ఆకాశవాణి కళాకారుల సంక్షిప్త జీవితాలు చక్కగా గుదిగుచ్చి రేడియో అభిమానుల అందుబాటులోకి తెచ్చిన అంబడిపూడి మురళీకృష్ణ గారు, మడిపల్లి దక్షిణామూర్తిగారు ఎంతైనా అభినందనీయులు.
పుస్తకం: వాచస్పతి
వెల : 100 రూపాయలు
ముద్రణ: కళాజ్యోతి ప్రాసెస్స్ ప్రైవేట్ లిమిటెడ్
ప్రతులకు: 402 ప్రేమ సాయి అపార్ట్మెంట్స్
శ్రీనగర్ కాలనీ, హైదరాబాదు - 73
ఈ పుస్తకంలో నాకు బాగా నచ్చింది అన్నిటికన్నా చక్కనైన ఆయా కళాకారుల చిత్రాలు....
ఈ ప్రతిని నాకు ఎంతో అభిమానంగా అందజేసిన శ్రీ పి.వెంకట రమణ (అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్) గారికి హృదయ పూర్వక కృతజ్ఞతలతో
ఇప్పుడో ప్రశ్న -
ఈ బొమ్మెవరిదో చెప్పుకోండి...
అలాగే "ప్రసార ప్రముఖులు" అనే మంచి రచన ఒకటి ఉన్నది - ఆకాశవాణి స్టేషన్ డైరెక్టర్ డాక్టర్ అనంత పద్మనాభరావు గారు వ్రాసింది - ఈ పుస్తకంలో బోల్డు ఆణిముత్యాల్లాంటి వివరాలు, కళాకారులు, ఆర్టిస్టులు, ఆకాశవాణి కేంద్రాలు, ఆకాశవాణి మూలస్థంభాలు, ఆకాశవాణి పుట్టుపూర్వోత్తరాలతో సహా!
వెబ్సైటులో ప్రసార ప్రముఖులు సెక్షన్లో చూడవచ్చు..
భవదీయుడు
వంశీ


వంశీ బాబూ తెలుగు వ్యాప్తికి,అభివృధికి
ReplyDeleteమీరు చేస్తున్న కృషికి అభినందనలు