గంగూ - ఇదిగో, మరో 1800 పుస్తకాలు ఇక్కడ
అయ్యా నిన్నో, మొన్నో 900 ఇచ్చారు, ఈవేళ 1800 పుస్తకాలే ఏకంగా! హాచ్చెర్యంగా ఉందే!!
గంగూ - అదేగా మరి కిటుకు - ఏదన్నా మొదలు పెట్టనే కూడదు, మొదలెడితే ఆగకూడదు
అయ్యా మరి ఇన్ని పుస్తకాలు నిజంగానే ఉన్నాయా?
గంగూ - మంచి ప్రశ్న. డి.ఎల్.ఐ. లో ఉన్నాయి....కానీ మనం తయారు చేసిన ఈ పుస్తకాల లిష్టుల్లో కన్ను కప్పి డూపులైపోయినవి కొద్ది శాతం, అంటే చాలా కొద్ది శాతం ఉన్నాయి. ఎంత శాతమా ? సుమారు 5 శాతం అనుకుంటున్నాను, ప్రస్తుతానికి. అయితే అది సద్దుకునే బాధ్యత వాడుకునేవారిదే.
ఎలాగెలాగా ? డూపులున్నాయా? ఎలాగెలాగా మళ్ళీ చెప్పయ్యా
గంగూ - చెప్పేది కాదులేరా. వారు చూసుకుంటారు.లిష్టులు ఇవ్వటం వరకే మన పని.
అయ్యా మరి నిన్న ఇచ్చిన 900 పుస్తకాల మీద రాతలు కోతలు, ఇతర విశేషాలు ఏమన్నా జరిగినయ్యా?
గంగూ - రాతలు కోతలు పక్కనెడితే ఒకట్రెండు విశేషాలు జరిగినాయిరోయి. అవేమిటా ? మచ్చుకు ఒకటి చెబుతా విను - కొంతమంది అతితెలివి జనాభా, అంటే నిన్న చెప్పిన "శూరశిఖామణులు" అన్నమాట - నాకు టెక్నికల్ నాలెడ్జీ అంతగా లేదు అని ఆ టపాలో చెప్పానని, పేరెంట్ ఫోల్డర్ని తెగ యాక్సెస్ చేసారు, ఇతర నోటుపాడులు / డాక్యుమెంటులు అవీ అక్కడ పెట్టానేమోనని. పాపం వాళ్ళకేం తెలుసు? "అంతగా" లేదన్నాను కానీ బభ్రాజమానాన్ని అనలేదుగా? అదిరా నిన్న జరిగినవాటిల్లో ఒక సంగతి.
అయ్యా మరి మీరు దాదాపు పదిహేనేళ్ళ నుంచి ఈ పొలంలో అంటే ఈ కంప్యూటర్ "ఫీల్డు"లో వ్యవసాయం చేస్తున్నారని అమ్మగారు - ఓ ఇదిగా చెపుతుంటారు! మరి మీకు టెక్నికల్ "నాలెడ్జీ" లేదని ఎందుకు చెప్పారు ?
గంగూ - అదే మరి! మరి అదీ లెఖ్ఖ! ఇహ అడిగింది చాలు గానీ పోయి మళ్ళీ రేపో ఎల్లుండో రా, కొత్త లిష్టు కోసం!
సరే దొరా! వస్తా! అవునుగానీ దొరా ఇక్కడా అన్నారు గానీ లింకు ఇవ్వలేదే
గంగూ - నువ్వు అడుగుతావా లేదా అనే ఇంతసేపు ఆగా - ఇదిగో ఇక్కడ
సరే సరే వెళ్ళు! ఆలస్యమవుతోంది
suparOOO
ReplyDeleteWOW! This post is god-sent for me. :)
ReplyDeleteనాకీ సైటు గురించి ఈ మధ్యనే తెలిసింది. నాలుగైదు రోజుల్నించీ తెగ కుస్తీ పడుతున్నాను. ఇక ఉండబట్టలేక అందర్నీ అడగటం కూడా మొదలుపెట్టాను. మీరిచ్చిన జాబితానే కాదు, దీనికి ముందు టపాలో రమణగారు ఇచ్చిన లింకు కూడా చాలా సాయపడుతోంది. కృతజ్ఞతలు!
కానీ ఈ టపాకు "స్పాయిలర్ అలెర్ట్" పెట్టాలి. వెతుకులాటలో వుండే ఉత్సుకత అంతా చెడగొట్టేసారు. :P ఎన్నున్నాయో తెలియనంత సేపూ ఎన్నో వున్నాయనుకుంటాం, తెలిసిపోయాకా ఓ హద్దు వచ్చేస్తుంది.
ReplyDeleteబాబా గారు.. ధన్యవాద్
ReplyDeleteమెహెర్ - :) Agreed!!
Wow! Thanks!!
ReplyDeleteఅసలు నేనింకా లిస్టు దిగుమతి చేసి చూడ్డం మొదలుపెట్టలేదు కానీ, మీ ఓపిక్కి ధన్యవాదాలు...
ఎక్కడ ఉన్నయండీ పుస్తకాలు? ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలి?
ReplyDelete