ఇవి తెలుసా మీకు ? :) ఒకేళ తెలీకపోతే సమాధానాలు రేపు -
1) గొడుగుని పట్టుకునే కర్రనేమంటారు ?
2) కర్రలేని గొడుగునేమంటారు ?
3) తెర్లించు అంటే నీళ్ళను మరిగించటం - మరి తొర్లించు అంటే?
4) పంగనామం అంటే అందరికీ తెలుసు - మరి బుంగనామం అంటే?
5) ఈడుముంత అంటే?
6) కొట్నం అంటే?
7) మండ కంచం అంటే?
8) బొక్కెన పట్టుకునే ఇనప కడ్డీనేమంటారు?
తొర్లించు (ప్రజల నోళ్లలో పడి తొల్లించు అయిందని అనుకుంటున్నాను)అంటే నాకు తెలిసిన అర్థం ఒక గ్లాసు/చెంబు నుంచి మరో గ్లాసు లోకి పోస్తూ చల్లార్చడం అని.
ReplyDeleteప్చ్..:(
ReplyDeleteబొక్కెన పట్టుకునే ఇనప కడ్డీనే "గేలం" అంటారు కదండీ!
ReplyDeleteకొట్నమే కొట్టం గా మారిందా కొంపదీసి?
1) గొడుగుకర్ర :)
ReplyDelete2) గోవర్ధనగిరి [కృష్ణుడు ఎత్తిన పర్వతం]
3) వేణ్ణీల్లకి చన్నీళ్ళు కలపటం [తొల్లించు/తొలుపు/తొర్లిమ్చు/ ఒకటే అర్థమని నేనకునేది]
6) ఇదేదో పరికరమా/పరిసరమా? పల్లెపట్టున విన్నట్లుగా ఉంది.
8) గేలం [కొక్కెం]
మొత్తం తప్పులేనని బుర్ర హెచ్చరిస్తోంది. :( అయినా హాజరుపట్టిలో పేరు పడితే మార్కులిస్తారేమోనని.. :)