కోలాచలం శ్రీనివాస రావు గారు 1895 లో వ్రాసిన సునందినీ పరిణయము అనే నాటకము నుండి ఒక అద్భుతమయిన మధురగతి రగడ ఇక్కడ చూడండి.
http://maganti.org/janapadapatalu/madhuragatiragada.html
ఆ నాటక రచన మొత్తం త్వరలో మీ ముందుకు, మాగంటి.ఆర్గ్ లో.అది కూడా యూనీకోడులో.. కొందరు మిత్రుల ఆనందం కోసం.
నా మటుకు నాకుగా ఈ యూనీకోడు ఫాంటు ఎన్నడూ నచ్చలేదు, నచ్చబోదు. వేరే ఇతర ఫాంటులు వస్తే తప్ప ఈ యూనీకోడు గురించి ఆలోచించనేమో మరి...చూద్దాము...
ప్రస్తుతానికి ఈ నాటిక మటుకు యూనీకోడులో ప్రచురించి చూసి, చదువరుల అభిప్రాయాలు తెలిసాక తరువాతి మెట్టు ఎక్కడానికి ప్రయత్నిస్తాను... :)
Friday, June 22, 2007
Saturday, June 9, 2007
హాస్యం.కాం లో సందేశం..
హాస్యం.కాం ఎడిటర్ గారు శ్రీ గణేష్ రావూరి గారు సహృదయంతో తమ పత్రికలో ఈ వ్యాసరచన గురించి ప్రకటించినందుకు ఆయనకి సభాముఖంగా హృదయపూర్వక ధన్యవాదాలు.
మంచి మంచి హాస్య రచనలకి ఆలవాలమయిన హాస్యం.కాం మరింత వృద్ధి పొంది, తెలుగు ప్రజలకి మరింత చేరువ అవ్వాలి అని ఆశిస్తూ
http://www.haasyam.com/092/index1.php
విధేయుడు
వంశీ

Friday, June 8, 2007
ఇన్ని దుష్టశక్తులు కత్తి కట్టటం .........
ఈనాడులో అమెరికా అధ్యక్షుడు బుష్ ను గెలిపించిన కిలారి ఆనంద్ పాల్ గురించిన వార్త చదివి నా జీవితం ధన్యం అయ్యింది. మన తెలుగు వారిలో ఇంత తేజోమూర్తులు ఉన్నారా అని ఎంతో ఆనందం వేసింది. బుష్ గారిని గెలిపించాక కూడా ఆయన కనీసం కృతజ్ఞత కూడా చూపకుండా , బుష్ గారు, కోండలిజా రైసు గారు పాల్ గారి మీద కత్తి కట్టి సోనియాకి చెప్పి మరీ ఈయన పీస్ మిషన్ను రద్దు చెయ్యటం మరింత ఆశ్చర్యానికి గురి చేసింది.అయ్యో మన తెలుగువాడి మీద ఇన్ని దుష్టశక్తులు కత్తి కట్టటం ఎంతో దారుణమయిన విషయం. హయ్యో హయ్యో.....పాపం సద్దాం హుస్సేన్ పారిపోవటానికి అవకాశం కూడా ఈయన కల్పించిన వార్త బయటకు తెచ్చిన ఈనాడుకి మరిన్ని ధన్యవాదాలతో... పాల్ గారి బోయింగు విమానం సరి అయిన సమయంలో సద్దాం గారి వద్దకి వచ్చి ఉంటే, ఆయనకి బిలంలో దాక్కుని అమెరికా చేతికి పట్టుబడే అవకాశం దొరికి ఉండేది కాదు కదా...హయ్యో .....హతవిధీ..హతవిధీ..పైగా మన బొత్స బాబు వోక్స్ వాగన్ డబ్బులు నొక్కాక అవి సరిపోక ఈ పాల్ గారి వెంటపడ్డారుట...హయ్యో...
రేగుపళ్ళ ముసలమ్మ
ఆ మధ్య ఎక్కడో చదివిన జోకు ఒకటి
బాబు: మామ్మా రూపాయికి ఎన్ని రేగుపళ్ళు?
ముసలమ్మ: రూపాయికి పాతిక.బాబు: అదేంటి మొన్న యాభై ఇచ్చావుగా?
