విషయానికొస్తే - క్రిస్టియన్ లిటరేచర్ సొసైటి - ఎస్.పి.సి.కె ప్రెస్స్ మద్రాసు వారు 1894లో ముద్రించిన "తెలుగు పాఠముల మొదటి పుస్తకము" పుస్తకం అట్ట ఇది. 1894 సంవత్సరానికే 24th Edition, 6,000 - Total Copies 156,000 (156,000 సరిగ్గా చూడండి)..

ఈ పుస్తకం దేనికి సంబంధించిందో తెలీదు కానీ, ఔత్సాహికులు - ఇదే ఇదే తెలుగులో మొదటి పుస్తకం అని అరుస్తూండగా విన్నాను. నిజమెంతో తెలియదు. వేపేరి ప్రెస్సూ, పుట్టుపూర్వోత్తరాల సంగతులూ తెలుసు కానీ ఈ పుస్తకం గురించి ఇతర వివరాలు తెలిసినవాళ్ళు పంచుకోవచ్చు.
యాదృచ్ఛికంగా ఇది మూడొందల యాభయ్యో పోష్టు :)
Very nice..
ReplyDeleteThank you..
మొదటి పుస్తకం అంటే ఏంటో అర్థం కాలేదు. నాకు తెలిసి - విదేశీయులకి ఒక భాష నేర్పే క్రమంలో తయారు చేసిన వ్యాకరణం వర్క్ బుక్కుల సిరీస్ కి ఆ రోజుల్లో First Book, Second Book, Third Book అని పేరు పెట్టేవారు. ఉదాహరణకి R.G. భండార్కర్ ఇంగ్లీషులో వ్రాసిన సంస్కృత అభ్యాస గ్రంథాలు ఇప్పటికీ ఆ విధమైన పేర్లతోనే ముద్రితమవుతున్నాయి. (Sanskrit First Book, Sanskrit Second Book, Sanskrit Third Book)
ReplyDeleteతెలుగులో మొదటి ముద్రితపుస్తకం అంతకంటే 120 ఏళ్ళకి ముందు అంటే 1775 ప్రాంతంలో వచ్చింది. శ్రీరామ్ పూర్ మిషన్ ప్రెస్ (కోల్కతా) వారు ముద్రించారు. ఇప్పటికీ కొనసాగుతున్న ప్రముఖ తెలుగు ప్రచురణాసంస్థ వావిళ్ళ రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్ కంపెనీ 1850 కంటే ముందే మద్రాసులో స్థాపించబడింది. ఇలాంటివి చాలా ఉన్నాయి.
-తాడేపల్లి
తాడేపల్లి గారూ
ReplyDeleteతెలుగులో ఏదేని "పాఠాలకు" మొదటి పుస్తకం అని మా సాహితీ సంఘం లోని పెద్దాయన కోటేశ్వర శర్మ గారూ, ఇంకో చిన్నాయన భోజన ప్రియ రామారావు ఇతరులతో, అనగా నన్ను కలుపుకొని - వాదులాడటం వల్ల వచ్చిన తలనొప్పితో రాసిన వాక్యమది. ఈ పుస్తకంలోవి ఏ పాఠాలో ఆ భగవంతుడికీ, మా రామా కోటేశ్వర బృందానికే తెలియాలె.
జై కాశీ విశ్వనాథా..
1894లో ముద్రించిన పుస్తకం అట్ట మీద తెలుగు పాఠముల మొదటి పుస్తకం అని స్పష్టం గా ఉంది కాబట్టి అందులోని విషయముల గురించి ఎలాంటి అయోమయం లేదు. అరుదైన పుస్తకం పరిచయం చేసిన వంశీకి అభినందనలు.
ReplyDeleteజై అబ్రకదబ్రా!