ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడు గారు "ఇతిశ్రీ" పేరుతో వ్రాసిన "కుమతీ శతకం"లోని కొన్ని అధిక్షేపాత్మక పద్యాలు.
1)
అధరము తడిసీ తడయక
మధురమ్మగు కాఫిజుర్రు మరి సిగరెట్టున్
ప్రథమముననె ముట్టించెడు
విధమేపో లైఫులోని విజ్ఞత కుమతీ
2)
బ్లేడును చూడని ముఖమును
బీడీ సిగరెట్ల కంపువీడని ముఖమున్
కోడిములు చెప్పు ముఖమును
బూడిద కిరవైన పాడు బొందిర కుమతీ
3)
లంచము పంచక తినకుము
కొంచెంబేనైన చేత గొనకుము సుమ్మీ
లంచంబు పట్టువారికి
కించిత్తుగ రాల్చకున్న కీడగు కుమతీ
4)
అడిగిన ప్రశ్నలు చెప్పని
మిడిమేలపు టీచరులతొ మెలగుటకంటెన్
వడిగొని త్యూషను వెట్టుక
బడి ప్యాసనవచ్చుగాదె వసుధను కుమతీ
ఇదే కోవలో ఇంచుమించు సుమతీ శతకం పద్యాలన్నిటికీ చాలా హాస్యపూరితమయిన పేరడీ పద్యాలు ఉన్నాయి "కుమతీ శతకము"లో. దీని పీఠిక కూడా చాలా హాస్యంగా ఉంది. అదంతా ఇక్కడ రాసే ఓపిక లేదు కానీ - మీకు ఓపిక ఉంటే ఈ కుమతీ పుస్తకం కొని చదువుకోండి...
ఇవి చదువుతున్నప్పుడు ముణిమాణిక్యంగారి "మనహాస్యం"లో ఉటంకించిన
తినదగు నెవ్వరు పెట్టిన
తినినంతనె తేన్పులిడక స్థిమితపడ
తిని రుచియు నరుచియు నెఱుగు
మనుజుడె సుఖభోజనుండు మహిలో సుమతీ
పద్యం గుర్తుకు వచ్చింది
Saturday, February 9, 2008
Subscribe to:
Post Comments (Atom)
3 comments:
బలే బాగున్నై.
కుమతీ శతకం కూడా ఉందన్నమాట! :)
బాగున్నాయి, శ్రీరామచంద్రుడు గారు కృతుల్లో ఇదొకటి అని తెలియదు. ధన్యవాదాలు.
Post a Comment