ముసలమ్మ: సరే నీ కోసం ఇస్తాలే..యాభై తీసుకో, ఏదీ రెండు చేతులూ పట్టు, నీ చేతిలో రేగుపళ్ళు పోస్తా..యాభై లెక్ఖెట్టు
బాబు: సరే ఇదిగో రూపాయి. పొయ్యి మరి
ముసలమ్మ: లాభం, రెండు, మూడు
ముసలమ్మ: బాబూ నీకెన్నేళ్ళు?
బాబు: నాకా? ఏడేళ్ళు.
ముసలమ్మ: ఏడా..ఎనిమిది,తొమ్మిది, పది పదకొండు, పన్నెండు..అయితే మీ అమ్మకి ఎన్నేళ్ళు బాబూ?
బాబు: మా అమ్మకా? ఏమో ఇరవై ఏడో ఏమో.
ముసలమ్మ: ఓ ఇరవై ఏడా, ఇరవై ఎనిమిది,ఇరవై తొమ్మిది, ముప్ఫై...మరి మీ నాన్నకి?
బాబు: నాన్నకా? ముప్ఫై ఐదు
ముసలమ్మ: ఓ ముప్ఫై ఐదా..ముప్ఫై ఆరు, ముప్ఫై ఏడు..మరి మీ పెద్ద మావయ్యకి?
బాబు: ఏమో..నలభై ఐదు ఏమో..
ముసలమ్మ: ఓ ...నలభై ఐదు, నలభై ఆరు, నలభై ఏడు, నలభై ఎనిమిది, నలభై తొమ్మిది, ఇదిగో యాభై...ఇదిగో బాబూ ఆ రేగుపళ్ళు కింద పడేసుకునేవు..చక్కగా కడుక్కుని తినెయ్యి..మళ్ళీ రేపు వస్తాను...
బాబు: సరే మామ్మా...

Monday, June 4, 2007
సణుగుడు మేళం - సరిచేసిన రెండోభాగం
"ఒహో అర్ధం అయ్యింది లెండి...మొన్న రాధికగారికి ఈ భాగం మరీ చిన్నగా ఎందుకు కనపడిందో..నేను మొత్తం భాగాన్ని చిత్తు ప్రతిలాగా(డ్రాఫ్టు రూపంలో)పెట్టా..ఇప్పుడు అసలు మీట నొక్కి సరిచేసా...ఇప్పుడు చూసి చెప్పండి...మరీ చిన్నదిగా ఉందేమో "
సరిచేసిన రెండోభాగం
ఏమిటీ... మళ్ళీ విషయం చెప్పు, సంగతులు చెప్పు అంటూ పురాణాల్లోకి దిగావు. మొన్న అయ్యింది చాలలా?
ఒరే నారాయణా, మొన్న అయ్యింది వేరు, ఇవ్వాళ్ళ మొలిచింది చెట్టు. మెట్లెక్కి వస్తూంటే ఆ తాయరమ్మ కనపడిందిరా, మళ్ళీ కళ్ళనీళ్ళు పెట్టుకుంది. ఏం చెప్పాలో తెలియక వచ్చేశా..ఈ రామ్మూర్తి గాడి తద్దినం చెయ్య..వెధవ పీనుగ ఆ మాత్రం సాయం చెయ్యటానికి మాయ రోగమా? పెళ్ళీ పెటాకులు అయినాయి కదా వాడికి సిగ్గు ఉండఖ్ఖరలా...ఎప్పుడో వీడికి తగిన శాస్తి నేనే చేస్తాను.
ఒరే పరంధామం, మొన్ననే కాడి మెడ మీద పడకుండా తప్పించుకున్నావు. అసలే పెళ్ళీడుకొచ్చిన ఆడపిల్ల ఉన్నది నీకు, ఏం చెయ్యాలనుకున్నా కొంచెం గోస లేకుండా చెయ్యి. ఏం చేస్తావో కొంచెం ముందే చెప్పి అఘోరించు. నాకు తగిన సాయం నేను చేస్తాను.సరేకానీ భోజనానికి పోదామా?
లేదురా.. పొద్దున్నే పార్వతి ఒక బంక పదార్ధం లాంటి దాణా పడేసింది నా మొహాన. రాత్రి కూడా సరిగ్గా తినలేదేమో, ఏదయితే అది అయ్యిందిలే అని ఆ దాణా బానే దట్టించా. గందరగోళంగా ఉన్నది పరిస్థితి. నువ్వు పోయిరా..
