వీవెన్
అందరినీ పిలిచి ఆ ఏటిగట్టునో, ఇరానీచాయి హోటల్లోనో కూర్చోబెట్టి మంగలిగంగన్నని పిలిపించి గొరిగించండి! ఏంటి గొరిగించేది? ఓ అదా ! అవును అదే అదే! ఆపైన రత్నమణిమయాలతో తాపడం చేసిన బంగారు కుక్కలను తెచ్చి ఆ గొరగబడ్డవాళ్ళతో దానమిప్పించండి! ఎవరికి ? వారికే – ద్వేషులకూ, వేషులకూ, సూకరములకూ!
అసలు జనాలు మిమ్మల్ని సతాయించడమేమిటో! మీరు ఇలా జనాలను అడగటమేమిటో! మీకు తీసెయ్యాలనుంటే తీసెయ్యండి. అడిగేవాడెవడు? ఐతే ధర్మం పాటించండి. తీసేస్తే అన్నీ తీసిపారెయ్యండి. ఉంచితే అన్నీ ఉంచెయ్యండి. అంతేకానీ కొన్ని సూకరాల్ని వదిలిపెట్టే సడలింపు కార్యక్రమాలు వైపు మొగ్గారనుకోండి, మనకు సకిలింపులే శరణాగతి – ఇప్పుడు కాకపోతే కొన్నిరొజులకైనా. అలవాటైన వాసనల కోసం సూకరాలు ఘూర్జరించకమానవు, వాటిని అదిలించటానికి చర్నాకోలలు రాకా మానవు. మళ్ళీ కప్పలబావే…
గొణిగేవాళ్ళు మూసివాయనం ముత్తైదువుల్లాగా వాకిట్టో నుంచునే వుంటారు. మరి మీరు అంగోస్త్రం జాడిస్తారో, కొల్లాయిగుడ్డ జాడిస్తారో – చేసే పని చక్కగా , పిండే నీళ్ళు తిరిగి బావిలోకి పోకుండా చూస్కోండి… భోక్త, హోత అన్నీ మీరే,మంత్రం కూడా మీదగ్గరే ఉన్నది. రెండవ భోక్తకోసమో , వాడి వెర్రిమొర్రి ఆలోచనల కోసమో, అబ్బి గాడి ఇప్పరాయాల కోసమో చూస్తే – ఇహ ఇంతే సంగతులు.