Saturday, February 2, 2008

ఘంటసాల మాష్టారు తప్పు పాడారా ?

ఘంటసాల మాష్టారు తప్పు పాడారా ? అన్న సందేహం వచ్చింది నాకు పొద్దున్నే.పొద్దున్నే కార్ లో ఆఫీసుకు వెళుతూ మాష్టారు పాడిన స్తోత్రాలు, భక్తి పాటలు వినటం అలావాటు నాకు. (పొద్దున్నే కాదు అసలు చాలా మటుకు మాష్టారు పాటలు తప్ప ఇంకేవీ వినను!)నిన్న రాత్రి ghanTasAla.info నుండి కాళహస్తి మహత్యం చిత్రంలోని "జయ జయ మహాదేవ శంభో హరా శంకరా" స్తోత్రం download
చేసుకుని , పొద్దున్నే వింటుంటే , ఆ రికార్డులో 2.53 minutes దగ్గర "దివ్య ఫల పుస్ప" అని వినపడింది...ఆశ్చర్యపోయా - మాష్టారు తప్పు పాడటమా అని... ఎన్నిసార్లు మళ్ళీ మళ్ళీ విన్నా అదే మాట.... నేనేమన్నా తప్పు విన్నానా ? ఆ స్తోత్ర రచనే అంతా? నా స్పీకర్ల ప్రాబ్లమా ఏమిటి అనేది అర్థం కాలా ...స్పీకర్ల ప్రాబ్లం అయితే మటుకు ఈ బోసు స్పీకర్ల వాడిని ఒక్క తాపు తన్నాలి

లింక్ ఇదిగో

http://www.ghantasala.info/allsongs/index.html

ఇందులో movie number 54 - song 5...

అంటే మాష్టారు తప్పు పాడకూడదని కాదు కానీ - నాకు మటుకు నమ్మశక్యంగా లేదు, ఆ మహానుభావుడు తప్పు పాడారు అంటే...

5 comments:

Giri said...

మీరన్న తర్వాత విన్నను, పుష్ప అనే అనిపిస్తోంది నాకు..ఆ పదం హెచ్చుస్వరాల్లో ఉండడం వల్ల అలా వినిపించిందేమో..

yadavalli vsn sharma said...

మాగంటి వారికి మరొక్కసారి నమస్కారము..
అయ్యా...దోషం తమరి స్పీకర్లదన్నా అయ్యుండాలి లేదా శ్రవణదోషమన్నా అయ్యుండాలి.ఘంటసాల వారు తప్పుగా పాడనేలేదు.నేను అయిదు తడవలు,నా అర్ధాంగి మూడు తడవలు అత్యంత శ్రద్దతో విన్నాము.చక్కగా "ఫలపుష్ప" అనే వినపడింది తప్ప...తప్పుగా వినపడలేదు.కొంచెం శ్రద్ధగా విని చూడండి.
యడవల్లి వేంకట సత్యనారాయణ శర్మ

Vamsi M Maganti said...

అయ్యా శర్మగారూ...ఇటువైపు తొంగిచూసినందుకు ధన్యవాదాలు...పది మందికి పైన వినిపించాను, అందులో ఎనిమిది మందికి పుస్ప అనే వినపడింది...బోసు స్పీకర్లు అనుకున్నాను కానీ, అది కాదు...ఆ పైన మొన్ననే "ఆడియాలజీ" టెష్టు చేయించుకున్నాను , నా శ్రవణ యంత్రం అద్భుతంగా పని చేస్తొంది అని ఇక్కడి డాక్టర్లు ఇంత పొడుగు సర్టిఫికేటు ఇచ్చారు కాబట్టి, అలా చెప్పుకుని తప్పించుకునే అవకాశం లేకుండా పోయింది

lakshmi said...

hi..friend..ghantashala sir might not be wrong..ofcourse i heard it.. and you are also not wrong..because this is electronic media which we have to blame..is it not..?

Satyasuresh Donepudi said...

మాగంటి గారు,

నాకు కూడా 'పుస్ప ' అనే వినిపించిందండి. నేను కూడా దాదాపు 10 సార్లు విన్నాను. ఏది ఏమయిన మీ శ్రవణ శక్తి అమెఘం.

~ సత్యసురేష్ దోనేపూడి.

Post a Comment