నాయనా సుబ్బారావూ - ఇవ్వాళ్ళ డబ్బులు సర్దకపోతే తమరి బట్ట బుర్ర మీద త్యాగరాజ కీర్తనా సుస్వరాలు అందరికీ వినిపిస్తా..
అన్నయ్యా...ఒఖ్ఖ రెండు రోజులు ఆగగలవా...ఇదిగో రేపు సోమవారం నువ్వు ఆఫీసులోకి వచ్చేసరికి పువ్వుల్లో పెట్టి ఇస్తా...
ఏం పువ్వు బాబూ - అరటి పువ్వా, మొగిలి పువ్వా, తామర పువ్వా...పువ్వూ వద్దు నీ పిండాకూడు వద్దు, నా ధనలక్ష్మిని నావద్దకు చేరిస్తే చాలు.
ఏవండీ ఇక్కడ పరంధామంగారు ఎవరండీ?
నేనే - మీరు ఎవరు? ఏం కావాలి?
నా పేరు మిరియాల పార్ధసారధి అండి. బిక్కవోలు బ్రహ్మం గారు పొద్దున్నే నాకు ఫోను చేసి మీ దగ్గరికి వెళ్ళమని చెప్పారండి. బ్రహ్మం గారి ఆడవాళ్ళు రేప్పొద్దున్న హౌరా మైలుకు వస్తున్నారంటండి. మిమ్మల్ని దించుకోమని చెప్పమన్నారు.
ఏమిటి దించుకునేది? వెధవ మాటలు మీరూనూ - వారేమన్నా మిరియాల బస్తాలా? దింపుడు కళ్ళాలా?
అది కాదండీ... దించుకోమంటే వాళ్ళను బండిలోనుంచి దించి మీ ఇంటికి తీసుకెళ్ళమని అండి...అయినా ఆ అడావిడీ ఏమిటీ, ఆ విరుపు మాటలు ఏమిటీ. జముకు పుట్తిస్తారు మనుషుల్లో మీరు ..అయినా అంత కోపం అయితే ఎలాగండీ మీకు
ఆహా భలే చెప్పారండి పార్థసారధి గారు. మీకు ముఖవైఖరీ విద్య బాగా తెలుసనుకుంటాను. నాకు కోపం ఎక్కువ అని బాగా కనిపెట్టారు. సరేలే భాషణభూషణాలు ఆపి ఇక తమరు దయ చెయ్యండి. తమరు సమాచారం ఇచ్చారు, ఇక మేము తన్నుకు చస్తాము.
చచ్చామురా గిరిజారమణా! ఇప్పుడే దిగాలా వీళ్ళు ....ఎటుపోయి ఎటువస్తుందొ ఏమో
ఈ బ్రహ్మిగాడికి ఎన్ని సార్లు చెప్పినా అర్ధం కాదు..మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇవ్వనురా అంటే, బోదురుకప్పలాగా బోరుమంటూ ఉంటాడు. ఆరోనంబరు కాలువలో పరకుచ్చుకుని గేదెల్ని తోమినట్టు బర బర బరికినా ఆ తోలు మందం తగ్గదు వీడికి.ఈ సత్రకాయగాడికి, వాడి పెళ్ళానికీ ఏదో ఒకటి ఖచ్చితంగా చెప్పి వదిలించుకోవాలి ఈ సారి.
ఏవండీ పరంధామం గారూ - మిమ్మల్ని రామూర్తిగారు పిలుస్తున్నారు.
ఓరి వీడిని తగలెయ్య, ఈ వెధవ ఎప్పుడు ఊడిపడ్డాడు? తడిమన్నూ పొడిమన్నూ అయ్యేటట్టు తిరిగే ఖర్మ రాసిపెట్టినట్టుంది నాకు వీడితో. ఇప్పుడేం పితలాటకం పెడతాడో, ఏం దస్త్రం విప్పుతాడో.వీడికి పని ఉన్నవాళ్ళు, పనులున్నాయి అని అనుకునేవాళ్ళు, పని లేని వాళ్లూ, ఏదో ఒక పని దొరక్కపోతుందా అని చూసేవాళ్ళూ అనే తేడా లేదు. అందరినీ ఒకటే గాటన కట్టి కుళాయిల వద్దకి వచ్చిన అమ్మలక్కల శృతిలాగా, నెత్తిన బిందెలతో నీళ్ళోసి ఉతికి ఆరేస్తుంటాడు మహానుభావుడు. సరే చూద్దాం పద ఏమంటాడో!! శొంఠి శోధిస్తుంది అని ఊరకే అన్నారా!
