట్టేసా...
బిగ్ కిస్స్ ఇచ్చి - చాలా బాగుంది చిన్నమ్మా, కానీ గణేశ్ జేజి బొట్టు ఏమిటే అలా వేసావు అని మాత్రం అన్నాడు నాన్న...త్రిశూలం బొమ్మ వేద్దామంటే ఎలాగో వచ్చింది ఆ బొట్టు మరి....ఇంకోసారి సరిగ్గా గీస్తా అని చెప్పా....
త్రిశూలం తిరునామమయింది,గణేశ్ విష్ణుగణపతి అయ్యాడు.
ReplyDeleteచిన్నమ్మా!మానుంచిగూడా ఓ బేద్ద ముద్దు నీకు.
good trick!!
ReplyDeleteసరే! అల్లెప్పటి బొమ్మలనో ఇప్పటికీ దాచిపెట్టుకోగలిగారు.
నా బాల్యంలో చాలా చాలా బొమ్మలు వేసాను.
హన్నీ లేవు అందరి నిర్లక్ష్యం ఓ హేతువు.
బొమ్మలన్నీ బావున్నాయిరా బంగారం. ఈసారినుండి నాన్నతో వెళ్లినప్పుడు నువ్వే పేపర్లు, పెన్సిల్లు పట్టుకెళ్లు. నీకిష్టమొచ్చిన బొమ్మలు వేసి మాకు చూపించాలి. మీ నాన్న కోపంగా ఉన్నాడన్నావు కదా ఆ బొమ్మ కూడా వేసేయ్. పర్లేదు..
ReplyDelete@విజయమోహన్ గారు - బేద్ద ముద్దు ట్రాన్స్ఫర్డ్ టు చిన్నమ్మి వైషమ్మ! :)
ReplyDelete@ అనిల్: ఓ పాలి టపా మళ్లీ సదవండి. ఇయ్యి అల్లెప్పటి బొమ్మలో గావు...ఇయ్యాల్టి బొమ్మలు...
@ జ్యోతి గారు - :)
Very cute! :)
ReplyDelete