ఏమిటి రామ్మూర్తిగారూ పిలిచారట...
ఏమీ లేదండీ, మీరు రేపు బయల్దేరి వీరంకిలాకు వెళ్ళి, ఆ రామారావు వద్ద వసూలీ చేసుకుని రావాలి. ఇప్పటికే సమయం మించిపోయింది.పోనీ డబ్బులు లేని మనిషా అంటే, ఊరికి మోతుబరి ఆయె. అయినా డబ్బులు కట్టడు. ఒక వేళ ఇవ్వను అంటే తాసిల్దారు రత్తయ్యని, పోలీసులని వెంటబెట్టుకుని అతని ఇంటికి వెళ్ళి అదే ఊర్లో అతని పరువు వేలం వేసి ఆ డబ్బులు తీసుకుని రండి.ఏమిటి అర్ధం అవుతోందా చెప్పింది..
సరే రేప్పొద్దున్న హౌరా బండికి చుట్టాలు వస్తున్నారు, అ దివాణం అయ్యాక వీరంకిలాకు వెళ్తాను.
భోజనానికి డబ్బులు గట్రా ఆ నారాయణని నేను ఇమ్మన్నాను అని చెప్పి తీసుకెళ్ళండి.
ఒరే నారాయణా - భోజనం అయ్యిందా ? నేను రేప్పొద్దున్న వీరంకిలాకు వెళ్ళాలి, ఖర్చులకి నీ దగ్గరి నుంచి డబ్బులు తీసుకోమన్నాడు.
వీరంకిలాకు ఎందుకురా ? అక్కడ ఎవరు ఉన్నారు?
ఆ రామారావు దగ్గర డబ్బులు తీసుకుని రావటానికి - ఆ ముచ్చు రామ్ముర్తిగాడు ఇందాక పిల్చి సంగతి చెప్పి మాంచి దయ్యం జూపు జూస్తూ "ఏమిటీ అర్ధం అయ్యిందా అంటాడు"- వీడి తస్సాగొయ్యా ఇదేమన్నా పెద్దబాలశిక్షా, మొల్ల రాసిన రామాయణమా అర్ధం కాకపోవటానికి. అయ్యవారు చెప్పటం, మా ఒంట్లో ఉపద్రంగా నీరు, దారుణంగా కోపం బయల్దేరకపోవటమూనా అని మనస్సులో అనుకుని బయటకి వచ్చా. సరే కానీ ఆ డబ్బులేవో నా మొహాన కొట్టు నేను ఇంటికి పోతా.
ఎంత కావాలి?
ఒక రెండు వందలు ఇవ్వు
సరే ఇదిగో..కానీ జాగ్రత్తరోయి పరంధామం, ఆ వీరంకిలాకు నుంచి వచ్చే దారి బాగుండదు. అసలే డబ్బుల్తో వస్తావు..దొంగల దివ్యచకోరాలు తమరి సంచీ మీదే ఉంటాయి జాగ్రత్త.
ఆ ఆ సరేలే..
సణుగుడు మేళం - రెండో భాగం సశేషం...
రెండో భాగం వచ్చింది ఇవ్వాళ్ళే - ఇక్కడినుంచి మిగిలిన భాగాలు ప్రేక్షకుల విన్నపాలను అనుసరించి కొంచెం క్లుప్తంగా కుదించబడి ఎక్కువ భాగాల్లో ప్రసారం చేయబడతాయి... కానీ అలా చెయ్యటం వల్ల ప్రేక్షకుల్లో సణుగుడు మేళం అంటే విరక్తి పుడుతుందేమో అని నాకో భయం ఉంది కానీ, ఒక సారి ప్రయత్నించి చూడటంలో తప్పు లేదు కదా..

Subscribe to:
Posts (Atom)